Jump to content

యుయుత్సుడు

వికీపీడియా నుండి
యుయుత్సుడు
యుయుత్సుడి చిత్రం
సమాచారం
లింగంపురుషుడు
ఆయుధంధనస్సు, బాణాలు
కుటుంబం
  • ధృతరాష్ట్రుడు (తండ్రి)
  • గాంధారికి దాసి (తల్లి)
  • గాంధారి (సవతి తల్లి)
  • దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడితో పాటు 100 మంది కొరవ సోదరులు
  • దుశ్శల (చెల్లెలు)

యుయుత్సుడు మహాభారతంలో ధృతరాష్ట్రునికి గాంధారి యొక్క దాసి అయిన సుఖదకు జన్మించిన పుత్రుడు. ధుర్యోధనునితో సమ వయస్కుడు. వంద మంది కౌరవులలో ఒకడు. మహాభారత యుద్ధం తరువాత కౌరవులలో జీవించియున్నది ఒక్క యుయుత్సుడు మాత్రమే. తరువాత ఇంద్రప్రస్థానికి రాజైనాడు.

జననం

[మార్చు]

గాంధారి గర్భం దాల్చి రెండేళ్ళు గడిచినా సంతానం కలగక పోవడంతో ధృతరాష్ట్రుడు వైశ్య కన్యకయైన సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడుగా పొందాడు[1]. యుయుత్సుడు, దుర్యోధనుడు ఒకే రోజు జన్మించారు. మిగతా కౌరవులు, దుస్సల కన్నా ముందే జన్మించాడు.

ధర్మ నిరతుడు

[మార్చు]

ఒకసారి విషపు నీటి ప్రయోగం నుంచి భీముని కాపాడాడు[2][3]. అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో అందరూ మౌనంగా ఉన్నా యుయుత్సుడు మాత్రమే దానిని వ్యతిరేకించాడు. మహాభారతం ధర్మయుద్ధం కావును అందులో పాల్గొనే ఇరు పక్షాల యోధులకు వారికి ధర్మం ఏ పక్షాన ఉందనిపిస్తుందో ఆ వైపుకి మారే అవకాశం ఉంది. యుద్ధ సమయంలో కౌరవులకు సమాచారం చేరవేయడంలో సహాయం చేశాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు కూడా సహాయం చేశాడు.

గాంధారి మూడో కొడుకు వికర్ణుడు కూడా యుయుత్సుడితో సమానంగా ధర్మాచరణుడే. ధుర్యోదనుని కుటిల బుద్ధిని ద్వేషించిన వాడే కానీ ధర్మాన్ని అనుసరించి యుయుత్సుడు ధుర్యోధనుడిని విడిచి పెట్టాడు. వికర్ణుడు అన్నగారిని విడిచిపెట్ట లేక పోయాడు. ఇది రామాయణంలో విభీషణుడు, కుంభకర్ణుడు సంబంధం లాంటిది.[4][5]

కురుక్షేత్రంలో

[మార్చు]

పాండవులకు, కౌరవులకూ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవక ముందే యుయుత్సుడు పాండవుల పక్షానికి చేరాడు. వారి తరపునే పోరాడాడు. కౌరవ సైన్యంలో ఉన్న పదకొండు మంది అతిరథుల్లో (ఒక్కసారి పదివేల మందితో పోరాడగలిగినవాడు) యుయుత్సుడు కూడా ఒకడు. యుద్ధానంతరం పదకొండు మందిలో జీవించి ఉన్నది కూడా యుయుత్సుడే.

యుద్ధం అనంతరం

[మార్చు]

సంగ్రామం ముగిసిన తరువాత పాండవులు హిమాలయాలకు వెళుతూ చిన్నవాడైన రాజు పరీక్షిత్తుకు యుయుత్సుడిని సంరక్షకుడిగా నియమించారు[6][7]. యాదవకులంలో ముసలం ప్రారంభం కాకమునుపే నగరంలో అరాచకం ప్రభలడం గమనించాడు యుయుత్సుడు. దాన్ని గురించి ప్రజలను అడగగా వారు అతని మీదే నిందలు వేసి ద్రోహిగా సొంత బంధువుల మరణానికి కారకుడిగా ముద్ర వేశారు. కలియుగం ప్రారంభమౌతుందన్న సూచనలు తెలుసుకొన్న ధర్మరాజు ఇంద్రప్రస్థానికి రాజుని చేశారు.

మూలాలు

[మార్చు]
  1. Kapoor, Subodh, ed. (2002). The Indian encyclopaedia : biographical, historical, religious, administrative, ethnological, commercial and scientific (1st ed.). New Delhi: Cosmo Publications. ISBN 9788177552577.
  2. Menon, [translated by] Ramesh (2006). The Mahabharata : a modern rendering. New York: iUniverse, Inc. ISBN 9780595401871.
  3. "Mahabharata Text".
  4. Yuyutsu was one of the 11 who managed to survive the war
  5. Buck, William (2000). Mahabharata. p. 327. ISBN 9788120817197.
  6. Parmeshwaranand, Swami (2001-01-01). Encyclopaedic Dictionary of Puranas (in ఇంగ్లీష్). Sarup & Sons. ISBN 9788176252263.
  7. Brodbeck, Simon Pearse (2009). The Mahābhārata patriline : gender, culture, and the royal hereditary. Farnham, England: Ashgate. ISBN 9780754667872.