జైమిని మహర్షి
జైమిని పురాణాలలోని ఋషి, భారతీయ తత్వశాస్త్రంలోని పూర్వమీమాంస విభాగంలో ప్రసిద్ధుడు. ఇతడు వేద వ్యాసుని శిష్యుడు, పరాశర మహర్షి కుమారుడు..[1]
జైమిని రచనలు
[మార్చు]- జైమిని పదహారు అధ్యాయములలో పూర్వ మీమాంస సూత్రాలు రచించ బడినవి. మొదటి 12 అధ్యాయములు మిక్కిలి ప్రసిద్ధములగుటచే, మిగిలిన 4 అధ్యాయములు జైమిని రచించినవి కావు అని అంటారు. కానీ ఉపవర్షుడు, దేవస్వామి, భావదాసుడు, రాజచూడామణి దీక్షితుడు, భాస్కరరాయమఖి మున్నగువారు సంకర్షకాండ అను పేరన ఉన్న ఈ నాలుగు అధ్యాయములకు వ��యాఖ్యానములు రచించి, వారే ఇవి కూడా జైమిని కృతములేనని అంగీకరించారు.
జైమిని గ్రంథములు
[మార్చు]- జ్యోతిష గ్రంథము : మొత్తము నాలుగు అథ్యాయములు.
- ఛాందోగ్య అనువాదము : ఇది తంత్ర గ్రంథము.
- జైమినీయ సౌత సూత్రము
- జైమినీయ గృహ్య సూత్రము
- స్మృతి మీమాంస : పూర్వ మీమాంస సూత్రాలు
పూర్వ మీమాంస సూత్రాలు
[మార్చు]జైమినీ తన ఉత్కృష్ట కృతి అయిన పూర్వ మీమాంస సూత్రాలు (“తొలి అవలోకన”) యొక్క కృతికర్తగా ప్రసిద్ధిపొందాడు. దీనేనే కర్మ-మీమాంస అనికూడా అంటారు. ఈ పద్ధతిలో వేద or Karma-mimamsa (“Study of [Ritual] Action”), a system that investigates the nature of Vedic injunctions. ఈ గ్రంథమే ఆరు ప్రాచీన భారతీయ తత్త్వ దర్శనాలలో ఒకటైన పూర్వ మీమాంస శాఖకు మూలాధారము.[1]
క్రీ.పూ 3వ శతాబ్దానికి చెందిన ఈ కృతిలో మూడు వేల సూత్రాలు, మీమాంస శాఖకు ఆధారభూతమైన పాఠ్యము ఉన్నాయి. The text aims at an exegesis of the Vedas with regard to ritual practice (karma) and religious duty (dharma), commenting on the early Upanishads. Jaimini's Mimamsa is a ritualist conter-movement to the mysticist Vedanta currents of his day. క్రీస్తు శకంలోని తొలి శతాబ్దాలలో శబరుడు జైమిని యొక్క పూర్వమీమాంస వ్యాఖ్యానం చేశాడు.[2]
జైమిని భారతం
[మార్చు]జైమిని మహాభారతం రచించాడు. దీనిని "జైమిని భారతం" అంటారు. దీనిలోని అశ్వమేధ పర్వం బాగా ప్రసిద్ధిచెందినది.[3]
జైమిని సూత్రాలు
[మార్చు]బృహత్ పరాశర హోరశాస్త్రము తర్వాత అంతటి శ్రేష్టమైన కృతి జైమినీ సూత్రాలు లేదా ఉపదేశ సూత్రాలు. ఇందులో జైమినీ, బృహత్ పరాశర హోరశాస్త్రానికి టీకాతాత్పర్య సహిత విస్తృతమైన భాష్యాన్ని చెప్పి జైమినీ జోతిష్యశాస్త్రానికి శ్రీకారం చుట్టాడు.[4]
సామవేదం
[మార్చు]వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించినప్పుడు, నాలుగింటిని నలుగురు ప్రధాన శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయునికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అథర్వణ వేదాన్ని సుమంతునికి బోధించాడు.[5]
మార్కండేయ పురాణం
[మార్చు]హిందూ పురాణాలలో ప్రముఖమైన మార్కండేయ పురాణం జైమిని, మార్కండేయుడు మధ్య చర్చా విషయంగా వివరించబడింది.[6]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Jaimini at experiencefestival
- ↑ "Purva Mimamsa Sutras of Jaimini". Archived from the original on 2007-06-09. Retrieved 2008-07-19.
- ↑ "Mahabharata". Archived from the original on 2011-02-20. Retrieved 2008-07-19.
- ↑ "Jamini Sutras at astrojyoti". Archived from the original on 2008-06-16. Retrieved 2008-07-19.
- ↑ Jaimini and Samveda at experiencefestival
- ↑ "Jaimini and Markandeya at Urday". Archived from the original on 2013-06-12. Retrieved 2008-07-19.