Jump to content

ఋషభుడు

వికీపీడియా నుండి
ఋషభుడు
ఋషభుడు
అనేక విష్ణు అవతారాలలో ఋషభుడు ఒక అవతారంగా వర్ణించబడింది.
అనుబంధంతిర్థాంకరుడు

ఋషభుడు భాగవత పురాణంలో ఇరవై రెండు విష్ణువు అవతారములలో ఒకడు. జైన మతముకు మూలపురుషుడైన ఋషభుడిని, అధినాధుడు అని కూడా అంటారు.[1][2][3] కొంతమంది పండితులు ఈ అవతారం జైనమతపు మొదటి తీర్థంకరుడితో సమానమని పేర్కొన్నారు. రిషభుడి గురించి ప్రస్తావన మార్కండేయ, బ్రహ్మాండ, స్కంద, విష్ణు పురాణాలలో కూడా కనిపిస్తుంది.[4]

ఋషభ అంటే సర్వోత్తమం, ధర్మం, నిగ్రహం, జ్ఞానం అని అర్థం. జ్ఞానముతో నిగ్రహమును సంపాదించి సర్వోత్తమ ధర్మమును తాను ఆచరించి ఆచరింపచేసిన అవతారమే ఈ ఋషభావతారం. యోగ మార్గం గురంచి ప్రపంచానికి తెలియజేశాడు. ఋషభుడు చేసిన ధర్మోపదేశంను ఋషభోపదేశం అని పిలుస్తారు.

జననం

[మార్చు]

ఆగ్నీధ్రుడు పెద్ద కుమారుడైన నాభి, మేరుదేవి దంపతులకు సంతానం కలగకపోవడంతో అనేక యజ్ఞాలు, యాగాలు చేశారు. దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం ఇయ్యగా, నీవంటి కుమారుడిని ప్రసాదించమని నాభి విష్ణువును కోరాడు. విష్ణువు అంగీకరించి వారి సంతానంగా జన్మించాడు. ఆ దంపతులు తమ కుమారుడికి ఋషభుడు అని పేరు పెట్టుకున్నారు.

ఋషభుడు బాహ్యపూజలు చేయకపోడంతో ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేయగా, ఋషభుడు తన యోగబలంతో మేఘాలను సృష్టించి తన రాజ్యంలో వర్షాన్ని కురిపించి, తన తండ్రిని సంతోష పరచాడు. దాంతో ఋషభుడికి పట్టాభిషేకం చేసి, తదనంతరం నాభి తపోవనంకు వెళ్ళిపోయాడు.

కుటుంబ వివరాలు

[మార్చు]

ఋషబునికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు వందమంది కుమారులు, వారిలో భరతుడు పెద్దవాడు. రెండవ భార్య కుమారుడు బాహుబలి. ఋషభుడు తన కుమారులకు అన్ని ఆచారాలను ఉపదేశించి తన రాజ్యాన్ని కురువు, హిరణ్మయము, రమణకము, భాద్రశ్వము, ఇలావ్రుతము, కేతుమల్యము, హరివర్శము, భారతవర్షము, కిమ్పురుశము అను తొమ్మిది భాగాలుగా చేసి మొదటి తొమ్మిదిమందిని వాటికి రాజులుగా చేసి, మిగిలిన వారికి ప్రధాన బాధ్యతలను అప్పగించాడు. ఇందులో భరతుడు పాలించిన భారతవర్షముకు భారతదేశం అనేపేరు వచ్చింది.

తరువాతి జీవితం

[మార్చు]

అవదూతగా మారిన ఋషభుడు అజగరవ్రతం (కొండచిలువ మాదిరిగా ఉన్నచోటు ఉండి కదలకుండా దొరికినపుడు దొరికినంత తినడం) ఆచరించాడు. ఈయన ఆచరించిన 9 ఆచారాలు వివిధ మతాలుగా మారాయి. అడవిలో నిద్రిస్తున్న సమయంలో మంటలు చుట్టుముట్టగా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేయకుండా ఋషభుడు అందులోనే దహనమయ్యి చనిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Matchett, Freda (2001). Krishna, Lord or Avatara?: the relationship between Krishna and Vishnu. 9780700712816. p. 152. ISBN 978-0-7007-1281-6.
  2. Wendy Doniger (2014). On Hinduism. Oxford University Press. pp. 593 note 46. ISBN 978-0-19-936009-3.
  3. PS Jaini (1977). "Jina Rishabha as an avatar of Vishnu". Bulletin of the School of Oriental and African Studies. XL (2): 321–327.
  4. Champat Rai Jain (1935). Risabha Deva - The Founder of Jainism. Delhi: The Jain Mitra Mandal. pp. iii–v. Not in Copyright
  5. ఆంధ్రప్రభ, భక్తిప్రభ (24 April 2020). "ధర్మం మర్మం (ఆడియోతో..)". Archived from the original on 9 మే 2020. Retrieved 29 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఋషభుడు&oldid=2993840" నుండి వెలికితీశారు