Jump to content

కేరళ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
కేరళ ఎక్స్‌ప్రెస్
Kerala Express
కేరళ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంSuperfast
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వే
మార్గం
మొదలున్యూ ఢిల్లీ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు38
గమ్యంత్రివేండ్రం సెంట్రల్
ప్రయాణ దూరం3,036 కి.మీ. (1,886 మై.)
సగటు ప్రయాణ సమయం50 గంటల 45 నిమిషాలు
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)12625 / 12626
సదుపాయాలు
శ్రేణులు2 Two Tier AC, 3 Tier AC, SL, General
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
సాంకేతికత
రోలింగ్ స్టాక్7
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం59.86 km/h (37.20 mph) average with halts
మార్గపటం

భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తోన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కేరళ ఎక్స్ ప్రెస్ (ఆంగ్లం: Kerala Express) కూడా ఒకటి. ఈ రైలు భారతదేశ రాజధాని క్రొత్తఢిల్లీ, కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం (తిరువనంతపురం) లోని త్రివేండ్రం సెంట్రల్ మధ్య నడుస్తుంటుంది. ప్రతిరోజు నడిచే ఈ రైలు న్యూఢిల్లీ, త్రివేండ్రం మధ్య 3, 036 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో మొత్తం 40 చోట్ల ఆగుతుంటుంది. దీని సగటు వేగం 59 కి.మీ./గం.[1] న్యూ ఢిల్లీ, తిరువంతపురం సెంట్రల్ స్టేషన��ల మధ్య నడిచే ఈ రైలు భారతదేశంలో అతి ఎక్కువ దూరం ఎలక్ట్రిక్ ఇంజిన్ తో నడిచే రైలుగా రికార్డు సృష్టించింది.[2] ఈ రైలును అందరూ అధిగమించే రారాజు (కింగ్ ఆఫ్ ఓవర్ టేక్స్) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ మార్గంలో నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్, శతాబ్ది ఎక్స్ ప్రెస్ మినహా దాదాపు మిగతా అన్ని రైళ్లను అధిగమించింది.

చరిత్ర

[మార్చు]

ఈ రైలు 1976లో కేరళ – కర్ణాటక (కె.కె. ఎక్స్ ప్రెస్) పేరుతో ప్రారంభమైంది. అప్పట్లో కేరళ-కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు న్యూ ఢిల్లీ నుంచి బయలు దేరి త్రివేండ్రంతో పాటు జోలార్ పెట్టి జంక్షన్ వద్ద విడిపోయి బెంగళూరు వరకు నడుస్తుండేది. 1980లో కె.కె. ఎక్స్ ప్రెస్ కాస్తా కేరళ ఎక్స్ ప్రెస్ మరియ కర్ణాటక ఎక్స్ ప్రెస్ పేర్లతో రెండు రైళ్లుగా విడిపోయింది. తిరిగి కేరళ ఎక్స్ ప్రెస్ లో కొంతభాగం పాల్ ఘాట్ జంక్షన్ వద్ద విడిగొట్టి మంగళూరు మార్గంలోకి మళ్లించారు. దీనిని జయంతి జనతా స్థానంలో సర్దుబాటు చేశారు. గతంలో జయంతి జనతా రైలు షోర్నాపూర్ వద్ద విడిపోయి ఒక భాగం రైలు కొచ్చిన్ ఓడరేవుకు, మరో భాగం మంగళూరుకు వెళ్లేది. ఆ తర్వాత ఈ రెండు రైళ్లను కలిపేసి కేరళ మంగళ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. 1990 తర్వాత మంగళూరుకు ప్రత్యేక రైలును పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అదే మార్గంలో నడుస్తోంది. ఇది అప్పట్లో ప్రతిరోజు నడిచేది కాదు. తమిళనాడు ఎక్స్ ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్, కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైళ్ల సమయంలోనే ఇది ఉండటం వల్ల ఆ కాలాన్ని పంచుకుని నడిచేది. కానీ... ఆతర్వాత ఇది ప్రతిరోజు నడిచే రైలుగా సొంత కాల భాగాన్ని పొంది స్వతంత్రంగా మారింది.[3]

కేరళ ఎక్స్ ప్రెస్ నిజానికి ఆరంభంలో 125/126 అనే మూడంకెల నెంబర్లతో నడిచేది. ఆ తర్వాత ఈ నెంబర్లను పలుమార్లు మార్చాల్సి వచ్చింది. 1989 తర్వాత భారతీయ రైల్వేలు నాలుగు అంకెలు గల నెంబర్ల పద్ధతిని ప్రవేశపెట్టడంతో రెండోసారి రైలు నెంబర్లను 2625/2626 నెంబర్లుగా మార్చారు.[4] తిరిగి డిసెంబరు 2010లో ఐదు అంకెల విధానాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో మళ్లీ కేరళ ఎక్స్ రైలు నెంబర్లు మూడోసారి మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ రైలు పై స్థాయి (అప్ వర్డ్) ప్రయాణంలో 12625 నెంబర్ తో నడుస్తుండగా, దిగువ స్థాయి (డౌన్ వర్డ్) ప్రయాణంలో 12626 నెంబరుతో నడుస్తోంది.[5]

ఈ రైలు 12626 నెంబరుతో న్యూ ఢిల్లీ నుంచి త్రివేండ్రం మార్గంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా 12625 నెంబరు గల రైలు త్రివేండ్రం నుంచి న్యూ ఢిల్లీకి ప్రయాణిస్తుంది.

బోగీల విభజన

[మార్చు]

మొత్తం 24 బోగీలు గల ఈ రైలును వివిధ విభాగాలుగా విభజించారు. వీటిలో 7 ఏసీ బోగీలున్నాయి. (ఏసీ విభాగంలో వీటిలో 2 టూ టైర్ ఏసీ బోగీలు, మరో 5 త్రీ టైర్ ఎసీ బోగీలుంటాయి.), ఇవిగాక 12 స్పీపర్ తరగతి బోగీలు, 4 సాధారణ బోగీలు, ఒక ప్యాంట్రీ కారు ఉంటాయి. ఈ రైలును లాగడానికి ఈరోడ్ షెడ్ కు చెందిన డబ్ల్యు.ఎ.పి-4 ఇంజిన్ తో గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

మార్గం

[మార్చు]
12626 Kerala Express - AC 3 tier

ఈ రైలు తిరువనంతపురంలో బయలుదేరి కొల్లాం, కాయంకులం, మావేలికరా, చెంగన్నూర్, తిరువెల్ల, చెంగనస్సేరీ, కొట్టాయాం, ఎర్నాకులం, ఆలువా, త్రిశూర్, షోర్నూర్, పలక్కాద్, కోయంబత్తూర్, తిరుపూర్, ఈ రోడ్, సేలం, జోలర్ పెట్టాయ్, కట్పడి, చిత్తూరు,తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, రామగుండం, బల్లర్షా, నాగపూర్, భోపాల్, ఝాన్షీ, గ్వాలియర్, ఆగ్రా, మథుర గుండా ప్రయాణించి న్యూఢిల��లీ చేరుతుంది.

సమయ సారణి

[మార్చు]
సంఖ్య స్టేషన్ కోడ్ స్టేషన్ పేరు 12625 : తిరువనంతపురం - న్యూఢిల్లీ 12626 : న్యూఢిల్లీ - తిరువనంతపురం
చేరు

సమయం

బయలుదేరు

సమయం

దూరం చేరు

సమయం

బయలుదేరు

సమయం

దూరం
1 TVC త్రివేండ్రం సెంట్రల్ మూల 11:15 (డే 1) 0 14:35 (డే 3) గమ్యం 3035
2 VAK వర్కల 11:44 (డే 1) 11:45 (డే 1) 41 13:25 (డే 3) 13:27 (డే 3) 2994
3 QLN కొల్లం జంక్షన్ 12:10 (డే 1) 12:15 (డే 1) 65 13:00 (డే 3) 13:05 (డే 3) 2970
4 KYJ కాయంగుళం జంక్షన్ 12:55 (డే 1) 12:57 (డే 1) 106 12:15 (డే 3) 12:17 (డే 3) 2929
5 MVLK మావేలికర 13:03 (డే 1) 13:05 (డే 1) 114 12:03 (డే 3) 12:05 (డే 3) 2921
6 CNGR చెంగన్నూర్ 13:18 (డే 1) 13:20 (డే 1) 126 11:48 (డే 3) 11:50 (డే 3) 2909
7 TRVL తరువల్ల 13:28 (డే 1) 13:30 (డే 1) 135 11:38 (డే 3) 11:40 (డే 3) 2900
8 CGY చంగనశ్శేరి 13:38 (డే 1) 13:40 (డే 1) 143 11:28 (డే 3) 11:30 (డే 3) 2892
9 KTYM కోట్టయం 14:02 (డే 1) 14:05 (డే 1) 161 11:07 (డే 3) 11:10 (డే 3) 2874
10 VARD వైకం రోడ్ 14:23 (డే 1) 14:25 (డే 1) 186 10:23 (డే 3) 10:25 (డే 3) 2850
11 ERS ఎర్ణాకుళం జంక్షన్ 15:35 (డే 1) 15:45 (డే 1) 220 09:35 (డే 3) 09:45 (డే 3) 2815
12 AWY అలువ 16:07 (డే 1) 16:09 (డే 1) 240 08:35 (డే 3) 08:37 (డే 3) 2795
13 TCR త్రిశ్శూర్ 17:00 (డే 1) 17:03 (డే 1) 295 07:37 (డే 3) 07:40 (డే 3) 2741
14 OTP ఒట్టప్పాలెం 18:03 (డే 1) 18:05 (డే 1) 340 06:53 (డే 3) 06:55 (డే 3) 2695
15 PGT పాలక్కాడ్ 18:40 (డే 1) 18:45 (డే 1) 372 06:20 (డే 3) 06:25 (డే 3) 2664
16 CBE కోయంబత్తూరు JN 19:55 (డే 1) 20:00 (డే 1) 426 05:05 (డే 3) 05:10 (డే 3) 2609
17 TUP తిరుప్పూర్ 20:48 (డే 1) 20:50 (డే 1) 476 04:03 (డే 3) 04:05 (డే 3) 2559
18 ED JN ఈరోడ్ 21:50 (డే 1) 22:00 (డే 1) 527 03:15 (డే 3) 03:20 (డే 3) 2509
19 SA సేలం జంక్షన్ 22:55 (డే 1) 23:00 (డే 1) 589 02:10 (డే 3) 02:15 (డే 3) 2446
20 JTJ జోలార్పేటై 00:43 (డే 2) 00:45 (డే 2) 709 00:33 (డే 3) 00:35 (డే 3) 2326
21 KPD కాట్పాడి జంక్షన్ 02:00 (డే 2) 02:02 (డే 2) 793 23:18 (డే 2) 23:20 (డే 2) 2242
22 CTO చిత్తూరు 02:39 (డే 2) 02:40 (డే 2) 826 21:58 (డే 2) 22:00 (డే 2) 2210
23 TPTY తిరుపతి 03:55 (డే 2) 03:57 (డే 2) 897 20:52 (డే 2) 20:54 (డే 2) 2138
24 RU రేణిగుంట జంక్షన్ 04:10 (డే 2) 04:20 (డే 2) 907 20:30 (డే 2) 20:40 (డే 2) 2128
25 GDR గూడూర్ జంక్షన్ 05:55 (డే 2) 05:57 (డే 2) 990 19:14 (డే 2) 19:20 (డే 2) 2045
26 NLR నెల్లూరు 06:22 (డే 2) 06:23 (డే 2) 1029 18:08 (డే 2) 18:10 (డే 2) 2007
27 BZA విజయవాడ JN 10:00 (డే 2) 10:15 (డే 2) 1283 14:45 (డే 2) 15:00 (డే 2) 1752
28 WL వరంగల్ 13:00 (డే 2) 13:05 (డే 2) 1492 11:02 (డే 2) 11:07 (డే 2) 1544
29 RDM రామగుండం 14:40 (డే 2) 14:41 (డే 2) 1592 09:30 (డే 2) 09:32 (డే 2) 1443
30 BPQ బల్హారషా 17:00 (డే 2) 17:10 (డే 2) 1734 07:40 (డే 2) 07:50 (డే 2) 1301
31 SEGM సేవాగ్రామ్ 18:59 (డే 2) 19:01 (డే 2) 1869 05:11 (డే 2) 05:13 (డే 2) 1166
32 NGP నాగపూర్ 20:05 (డే 2) 20:15 (డే 2) 1945 04:00 (డే 2) 04:10 (డే 2) 1090
33 ET ఇటార్సి JN 01:05 (డే 3) 01:10 (డే 3) 2242 23:50 (డే 1) 23:55 (డే 1) 793
34 BPL భోపాల్ జంక్షన్ 02:55 (డే 3) 03:00 (డే 3) 2334 21:40 (డే 1) 21:45 (డే 1) 701
35 BINA బినా JN 04:50 (డే 3) 04:55 (డే 3) 2472 19:50 (డే 1) 19:55 (డే 1) 563
36 JHS ఝాన్సీ జంక్షన్ 06:55 (డే 3) 07:07 (డే 3) 2625 17:40 (డే 1) 17:52 (డే 1) 410
37 GWL గౌలియార్ 08:20 (డే 3) 08:25 (డే 3) 2722 16:05 (డే 1) 16:10 (డే 1) 313
38 AGC ఆగ్రా CANTT 10:20 (డే 3) 10:25 (డే 3) 2840 14:05 (డే 1) 14:10 (డే 1) 195
39 MTJ మధుర JN 11:12 (డే 3) 11:15 (డే 3) 2894 13:18 (డే 1) 13:21 (డే 1) 141
40 FDB ఫరీదాబాద్ 12:50 (డే 3) 12:51 (డే 3) 3007
41 NZM హెచ్ నిజాముద్దీన్ 13:21 (డే 3) 13:23 (డే 3) 3027
42 NDLS న్యూఢిల్లీ 13:45 (డే 3) గమ్యం 3035 మూల 11:25 (డే 1) 0

కోచ్ల కూర్పు

[మార్చు]

ఈ రైలుకు 24 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -

12635/12636

తిరువనంతపురం రైల్వే స్టేషను నుండి ఢిల్లీకి నడిచే ఈ రైలులో కోచ్ ల అమరిక ఈ విధంగా ఉంటుంది.

0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
ERS SLR జనరల్ A2 A1 బి5 బి4 బి3 బి2 బి1 ఎస్12 ఎస్11 PC ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ SLR

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://indiarailinfo.com/train/timetable/935/59/664
  2. "Trivia". IRFCA.
  3. "Altered Trains". IRFCA.
  4. "Old Train Numbers". IRFCA.
  5. "Kerala Express-12625". cleartrip.com. Archived from the original on 2014-08-14.

బయటి లింకులు

[మార్చు]