Jump to content

అశ్వత్థామ

వికీపీడియా నుండి
ప్రతివింద్యుని చంపిన అశ్వత్థామ

అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి కడు ప్రియమైనవాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వథ్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు.

ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు. వీరు..... 1. అశ్వత్థామ, 2. బలిచక్రవర్తి. 3. వ్వాసమహర్షి. 4. హనుమంతుడు. 5. విభీషణుడు. 6. కృపాచార్యుడు. 7. పరశురాముడు.

మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటి పూట ఎలా దాడి చేస్తాయో, అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందర్నీ గంగానదీ తీరానికి తరలించాడు.

అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపదీ పుత్రులైన ఐదుమంది ఉపపాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా Pasupatsharam ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేక పోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్ళిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్టించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. అశ్వత్థామను 3 వెల సంవత్సరాలపాటు కుష్టు వ్యాధి గ్రస్థుడివి కమ్మని కృష్ణుడు శపిస్తాడు.