దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి | |
---|---|
జననం | 1949 ఆగష్టు 1 |
ఇతర పేర్లు | దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి |
ప్రసిద్ధి | తెలుగు విమర్శకులు, రచయిత |
తండ్రి | వెంకటప్పారెడ్డి |
తల్లి | నాగేంద్రమ్మ |
పుట్టుక-కుటుంబ నేపథ్యం
మార్చుడా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి సా.శ.1949 సంవత్సరం అగస్టు 1 వ తేదిన జన్మించాడు.ఇతని తల్లిదండ్రులు నాగేంద్రమ్మ, వెంకటప్పారెడ్డి.ఈయనకు ఇద్దరు సోదరులు డి.వి.కృష్ణ, సాయిరెడ్డి.
విద్యాభ్యాసం
మార్చుచంద్రశేఖరరెడ్డి యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం ప్రస్తుత్త తెలంగాణ రాష్ట్రంలోని, నిజామాబాదు జిల్లాలోని పెంటఖుర్దు (బోధన్) లో మొదలైనది. బొదన్ లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 1965లో తన హెచ్.ఎస్.సి,ని పూర్తి చేసాడు.అతరువాత ఈయన కళాశాల విద్యాభ్యాసం హైదరాబాదున మొదలైనది. హైదరాబాదులోని, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1965-69లో పట్టబధ్రుడయ్యాడు.అక్కడ డిప్.ఓ.ఎల్, బి.ఓ.ఎల్‌లో ఉత్తీర్ణత సాధించాడు.అటుపిమ్మట ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఎమ్.ఏ (తెలుగు) 1973,1976లో ఎమ్.ఏ (భాషాశాస్త్రం) లో,1979లో ఎమ్.ఫిల్ (తెలుగు) లో కూడా ఉత్తీర్ణత పొందాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు కావ్య పీఠికల పరిశీలన అనే విషయంపై పరిశోధన వ్యాసం సమర్పించి,1984లో పిహెచ్.డి.పొందాడు. :
వ్యక్తిగత జీవితం
మార్చుచంద్రశేఖరరెడ్డి వివాహం డాక్టరు గుంట���రు రాజ్యలక్ష్మితో 1976 వసంవత్సరం జూలై నెల 5 వతేదిన జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వారిపేర్లు ; హిమ (25-3-1978), పావన్ (8-11-1984)
ఉద్యోగ జీవితం
మార్చువీరి ఉద్యోగ పర్వమంతా సికింద్రాబాదు, హైదరాబాదు పరిసరప్రాంతాలలోనే కొనసాగినది
- తెలుగు పండితుడు, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ (1967).
- తెలుగు పండితుడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, హైదరాబాద్ (1968-74)
- తెలుగు ఉపన్యాసకుడు, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల, హైదరాబాద్ (1974-2003)
- ప్రధానాచార్యులు, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాల, హైదరాబాద్ (2003-2007)
వీరు 2007 జూలై 31న ఉద్యోగ విరమణ చేసారు. ప్రస్తుతం ఎమెస్కో ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
రచనలు
మార్చు- చిత్రాల్లో తెలుగువారి చరిత్ర, ఎమెస్కోప్రచురణ[1]
- మన భాష , మీడియా హౌస్ పబ్లికేషన్స్[2]
- మనజాతి నిర్మాతలు, ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు (1982)
- శ్రీకృష్ణదేవరాయ వైభవం, ఎమెస్కోప్రచురణ[3]
- తెలుగు పీఠిక, ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు, (1990)
- మారుతున్న సమాజానికి శాశ్వత విలువలు (అనువాదం) (కాకానిచక్రపాణితో), రామకృష్ణ మఠం, హైదరాబాదు,1992
- దువ్వూరి రామిరెడ్డి (మోనోగ్రాఫ్), కేంద్రసాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ, 1999
- బలవంతులు (అనువాద కవితలు) మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2001
- సంహిత (సాహిత్య వ్యాస సంకలనం) మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2001
- మనసులోమాట (అనువాదం), ఎమెస్కో, హైదరాబాదు, 2003
- 'జెన్ కథలు', మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, (యావిలాల జగదీశ్‌తో) 2005
- 'సహస్రధార' (అనువాదం), ఎమెస్కో, హైదరాబాదు, 2006
- కోల్పోయిన ప్రపంచం (అనువాదం - కథలు) (కాకాని చక్రపాణిగారితో) ఎమెస్కో, హైదరాబాదు, 2006
- సహరచయిత : 'తెలుగువాచకాలు, ఆరు, పది తరగతులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు.
- తెలుగు ఉపవాచకం - పదవ తరగతి (ద్వి.భా), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు.
- తెలుగు బోధనా పద్ధతులు - డి.ఎడ్, కర్ణాటక ప్రభుత్వం, బెంగుళూరు.
సంపాదకత్వం- సహసంపాదకత్వం
మార్చు- తెలుగు సాహిత్యం - చారిత్రక నేపథ్యం, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాల, హైదరాబాదు, 1994.
- 'తెలుగువాచకాలు' - పదవ తరగతి (ద్వితీయ భాష), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు.
- 'సంపాదకమండలి సభ్యత్వం: 'తెలుగు వాచకం' - మూడు, నాలుగు, ఐదు తరగతులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు.
- 'సహఅనువాదకుడు : 'తెలుగువాచకాలు', పి.యు.సి ప్రథమ ద్వితీయ సంవత్సరాలు, కర్ణాటక ప్రభుత్వం, బెంగుళూరు.
- నిజాం బ్రిటీషు సంబంధాలు:', మీడియాహౌస్ పబ్లికేషన్స్ హైదరాబాదు, 2002.
- కాకతీయులు, మీడియా హౌస్ పబ్లికేషన్స్:', హైదరాబాదు, 2005.
- హైదరాబాదు నిజాం నవాబులు, ఎమెస్కో, హైదరాబాదు, 2011
ఆధారాలు
మార్చు- ↑ "చిత్రాల్లో తెలుగువారి చరిత్ర". emescobooks.com. Archived from the original on 2014-10-08. Retrieved 2015-03-26.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "మన భాష". మీడియా హౌస్ పబ్లికేషన్స్. Retrieved 2018-08-27.
- ↑ "శ్రీకృష్ణదేవరాయ వైభవం". emescobooks.com. Archived from the original on 2014-01-11. Retrieved 2015-03-26.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)