పులహుడు
పులహుడు | |
---|---|
సమాచారం | |
దాంపత్యభాగస్వామి | క్షమ, గతి |
పిల్లలు | కర్మశ్రేష్టుడు, వరీయాంసుడు, సహిష్టుడు |
పులహుడు లేదా పులాహా ఋషి లేదా పులహా విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ కుమారుడు, మొదటి మన్వంతరములో సప్త (సెవెన్ గ్రేట్ సేజేస్ రిషి) బ్రహ్మ ఋషులు అయిన మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు లందు ఒకడు.[1] ఇంకొక వర్గీకరణలో బ్రహ్మ చేత సృష్టించబడిన పది ప్రజాపతిలలో ఒకడైన పులహా, ప్రజల పాలకుడు.[2] బ్రహ్మ సప్త ఋషులను, పదిమంది ప్రజాపతులను (కొన్ని లెక్కల ప్రకారం 21 మంది) రూపొందించినట్లుగా, వీరి నుండి మానవులు అందరూ జన్మించినట్లుగానూ నమ్ముతారు. పులహుడు బ్రహ్మ యొక్క తల భాగము నుండి జన్మించిన ఐదవ కుమారుడు.
విద్య
[మార్చు]పులహుడు జ్ఞానం యొక్క శక్తిని ఋషి సనందన దగ్గర నేర్చుకున్నాడు. ఇతను తను నేర్చుకున్న జ్ఞానాన్ని, విద్యను ఋషి గౌతముడుకు బదిలీ చేశాడు. ఇతను అలకనంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేసాడు, ఇంద్రుడు న్యాయస్థానంలో ఉండటానికి వరాన్ని పొందాడు.
రాజు అయిన భరతుడు తన సామ్రాజ్యాన్ని నిరాకరించినపుడు, పులహా యొక్క ఆశ్రయంలో శరణు కోరాడు.
జీవితం
[మార్చు]మొదటి మన్వంతరములో జన్మించినప్పుడు, పులహా ఋషికి దక్షుడు కుమార్తె అయిన క్షమతో వివాహం జరిగింది. వీరికి కర్దమ, కనకపీఠ, ఉర్వరీవత అను ముగ్గురు కుమారులు, పీవరీ అను కుమార్తె కలిగిరి. భాగవత పురాణం ప్రకారం పులాహా ఋషి కర్ధమ ప్రజాపతి మరితు దేవహుతి కుమార్తె అయిన గతిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కర్మశ్రేష్ట, వరీయాంశ, సహిష్ణు అను ముగ్గురు కుమారులు కలిగారు.[3]
శివారాధకుడు
[మార్చు]ఇతను శివ భగవానుడికి శివారాధకుడుగా ఉన్నాడు. పులహుడు యొక్క భక్తికి పరవశం చెందిన శివుడు ఆనందంగా, వారణాసి లోని పులేశ్వర్ రూపంలో శివుడు దర్శన మిచ్చాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Inhabitants of the Worlds Mahanirvana Tantra, translated by Arthur Avalon, (Sir John Woodroffe), 1913, Introduction and Preface. The Rishi are seers who know, and by their knowledge are the makers of shastra and "see" all mantras. The word comes from the root rish Rishati-prapnoti sarvvang mantrang jnanena pashyati sangsaraparangva, etc. The seven great Rishi or saptarshi of the first manvantara are Marichi, Atri, Angiras, Pulaha, Kratu, Pulastya, and Vashishtha. In other manvantara there are other sapta-rshi. In the present manvantara the seven are Kashyap, Atri, Vashishtha, Vishvamitra, Gautama, Jamadagni, Bharadvaja. To the Rishi the Vedas were revealed. Vyasa taught the Rigveda so revealed to Paila, the Yajurveda to Vaishampayana, the Samaveda to Jaimini, Atharvaveda to Samantu, and Itihasa and Purana to Suta. The three chief classes of Rishi are the Brah-marshi, born of the mind of Brahma, the Devarshi of lower rank, and Rajarshi or Kings who became Rishis through their knowledge and austerities, such as Janaka, Ritaparna, etc. Thc Shrutarshi are makers of Shastras, as Sushruta. The Kandarshi are of the Karmakanda, such as Jaimini.
- ↑ Wilkins, W.J. (2003). Hindu Mythology. New Delhi: D.K. Printworld (P) Limited. p. 370. ISBN 81-246-0234-4.
- ↑ "Pulaha Rishi". Archived from the original on 2017-01-24. Retrieved 2017-05-17.
- ↑ Sathyamayananda, Swami. Ancient sages. Mylapore, Chennai: Sri Ramakrishna Math. pp. 29–31. ISBN 81-7505-356-9.