ఆగష్టు 1
తేదీ
(ఆగస్టు 1 నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 213వ రోజు (లీపు సంవత్సరములో 214వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2025 |
సంఘటనలు
మార్చు- 1498: క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరాడు.
- 1790: అమెరికాలో మొట్టమొదటి జనాభా లెక్కలు ముగిసిన రోజు. ఆనాటి అమెరికా జనాభా 39, 29, 214 మాత్రమే.
- 1774: జోసెఫ్ ప్రీస్ట్లీ, షీలే అనే శాస్త్రవేత్తలు ఆక్సిజన్ (ఆమ్లజని ) మూలకాన్ని కనుగొన్నారు.
- 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1958 అక్టోబరు 1న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1957 ఏప్రిల్ 1 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు [1]
- 1798: ఆంగ్ల నౌకాదళం, నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలు నది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ నావికాదళాన్ని ఓడించింది.
- 1861: "టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటి "వాతావరణ వివరాలు" ప్రచురించింది. ఆనాడు, వాతావరణ శాఖలో పనిచేస్తున్న "అడ్మిరల్ రాబర్ట్ ఫిట్ఝ్రోయ్" ఈ వాతావరణ వివరాలు అందచేసాడు. ("రేపటి వాతావరణం వివరాలు" పుట్టిన రోజు) [2]
- 1876: కొలరాడో 38వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరింది.
- 1914: జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశంగా చెప్పింది.
- 1936: అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాడు.
- 1957: భీమసేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పదవీస్వీకారం (1957 ఆగష్టు 1 నుంచి 1962 సెప్టెంబరు 6 వరకు) .
- 1969: ఎయిర్ ఛీఫ్ మార్షల్గా అర్జున్ సింగ్ పదవి స్వీకారం (1964 ఆగష్టు 1
- 1946: అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేసాడు. ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం, మరొకటి పుల్బ్రైట్ స్కాలర్షిప్ చట్టం.నుంచి 1969 జూలై 15 వరకు) .
- 1971: అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ చంద్రశిలను అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోతి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి చంద్ర వాహనం నడిపిన వారు కూడా వీరే.
- 1975: మానవ హక్కుల ఒప్పందం పై 35 పైగా దేశాలు సంతకం చేసాయి. ( దీనిని హెల్సింకీ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకీ నగరంలో జరిగింది)
- 1981 : ఉర్రూతలూగించే ఎమ్.టి.వి. తన మొట్టమొదటి ప్రసారం, ఉదయం 12:01 నుంచి ప్రారంభించింది. మొట్టమొదట ప్రసారమైన వీడియో బగ్లెస్ వారి "వీడియో కిల్డ్ ద రేడియో స్టార్".
- 1983: జనరల్ ఎ.ఎస్.వైద్య భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
- 2008: భారతదేశంకు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది.
జననాలు
మార్చు- 10 బి.సి: క్లాడియస్ రోమన్ చక్రవర్తి (మ. 0054) .
- 1744: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (మ.1829)
- 1770: విలియం క్లార్క్, ఎక్స్ప్లోరర్
- 1779: ఫ్రాన్సిస్ స్కాట్ కీ, అమెరికన్ జాతీయగీతం రచయిత. పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత జననం 2 ఆగష్టు 1876. ఆశ్చర్యం ఏమిటంటే అమెరికా జాతీయ గీతాన్ని (ద స్టార్ స్ఫాంగ్ల్ద్ బేనర్ - “O say can you see by the dawn's early light” ) రచించిన ప్రాన్సిస్ స్కాట్ కీ పుట్టిన రోజు 1 ఆగష్టు 1779. ఇద్దరికి 1 రోజు తేడా. నెల ఒక్కటే. సంవత్సరాలు 97 తేడా. అమెరికా, భారత దేశము రెండూ ప్రజాస్వామ్య దేశాలే. ఒకరు జాతీయ పతాక నిర్మాత. మరొకరు జాతీయ గీతం రచయిత.
- 1818: మేరియా మిచెల్, రోదసీ పరిశోధకుడు.
- 1877: షార్లెట్ మారియన్ హుఘ్స్, బ్రిటన్ లోని క్లీవ్ లాండ్ (మార్స్క్) అనే చోట 1 ఆగష్టు 1877 న జన్మించి 1989లో బ్రిటన్ లోని పురాతన వ్యక్తిగా తన 112వ పుట్టిన రోజు చేసుకున్నది. ఈమె పుట్టిన రోజున అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన మొదటి టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. అదే సంవత్సరం మొదటి లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్, వింబుల్డన్ వద్ద జరిగింది. అప్పటికి క్వీన్ విక్టోరియా భారతదేశపు మహారాణిగా ఉంది.
- 1888: శొంఠి వెంకట రామమూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (మ.1964)
- 1889: డాక్టర్ జాన్ ఎఫ్ మహనీ, సవాయి వ్యాధికి పెన్సిలిన్తో చికిత్స చేయటం మొదలుపెట్టి, అభివృద్ధి, చేసాడు. (ఆ కాలపు సుఖవ్యాధులలో సవాయి అత్యంత భయంకరమైనది) (మ.1957)
- 1890: అనంతపంతుల రామలింగస్వామి, తెలుగు కవి. (మ.1977)
- 1900: పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (మ.1962)
- 1921: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (మ.1966)
- 1925: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాదు బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (మ.2013)
- 1933: డోమ్ డెలూయిస్, అమెరికన్ సినిమా నటుడు.
- 1934: నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (మ.2019)
- 1935: ఏ.బి.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.
- 1936: వైవెస్ సెయింట్ లారెన్ట్, ఫాషన్ డిజైనర్.
- 1942: జెర్రీ గార్షియా, సంగీత కళాకారుడు.
- 1944: యూరి వి రొమనెన్కొ, రష్యాదేశపు వ్యోమగామి USSR, కాస్మోనాట్ (సోయుజ్ 26, సోయుజ్38, సోయుజ్ టి.ఎమ్-2 రోదసీ నౌకలలో ప్రయాణించాడు)
- 1949: గల్లా అరుణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.
- 1949: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, విమర్శకుడు, భాషాశాస్త్ర పండితుడు, ఎమెస్కో గౌరవ సంపాదకుడు.
- 1955: అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1956: అనంత వెంకట రామిరెడ్డి, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు
- 1975: హరీష్: తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళo, హిందీ, చిత్రాల నటుడు .
- 1983: కే.ఎస్ .రవీంద్ర , తెలుగు చలనచిత్ర దర్శకుడు.
- 1987: తాప్సీ, వర్థమాన సినీ నటి, మోడల్.
- 1992: మృణాల్ ఠాగూర్ , మరాఠి, హిందీ, తెలుగు చిత్రాల నటి.
మరణాలు
మార్చు- 1920: బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856)
- 1936: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. (జ.1863)
- 2010: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (జ.1917)
- 2013: పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940)
- 2017: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త. "సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (జ.1928)
- 2020: పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి. (జ.1961)
- 2022: కె.జె.సారథి, తెలుగు సినిమా నటుడు, నిర్మాత. (జ.1942)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
- 1935 - ఆగస్టులోని మొదటి ఆదివారం 'స్నేహితుల దినోత్సవం" జరుపుకోవటం అమెరికాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది.
- 1976: ట్రినిడాడ్ స్వాతంత్ర్య దినోత్సవం.
- 1976: టొబాగో స్వాతంత్ర్య దినోత్సవం.
- స్విట్జర్లాండ్ జాతీయ దినోత్సవం. (స్విస్ కాన్ఫెడరేషన్ దినోత్సవం)
- బెనిన్ జాతీయ దినోత్సవం.
- కుక్ ఐలాండ్స్ రాజ్యాంగ దినోత్సవం.
- జమైకా స్వాతంత్ర్య దినోత్సవం.
- ఇండియా ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవము.
- అంతర్జాతీయ పర్వత దినోత్సవం
- యార్క్ షైర్ డే (యు.కె . జరుపుకొనే ముఖ్యమైన దినోత్సవం )
- వరల్డ్ వైడ్ వెబ్ డే
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
జూలై 31 - ఆగష్టు 2 - జూలై 1 - సెప్టెంబర్ 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |