Jump to content

మార్కండేయుడు

వికీపీడియా నుండి


మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలుని గానే యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.

మార్కండేయుడిని రక్షించడానికి యముని అంతమొందిస్తానంటున్న శివుడు

మృకండు మహర్షి తపస్సు

[మార్చు]

మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని (దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం) తీర్చుకొనేవి. మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశికి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు. వారణాశిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి, శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి, సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుదైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు ��ాలంటాడు. మహదేవుడు సంతసించి పుత్రుడ్ని ఇచ్చాను అని పల్కి అదృశ్యమౌతాడు.

మహాదేవుని మాటల ప్రకారం, మరుద్వతి గర్భవతి అయింది మరియు 9 నెలల తర్వాత దివ్య తేజస్సుతో ఒక కుమారుడు జన్మించాడు. మృకండు మహర్షి పుత్రుడు కావడంతో అతనికి 'మార్కండేయుడు' అని పేరు పెట్టారు. ఈ ప్రదేశం ఇప్పుడు (మార్కెండయ పురం) మార్కొండపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. 7 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సప్తఋషుల మృకండ మహర్షి దర్శనానికి వచ్చాడు. మార్కండేయుడు ఏడుగురు ఋషులచే నమస్కరించబడిన వెంటనే, ఏడుగురు ఋషులు చిరంజీవ అని దీవించారు. మృకండు మహర్షి అది విని, తన కొడుకు నిజంగా అమరుడవుతాడా అని అడిగాడు మరియు ఏడుగురు ఋషులు శివుడు మరియు మృకండు మధ్య జరిగిన సంభాషణను దివ్యదృష్టితో గ్రహించారు. మార్కండేయుడిని బ్రహ్మ వద్దకు తీసుకెళ్లి కుడా చిరంజీవిగా అనుగ్రహిస్తారు. ఆ తరువాత, దివ్యదృష్టితో, మృకండ మహర్షి, శివుని మధ్య ఏమి జరిగిందో తెలుసుకుని, మార్కండేయుడిని నిరంతరం శివుడిని పూజించమని కోరాడు మరియు బ్రహ్మ కూడా శివుని కోసం తపస్సు చేసి మార్కండేయుడిని అమరుడిని చేయమని కోరాడు.

నారదుడు యముడిని మార్కండేయుడుని కలవడం

[మార్చు]

మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడుకి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయ్యకపొతే ప్రపంచానికి యమడి భయం పొతుందీని చెప్పి మార్కండేయుని దగ్గరకు వెళ్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చెయ్యమని చెప్తాడు.

మార్కండేయుడు చిరంజీవి అవడం

[మార్చు]
విష్ణువునుపూజిస్తున్న మార్కండేయుడు

16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తనకింకర్లుని మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. శివుడు యముడ్ని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవాడివి. నీ తండ్రి పుత్రుడిన్ని కోరుకోమన్నప్పుడు పుత్రుడ్ని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు. ఇప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నాడు.

మహాభారతంలో మార్కండేయడు

[మార్చు]

మార్కండేయునిపై సినిమాలు

[మార్చు]

మరికొన్ని విషయాలు

[మార్చు]