Jump to content

దుర్వాసుడు

వికీపీడియా నుండి
(దూర్వాసుడు నుండి దారిమార్పు చెందింది)
దూర్వాస మహర్షి

దూర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతను్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అతను కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

అంబరీషుని కథ

[మార్చు]

భాగవతంలో వచ్చే అంబరీషుని కథ చాలా ప్రాచుర్యం పొందింది. అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు. సత్యసంధుడు. అతను ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి నారాయణుని మెప్పించి సుదర్శన చక్రాన్నే వరంగా పొందుతాడు. దానివల్ల అతను రాజ్యం సంపద, శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. రాజ్యానికి రక్షణ కవచంగా కూడా ఉంది. ఒక సారి అంబరీషుడు ద్వాదశి వ్రతం నిర్వహించాడు. ఈ వ్రతం ప్రకారం అతను ఏకాదశి ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి, ద్వాదశి రోజున ముగించి ప్రజలందరికీ భోజనం పెట్టాల్సి ఉంటుంది.

మహాభారతంలో

[మార్చు]

మహాభారతంలో దుర్వాసుడు అతనును తమ భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, అతిథిగా ఆదరించిన వారికి వరాలు అనుగ్రహిస్తుంటాడు. వాటిలో ముఖ్యమైన ఘట్టం కుంతీదేవి బాల్యంలో జరిగింది. కుంతీ చిన్నతనంలో తన పెంపుడు తండ్రియైన కుంతీభోజుడి దగ్గర పెరుగుతుంటుంది. ఒకసారి దుర్వాసుడు అతను దగ్గరకు అతిథిగా వస్తాడు. అతను దుర్వాసునికి మర్యాదలు చేయవలసిన బాధ్యత కుంతీ దేవికి అప్పజెపుతాడు. ఆమె దుర్వాసుడు ఎలాంటి కష్టాలు పెట్టినా ఓర్చుకుని బాగా సేవలు చేస్తుంది. దుర్వాసుడు అందుకు సంతుష్టుడవుతాడు. అతను తిరిగి వెళ్ళేటపుడు ఆమెకు అథర్వణ వేదం లోని దేవతా ఉపాసనా మంత్రాలను కొన్నింటిని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే వరం సంపాదిస్తుంది. దీని సాయంతోనే ఆమె ముగ్గురు పాండవులను సంతానంగా పొందుతుంది. పెళ్ళి కాక మునుపే సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని సంతానంగా పొందుతుంది. కానీ అవివాహిత కావడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బిడ్డను నదిలో వదిలి వేస్తుంది.