పరాశరుడువసిష్టుని మనుమడు,శక్తి మహర్షి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. జోతిష్యానికి తొలి గురువుగా భావిస్తున్న పరాశరుడు, పరాశరహోర అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు.[2]
సప్తర్షులలో ఒకరైన వశిష్టుడికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు. పరాశరుడు పుట్టే నాటికే శక్తిని రాక్షసుడు మింగేసాడు. పరాశరుడు పుట్టిన తరువాత తన తండ్రి చావు గురించి తెలుసుకొని వశిష్టుడి సలహాతో పరాశరుడు శివుడికి పూజలు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని వరంతో పరాశరుడు స్వర్గంలో ఉన్న తండ్రిని చూడగలిగాడు. తన తండ్రి మరణానికి కారణమైన రాక్షసజాతి మొత్తాన్ని సంహరిస్తానని పరాశరుడు పగపట్టి, అందుకోసం యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం వల్ల వందలాది రాక్షసులు మరణించారు. అయినా శాంతించని పరాశరున్ని శాంతింపచేసేందుకు వశిష్టుడు వచ్చి నచ్చచెప్పడంతో పరాశరుడు శాంతించాడు. ఆ తరువాత యజ్ఞంలోని అగ్నిని హిమాలయాల���ు ఉత్తరంగా విడిచిపెట్టి, తీర్థయాత్రలకు బయల్దేరాడు.[3]
పరాశరుడు తీర్థయ���త్రలకు వెళ్తూ, యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్యగంధి అనే మత్స్యకార యువతిని చూచి మోహిస్తాడు. ఆమె కన్యత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోయేటట్లు వరం ప్రసాదించి, యమునా నది ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించగా, వారికి వేద వ్యాసుడు జన్మించాడు.
వేదాల మీద మంచి పట్టు ఉన్న పరాశరుడు స్వయంగా కొన్ని మంత్రాలను కూడా రచించినట్లు తెలుస్తోంది. రుగ్వేదంలోఅగ్నిదేవుడు, సోమదేవులకి సంబంధించిన కొన్ని సూక్తులు పరాశరుడు రాసినట్టుగా పేర్కొనబడ్డాయి.
↑తెలుగు వెలుగు, ఆధ్యాత్మికం (14 July 2020). "జ్యోతిషానికి తొలి గురువు - పరాశరుడు". TeluguOne Devotional (in english). నిర్జర. Retrieved 14 July 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
సూచనలు క: కురు మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన పూర్వీకుడు కురుకు కొన్ని తరాల తరువాతి రాజు, శంతనుడు. సత్యవతిని పెళ్ళాడే ముందు అతడు గంగను పెడ్లాడాడు.
గ: విచిత్రవీర్యుని మరణం తరువాత, వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండు రాజు జన్మించారు చ: కుంతి వివాహానికి ముందే సూర్యుని వరం చేత ఆమెకు కర్ణుడు జన్మించాడు. డ: పాండవులు పాండు రాజు పుత్రులైనప్పటికీ, దేవతల వరం చేత కుంతి, మాద్రిలకు వీరు కలిగారు.యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు,వాయుదేవుని వలన భీముడు,ఇంద్రుని వలన అర్జునుడు,కవలలైన నకులుడు, సహదేవుడు మాద్రికి అశ్వనీదేవతల వలన కలిగారు. త: దుర్యోధనుడు, అతని శతసోదరులు ఒకేసారి జన్మించారు. న: పాండవులకు ద్రౌపది ద్వారా కలిగిన కుమారుల వివరాలు: ** యుధిష్ఠిరుడు వలన ప్రతివింధ్యుడు, భీముడు వలన శ్రుతసోముడు ,అర్జునుడు వలన శ్రుతకర్ముడు, నకులుడు వలన శతానీకుడు, సహదేవుడు వలన శ్రుతసేనుడు జన్మించారు.