Jump to content

ద్వాదశి

వికీపీడియా నుండి

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పన్నెండవ తిథి ద్వాదశి. చాంద్రమానంలో శుక్లపక్షంలో వచ్చు ద్వాదశిని శుద్ధ ద్వాదశి అనీ, కృష్ణపక్షంలో వచ్చు ద్వాదశిని బహుళ ద్వాదశి అని పిలుస్తారు. ద్వాదశికి అధి దేవత - విష్ణువు. దీనికి ముందు వచ్చు తిథి ఏకాదశి అయితే తర్వాత వచ్చు తిథి త్రయోదశి.

పండుగలు

[మార్చు]
ఏలూరు వద్ద శనివారపు పేట గ్రామంలో చెన్న కేశవ స్వామి ఆలయం గోపురం పై చెక్కిన క్షీరసాగర మధన దృశ్యం

కార్తీక శుద్ధ ద్వాదశి - క్షీరాబ్ధి ద్వాదశి :

[మార్చు]

అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి.అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రథమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది.[1]

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని 'బృందావని ద్వాదశి'గా పిలుస్తారు.

రామలక్ష్మణ ద్వాదశి

[మార్చు]

జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహములను తయారుచేయించి, పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానముచేయవలెనని వరాహపురాణము చెప్పుచున్నది. కనుకనే ఆ ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగల్గినది.[2]

మూలాలు

[మార్చు]
  1. Madhuri, Geddam Vijaya. "క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఇదే.. ఈరోజు అలా చేస్తే చాలా మంచిదట." Hindustantimes Telugu. Retrieved 2022-12-25.
  2. "జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకర కైలాస గమనం". శంకరవాణి (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-06-13. Archived from the original on 2022-12-25. Retrieved 2022-12-25. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ద్వాదశి&oldid=4218792" నుండి వెలికితీశారు