Jump to content

చిత్రాంగదుడు

వికీపీడియా నుండి
Chitrāngada.jpg
చిత్రాంగదుడు

చిత్రాంగదుడు శంతనుడు, సత్యవతిల మొదటి కుమారుడు. విచిత్రవీర్యుడు ఇతని తమ్ముడు. భీష్ముడు సత్యవతికి కాక శంతనుడు, గంగలకు కలిగిన కుమారుడు. భీష్ముడు తన శపథం మేరకు చిత్రాంగదుని హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుని చేసాడు. చిత్రాంగదుడు బలవంతుడనని అహంకారము కలవాడు. అదే పేరు కలిగిన ఒక గంధర్వ రాజు చిత్రాంగదుని యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలో గంధర్వ రాజు చిత్రాంగదుని చంపాడు. చిత్రాంగదుని మరణం తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని పట్టాభిషిక్తుని చేసాడు.

వివరాలు

[మార్చు]

శంతన మహారాజు గంగాదేవిని కలిసి భీష్ముడిని పుత్రునిగా పొందుతాడు. అష్టవసువుల శాపాన్ని ఉద్ధరించడానికి ఆమె పుట్టిన వెంటనే ఏడుమంది శిశువులను గంగపాలు వేస్తుంది. అష్టమ వసువైన భీష్ముడిని చంపబోగా శంతనుడు ఆమెను వారించడంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆమె శంతనుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత శంతనుడు సత్యవతిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ తనకు పుట్టబోయే సంతానానికి రాజ్య అర్హత ఉండదని అడ్డుపడుతుంది. అప్పుడు భీష్ముడు తనకు రాజ్యం వలదనీ, పెళ్ళి కూడా చేసుకోనని ఆమెకు మాట ఇచ్చి తండ్రి వివాహం జరిపిస్తాడు. తర్వాత ఆమెకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. ఒకరు చిత్రాంగదుడు. మరొకడు విచిత్ర వీర్యుడు. వీరు చిన్నతనంలో ఉండగానే శంతనుడు మరణించాడు.[1]

రాజ్యభారమే కాక వారిద్దరి పోషణా భారం కూడా భీష్ముడిమీద పడుతుంది. భీష్ముడు వారిని పెంచి పెద్దచేసి ముందుగా పెద్దవాడైన చిత్రాంగదుడిని రాజును చేస్తాడు. అతను మహావీరుడై అనేక యుద్ధాలు చేస్తాడు. అదే అహంకారంతో తన పేరే కలిగిన గంధర్వరాజుతో యుద్ధం చేసి మరణిస్తాడు. దాంతో భీష్ముడు అతని తమ్ముడైన విచిత్రవీర్యుని రాజును చేస్తాడు.[2]

చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. దివాకర్ల, వేంకటావధాని (2013). కవిత్రయ విరచిత శ్రీమదాంద్రమహాభారతము ఆదిపర్వము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.
  2. "మహాభారత కథ : భీష్ముడు రాజకుమార్తెలను అపహరించడం". ఇష సద్గురు. 2017-03-01. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.