వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ
నాణ్యతపై అవగాహనకు యర్రా రామారావు సలహా
[మార్చు]- నాణ్యతపై అవగాహన విభాగం పై నాకు తోచిన సలహా మీ ముందుంచుతున్నాను. వికీపీడియాలో తప్పులుగా అనిపించి గమనించిన పదాలకు సరియైన పదాలు, స్వంతంగా ఆలోచనకు వచ్చిన సరియైన పదాలు, దినపత్రికలనందు గమనించిన సరియైన పదాలు వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక లో అవసరమైన మార్పులు చేసి, వాడుకరులు నేరుగా పొందుపరిచే అలవాటు అందరం పాటిస్తే ఒకరు రాసినవి ఇంకొకరికి తెలిసే అవకాశం ఉంటుంది.--యర్రా రామారావు (చర్చ) 15:54, 7 ఫిబ్రవరి 2020 (UTC)
70% కంటే తక్కువ మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి విధానం సమీక్ష
[మార్చు]- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
- చర్చ గడువు పూర్తి. అర్జున (చర్చ) 23:46, 5 సెప్టెంబరు 2020 (UTC)
వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద_ఉపకరణ_వ్యాసాల_నాణ్యతాభివృద్ధి#2020_ఫిభ్రవరికి_ముందు_అనువాద_వ్యాసాల_యాంత్రికానువాద_స్థాయి_విశ్లేషణ ప్రకారం, యాంత్రిక అనువాద స్థాయి 70% గా నిర్ణయించడం తొలగించిన వ్యాసాలలాంటివి సృష్టించకుండా నిరోధించగలుగుతున్నది కాని, కొంత అనుభవమున్న సభ్యుల యాంత్రిక అనువాదాలను కూడా నిరోధిస్తున్నది.
తెలుగు వికీలో క్రియాశీల సభ్యుల సంఖ్యలో పెద్ద పెరుగుదల లేదు. నైపుణ్యాలు కూడా కొత్త వ్యాసాలు రాయుటకు తగినంతగా వుండే అవకాశం తక్కువ. ప్రస్తుత విధానం ద్వారా, కొద్ది ఆసక్తి వున్న వాళ్లని నిరుత్సాహపరిచిన వారమవుతాము. అలా ప్రస్తుత విధానం భాషపై బాగా పట్టు గల వారు మాత్రమే అనువాదాలపై కృషి చేయటానికి అనుమతిస్తున్నందున, తెవికీ అభివృద్ధికి ఇది నిరోధకంగా వుంది. మరిన్ని వివరాలు క్రింద చేర్చాను. ఇతర సభ్యులు వారి అభిప్రాయాలను, విశ్లేషణలను ఆ విభాగాలలో చేర్చండి.--అర్జున (చర్చ) 01:54, 15 ఆగస్టు 2020 (UTC)
స్పందన అభ్యర్ధన
దీని గురించి అనువాద పరికరం వాడిన సభ్యులందరు చర్చించి ప్రతిపాదనలో మార్పులు, చేర్పులు ఖరారు చేసి వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం కొత్త నిర్ణయం చేసి అమలులోకి తీసుకురావచ్చు. స్పందించే ముందు సంబంధిత ప్రాజెక్టు పేజీ కూడా చూడండి. సందేహాలు అడగండి. విశేషంగా కృషి చేసి తెలుగు అనువాద వ్యాసాల పతకం అందుకున్న Meena gayathri.s, Chaduvari, Pavan santhosh.s, K.Venkataramana, Subramanyam parinam, IM3847, Viggu, Apbook, యర్రా రామారావు, రహ్మానుద్దీన్, Ajaybanbi, దేవుడు, PhaniYesh99, Arjunaraoc, Rajani Gummalla Translation, Ballankipavan, Bhashyam Tharun Kumar, Ch Maheswara Raju, Krupa Vara Prasad, Somepalli Manikumar, Sumanth699, Praveen Illa, Vin09 అందరూ, ఇంకా అనువాద వ్యాసాలపై పనిచేసినవారందరూ, పనిచేయని వారు పనిచేయటానికి ప్రయత్నించి, చర్చలో పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి.--అర్జున (చర్చ) 14:24, 14 ఆగస్టు 2020 (UTC)
అనువాదకులు, అనువాద వ్యాసాలు - గణాంకాల విశ్లేషణ
[మార్చు]2020 తొలి రెండు మాసాలలో అనువాదాలు ముద్రించి గలిగిన వారు 10 మంది కాగా, 2020 మూడు, నాలుగు నెలలలో అనువాదాలు ముద్రించగలిగినవారు 8 మంది మాత్రమే. ఇది పెద్ద తేడా కాకపోయినా, చిత్తుస్థితిలో వున్న అనువాదాల సంఖ్యSpecial:CXStats గమనించండి
29/12/2020 - 122
01/03/2020 - 167
03/05/2020 - 234
౦5/07/2020 - 271
అంటే 70% పరిమితి లేకమ��ందు చిత్తు అనువాదాలు రెండు నెలలలో 55 పెరగగా, పరిమితి విధించిన తరువాత రెండు నెలలలో 67 పెరిగాయి. మే, జూన్ మాసాలలో 47 పెరిగాయి. సభ్యులు ప్రస్తుత విధానం వలన అనువాద వ్యాసాలపై ఆసక్తి తగ్గించుకోవటంగా దీనిని అనుకోవచ్చు.--అర్జున (చర్చ) 01:54, 15 ఆగస్టు 2020 (UTC)
తొలగింపుల విశ్లేషణ
[మార్చు]2019 లో కొత్తగా సృష్టించిన అనువాద వ్యాసాలలో సుమారు 20 శాతం తొలగింపుకు గురయ్యాయి, సాధారణ కొత్త వ్యాసాలు 15% తొలగింపుకు గురయ్యాయి. 5 శాతం పెద్ద తేడా కాదు.
2019 లో హెచ్చు సంఖ్యలో తొలగింపులు డిసెంబరు మాసంలో 111 గా నమోదయ్యాయి. ప్రధానంగా ఇవి శిక్షణలు, వికీమీడియా ఎడిటథాన్ లో జరిగేటప్పుడు కొత్త వాడుకరులు నేరుగా ఉపకరణం వాడడంతో జరిగినవని అనుమానించడమైనది. --అర్జున (చర్చ) 01:54, 15 ఆగస్టు 2020 (UTC)
కొంత అనుభవంగల సభ్యుని నిర్ణయంపై గౌరవం లేదు
[మార్చు]యాంత్రిక అనువాద స్థాయి గణాంకం చాలా వాటిపై సూత్రం(algorithm) ప్రకారం ఆధారపడింది. కొంత అనుభవం గల సభ్యుని నిర్ణయాన్ని గౌరవించాలి. ఇలా చేయటం అప్రమేయ ఉపకరణ నాణ్యత సంరక్షణ క్రియలలో భాగం. ఈ విధానం వలన ఆ నియమం రద్దయింది. --అర్జున (చర్చ) 01:54, 15 ఆగస్టు 2020 (UTC)
- కొంత అనుభవం కలిగిన సభ్యుల దాకా అక్కరలేదు అపారమైన అనుభవం కలిగినవారు కూడా వారి నిర్ణయాన్ని గౌరవించి పరిమితులు పెట్టకుండా వదిలేసినప్పుడు, ఆయా సభ్యులు తమ నిర్ణయాధికారాన్ని పెద్దంత విచక్షణతో వాడట్లేదనీ కింద మరో విభాగంలో ఉదాహరణ సహితంగా విశ్లేషించాను. ఓసారి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 10:02, 18 ఆగస్టు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారు, నా స్పందన అదేవిభాగంలో చేర్చాను. చూడండి. --అర్జున (చర్చ) 22:46, 25 ఆగస్టు 2020 (UTC)
నాణ్యత లేని యాంత్రిక అనువాదాలను పూర్తిగా నియంత్రించదు
[మార్చు]ఉపకరణంతో అనువాదాలను ముద్రించకుండా అడ్డుకుంటున్నపుడు, సభ్యులు ఉపకరణం లేనపుడు గతంలో వాడిన పద్ధతులను లేక ఇతర పద్ధతులను అవలంబిస్తారు.
- ఆంగ్ల వ్యాసాన్ని నేరుగా వికీపీడియా వ్యాసంలో చేర్చి అనువాదం చేయడం. (అతిరపిళ్ళి జలపాతం, తొలి కూర్పు)
- ఆంగ్ల వ్యాసాన్ని స్థానిక వర్డ్ ప్రాసెసర్ ఉపకరణాలలో చేర్చుకొని అనువాదం చేసి వికీ వ్యాసంలో చేర్చడం. (పాత చర్చ)
- అనువాద ఉపకరణం నుండి పేరాలను నకలు చేసి వ్యాసంలో అతికించడం. (విజువల్ ఎడిటర్ వాడినపుడు మాత్రమే కొన్ని వ్యాస మూలాలు సరిగా నకలు చేయబడుతున్నాయి. మూలమూసలకు సంబంధించిన సమస్యలు వుండవచ్చు), లేక వికీపాఠ్య రూపాన్ని సవరించి చేర్చటం. ( ఉదాహరణ)
- తెలుగు వికీ నకళ్లు ఇతరులు శిక్షణకు వాడుతున్నారు (ఉదా:IIITH ప్రాజెక్టు) ఆ వాడుకరులు, అక్కడ అనువాదం చేసి తెవికీలో చేర్చటం ద్వారా ముద్రించవచ్చు. (రచ్చబండ చర్చ)
వాటివలన నాణ్యత ఖచ్చితంగా మెరుగవుతుందని చెప్పలేము. పైపెచ్చు మూలాలు కొన్నిసార్లు సరిగా నకలుకాక (ఉదా:Cite web వెబ్ మూలము గా అనువాదవముతున్నది కాని పరామితులు చేర్చబడుటలేదు), మూలాలు అసంపూర్తిగా వుండిపోయిన దోషాలు వస్తాయి. అటువంటి వ్యాసాల యాంత్రిక అనువాద స్థాయి తెలియక, వాటిని గుర్తించడం సులభంకాక, అటువంటి వ్యాసాలతో నాణ్యత దెబ్బతినే అవకాశముంది. విశ్లేషణ గణాంకాల కాలంలో అలా చేర్చిన అనువాదాలు చూడండి.--అర్జున (చర్చ) 11:50, 17 ఆగస్టు 2020 (UTC)
వ్యక్తిగత అనుభవాలు
[మార్చు]అర్జున
[మార్చు]నేను ప్రారంభించిన ఒక పట్టణ వ్యాసం అనువాద పరిచయ విభాగంలోని మూడు పేరాలకు యాంత్రిక అనువాద గణాంకాలు 92%,87%,87% వున్నది, మొత్తము వ్యాస స్థాయిలో యాంత్రిక అనువాదం 88 స్థాయిలో వున్నందున ముద్రణకు అనుమతి లేదు. ఆ అనువదించిన పాఠ్యాన్ని, మూలాలతో సహా వికీటెక్స్ట్ రూపంలో పొందుటకు వీలుకాలేదు. --అర్జున (చర్చ) 01:54, 15 ఆగస్టు 2020 (UTC)
- విజువల్ ఎడిటర్ వాడటం ద్వారా, చిత్తుప్రతి లోనుండి అవసరమైన భాగాలు నకలు చేసి వ్యాసంలో చేర్చవచ్చని తెలిసింది. కాని ఇలా చేయటం వలన మూలాలలో దోషాలు చేరే అవకాశమున్నందున అభిలషణీయం కాదు, పూర్తిగా అనువదించినదానిని ముద్రించుకొని దాని నుండి అవసరమైతే నకలు తీసుకొనే అవకాశం మంచిది. --అర్జున (చర్చ) 12:14, 17 ఆగస్టు 2020 (UTC)
వెంకటరమణ
[మార్చు]నేను యాత్రికానువాదాలు అనేక చేసాను. వ్యక్తుల వ్యాసాలు, సినిమా వ్యాసాలు మొదలైన వాటికి యంత్రిక అనువాదం 80% నుండి 90% స్థాయిలో ఉన్నప్పుడు పూర్తిగా శుద్ధిచేయబడినా వాటికి ముద్రణకు అనుమతి లభించలేదు. అందులో అనువదించిన భాగాలను కాపీ, పేస్టు ద్వారా వ్యాసాలలోకి చేర్చాను. మూలాలతో సహా వచ్చినది. అలా చాలా వ్యాసాలను అనువాదం చేసాను. శాస్త్ర, సాంకేతిక వ్యాసాలకు మాత్రం ప్రస్తుత ఈ అనువాద పరికరం 50% కంటే ఎక్కువ దోషాలతో అనువదిస్తుంది. కొన్ని వాక్యాల అర్థాలు ఫూర్తిగా మారిపోయిన సందర్భాలున్నాయి. అనువాదకునికి ఆంగ్లం, తెలుగు భాషల అనువాదం తెలియడంతో పాటు ఆ వ్యాస విషయంపై కూడా పూర్తి పట్టు ఉంటే తప్ప అనువదించలేము. అనువాదం 70 స్థాయి నియమానికి వెసులుబాటు ఇస్తే అనువాదం తెలియనివారుకూడా కృతక భాషతో అనేక వ్యాసాలను సరియైన శుద్ధి చేయకుండా వికీలోకి చేరుస్తుంటారు. వాటిపై చర్చలూ, శుద్ధి చేయడాలు, తొలగింపులు నిర్వాహకులకు విపరీత భారంగా మారుతుంది. అందరికీ కాకుండా అనుభవజ్ఞులైన వాడుకరులకు 70 స్థాయి నుండి వెసులుబాటు ఇస్తే బాగుంటుంది. K.Venkataramana(talk) 06:44, 17 ఆగస్టు 2020 (UTC)
- User:K.Venkataramana గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్య తరువాత నేను ప్రయత్నించి విజువల్ ఎడిటర్ లో మూలాలతో సహా వస్తున్నదని (కొన్ని మూలాలకు మూసలు తెలుగులోకి అనువదించబడడం వలన సమస్యలున్నాయి), సాధారణ ఎడిటర్ లో మూలాలు లేకుండా వస్తున్నదని గ్రహించాను. ఇక మీ సలహాను ఆచరణలో పెట్టటానికి ఆంగ్ల వికీపీడియాలో AbuseFilter ను వినియోగించి, Extended confirmed editors అనగా ఒక నెల క్రిందట చేరి 500 మార్పులు చేసినవారు ప్రధానపేరుబరిలో ముద్రించకుండా చేశారు. అనువాద ఉపకరణం తయారీదారులు అది అంత మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నప్పటికి, మన తెవికీకి మంచిదనుకుంటే మీరు కొత్త ప్రతిపాదన క్రింద సవరణలో మీరు ప్రతిపాదించవచ్చు. --అర్జున (చర్చ) 10:44, 17 ఆగస్టు 2020 (UTC)
- User:K.Venkataramana గారు, మీరుపేర్కొన్న 50% దోషాలను మరింత వివరించండి. ఇదీ మీ అంచనా యేనా? ఏమైనా సూత్రం ప్రకారం లెక్కకట్టినదా?--అర్జున (చర్చ) 00:55, 18 ఆగస్టు 2020 (UTC)
- నేను వికీ సూత్రాల ప్రకారం లెక్కలు చేయలేదు. అనుభవం బట్టి చెబుతున్నాను. నేను అనేక వ్యాసాలను అనువదించినపుడు ప్రతీ వాక్యం శుద్ధి చేయాల్సి వచ్చింది. అనగా ��్యాసాన్ని తిరిగి మొదటి నుండి వ్రాయడమే. అంతకన్నా వ్యాసాన్ని మొదటి నుంచి రాస్తే మేలనిపించి అలా కొన్ని వ్యాసాలు రాసాను. ఈ అనువాద పరికరానికి శాస్త్ర, సాంకేతిక పదాల తర్జుమా సరిగా తెలియదు. కృతక భాషలో అనువాదం చేస్తుంది. మీరు కూడా ఒక సాంకేతిక రంగానికి చెందిన వ్యాసాన్ని రాయడానికి ప్రయత్నించండి. అనుభవంలో ఎలా అనువాదం చేస్తుందో తెలుస్తుంది. అనుభవం లేని వాడుకరులు నాణ్యత లేని అనువాద వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. వాటిని నిర్వాహకునిగా శుద్ధి, పరిశీలన చేస్తే క్రమంలో మొత్తం వ్యాసం కృతకంగా ఉన్న సందర్భాలున్నాయి. సంభావ్యత వ్యాసంలో "ఈ భావనలు ఒక ఇవ్వడం జరిగింది ప్రమాణ లో గణిత రూపంగా సంభావ్యత సిద్ధాంతం వంటి విరివిగా ఉపయోగించే, అధ్యయనం యొక్క ప్రాంతాల్లో వంటి గణిత, గణాంకాలు, ఫైనాన్స్, జూదం, సైన్స్ (ముఖ్యంగా భౌతిక ), కృత్రిమ మేధస్సు / యంత్ర అభ్యాస, కంప్యూటర్ సైన్స్, గేమ్ థియరీ, మరియు తత్వశాస్త్రం, ఉదాహరణకు, సంఘటనల frequency హించిన పౌన frequency పున్యం గురించి అనుమానాలను గీయండి." - ఈ చచ్చు అనువాదంలో ఇదొక పుచ్చు వాక్యం. ఇలా వ్యాసమంతా కృతకం ఐనందున తొలగించాము. ఈ గూగుల్ అనువాద వరికరం చాలా కృతకంగా, దోషభూయిష్టమైన భాషతో అనువాదాలను చేస్తుంది. భాష రాని వాడుకరులు కూడా ఒక నిమిషంలో అనువాదం చేస్తున్నారు. తరువాత దానిని శుద్ధిచేయడానికి పట్టించుకోరు. కొన్ని రోజుల క్రిందట రసాయన శాస్త్ర వ్యాసం గూగుల్ అనువాదం చేసినపుడు అది అనువాదం చేసే భాష చాలా దోషాలతో అర్థం పూర్తిగా మార్చి చూపిస్తుంది. "basic solutions" అనగా "క్షార ద్రావణాలు". గూగుల్ పరికరం "ఆధారపు పరిష్కారాలు" అని అనువాదం చేస్తుంది. భాష, రాసే వ్యాసంలోని అంశాల గూర్చి అవగాహన లేకపోతే అదే సరైన అనువాదం అని వదిలేస్తారు. అందువలన భాష విషయంలో రాజీపడడం ఉండరాదు. కనుక 70 శాతం కనీస స్థాయి ఉండాలి. K.Venkataramana(talk) 02:48, 18 ఆగస్టు 2020 (UTC)
- User:K.Venkataramana గారు, మీ వివరణాత్మక స్పందనకు ధన్యవాదాలు. మీరు తెలిపిన వ్యాసం అనువాదం, అనువదించిన సభ్యుల వివరాలు, అనువాద సమస్యల పరిష్కరణ ఉపకరణంతో పరిశీలించాను. అనువదించిన సభ్యుడు కొత్తగా చేరినప్పుడే అనువాదం చేశాడు. యాంత్రిక అనువాదం నిఘంటువులో సాంకేతిక పరిభాష చేరలేదనిపిస్తుంది. శాస్త్ర, సాంకేతిక వ్యాసాలు అనువాదం చెయ్యటానికి నిశ్చయంగా మెరుగైన నైపుణ్యాలు కావాలి. ఒకవేళ నైపుణ్యాలున్నా తొలి అనువాదంతోటే నాణ్యతగల వ్యాసంగా రూపొందించడం కష్టమని నా అనుభవం. 70% నిర్ణయం వెనుకనున్న అధ్యయనంపై పరిమితులున్నప్పుడు(ప్రధానంగా శాస్త్రసాంకేతికవ్యాసాలపై అధ్యయనం కావున), అనువాద ఉపకరణం యాంత్రిక అనువాద స్థాయి లెక్కించడంలో పరిమితులున్నప్పుడు(జాబితా లాంటి వ్యాసాలు, కొన్ని సినిమా వ్యాసాలు సునాయాసంగా ఈ పరిమితిని అధిగమించగలుగుతుంటే, ఇతర వ్యాసాలకు అడ్డంకిగా మారింది), ఆ నిర్ణయం నిర్వహణసమస్యలను పరిష్కరించలేకపోగా, ఇతర వ్యాసాల అనువాదాలపై, కృషి చేసే సభ్యులని నిరుత్సాహపరిచేటప్పుడు, ఇతరపద్ధతులలో సమస్యను పరిష్కరించడం మంచిది కదా. అనువాదాలు చేయాలంటే 500 వున్న వ్యాసాలలో మార్పులు చేయాలి, పూర్తి వ్యాసం అనువాదం చేయనవసరంలేదు, చేసిన అనువాదం వీలైనంత అర్ధవంతంగా వుండాలనే సూచనలు, అవి పాటించని సభ్యులకు హెచ్చరికలు, అవీ పనిచేయకపోతే తాత్కాలిక నిరోధింపులు చేయడం మంచిదని నా అభిప్రాయం.
- నేను వికీ సూత్రాల ప్రకారం లెక్కలు చేయలేదు. అనుభవం బట్టి చెబుతున్నాను. నేను అనేక వ్యాసాలను అనువదించినపుడు ప్రతీ వాక్యం శుద్ధి చేయాల్సి వచ్చింది. అనగా ��్యాసాన్ని తిరిగి మొదటి నుండి వ్రాయడమే. అంతకన్నా వ్యాసాన్ని మొదటి నుంచి రాస్తే మేలనిపించి అలా కొన్ని వ్యాసాలు రాసాను. ఈ అనువాద పరికరానికి శాస్త్ర, సాంకేతిక పదాల తర్జుమా సరిగా తెలియదు. కృతక భాషలో అనువాదం చేస్తుంది. మీరు కూడా ఒక సాంకేతిక రంగానికి చెందిన వ్యాసాన్ని రాయడానికి ప్రయత్నించండి. అనుభవంలో ఎలా అనువాదం చేస్తుందో తెలుస్తుంది. అనుభవం లేని వాడుకరులు నాణ్యత లేని అనువాద వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. వాటిని నిర్వాహకునిగా శుద్ధి, పరిశీలన చేస్తే క్రమంలో మొత్తం వ్యాసం కృతకంగా ఉన్న సందర్భాలున్నాయి. సంభావ్యత వ్యాసంలో "ఈ భావనలు ఒక ఇవ్వడం జరిగింది ప్రమాణ లో గణిత రూపంగా సంభావ్యత సిద్ధాంతం వంటి విరివిగా ఉపయోగించే, అధ్యయనం యొక్క ప్రాంతాల్లో వంటి గణిత, గణాంకాలు, ఫైనాన్స్, జూదం, సైన్స్ (ముఖ్యంగా భౌతిక ), కృత్రిమ మేధస్సు / యంత్ర అభ్యాస, కంప్యూటర్ సైన్స్, గేమ్ థియరీ, మరియు తత్వశాస్త్రం, ఉదాహరణకు, సంఘటనల frequency హించిన పౌన frequency పున్యం గురించి అనుమానాలను గీయండి." - ఈ చచ్చు అనువాదంలో ఇదొక పుచ్చు వాక్యం. ఇలా వ్యాసమంతా కృతకం ఐనందున తొలగించాము. ఈ గూగుల్ అనువాద వరికరం చాలా కృతకంగా, దోషభూయిష్టమైన భాషతో అనువాదాలను చేస్తుంది. భాష రాని వాడుకరులు కూడా ఒక నిమిషంలో అనువాదం చేస్తున్నారు. తరువాత దానిని శుద్ధిచేయడానికి పట్టించుకోరు. కొన్ని రోజుల క్రిందట రసాయన శాస్త్ర వ్యాసం గూగుల్ అనువాదం చేసినపుడు అది అనువాదం చేసే భాష చాలా దోషాలతో అర్థం పూర్తిగా మార్చి చూపిస్తుంది. "basic solutions" అనగా "క్షార ద్రావణాలు". గూగుల్ పరికరం "ఆధారపు పరిష్కారాలు" అని అనువాదం చేస్తుంది. భాష, రాసే వ్యాసంలోని అంశాల గూర్చి అవగాహన లేకపోతే అదే సరైన అనువాదం అని వదిలేస్తారు. అందువలన భాష విషయంలో రాజీపడడం ఉండరాదు. కనుక 70 శాతం కనీస స్థాయి ఉండాలి. K.Venkataramana(talk) 02:48, 18 ఆగస్టు 2020 (UTC)
- మీరు ఇప్పటివరకు అమలుచేయటానికి పరస్పర విరోధాలైన సూచనలు చేశారు. మొదటిది అనుభవం వున్న సభ్యులకు ఈ పరిమితిని సడలించాలని, రెండోది ఇతరులకు 70% పరిమితి కొనసాగాలని. ప్రస్తుత సాంకేతికాలలో యాంత్రిక అనువాదానికి స్థాయి పరిమితిని కొత్త సభ్యులకే పరిమితం చేయవీలులేదు. ఆంగ్ల వికీపీడియాలో చేసినట్లు 500 మార్పులు చేయనివారు, అనువాద వ్యాసాలను ప్రధానపేరుబరిలో ముద్రించకుండా నిరోధించవచ్చు. అలా చేసినపుడు, అప్రమేయ నాణ్యత పరిరక్షణలు సరిపోతాయని నా అభిప్రాయం. కావున మీ అభిప్రాయాన్ని లేక ప్రతిపాదనను అమలుచేయుటకు సాధ్యాసాధ్యాలను పరిగణించి స్పష్టంచేయండి.--అర్జున (చర్చ) 06:33, 25 ఆగస్టు 2020 (UTC)
రవిచంద్ర
[మార్చు]ఈ యాంత్రికానువాద పరికరం నేను వాడింది తక్కువ. అది అనువదించిన వాక్యాలు చాలావరకు నాకు నచ్చలేదు. నేను మరీ నాణ్యతను ఎక్కువ ఆశించడం వల్ల అలా అనిపించి ఉండవచ్చు. వ్యాసం మొత్తంగా అనువాదం చేయడానికి ఈ పరికరం ఇంకా సిద్ధంగా లేదేమో అనిపించింది. మంచి వాక్యాలు కేవలం అక్కడక్కడ మాత్రమే కనిపించాయి. కాబట్టి ఎప్పుడూ వ్యాసాన్ని నేరుగా ప్రచురించకుండా కొన్ని వాక్యాలు మాత్రం నకలు తీసుకువచ్చి కావల్సిన వ్యాసంలో అతికించాను. కాబట్టి ఈ ఉపకరణం నుంచి నేరుగా వ్యాసాన్ని ప్రచురించడానికి కఠినమైన నిబంధనలు ఉండాలని, వాటిని సరళతరం చేయకూడదని అభిప్రాయపడుతున్నాను. - రవిచంద్ర (చర్చ) 13:00, 21 ఆగస్టు 2020 (UTC)
- రవిచంద్ర గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఇటీవలి గణాంకాల విశ్లేషణ చూస్తే చాలా మంది ఉపకరణం వాడి అనువాదాలు చేశారు. నేరుగా ప్రచురించటానికి ఉపకరణం అనుమతించదు. అప్రమేయ నాణ్యత పరిరక్షణ చర్యలున్నాయి. అంతకంటే కఠిన భాషా స్థాయి పరిమితి వలన సమస్యలు, ప్రభావాలు ఈ చర్చ, మరియు ప్రాజెక్టు పేజీ లో తెలియచేశాను. కావున ఇంకా కఠినమంటే ఏమి చేయాలి, మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి 50% గా వుండాలనేది మీ అభిప్రాయమా? 70% స్థాయి వున్నా ఉపకరణ పరిమితుల వలన కొన్ని రకాల వ్యాసాలు సులభంగా ఆ స్థాయి దాటటం, ఇతర అనువాదాలు స్థాయి దాటలేదని, మీరు చర్చలో గమనించారు అనుకుంటాను. ఇక మీరు ఒకటి రెండు అనువాద వ్యాసాలు ముద్రించటానికి ప్రయత్నించితే మీకు ఇతరులు ఎదుర్కొనే సమస్య మరింత అర్ధం చేసుకోవటానికి వీలవుతుంది. అలా ప్రయత్నించి నియంత్రణ స్థాయి ఎలా వుండాలో మీ అభిప్రాయం లేక కొత్త ప్రతిపాదన తెలియచేయండి. --అర్జున (చర్చ) 13:09, 25 ఆగస్టు 2020 (UTC)
ప్రణయ్‌రాజ్
[మార్చు]అనువాద ఉపకరణం వాడి ఒక్క క్లిక్ తో వ్యాసాన్ని (భాషా దోషాలు ఉన్నప్పటికీ) ప్రచురించి, మళ్ళీ ఆ వ్యాసాన్ని సరిచేయడంలేదు. ఇలా అనేక వ్యాసాలు సృష్టించబడుతున్నాయి. కాబట్టి, కనీస మాత్రపు ప్రమాణంగా 30 శాతం ఉండదమనేది సరైనదేనని నా అభిప్రాయం. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 11:30, 17 ఆగస్టు 2020 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఒక్క క్లిక్ తో ప్రచురించటం అనేది అపోహా మాత్రమే. మరిన్ని అపోహలు, అసలు నిజాలు, ప్రాజెక్టు పేజీ లో చూడండి. అన్నట్లు, మీ ఈ స్పందనలు పై విభాగాలలో వ్యక్తిగత అనుభవాలలో చేర్చవచ్చు. పరిశీలించండి.--అర్జున (చర్చ) 11:47, 17 ఆగస్టు 2020 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి గారు,నేను సరియైన విభాగానికి మార్చాను.--అర్జున (చర్చ) 13:11, 21 ఆగస్టు 2020 (UTC)
పవన్ సంతోష్
[మార్చు]ఇది నా స్వంత వ్యాసాల్లో చూసిన అనుభవం కాదు. ప్రతిపాదకులు అర్జున గారి వ్యాసాల్లో చూసిన అనుభవం. ఆయన అనువాద ఉపకరణం వాడి ప్రచురించిన 13 వ్యాసాలు పరిశీలించిన తర్వాత ఈ కొత్త ప్రతిపాదన సరికాదని, 30 శాతం మార్పుచేర్పులు కూడా చేయకపోతే ప్రచురించనివ్వని నిబంధన సరైనదేననీ భావిస్తున్నాను. ఈ పరిశీలనను పూర్తిస్థాయిలో ఈ పేజీలోనే వేరే విభాగంగా రాశాను.--పవన్ సంతోష్ (చర్చ) 10:33, 18 ఆగస్టు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారు, నా స్పందన అదేవిభాగంలో చేర్చాను. చూడండి. --అర్జున (చర్చ) 22:52, 25 ఆగస్టు 2020 (UTC)
ప్రభాకర్ గౌడ్ నోముల
[మార్చు]ఈ ఉపకరణం గురించి అంతకుముందు నాకు తెలియదు, మొన్న మా గురువుగారు అర్జున గారు ఈ విషయం ప్రస్తావించినప్పుడు ఇది ఉన్నది అనే విషయం నాకు తెలిసింది. ఉపకరణం చాలా బాగా అనువదిస్తుంది, అర్జున గారు ధన్యవాదాలు. మూలాలు కూడా ఇస్తుంది, ఉపకరణం వాడటానికి ప్రయత్నించాను, నాకు బాగా నచ్చింది. అయితే ఉపకరణం నుండి ఉన్నదున్నట్లు వ్యాసం అనువదించి ప్రచురించడం, ఈ ఉపకరణం వాడి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా వ్యాసాన్ని ప్రచురించడం అయితే తెలుగు వికీపీడియా లోకి ఆంగ్ల కాలుష్యం వెదజల్లినట్లు, అక్కడ కాపీ చేసుకొని మరోచోట వ్యాస వ్యాసాన్ని శుద్ధిచేయడం తర్వాత వ్యాసాన్ని ప్రచురించటం చాలా మంచిది. మా తొలిగురువు అర్జున గారిని విభేదించడం కాదు కానీ, ఉపకరణం 50 శాతానికి కుదించడమే మరింత తెలుగు వికీపీడియాకు మంచిదని నా అభిప్రాయం. నాకు ఒక సందేహం ఇక్కడ ఆంగ్లం నుండి అనువదించిన వ్యాసాలు మూలాలు ఉపకరణం నుండి ఇస్తుంది అవి యధాతధంగా వాడవచ్చా వాటిని కూడా మార్పులు చేర్పులు చేయవలెనా? మూలాల గురించి నాకు తెలియక అడుగుతున్నాను తెలుపగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 12:09, 18 ఆగస్టు 2020 (UTC)
- వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీరు ఉపకరణం వాడటానికి ప్రయత్నించి చర్చలో పాల్గొనటం చాలా సంతోషం. మీకు ఉపకరణం నచ్చినందుకు సంతోషం. ఉపకరణం ఎలా పనిచేస్తుందని మరింత తెలుసుకొనటానికి ఒకటి రెండు వ్యాసాలు మీరు ప్రధానపేరుబరిలో ముద్రించండి. ప్రస్తుతం అమలులోలేని ఉపకరణంలో అప్రమేయ నాణ్యత పరిరక్షణవలన తొలిగా ఇవ్వబడిన అనువాదం యథాతథంగా ముద్రించడాని అనుమతించదు. మరింత సమాచారానికి ప్రాజెక్టు పేజీ లో విభాగం చూడండి. ప్రస్తుతానికి మెరుగుపరచిన యాంత్రిక అనువాదం 50 శాతం కన్నా తక్కువ వుండాలి అన్న ప్రతిపాదన చేరుస్తాను. మీకు మరింత అనుభవం వచ్చిన తరువాత ఈ ప్రతిపాదన అవసరమా లేదా తెలియచేయవచ్చు.
- ఇక మీ సందేహం గురించి: మూలాలను అనువాదం చేయకూడదు.-- అర్జున (చర్చ) 09:44, 21 ఆగస్టు 2020 (UTC)
- అనుభవం ఉన్న వారి మీద అభిప్రాయం చెప్పలేకపోయా... అనుభవం ఉన్న వాడుకరి అనగా కనీసం 500 మార్పుచేర్పులు చేసి ఉన్నవారు ఉపకరణం వాడుటకు 70 నుండి 90 వరకు ప్రచురణకు అవకాశం ఇస్తే అనువాదాలకు సంఖ్య పెరుగుతుంది, కానీ చదువరి గారు అన్నట్లు మరియు లు యొక్క లు ఉపకరణ మే తొలగింపు చేసే విధంగా ఉండేలా ఉంటే మంచిది అలా సాధ్యమేమో చూసి చేయగలరు. ఇక కొత్తవాడుకరులకు అనువాదం 50 శాతం వరకు ప్రచురణకు అవకాశం ఎక్కువ అవకాశం ఇవ్వకూడదని అదే అభిప్రాయం. ప్రభాకర్ గౌడ్ నోముల 12:13, 21 ఆగస్టు 2020 (UTC)
- వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుత అనువాద ఉపకరణం శైలి అంశాలను నియంత్రించలేదు. ఇప్పటికే 'మరియు' గురించి దుశ్చర్యల వడపోత ద్వారా నిరోధించేటట్లు చదువరి గారు చేసివున్నారు. అలాగే 'యొక్క' కు కూడా చేయవచ్చు. ఆంగ్ల వికీపీడియాలో చేసినట్లు నెలరోజులు, 500 మార్పులు చేసినవారే ప్రధానపేరుబరిలో ముద్రించగలిగే విధంగా మన తెలుగు వికీపీడియాలో కూడా చేయవచ్చు. మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి సంఖ్య 70 లేక 90 కు శాస్త్రీయ ప్రాతిపదిక లేదు కావున అది అవసరంలేదని నా అభిప్రాయం. ఒకవేళ ఆ పరిమితి కావాలనుకుంటే వేరే విధంగా నిరోధించటం వలన ఉపయోగం వుండదు. చర్చ ద్వారా సాంకేతికమైన అనువాద ఉపకరణం గురించి సభ్యుల అపోహలపై అధారపడిన అభిప్రాయాలు తెలుస్తున్నాయి. వాటికి స్పందనలు, ప్రాజెక్టుపేజీలో అవసరమైన మార్పులు చేస్తున్నాను. వాటిని కూడా గమనిస్తూ వుండండి. మీ వ్యాఖ్య సారాంశాన్ని ప్రతిపాదన విభాగంలోకూడా చేరుస్తాను. అవసరమైతే దానిని సరిచేయండి -- అర్జున (చర్చ) 22:37, 21 ఆగస్టు 2020 (UTC)
- అనుభవం ఉన్న వారి మీద అభిప్రాయం చెప్పలేకపోయా... అనుభవం ఉన్న వాడుకరి అనగా కనీసం 500 మార్పుచేర్పులు చేసి ఉన్నవారు ఉపకరణం వాడుటకు 70 నుండి 90 వరకు ప్రచురణకు అవకాశం ఇస్తే అనువాదాలకు సంఖ్య పెరుగుతుంది, కానీ చదువరి గారు అన్నట్లు మరియు లు యొక్క లు ఉపకరణ మే తొలగింపు చేసే విధంగా ఉండేలా ఉంటే మంచిది అలా సాధ్యమేమో చూసి చేయగలరు. ఇక కొత్తవాడుకరులకు అనువాదం 50 శాతం వరకు ప్రచురణకు అవకాశం ఎక్కువ అవకాశం ఇవ్వకూడదని అదే అభిప్రాయం. ప్రభాకర్ గౌడ్ నోముల 12:13, 21 ఆగస్టు 2020 (UTC)
యర్రా రామారావు
[మార్చు]నాకైతే అసలు తికమక అంతా ఈ చర్చ ప్రవేశపెట్టిన దాంట్లోనే ఉంది. చర్చ యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ మీద.ఎక్కడన్నా చెడుకు, లేదా తప్పులకు నియంత్రణ పాటిస్తారు.అభివృద్దిని, లేదా బాగును, లేదా మంచిని నియత్రించటం ఏమిటో నాకర్థం అగుటలేదు. ఇలా కూడా ఉంటుందా అని నా అనుమానం. నియంత్రణ అంటే నిఘంటువు అడ్డగింత, అదుపుచేయుట, అనే అర్థాలు చూపుతుంది. బాగుచేసేదానికి అడ్డగింత ఎందుకో నాకు అర్థంఅగుటలేదు. అంటే వికీ వ్యాసాలు నాణ్యత బాగుండకూడదనా! నాకైతే అదే అర్థం స్పరిస్తుంది. ఆ అర్థం సరియైనదైతే నేను దీనిని వ్యతిరేకించుచున్నాను. ఇప్పటికే చాలా మనం ఎంతో చర్చించి నిర్ణయం చేసిన నియమాలు, మార్గదర్శకాలు పాటించటలేదు. దానికి ఒక ఉదా:'ము' తో అంతమయ్యే పదాల విషయంలో 'ము' స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. కానీ అనుభవం ఉన్న వాడుకరులలో బహుకొద్దిమంది మంది మాత్రమే దానిని పాటిస్తున్నారు. నేను అన్నానని కాదు. ఎవరికి వారు ఆత్మ విమర్శన చేసుకుంటే వారి ఆత్మే చెపుతుంది. కాలం గడిచేకొద్ది అభివృద్ధితో ముందుకు పోవాలిగానీ,వెనక్కి పోదాం అంటంలో మతులబు నాకు అర్థం అగుటలేదు. నా మాటలు కఠినంగా ఉంటే క్షమించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:32, 18 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. చర్చకు, ప్రాజెక్టు పేజీ అభివృద్ధికి, గణాంకాల కొరకు నేను తగినంత సమయం వెచ్చించాను. అయినా సందేహాలుంటే తప్పక నేను, ఇతర అనుభవంగల సభ్యులు తీర్చటానికి ప్రయత్నం చేస్తాము. మీ సందేహాలకు స్పందనలు వచ్చిన తరువాత మరియు చర్చ ముగిసిన తరువాత ని నిలిచిన ప్రతిపాదనలను ఓటు పద్ధతి పెట్టినపుడు, మీ మద్దతును ఓటు ద్వారా తెలియ చేయవచ్చు. ప్రతిపాదించిన విధానం నాణ్యతపై నియంత్రణని తొలగించుటలేదు. నియంత్రణ ఏ స్థాయిలో వుండాలి అనే దానిలోనే ప్రస్తుత విధానానికి, నేను ప్రతిపాదించిన విధానానికి తేడా వుంది. ప్రతిపాదించిన విధానంలో నాణ్యత నియంత్రణ వివరాలు చూడండి.
- శైలిని, ప్రస్తుత అనువాద ఉపకరణం ద్వారా నియంత్రించలేము. ఎవరైనా పాల్గొన కలిగే వికీపీడియా ప్రాజెక్టులో ఏకరీతిశైలి సాధించడం చాలా కష్టసాధ్యం. విషయం ��ర్ధం అయ్యేటట్లు వున్నదా అన్నదే ప్రధానం అని నా అభిప్రాయం. ఇంకేవైనా సందేహాలుంటే తప్పక అడగండి. మీరు ప్రస్తుత విధానం అమలు తర్వాత ఒక వ్యాసం అనువదించినట్లు గమనించాను. అయితే ఆ విషయంలో కేవలం చిన్న వాక్యాలు బుల్లెట్ అంశాల లాగా వుండటంతో మెరుగుపరచబడినయాంత్రిక అనువాద స్థాయి సున్నాగా నమోదైంది. మీకు వీలైతే ఇంకొకటి, రెండు వ్యాసాలు అనువదించి ముద్రించటానికి ప్రయత్నించండి. మీకు మరింత మెరుగైన అవగాహన ఏర్పడటానికి అవి సహాయపడతాయి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 11:30, 21 ఆగస్టు 2020 (UTC)
- అర్జున గారూ నా అభిప్రాయం మీరు ఏ విధంగా అర్థం చేసుకుని తటస్థ లేక ఇతర అనుభవాలు విభాగంలో చేర్చారో నాకర్థమగుటలేదు. మీకు అర్థం కానప్పుడు మరలా మీరు తగు వివరణ కోరవలసింది. అది ఏమీ లేకుండా ఏకపక్షంగా తటస్థంలో చేర్చుటను నేను ఖండిస్తున్నాను.70 శాతం పరిమితిమీద యాంత్రిక అనువాదం ద్వారా నేను ఒక వ్యాసం సృష్టించాను. అది మీకు తెలుసు. అది పేరాలా బుల్లెట్లా అనేది అప్రస్తుతం. నాకు 70 శాతం పరిమితి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులకు గురి కాలేదు. యాంత్రిక అనువాదం 70 శాతంకన్నా ఎక్కువ ఉండటానికి నేను వ్యతిరేకిస్తున్నానని మరొక్కసారి నా అభిప్రాయం తెలుపుతున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:02, 24 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారు, మీకు తొలిగా ఏ విభాగంలోనైనా చేర్చే అవకాశం వుంది. కాని దానిని మీరు వాడుకోలేదు, కావున మీ వ్యాఖ్యలను నాకు అర్ధమైనంతవరకు తగిన విభాగంలో చేర్చాను. అది మీకు సరిపోనప్పుడు నిరభ్యంతరంగా మార్చవచ్చు. ఆ విభాగాలు చర్చ అర్ధవంతం కావడానికి సహకరించుటలేనందున అవి ఇప్పుడు తొలగించాను.
- అర్జున గారూ నా అభిప్రాయం మీరు ఏ విధంగా అర్థం చేసుకుని తటస్థ లేక ఇతర అనుభవాలు విభాగంలో చేర్చారో నాకర్థమగుటలేదు. మీకు అర్థం కానప్పుడు మరలా మీరు తగు వివరణ కోరవలసింది. అది ఏమీ లేకుండా ఏకపక్షంగా తటస్థంలో చేర్చుటను నేను ఖండిస్తున్నాను.70 శాతం పరిమితిమీద యాంత్రిక అనువాదం ద్వారా నేను ఒక వ్యాసం సృష్టించాను. అది మీకు తెలుసు. అది పేరాలా బుల్లెట్లా అనేది అప్రస్తుతం. నాకు 70 శాతం పరిమితి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులకు గురి కాలేదు. యాంత్రిక అనువాదం 70 శాతంకన్నా ఎక్కువ ఉండటానికి నేను వ్యతిరేకిస్తున్నానని మరొక్కసారి నా అభిప్రాయం తెలుపుతున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:02, 24 ఆగస్టు 2020 (UTC)
- యాంత్రిక అనువాద స్థాయి లెక్కింపు బలహీనతలు తెలుసుకోవడానికి వ్యాసాలు పరిశీలించవలసివచ్చింది. దానికి మీరు అనువదించిన వ్యాసం ఉపయోగపడింది. అటువంటి ఇతరులు అనువాదాలు చేసిన వ్యాసాలు కూడా వున్నాయి. 70% కంటే తక్కువ విధానం అమలైన తరువాత ఒక్క వ్యాసం అనువదించి లేక ఒకేరకమైన వ్యాసాలు అనువదించి సమస్యలు ఎదుర్కోలేదు అని విధానాన్ని సమర్ధించడం బలహీనమైన వాదన అని నా అభిప్రాయం. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:27, 25 ఆగస్టు 2020 (UTC)
కశ్యప్
[మార్చు]ఇది నా వ్యక్తి గత అభిప్రాయం : గత కొద్ది కాలంగా గూగుల్ , మైక్రోసాఫ్ట్ తదితర యాంత్రిక అనువాద ఉపకరణాల నాణ్యత పెరిగినది. ఇవి వాడుతున్న కొద్దీ మెరుగయ్యే ఉపకరణాలు కాబట్టి వాటికి ఎక్కువ వాడటం ద్వారా మాత్రమే అనువాదాలు మెరుగు పరచుకోగలము అని నా అభిప్రాయం. నేను సాధారణంగా ఆ టూల్ లోనే కావలిసిన అనువాద మార్పులు చేసి, తరువాత వికీలో చేరుస్తాను, వికీని మొబైల్ ద్వారా టైపు చేయటానికి జి బోర్డు తెలుగు వాయిస్ టైపింగ్ ను వాడతాను. దీని వలన కూడా కొన్ని ఇంగ్లీషు పదాలకు సరైన ట్రాన్స్లిటరేషన్ మెరుగు పడుతోంది. ముఖ్యంగా శాస్త్ర సంబంధిత పదాలకు తెలుగులో సరైన పదాలు లేవు. వాటినికి అందరికీ అర్ధం అయ్యే తెలుగు పదాలతో వ్వాసం రాయటం కొంచెం క్లిష్టమే. మనకు ఉన్న భాషమీద ప్రేమ, ఉన్న ఉపకరణాలలో లోపాల వలన అనేక మంది కొత్త వారిని యాంత్రికానువాదాల విషయంలో నిరుత్సాహ పరుస్తున్నాం. నాకు వున్నమిత్రుల ద్వారా జర్మన్ , స్పానిష్ ,ఇంకా మరికొన్ని భాషల లో ఉన్న వికీ సమూహాల ఓర్పు గురించి నాకు కొంత అవగాహన ఉన్నది. అన్ని వికీలలాగానే వీటిలో కూడా A well written encyclopedia article మీద చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇందులో కొంతమంది కొత్త వ్యాసాలు పెంచుకొంటూ పోతారు , మిగిలిన కొంత మంది అభివృద్ధి చేస్తూ ఉంటారు. వీటిలో కూడా చాలా వరకు శ్రేష్ఠ మయిన వ్యాసాలు తక్కువ. వికీలలో నాణ్యత, అభివృద్ధి అన్నది నిరంతరం జరిగే పక్రియ. అయితే వీటి గురించి పాథమిక స్థాయిలోనే నిర్ణయం తీసుకొని మొలకను తుంచాలా లేదా వృద్ధి చేయాలా అన్న వాటిమీద నిర్ణయం సమూహం తీసుకోవాలి. ఉదాహరణకు 2009 జూన్ లో గూగుల్ ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ (GTP) ద్వారా చేర్చిన గూగుల్ అనువాదాలు వ్యాసాలకు కూడా ఒక హెచ్చరిక మూస చేర్చటం ద్వారా చాలా యాంత్రికానువాదాల నాణ్యత గురించి చదువరులకు హెచ్చరించాము. తెవికీ మీద దీని ప్రభావం అర్జున గారు సోదాహరణంగా వివరించారు కూడా. అప్పట్లో ఆ ఉపకరణం యాంత్రిక అనువాద ఉత్పత్తి నాణ్యత ఇప్పటికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. అయితే ఇప్పుడు అలా లేదు, కానీ ఇంకా చాలా మెరుగుగవ్వాలి. అయినా కూడా అలాంటి వ్యాసాలు కొన్ని ఏళ్ల పాటు తెలుగు వికీపీడియాలో మనగలిగాయి, కొన్ని అభివృది చెందాయి కూడా. అయితే వాటి నాణ్యత పెంచటానికి ఎక్కువమంది వాడుక దారులు లేకపోవటం వలన, మన నాణ్యతా ప్రమాణాలకు అవి సరితూగ లేకపోవటం వలన అని తొలగింపుకు గురి అయినాయి. అయితే ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే ఆప్రాజెక్టు లో భాగంగా ఇతర భారతీయ భాషల వికీలలో చేర్చిన వ్యాసాలు చాలా వరకు తొలగింపుకు గురికాకుండా ఉన్నాయి. తెలుగు వికీపీడియా నుండి https://en.wikipedia.org/wiki/Wikipedia:WikiProject_India/Translation వంటి ప్రాజెక్టులలో ఎక్కవమంది పాల్గొనాలి. అప్పుడే మనం మెరుగైన పాలసీలు తీసుకురాగలం. వికీలో వ్యాసాల సంఖ్య పెరగాలి అంటే యాంత్రిక అనువాదాలు అనివార్యం. అయితే ఎక్కువ మొత్తంలో ఎడిటర్లను పెంచటం ద్వారా, వారికి సరైన శిక్షణ ఇవ్వటం ద్వారా, అలాంటి వారికి కొత్త వారికి ఉన్న తెవికీ సమూహం తోర్పడటం ద్వారా సాధించగలం. -- Kasyap (చర్చ) 06:48, 27 ఆగస్టు 2020 (UTC)
- Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. దానికి సంబంధించి నా అభిప్రాయాలు తెలుపుతున్నాను. కంటెంట్ ట్రాన్స్లేషన్ టూల్ వాడకుండా బయటి అనువాద ఉపకరణాలు వాడితే కొన్ని సమస్యలున్నాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ అనువాద ఉపకరణం వాడితే హెచ్టిఎమ్ఎల్ పాఠ్యం వస్తుంది కాని వికీటెక్స్ట్ పాఠ్యం రాదు. కావున వికీపీడియాలో చేర్చలేము. గూగుల్ అనువాద ఉపకరణం నేరుగా ఇంటర్నెట్ వినియోగదారులు వాడటానికి ఇప్పుడు అందుబాటులో లేదు. కేవలం కంటెంట్ ట్రాన్స్లేషన్ టూల్ ద్వారా వికీపీడియా సభ్యులు లేక సాఫ్ట్వేర్ అభివృద్ధికారులు తయారుచేసే ఉపకరణాల ద్వారానే వాడగలం. ఈ పరికరాలు ఉత్పత్తిదారుల కృషివలన అభివృద్ధి చెందుతుండవచ్చు. మన కృషివలన మనకు అవగాహన మెరుగై సవరణలు మాత్రమే వేగంగా చేయగలుగుతాము. ఉపకరణాలతో రెండువైపుల బంధం లేదు కావున మనం వాడే కొత్త పదాలు, వాటి అనువాద నిఘంటువులలో చేరవు. అలా చేర్చగలిగేటట్లు కంటెంటు ట్రాన్స్లేషన్ ఉపకరణం చేయబడలేదు. గూగుల్ అనువాద వ్యాసాలు తమిళంలో, బెంగాలీ మనకంటే ముందే తొలగింపుకు లేక నిరోధానికి గురయ్యాయి. ఇతర భాషలలో తొలగించలేదంటే అక్కడ సముదాయం పటిష్టంగా లేకపోవడం లేక దీనిపై దృష్టిపెట్టకపోవడం కారణాలు కావచ్చు. అనువాద వ్యాసాల సభ్యులను ప్రోత్సహించాలన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.--అర్జున (చర్చ) 23:24, 31 ఆగస్టు 2020 (UTC)
దేవుడు
[మార్చు]ఏదీ ఆశించక మనస్పూర్తిగా తెలుగు సేవ చేస్తున్న గౌరవ సభ్యులు అందరికీ నమస్కారం. ఈ చర్చలో నా స్పందన ఆలస్యానికి క్షమించగలరు. అందరూ బాగున్నారనే తలుస్తాను. తెవికీ అనువాదయంత్రం పై నా అనుభవం మేర నేను ఎదుర్కొన్న సమస్యలు, అనుభవాలు, సూచనలు ఈ క్రింద ప్రశ్నలు సమాధానాలు రూపంలో రాస్తున్నా.
1. తెవికీలో అనువాద యంత్రం వాడుకరి మీద నియంత్రణలను అమలు చేయడం ద్వారా నాణ్యతను ఎలా సాధిస్తుంది ?
నేను వాడుకరి మీద యాంత్రిక నియంత్రణలను ఏ మాత్రం సమర్ధించడం లేదు. పైగా ఈ యాంత్రిక నియంత్రణలు వాడుకరులను అనువాదాలు చేయడంలో పూర్తిగా నిరుత్సాహపరుస్తున్నాయి. ఈ నియంత్రణలు నియంత్రణా శాతాలు ఏ మాత్రం శాస్త్రీయత లేదు అని నాణ్యతకు సహకరించడం లేదు అని అనుకుంటున్నాను.
2. తెవికీలో అనువాద యంత్రం వాడే వాడుకరులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు ఏమిటి ?
*కొన్ని సార్లు టైపు చేస్తుంటే తెవికీ అనువాద యంత్రము టైపింగు కాలేదు(ఫోనెటిక్ విధానంలో తీసుకోలేదు). *నాణ్యత కలిగిన వాక్య నిర్మాణం సరిగ్గా చేసిననూ కొన్ని చోట్ల అనువాద యంత్రము హెచ్చరిక చేయడం ఆపలేదు. *కొన్ని పేరాలు యంత్రము అసలు అనువాదం కూడా చేయలేదు. సొంతంగా రాయడానికి అనుమతించలేదు. (Translation failed; (error notifications))
3. అనువాదయంత్రం అంతా సరిగా ఏ మాత్రం తప్పులు లేకుండా అనువాదం చేస్తుందని అంటారా ?
అలా అనడం లేదు. యాంత్రిక అనువాద భాష చాలా కృతకంగా ఉంటుంది. సహజంగా అనిపించదు. అలాగే ప్రచురిస్తే వ్యాసాల నాణ్యత కూడా దారుణంగా ఉంటుంది. 70% కన్నా ఎక్కువ యాంత్రిక అనువాద స్థాయి ఉంటే తెవికీ అనువాద యంత్రము ప్రచురణకు అనుమతించదు. కానీ 70% కన్నా మించి సరిపోలే పదాలు ఉండి వాక్యం సరిగా ఉన్నప్పుడు ప్రచురణకు అనుమతించక వాడుకరి ఇబ్బంది పడుతున్నారు. చాలా సందర్భాలలో వేరు సరిపోలే పదాల కోసం వెతుక్కోవడం వల్ల, వేరు ఉపకరణాల నుండి ఎత్తిపోతల పనుల వల్ల వాడుకరికి సమయాభావం అవుతోంది.
4. మరి అనువాద వ్యాసాలలో నాణ్యతను ఎలా సాధించాలి ?
సర్వే చేయాలి. పుటను వీక్షించే వారి అభిప్రాయం తీసుకోవాలి. ఓ పాప్ అప్ సర్వే ఆ వ్యాసం క్రింద ఓ సూచనగా ఉంచి వ్యాస నాణ్యత, అనువాద నాణ్యత వీక్షకుడి నిర్ణయానికి వదిలేయాలి. మంచి అనువాద వ్యాసం ఏదో, చెత్త అనువాద వ్యాసం ఏదో అప్పుడు తేల్చవచ్చు. లేదా నిర్వాహకులు గమనిస్తే సాటి సభ్యుల అభిప్రాయం కోరి హెచ్చరించవచ్చు, చర్యలు తీసుకోవచ్చు. తద్వారా వ్యాసకర్తను వ్యాసాన్ని సమీక్షించమని కోరవచ్చు. 1 -10 కొన్ని ప్రశ్నలు వీక్షకుడికి సభ్యుల సముదాయం రూపొందించాలి. కొత్త పాత తేడా లేకుండా చదివే వారి రేటింగ్ బట్టి ఆ వ్యాసకర్తల మీద నియంత్రణలు విధించవచ్చు, లేదా వ్యాసాన్ని తొలగించవచ్చు. కానీ అందరి మీద అనువాద నియంత్రణలు అసౌకర్యాన్ని కల్గిస్తున్నాయని తెలుపగలను.
5. తెవికీ అనువాద యంత్ర సౌలభ్యం నుంచి మీరేం కోరుకుంటున్నారు లేదా ఆశిస్తున్నారు ?
1. నియంత్రణలు తీసేసి అనువాదం మరింత సులభతరం చేయాలి. 2. సభ్యుల అభిప్రాయాలు తీసుకుని అనువాద యంత్రాన్ని మరింత మెరుగుపరచాలి. 3. సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి. 4. అనువాద యంత్రం మీద లేని పోనీ నియంత్రణలు విధించడం కన్నా అనువాద యంత్రాన్ని మెరుగుపరచడం లేదా యంత్రాన్ని పూర్తిగా తొలగించడం చేసి ఖాళీ పెట్టెలు ఇచ్చి అనువాదకుడిని సొంత అనువాదం చేసుకోమనడం మేలు. 5. గౌరవ సభ్యులను వారి అభిప్రాయాల మీద, ప్రతిపాదనల మీద తీర్పులు(జడ్జింగ్) చెప్పడం, అభిప్రాయాన్ని రుద్దడంమాని ఆ సూచన తెవికీ కి ఎంత మేలు చేస్తుంది, వాడుకరి అనుభవాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అన్న అంశాల ప్రాతిపదికన ఆలోచన చేసిన పిదప ప్రగతి శీల చర్చలు చేసి ఓ ఏకాభిప్రాయనికి రావడం అనేది మేలు చేస్తుంది అని నా అభిప్రాయం. ధన్యవాదాలు. _____ దేవుడు (చర్చ) 14:33, 5 సెప్టెంబరు 2020 (UTC)
- దేవుడు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ విలువైన అభిప్రాయాలను చక్కగా ప్రశ్నలు-సమాధానాల రూపంలో చేర్చటం వలన అందరికి సులభంగా అర్ధమవుతుంది. ఇక ఉపకరణం సాంకేతిక సమస్యల గురించి మీ సూచనలు బాగున్నాయి. ఉపకరణంలో వివిధ రకాల యాంత్రిక అనువాదాలను వాడటం, ఏ యాంత్రిక అనువాదం లేకుండా మూల పేరా యథాతథంగా కాపీ చేయటం, ఖాళీ పేరాతో మొదలు పెట్టటం లాంటి ఐచ్ఛికాలున్నాయి. వాటిని ఎలావాడాలో వివరించాల్సిన అవసరం వుంది. వేరేచోట తెలిపినట్లు వికీపీడియా:కంటెంట్ ట్రాన్స్లేషన్ టూల్ అనే పేజీలో ఇలాంటివన్నీ చేర్చాలి.
- నాణ్యతను పెంచడానికి మీరు సర్వే సూచించారు. దాని అమలు కొంత ప్రయాసతో కూడుకున్నది. కావున తొలిగా ఇతరులు అనువాదం వ్యాసం చర్చాపేజీలో అభిప్రాయాలు తెలిపితే చాలామంది స్వచ్ఛందంగా పనిచేసే అనువాదకులు వ్యాసాన్ని మెరుగుచేయటానికి ఇష్టపడతారని నా అభిప్రాయం. ఒకవేళ అలా చేయకపోతే వ్యాసాన్ని తొలగించటం, అనువాదకుని పై కొంతకాలం నిషేధం విధించటం లాంటి తీవ్రమైన చర్యలు ప్రయోగించవచ్చు.-- అర్జున (చర్చ) 16:57, 5 సెప్టెంబరు 2020 (UTC)
విభాగాలుగా విభజించి అర్ధవంతంగా ఇతర విభాగాలలో లేక కొత్త విభాగాలలో చేర్చని అభిప్రాయాలు
[మార్చు]పవన్ సంతోష్ స్పందన
[మార్చు]ఇక్కడ చదువరి గారి విశ్లేషణ ప్రకారం - మీనా గాయత్రి, చదువరి గారు, నేను, వెంకటరమణ గారు కలిసి 54 శాతం అనువాద ప్రచురణలు చేశాం. సంతోషం. నేను 103 అనువాదాలు చేశాను. కనీసం 20 అనువాదాల పైచిలుకు ఈ ఉపకరణం వాడి కొత్త వ్యాసాలు ప్రచురించినవారం 9 మందిమే ఉన్నాం. (ఈ విశ్లేషణ పరిమితులు నాకు తెలుసు లెండి, కానీ స్థూలంగా చూస్తే) ఇటువంటి అనుభవం కొద్దిమందికే ఉన్నప్పుడు ఈ విషయంపై అభిప్రాయం చెప్పడం ధర్మంగా భావించి చెప్తున్నాను:
ముందు కొన్ని విషయాలు పరిశీలిద్దాం:
- రచ్చబండలో ఇక్కడ చదువరి గారు ఓ చర్చలో పాల్గొన్నారు. దాని ఫలితంగానే ఇప్పుడు మనం చర్చిస్తున్న విధానం ఏర్పడింది. ఈ చదువరి తెలుగు వికీపీడియాలో 200 పైచిలుకు అనువాద ఉపకరణం ద్వారా కొత్తవ్యాసాలు సృష్టించి ప్రచురించిన ఇద్దరిలో ఒకరు. (మరొకరు మీనా గాయత్రి, ఆమె ప్రస్తుతం సచేతనంగా లేరు) వారు చర్చించిన విషయం ఏమిటంటే - ఇంగ్లీషు నుంచి తెలుగుకు ఈ ఉపకరణం వాడి యాంత్రిక అనువాదం మద్దతు తీసుకుని అనువదిస్తే ఏమేరకు స్వయంగా రాయాల్సి వస్తోందన్నది చర్చ. చదువరి గారు ఏకంగా డిసెంబరు 2019లో తానే ఉపకరణంలో అనువదించిన 19 వ్యాసాలను విశ్లేషించి చూసి దాదాపు 50 శాతం తిరగరాయాల్సి వచ్చిందని చెప్పారు.
- అప్పుడు వికీపీడియా:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ అన్న ఈ విధాన పేజీలో చర్చ జరిపారు. చర్చలో చదువరితో పాటుగా బి.కె.విశ్వనాథ్ మాత్రమే పాల్గొన్నారు. చదువరి గారికి 50 శాతం వరకూ మానవీయమైన మార్పులు ఉంటేనే ఆమోదించాలన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 40 శాతాన్ని మాత్రమే థ్రెషోల్డ్ గా పెట్టారు. చివరకు 30 శాతం మానవీయమైన మార్పులు ఉన్నా ప్రచురించడానికి వీలు కలిగేలా విధానం అమలవుతోంది.
ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనపై నా వ్యాఖ్య:
- సశాస్త్రీయంగా విశ్లేషించి, చిన్న పాటి అధ్యయనం చేసి చదువరి గారు యాంత్రికానువాదాన్ని నేరుగా ప్రచురించడం సరికాదని దానికి కనీస మాత్రపు ప్రమాణంగా 30 శాతం పెట్టారు. ఈ విశ్లేషణ జరిగింది డిసెంబరు 2019లోనే. ఇప్పటికిప్పుడు దీన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం లేదు.
- ఎందుకు లేదూ అన్నదానికి కొన్ని కారణాలు ఉన్నాయి:
- ఒకటి: పునః పరిశీలించాలంటే ఉన్న ఒకే ఒక ప్రమాణం అనువాద ఉపకరణంలోని (కనీసం గూగుల్) అనువాద పాఠ్యం చాలా మెరుగ్గా ఉందనీ, అంటే 90 శాతం వరకూ ఖచ్చితంగా ఉందనీ నిరూపించడం. ఆ ప్రయత్నం ఏమీ జరగలేదు. ప్రతిపాదకులు చదువరి గారు తీసుకున్నట్టు 20 (సాధ్యమైతే వేర్వేరు అంశాలకు, సంక్లిష్టతలకు చెందిన) వ్యాసాలు తీసుకుని, పాఠ్యాన్ని మెరుగుపరిచి, 2020 ఆగస్టులో అనువాద ఉపకరణం 90 శాతం మెరుగైన పాఠ్యాన్ని అందిస్తోందని నిరూపించాలి. అర్జున గారు అదేమీ చేయలేదు. కాబట్టి, ఆయన ప్రతిపాదన శాస్త్రీయంగా లేదు.
- రెండు: గతంలో గూగుల్ అనువాద వ్యాసాలు మనం తొలగించినప్పుడు వాటిపై మనం చేసిన ఆరోపణల్లో "అసహజమైన భాష" ముఖ్యమైనది. (ఉపకరణం వల్ల మూసలు, లింకులు, ఫోటోలు వంటి సమస్యలు పరిష్కారమవుతాయి తప్ప అసహజ భాష అవదు) ఇప్పుడు ఉన్నదున్నట్టు యాంత్రికానువాద భాష ప్రచురించాలనుకుంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ యాంత్రికానువాదం 90 శాతం వరకూ మెరుగుపడిపోయిందా అన్న ప్రశ్న వస్తుంది.
- మూడు: అర్జున రావు గారు యాంత్రికానువాదం మెరుగుపడింది కాబట్టి ఈ పరిమితి పెంచుదామని అనడం లేదు. యాంత్రికానువాదం పరిస్థితి ఎలా ఉన్నా ఆయన 88 శాతం అనువాదం అలానే ఉంచేసి ప్రచురిద్దామంటే ఉపకరణం అడ్డుపడిందనీ అనక్‌డోట్ ఒకటి, తొలగింపు లెక్కలు రెండు, "భాషపై బాగా పట్టు గల వారు మాత్రమే అనువాదాలపై కృషి చేయటానికి అనుమతిస్తున్నందున, తెవికీ అభివృద్ధికి ఇది నిరోధకంగా వుంది" అన్న మాట ఇంకొకటి. ఇలా పొసగని విషయాలు ఏవో చెప్తున్నట్టు అనిపిస్తోంది. వీటిలో ఎక్కడా యాంత్రికానువాదం ద్వారా వస్తున్న ప్రొడక్టు ఎంతమేరకు ఖచ్చితంగా ఉందన్న విషయం లేనే లేదు. ఇక్కడ చేసిన ప్రతిపాదనలకు ప్రాతిపదికలు సరిగా లేవు.
విషయమేంటంటే - అనువాదం అన్నదానికి అటు మూల భాషలోనూ, ఇటు అనువదించే భాషలోనూ చాలా భాషా నైపుణ్యం ఉండాల్సిన పని. ఒకవేళ ఆంగ్ల భాషా నైపుణ్యం లేకపోతే చాలా ఓపికగా పదాన్నీ, వాక్యాన్నీ అర్థం చేసుకుంటూ, ఆంధ్రభారతి వంటి నిఘంటు శోధనలు వాడుకుంటూ శ్రమించి అనువదించాల్సి వస్తుంది. అదేమీ చటుక్కున అయిపోయే పనికాదు. ఈ పనిని అనువాద ఉపకరణం కొంత సులువు చేస్తోంది. అలాంటప్పుడు కనీసం 30 శాతం కూడా మార్పులు చేయను, నాణ్యత ఎలా ఉన్నా నాకు అనవసరం అనేలాంటి అనువాదాలు మేలు చేయవు. ఈ ముక్క విరివిగా అనువాదాలు చేసిన తోటి సభ్యులు కూడా సమర్థించేదేనని అనుకుంటన్నాను. భాషా నైపుణ్యాలు లేని సభ్యులు చేయగల పనులు వికీపీడియాలో చాలనే ఉన్నాయి. లేదూ అనువాదాలు చేద్దామనుకుంటే భాష, శైలి, అనువాద నైపుణ్యాలు ఓపికగా అలవరుచుకోవలసి వస్తుంది.
ఇప్పుడు నా ఉద్దేశంలో పునః పరిశీలించాలంటే ప్రతిపాదకులు చదువరి గారి పద్ధతిలోనే 20 వ్యాసాలు తీసుకున అనువాదం గణనీయంగా మెరుగుపడిపోయిందనీ, యాంత్రికానువాదం 85-90 శాతం ఖచ్చితంగా వస్తోందని ససాక్ష్యంగా, సాధికారికంగా చూపిస్తే అప్పుడు ఈ పరిమితులు తొలగించడంపై ఆలోచించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 16:42, 15 ఆగస్టు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. చర్చలో అందరూ సులభంగా పాల్గొనేటందుకు, సులభంగా అర్ధచేసుకునేందుకు, User:Chaduvari గారు రచ్చబండలో ఇచ్చిన సలహా మేరకు, చర్చాంశాలను ఉపవిభాగాలుగా చేశాను. నేను, ఇతరులు వివరంగా ప్రతిస్పందించేముందు, మీరు మీ స్పందనను ఆ ఉపవిభాగాలలో అవసరమైతే ప్రతిస్పందించే వ్యక్తుల పేరు వాడని కొత్త విభాగాలతో తగిన శీర్షికలు పెట్టి పై వ్యాఖ్యని సవరించమని కోరుతున్నాను. అలాగే సహసభ్యులు కూడా తమ వ్యాఖ్యలను చేర్చమని విజ్ఞప్తి చేస్తున్నాను. --అర్జున (చర్చ) 23:04, 16 ఆగస్టు 2020 (UTC)
- అర్జున రావు గారూ, మీరు చేసిన ఉప విభాగాలు చాలా కన్ఫ్యూజన్‌గా ఉంది నాకు. నా ఉద్దేశంలో ఇప్పుడు ఉన్న నియంత్రణ విధానం చాలా శాస్త్రీయంగా ఏర్పడింది. దీన్ని తొలగించాలంటే ప్రతిపాదకులు "యాంత్రికానువాద ఉపకరణం (కనీసం గూగుల్) 90 శాతం వరకూ సరైన పాఠ్యాన్ని అందిస్తోంది" అన్న విషయాన్ని కనీసం 20 (వివిధ వర్గాలకు చెందిన) వ్యాసాలను స్వీకరించి పరిశీలించి నిరూపించాలి. కేవలం అనక్‌డోటల్ రిఫరెన్సులు, ఇతరేతర కారణాలు (భాషానైపుణ్యం లేనివారు అనువాదకులు కాలేకపోతున్నారు, వికీపీడియన్ల స్వతంత్ర నిర్ణయాలకు ఆస్కారం లేదు, వంటివి) ఈ ప్రతిపాదన చేయడానికే బలం సరిపోదని. కాస్త సడలింపు చేయదలిచినా అనుభవజ్ఞులు అంటే వికీలో ఇతరేతర పనులు చేసినవారు కాదనీ, అనువాదాల్లో పనిచేసిన అనుభవం మాత్రమే ప్రాతిపదికగా స్వీకరించాలని అభిప్రాయపడుతున్నాను. దీన్ని మీరు తయారుచేసిన వివిధ విభాగాల్లో ఎక్కడెక్కడ చేర్చాలో తెలియట్లేదు. మీరు ఇక్కడ చేర్చండి అని చెప్తే చేస్తాను. ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 07:52, 17 ఆగస్టు 2020 (UTC)
కొత్త విధానానికి ప్రతిపాదనలు
[మార్చు]- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
- చర్చ గడువు ముగిసింది. ప్రతిపాదన 1 మాత్రమే బరిలో నిలిచింది. తదుపరి చర్య: ఓటు ప్రక్రియ ద్వారా దీనిపై విస్తృత సముదాయ అభిప్రాయం తెలుసుకొనుట. ఇతర ప్రతిపాదనల అమలుసాధ్యత లేదు. --అర్జున (చర్చ) 23:48, 5 సెప్టెంబరు 2020 (UTC)
ప్రతిపాదన 1: భాష పరంగా యాంత్రిక అనువాద స్థాయి తొలగింపు
[మార్చు]- అర్జున ప్రతిపాదన
భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలని నా ప్రతిపాదన. అనగా ఉపకరణంలో అప్రమేయంగా వున్న నాణ్యత పరిరక్షణ క్రియలు తెలుగు వికీకి సరిపోతాయి.
- అర్జున సవరణ
- కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు.
వికీపీడియాపై ప్రభావం - అనుకూలాలు
[మార్చు]- అనువాద వ్యాసాలు సృష్టించే సభ్యులపై ప్రస్తుతం వున్న వివక్ష పోతుంది. కొత్త వ్యాసాలు సృష్టించే సభ్యులకు లభించే అనుభవమే వీరికి అందుతుంది.
- వివక్ష తగ్గటం వలన తెవికీలో క్రియాశీలక సభ్యులు, ముఖ్యంగా అనువాద వ్యాసాలపై కృషిచేసే సభ్యులు పెరిగే అవకాశముంది.
- తెవికీ ఏర్పడ్డ ప్రధాన నియమం , ఎవరైనా పాల్గొనగలిగే వీలున్న నియమాన్ని గౌరవించడం జరుగుతుంది.
- అనువాదాలపై ఆసక్తి వున్న సభ్యులు దొడ్డిదారులు వెతకనవసరం వుండదు. అనువాద వ్యాసాల గణాంకాలను, నాణ్యతను కనుగొనడం, ఆ ప్రక్రియలో చేర్చబడ్డే వర్గాల ద్వారా, సమీక్షించడం వీలవుతుంది.
వికీపీడియాపై ప్రభావం - ప్రతికూలాలు
[మార్చు]- కొత్త అనువాద వ్యాసాలలో నాణ్యత తగ్గిన వ్యాసాలు కొంచెం పెరగవచ్చు. సభ్యులకు అనువాద వ్యాస పేజీలలో హెచ్చరిక మూసలు, అనువాద వ్యాస చర్చాపేజీలలో సలహాలు ఇవ్వడం ద్వారా, దుశ్చర్యలవడపోత (AbuseFilter) ద్వారా, ఒక్కోసారి అనువాద వ్యాసాలను తొలగించడం ద్వారా, క్రింద తెలిపిన ఇతర చర్యల ద్వారా వాటి నాణ్యత మెరుగుపరచటానికి చర్యలు చేపట్టవచ్చు.
తొలగింపుల తగ్గింపుకు చర్యలు
[మార్చు]- అనుభవం వచ్చిన వ్యక్తులు మాత్రమే ఉపకరణం వాడాలని ప్రచారం చేయాలి. {{స్వాగతం}} లో సవరణ, కొన్ని రోజులు, వికీపీడియాపై ప్రకటన MediaWiki:Anonnotice, MediaWiki:Sitenotice లాంటివి వాడవచ్చు.
- అయినా ఎక్కువమంది కొత్త సభ్యులు వాడుతుంటే, దుశ్చర్యల వడపోత లో కొత్త వడపోతల ద్వారా యాంత్రికంగా వారిని నిరోధించవచ్చు.
- ప్రాజెక్టుల ద్వారా నాణ్యత లేని అనువాద వ్యాసాలు చేర్చబడుతున్నప్పుడు, ప్రాజెక్టు నిర్వాహకులను హెచ్చరించటం, ఆ ప్రాజెక్టు లో పనిచేసే సభ్యులను హెచ్చరించటం, అవసరమైతే వ్యాసాల తొలగింపులు (దీనివలన అప్రమేయంగా వున్న నాణ్యత సంరక్షణ క్రియలు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయి), కొంతకాలం సభ్యులపై నిషేధాలు విధించడం చేయవచ్చు.
- చెడు వినియోగాలు ఎక్కువగా వున్నప్పుడు నిర్వహణ కార్యక్రమాలలో ఎక్కువమంది నిర్వాహకులను, సభ్యులను పాల్గొనేలా ప్రేరేపించాలి.
చర్చ
[మార్చు]విధానంలోని లోపాలను నిస్సంశయంగా నిరూపించే ఒక విశ్లేషణ
[మార్చు]పైన వ్యక్తిగత అనుభవం చెప్తూ అర్జున గారు అనువాద ఉపకరణం వాడి తన వ్యాసాలు ప్రచురిద్దామంటే ఈ 70 శాతం నిబంధన వల్ల ప్రచురణ కావట్లేదనీ, వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి అనే పేజీలో 2019 వరకూ "అర్జున వ్యాసాలు ప్రస్తుత 70% పరిమితితో 40 శాతం అనగా 13 లో 5 మాత్రమే ముద్రణకు అనుమతించబడతాయి" అని రాశారు. ఏకంగా అర్జున గారి వ్యాసాలే ఈ 70 శాతం మార్పుల పరిమితి దాటకపోవడం ఏమిటి, అంటే కొన్ని వ్యాసాల విషయంలో ఈ గూగుల్ అనువాదం ఏమైనా మెరుగ్గా ఉందా చూద్దాం అనుకొని నేను అర్జున గారు ఇప్పటిదాకా అనువాద ఉపకరణంలో అనువదించిన 13 వ్యాసాలను తీసుకుని విశ్లేషించాను. ఆ వ్యాసాలను విశ్లేషించి చూస్తే అర్జున గారు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన వీగిపోవడానికి ఆయన వ్యాసాలకు మించిన చక్కని ఉదాహరణలు అక్కరలేదని తేలింది. ఈ విశ్లేషణ ఫలితాలు ఇవిగో:
- అనువదించాల్సిన ఇంగ్లీష్ పదబంధాలు అలానే ప్రచురించెయ్యడం: మనం అనువదించేప్పుడు ఒక్కోసారి గూగుల్ ఉపకరణం పొరబాటున కొన్ని ఆంగ్ల వాక్య భాగాలను అచ్చంగా ఆంగ్లంలోనే ఇచ్చివేస్తోంది. ఇవేమీ అనువాదానికి లొంగని సాంకేతిక పదజాలం కాదు, పొరబాటున వదిలేసిన సాధారణ పదాలు. అర్జున గారి వ్యాసాల్లో కొండొకచో వీటిని ఆయన మార్చకుండా ప్రచురించేశారు. విశేషమేమిటంటే ఈనాటికీ మార్చలేదు. ఉదాహరణకు: జాతీయ డిజిటల్ లైబ్రరీ వ్యాసంలో As of 2017, WX లిప్యంతరీకరణ kZa' represents क़ అన్నవి మార్చి ఉండాల్సినవి, మార్చకుండా ఉంచినవి. మరొకటి: ట్రూజెట్#గమ్యస్థానాలు అన్న విభాగం చూడండి. Devi Ahilyabai Holkar Airport, Jaisalmer, Jaisalmer Airport, Vasco da Gama, Goa International Airport, Mysore Airport, Jindal Vijaynagar Airport, Nanded, Nanded Airport, Nashik Airport, Jalgaon, Coimbatore International Airport, Salem Airport, Ahmedabad, Sardar Vallabhbhai Patel International Airport, Porbandar Airport, Kandla, Kandla Airport - ఈ పదాలన్నీ ఆంగ్లంలోనే వదిలివేశారు. అనువాద ఉపకరణం బ్లూలింకులు, రెడ్ లింకుల్లో ఉన్నవి మాత్రమే అనువదించి ఊరుకుంది ఆ పట్టికలో. అది పొరబాటున మార్చని ఈ పదబంధాలన్నీ అలానే వదిలేశారు. నాసిక్ విమానాశ్రయం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయం అని రాయడానికి ఏమాత్రం భాషా నైపుణ్యం అవసరం, మార్చాలన్న పూనిక తప్ప?
- శైలి ఉల్లంఘనలు: ఈ వ్యాసాల్లో పలు శైలీ ఉల్లంఘనలు ఉన్నాయి. వాటిని అనువాదకులు పట్టించుకోకుండా యథాతథంగా ప్రచురించేశారు. ఒక్కోటీ చెప్పుకుందాం:
- తేదీ ఆకృతి: నాలుగేళ్ళ క్రితమే మనం తేదీ ఆకృతి అన్నది "సంవత్సరం నెల తేదీ+న" లేక "నెల తేదీ+న" అన్న పద్ధతిలో ఉండాలని నిర్ణయించుకుని వికీపీడియా శైలిలో భాగంగా చేర్చుకున్నాం. దీని ప్రకారం "(2020) ఆగస్టు 18న పవన్ సంతోష్ ఈ వ్యాఖ్య చేశాడు" అనాలి. అనువాద ఉపకరణం ఇంగ్లీష్ తేదీని బట్టి 18 ఆగస్ట్ 2020 అనేస్తుంది. మనం దిద్దుకోవాలి. పలు వ్యాసాల్లో అర్జున గారు ఈ అనువాదాలు దిద్దకుండానే ప్రచురించేశారు. ఒక్కోచోట ఇతరుల ఏడబ్ల్యూబీ దిద్దింది. ఉదాహరణకు: వికీడేటా(Wikidata)లో ఇంకా అన్ని తేదీలూ అదే ఆకృతిలో ఉంటాయి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వ్యాసంలో యర్రా రామారావు గారు ఏడబ్ల్యూబీతో చేసిన మార్పుల్లో ఇవి మారాయి.
- మరియులు, యొక్కలు వదిలెయ్యడం: తెలుగు భాషకు మరియులు, యొక్కలు అసహజంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆంగ్లంలో ఒకే వాక్యంలో రెండు మూడు andలు వచ్చినప్పుడు దాన్ని అనువాద ఉపకరణం రెండు, మూడు మరియులతో అనువదించేస్తుంది. చాలా కృతకంగా కనిపిస్తుంది భాష. ఇవి కనీసం దిద్దవలసినవి. చదువరి గారు ఇటీవల అనువాద ఉపకరణానికి పెట్టిన థ్రాటిల్ 30 శాతం అనువాదం ఉండాలని మాత్రమే కాదు (అదొక్కటే అన్నట్టు చర్చిస్తున్నారు) ఈ మరియులు, యొక్కలు తొలగించేలా కూడా నిబంధించారు. అర్జున గారు చేసిన ఈ అనువాదాలన్నిటిలోనూ మరియులు అలాగే వదిలేశారు. తిరిగి చదువరి గారే ఏడబ్ల్యూబీలు నడిపించి ఆ మరియులు తీసేయవలసి వచ్చింది. ఉదాహరణలు: 1. యుఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్ (USB Flash Drive) వ్యాసంలో మరియుల తొలగింపు, 2. వికీమీడియా కామన్స్ వ్యాసంలో మరియుల తొలగింపు, 3. కొద్ది బైట్ల తేడాతో మొలక దశ దాటిన అతిచిన్న వ్యాసం జాతీయ డిజిటల్ లైబ్రరీలోనూ మరియుల తొలగింపు. అత్యంత అరుదైన సందర్భాల్లో యొక్కకు ప్రయోజనం ఉండవచ్చు కానీ అలాగేమీ కాకుండా అత్యంత విరివిగా వదిలివేసిన యొక్కలు ఇంకా ఈ వ్యాసాల్లో అలాగే ఉన్నాయి.
- కనీస మార్పులు కూడా చేయకపోవడం: వికీడేటా(Wikidata) అన్న వ్యాసంలో ఇవి కూడా చూడండి అన్నలాంటి ఓ విభాగం ఇది కూడా చూడు అని ఉంది. ఈ విభాగంలో ఎప్పుడైనా సంబంధిత వ్యాసాల లింకులు ఉండాలని తెవికీ గురించి కనీస అవగాహన ఉన్నవారికి కూడా తెలుస్తుంది. ఆ విభాగంలో (పేరు ఇది కూడా చూడు) BabelNet, DBpedia, Freebase, సెమాంటిక్ మీడియావికీ, SPARQL అన్నవి లింకులు లేకుండా ఇచ్చి వదిలేశారు. అవకాశం ఇస్తే యంత్రం ఎంతటి పొరబాటు చేసినా చాలామంది పట్టించుకోకుండా ప్రచురించేస్తారన్నదానికి అనుభవజ్ఞులైన ప్రతిపాదకులే ఉదాహరణ. జాతీయ రహదారి 75 (భారతదేశం) అన్న పేజీలో "జంక్షన్ల" అన్న విభాగం ఉంది. ఏమి Junctions అన్నది పొరబాటున జంక్షన్ల అని పెట్టింది ఉపకరణం, అనువాదకులు కనీసం జంక్షన్లు అని ఓ కొమ్ము కూడా ఇవ్వలేదు. ఉన్నదున్నట్టుగా క్లిక్ కొట్టి ప్రచురించారు.
- ఈ వ్యాసాల్లో ఎంత పని ఉంటుందో తెలుసా?: అర్జున గారు చేసిన అనువాదాల్లో అత్యధిక భాగం పది వేల బైట్ల లోపు ఉన్నవీ, కొన్ని కేవలం పట్టికలు, జాబితాలు ఉన్నవీ, ఏదో ఒకటి ఐదువేల బైట్లు అనువదించి మరో పదివేల బైట్లకు బయట విస్తరించినదీను. కాబట్టి, ఉన్నవాటిలోకెల్లా పెద్ద వ్యాసమైన వికీమీడియా కామన్స్ ఉదాహరణగా తీసుకుందాం. ఆ వ్యాసంలో అనువాదకులు అనువదించాకా భాషాదోషాలు, అక్షరదోషాలు, శైలీదోషాలు, సాధారణ పొరబాట్లు దిద్దేందుకు ఎంత పని మిగిలిందో ఈ లింకులో చూడవచ్చు. (చిన్న సూచన ఆ లింకులో కనిపించే మార్పుల్లో మధ్యలో సమాచారపెట్టెలో సమాచారం తెలుగు చేసింది మట్టుకు అర్జున గారు) ఈ మార్పులు చదువరి గారు చాలావరకూ మానవీయంగానూ, కొంత ఏడబ్ల్యూబీతోనూ చేశారు.
ఆ పదమూడు వ్యాసాలు చూస్తే బొమ్మలకు ఉపశీర్షికలు ఆంగ్లంలోనే వదిలెయ్యడం మొదలుకొని చాలా చిన్నా చితకా సమస్యలు ఉన్నాయి. అవంతా రాసి విసిగించడం ఇక్కడ పాయింట్ కాదు కాబట్టి విడిచిపెట్టేశాను. అలానే వికీలో తప్పులే దొర్లవనీ, ఇదేదో ఘోరమనీ కూడా కాదు. మరి విషయం ఏమిటీ అంటే
- సాక్షాత్తూ ఈ ఎంతో అనుభవం, నాణ్యతపై అక్కర కలిగి, ఈ ప్రతిపాదన చేసిన అర్జున ��ావు గారే అవకాశం ఇస్తే ఇలా సరిగా మార్పులు చేయకుండా ప్రచురించేసినప్పుడు, ఈనాటికీ ఆ వ్యాసాలు అవే సమస్యలతో ఉన్నప్పుడు, ఉన్న 70 శాతం నిబంధన తీసేసి 90 శాతం దాకా మార్పుల్లేని పాఠ్యం అచ్చంగా ప్రచురించెయ్యవచ్చును అంటే నాబోటిగాళ్ళు ప్రచురించే అనువాదాలు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో సహసభ్యుల ఊహకే వదిలివేస్తున్నాను.
- "పై వివరాలు పరిశీలించితే అర్జున వ్యాసాలు ప్రస్తుత 70% పరిమితితో 40 శాతం అనగా 13 లో 5 మాత్రమే ముద్రణకు అనుమతించబడతాయి." అని ఈ విశ్లేషణలో (బహుశా) వాపోయారు. కానీ, 70 శాతం పరిమితి వల్ల ఈ 13 వ్యాసాల్లో 5 మాత్రమే ప్రచురణ అవుతాయనీ, మిగిలినవాటిపై అనువాదకుడు మార్పుచేర్పులు చేయవలసి వస్తుందనీ అంటే ఈ పరిమితి చాలా బావున్నట్టు. కనీసం ఆ ఐదు వ్యాసాలన్నా ఇంకొంత మెరుగుపడతాయి. ఆ విధంగా ఆయనే తన అనువాదాల ద్వారానూ, పై వాక్యాలతోనూ పరోక్షంగా 70 శాతం పరిమితిని సమర్థిస్తున్నట్టు అవుతోంది.
- ఇందాకా ప్రణయ్ రాజ్ గారు తన స్పందన చెప్తే అర్జున గారు "ఒక్క క్లిక్ తో ప్రచురించటం అనేది అపోహా మాత్రమే. మరిన్ని అపోహలు, అసలు నిజాలు, ప్రాజెక్టు పేజీ లో చూడండి." అన్నారు. "ఒక్క క్లిక్" అంటే - కళ్ళు మూసుకుని పాఠ్యంలో మార్పులు చేయకుండా దోషాలు అలానే ఉంచి అచ్చు కొట్టెయ్యడం అన్న అర్థం తీసుకుంటే - అర్జున రావు గారు ప్రచురించిన వ్యాసాలపై చేసిన పై విశ్లేషణ అర్జున గారిదే అపోహ అనీ, ప్రణయ్ రాజ్ గారు చాలా సరిగా అంచనావేశారనీ చెప్పాల్సి వస్తుంది.
ఈ 70 శాతం నిబంధన వల్ల మొత్తం అనువాద సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని నేను అనబోవట్లేదు. కానీ, ఇది కనీస మాత్రంగా ఉండవలసిన నిబంధన అనీ, అనువాద ఉపకరణం మెరుగుపడిందో లేదో చూడకుండా దీన్ని తొలగించడం సరికాదనీ ఈ విశ్లేషణ నిరూపిస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 09:54, 18 ఆగస్టు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారు, మీ విశ్లేషణకు ధన్యవాదాలు. నా ఉద్యోగ పర్వంలో నా పై అధికారి ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని విమర్శించడం ఆ రెండవ వ్యక్తికి ఇవ్వగల గొప్ప బహుమతి అని అన్నారు. మీ విమర్శను మీరు నాకు ఇచ్చిన బహుమతిగానే తీసుకున్నాను. నా అనువాద వ్యాసాలన్నీ మరల పరిశీలించి మెరుగుపరచే దిశగా సవరణలు చేశాను. ఆ భాగంలో {{As of}}ను స్థానికీకరణ చేసి దాదాపు 100 పైగా వ్యాసాలలోగల సమస్యను పరిష్కరించాను. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాల్సినవి తెలుసుకున్నాను.
- నేను ఎక్కువగా అనువాదాలు చేసినది లేదు. వీటిలో దాదాపు సగం అనువాదాలు, అనువాద ఉపకరణం పనితీరు నేర్చుకునే ప్రక్రియలో చేసినవి. ఒక్కో వ్యాసం తొలి అనువాద ముద్రణకు ఎంత సమయంపట్టిందో కూడా తెలుసుకొనేవీలున్నది అవసరమైతే అవి అందచేయగలను. వ్యాసం అనువదించినపుడు తెవికీ పాఠకులకు ఆసక్తిగల అంశాలపై దృష్టి పెట్టాను, అందువలన కొంత సమాచారాన్ని అనువాదం చేయలేదు. అనువాదం ముద్రించిన తరువాత కూడా నా సవరణలు వ్యాస చరిత్రలో మీకు కనబడతాయి. అంటే అనువాదాన్ని ముద్రించి వదలివేసే సభ్యుడిని కాను. నా అనువాద వ్యాసాలపై చదువరి సవరణలు గమనించి ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపినట్లు గుర్తు. నాకంటే మీరు, ఇతరులు ఎక్కువగా అనువాదాలు చేశారు, మీరు ఆశించే నాణ్యత నా అనువాద వ్యాసాలలో కనబడకపోవటాన్ని నేను అంగీకరిస్తాను. నేను మరల పరిశీలించినపుడు నా అనువాదంలోగల సమస్యలు మరింతగా తెలిశాయి. వాటిని అనువాద సమస్యల పరిష్కరణ ఉపకరణం వాడి కొంతవరకు సవరించాను. మీరు, ఇతర సభ్యులు తెలుగు వికీ నాణ్యతకోసం చేస్తున్న కృషి నాపై ప్రభావం చూపింది. ముందు చేయబోయే అనువాదాలు మరింత నాణ్యతగా చేయదలుచుకున్నాను.
- మీ ఉదాహరణలలో చాలా భాగం శైలికి సంబంధించినవి. మీరు కొంతవరకు అభిప్రాయపడినట్లు శైలిని, ప్రస్తుత అనువాద ఉపకరణం ద్వారా నియంత్రించలేము. స్వచ్ఛందంగా, ఎవరైనా పాల్గొన కలిగే వికీపీడియా ప్రాజెక్టులో ఏకరీతిశైలి సాధించడం చాలా కష్టసాధ్యం. విషయం అర్ధం అయ్యేటట్లు వున్నదా అన్నదే ప్రధానం అని నా అభిప్రాయం. మరియు లాంటివాడకాన్ని నిరోధించటానికి చదువరి గారు దుశ్చర్యల వడపోత ద్వారా చేశారు. ఇతర శైలి విషయాలకు అలా చేయవచ్చు. బాట్,ఎడబ్ల్యుబి(AWB) ద్వారా శైలి దోషాలను సరిచేయటం జరుగుతున్నది మీకు తెలుసు.
- సమీక్షలో అంశాలు, చర్చలు, ప్రాజెక్టు పేజీని పరిశీలిస్తే 70% కంటే తక్కువ మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి వలన సమస్యలు తేటతెల్లం అవుతాయి. సభ్యుల కృషిలో సమస్యలున్నప్పుడు ఉపకరణం ద్వారా కఠినమైన నిరోధ ప్రక్రియలు అమలుచేయడానికి బదులు, చర్చల ద్వారా కావలసిన సవరణలను చేయటానికి ప్రోత్సహించటం అలా చేయటంవలన తెవికీ సముదాయం బలపడుతుందని నా అభిప్రాయం. దానిని మీరు అర్ధం చేసుకుని ఈ ప్రతిపాదనకు సవరణలు లేక కొత్త ప్రతిపాదన చేయాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 13:51, 25 ఆగస్టు 2020 (UTC)
తొలగింపులు తగ్గించుటకు అదనపు చర్యలు
[మార్చు]70% యాంత్రిక అనువాద విధాన సమీక్షలో సభ్యులు, కొత్త సభ్యుల యాంత్రిక అనువాదాలపై నియంత్రణ వుండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు కావున, ఆంగ్ల వికీపీడియాలో అమలు చేసినట్లు దుశ్చర్యల వడపోత ద్వారా కొత్త సభ్యులు నెల రోజులు, 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించడాన్ని నిరోధించే పద్ధతి అమలు చేయాలి.--అర్జున (చర్చ) 22:30, 30 ఆగస్టు 2020 (UTC)
ప్రతిపాదన 2: మెరుగుపరచిన యాంత్రిక అనువాదం 50 శాతం కన్నా తక్కువ వుండాలి
[మార్చు]- వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల ప్రతిపాదన
మెరుగుపరచిన యాంత్రిక అనువాదం స్థాయి 50 శాతం కన్నా తక్కువ వుండాలి.
- అనుభవం ఉన్న వాడుకరి అనగా కనీసం 500 మార్పుచేర్పులు చేసి ఉన్నవారికి మెరుగుపరచిన యాంత్రిక అనువాదం పరిమితి 90 శాతం వరకు వుండాలి
వికీపీడియాపై ప్రభావం - అనుకూలాలు
[మార్చు]వికీపీడియాపై ప్రభావం - ప్రతికూలాలు
[మార్చు]- అనువాద ఉపకరణం మరింతగా నియంత్రిస్తుంది కావున, అనువాద వ్యాసాలు, అనువాద సభ్యుల గణాంకాలు మరింతగా తగ్గుతాయి.
- తెలుగు వికీ అనువాద సభ్యుల అనువాద ప్రయత్నాలు విజయవంతం కాక, తెవికీలో కృషి తగ్గిపోతుంది.
తొలగింపుల తగ్గింపుకు చర్యలు
[మార్చు]చర్చ
[మార్చు]50 శాతం పరిమితికి శాస్త్రీయ ప్రాతిపదికలేదు
[మార్చు]ప్రస్తుతం అమలులో వున్న 70% లాగానే 50% సంఖ్యకు శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. అనుభవం ద్వారా నిర్ణయించిన సంఖ్య. ఇటువంటి వాటికి గతంలో అధ్యయన పరిమితులు,ఉపకరణ పరిమితులు పరగణించి సవరణలు చేసిన సంగతి మీకు తెలుసు. అందువలన ఉపకరణం హెచ్చరించినపుడు అనువాదం చేసే వాడుకరి తన అనుభవంతో సమీక్ష చేయటమే మంచిది. అలాగే కొత్త వాడుకరులను నియంత్రించటానికి దుశ్చర్యల వడపోత ద్వారా కొంత నిరోధం లేక హెచ్చరిక చర్యలు చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 01:20, 28 ఆగస్టు 2020 (UTC)
విధాన అమలు సాధ్యంకాదు
[మార్చు]వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, అనుభవం వున్న సభ్యులకు ఈ పరిమితిని 90% కు సడలించాలని, రెండోది ఇతరులకు 50% పరిమితి కొనసాగాలని. ప్రస్తుత సాంకేతికాలలో యాంత్రిక అనువాదానికి స్థాయి పరిమితిని కొత్త సభ్యులకే పరిమితం చేయవీలులేదు. ఆంగ్ల వికీపీడియాలో చేసినట్లు 500 మార్పులు చేయనివారు, అనువాద వ్యాసాలను ప్రధానపేరుబరిలో ముద్రించకుండా నిరోధించవచ్చు. అలా చేసినపుడు, అప్రమేయ నాణ్యత పరిరక్షణలు సరిపోతాయని నా అభిప్రాయం. కావున మీ అభిప్రాయాన్ని లేక ప్రతిపాదనను అమలుచేయుటకు సాధ్యాసాధ్యాలను పరిగణించి స్పష్టంచేయండి లేదా ఉపసంహరించుకోవటం గురించి స్పందించండి. --అర్జున (చర్చ) 01:08, 28 ఆగస్టు 2020 (UTC)
- అర్జున గారు, పరిమితం చేయవీలులేదు కాదు అన్నప్పుడు ఉపసంహరించుకోవటం గురించి నాకేమీ అభ్యంతరం లేదు గురువా కానీ ప్రాజెక్టు సభ్యులు ఈమధ్య చేస్తున్న అనువాదాలు చూస్తే మీ ద్వారా వారికి ఒక్క విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను, అనువాదం పరికరము ఉపయోగించి ముద్రించే ముందు కంట్రోల్ F, (Ctrl + F) గురించి:
మరియు
, లేకయొక్క
లను మౌస్ లేక కీ బోర్డుతో ఎంపిక చేసి, కంట్రోల్ + F ఇప్పుడు నొక్కితే ఆ పేజీలో ఎన్ని మరియు లు ఉన్న లెక్కకట్టి మరి చెబుతోంది. మార్చు, అన్నిటినీ మార్చు ఉపయోగించి వాటిన తొలగించవచ్చు.
- అలాగే వ్యాసంలోని పదాలకు ఇచ్చిన వికీవ్యాస లింకులకు ఆంగ్లం వ్యాసాలు ఉండి తెలుగు వ్యాసాలు లేకపోతే ఎర్ర లింకులు వస్తుంటాయి,
A
నోక్కి శైలి పాఠంలో తీసివెయ్యితో వాటిని తొలగిస్తూ ముద్రిస్తే వ్యాసం కొంత వరకు బాగుంటుంది. ఇది ప్రాజెక్టు సభ్యులకు మేనేజర్లకు మీ ద్వారా గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆలస్య స్పందనకు కారణం నా లాప్ టాప్ ఇంటర్నెట్ తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పెట్టింది. ప్రభాకర్ గౌడ్ నోముల 09:21, 2 సెప్టెంబరు 2020 (UTC)
- వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యకు, మరింత అర్ధవంతం కావడానికి కొన్ని భాషా సవరణలు, రూపంతీరు సవరణలు చేశాను. నేనేమైనా తప్పుగా సవరించితే మీరు మరల సవరించండి లేక నాకు సూచించండి.
- మీరు వ్యాసాలను ముద్రించేముందే శైలికి సంబంధించి అనువాదం ఉపకరణం ఎలా వాడాలో మంచి సూచనలు చేశారు. నేను వీటిని ఇంతవరకు గమనించలేదు. ఇటువంటి సూచనలను వికీపీడియా:కంటెంట్ ట్రాన్స్లేషన్ టూల్ లో చేర్చటం, అనువాదం చేసే సభ్యులకు తెలియచెప్పితే శైలి పాటించడానికి సహకరిస్తాయి. ఆ వ్యాసం నేను ఆంగ్లవికీనుండి అనువాదం చేయాలని మొదలుపెట్టి ప్రస్తుత నియంత్రణ వలన అనువాదం పూర్తి చేయలేక ఆగిపోయాను.
- తెలుగు వికీలోలేని వ్యాసాలకు లింకులు అనువాద ఉపకరణంలో బూడిద రంగులో ఉపకరణంలో కనబడతాయి. వాటిపై కర్సరు వుంచినపుడు వాటిని కనబడని లింకు అనే విభాగంలో ఆ లింకుని తొలగించటం (చెత్తబుట్ట పై నొక్కటం ద్వారా)లేక Mark as missing ఎంచుకోవటం ద్వారా ఎర్రలింకుగా మార్చవచ్చు. మీరు చెప్పిన రెండవ విషయం ఇదే అనుకుంటాను. నేను సరిగా అర్ధంచేసుకోకపోతే మరింత వివరించండి.
- చివరిగా మీ ప్రతిపాదన ఉపసంహరించటానికి అభ్యంతరం తెలపనందుకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:06, 2 సెప్టెంబరు 2020 (UTC)
ప్రతిపాదన 3: చిత్తువ్యాసాల పేరుబరిలో అనువాద వ్యాసాలు చేర్చడం
[మార్చు]IM3847 గారి ప్రతిపాదన
అనువాదించిన వ్యాసాలను నేరుగా ప్రచురించకుండా, ఆంగ్ల వికీపీడియాలో వాడిన విధంగా చిత్తువ్యాసాలులో ఉంచితే అనువాదాలపై బాగా అనుభవం కలగిన అడ్మిన్లు వాటిని పెట్రోల్ చేసి వ్యాస స్థలానికి తరలించవచ్చు. ఈ ప్రక్రియను ఆంగ్లంలో Articles for creation అంటారు. ఈ విధంగా చేయడంవలన పవన్ గారు అన్నట్లుగా "అసహజమైన భాష" కలిగిన వ్యాసాలను వీక్షకులు నేరుగా చూడకుండా నివారించవచ్చు.--IM3847 (చర్చ) 06:40, 29 ఆగస్టు 2020 (UTC)
వికీపీడియాపై ప్రభావం - అనుకూలాలు
[మార్చు]వికీపీడియాపై ప్రభావం - ప్రతికూలాలు
[మార్చు]తొలగింపుల తగ్గింపుకు చర్యలు
[మార్చు]చర్చ
[మార్చు]ప్రస్తుత చర్చకు సంబంధం, అమలు సాధ్యత
[మార్చు]IM3847 గారు, మీ ప్రతిపాదన చేర్చినందులకు ధన్యవాదాలు. చిత్తుపేరుబరి తెలుగు వికీపీడియాలో లేదు. దానిని ఆంగ్లంలో కేవలం అనువాద ఉపకరణ వ్యాసాలకొరకే కాక ఇతర ఉపయోగాలకు వాడుతారు. తెలుగువికీలో క్రియాశీల సభ్యులు, నిర్వాహకుల సంఖ్య తక్కువ. కొత్త పేరుబరివలన ఏర్పడవలసిన విధానాలు, దానికి కావలసిన తోడ్పాటు తెవికీలో చేయడం కష్టం. దానికొరకు వేరే చర్చ జరపాలి. కావున ప్రస్తుత చర్చకు మీ ప్రతిపాదన సంబంధం లేదు కావున అమలు సాధ్యంకాదు.--అర్జున (చర్చ) 00:10, 30 ఆగస్టు 2020 (UTC)
- IM3847 గారు, పైన తెలిపిన విధంగా అమలు సాధ్యత లేనందున, మీ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటారా?అమలుకు వీలుకాని ప్రతిపాదనలు ఓటు వేయడానికి పరిగణించబడవు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:57, 2 సెప్టెంబరు 2020 (UTC)
వాడుకరి పేరుబరిని చిత్తు అనువాదాల వ్యాసాలకు వాడుకోవచ్చు
[మార్చు]IM3847 గారు, మీ ప్రతిపాదన నేపధ్యంలో గల ఆలోచన మంచిదే. అయితే ప్రస్తుతం వాడుకరి పేరుబరిని చిత్తు అనువాద వ్యాసాలకు వాడుకోవచ్చు. దుశ్చర్యలవడపోత ద్వారా అనుభవం లేని వాడుకరులు ప్రధానపేరుబరిలో అనువాదాలు చేర్చకుండా కట్టడి చేయవచ్చు. కావున మీ ప్రతిపాదన ఆలోచన ఆ విధంగా అమలులోకి తేవచ్చు.--అర్జున (చర్చ) 00:13, 30 ఆగస్టు 2020 (UTC)
చదువరి స్పందన
[మార్చు]- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
- చర్చ గడువు పూర్తి. అర్జున (చర్చ) 23:50, 5 సెప్టెంబరు 2020 (UTC)
ఈ సవరణ ప్రతిపాదన, అ ప్రతిపాదనకు ప్రతిపాదకుడే స్వయంగా చేసుకున్న సవరణ దానిపై సభ్యుల అభిప్రాయాలను మోడరేషను చేసి, కొత్తకొత్త విభాగాలు పెట్టి, అనుకూలం ప్రతికూలం అంటూ వర్గీకరించి... మొత్తమ్మీద ఈ పేజీ అంతా గందరగోళమైపోయింది. అంచేత ఫ్రెష్షుగా ఓ కొత్త ఉపవిభాగం పెట్టి నా అభిప్రాయం రాస్తున్నాను. దయచేసి దీన్ని మోడరేటు చెయ్యకండి, దాన్ని మొత్తంగా గానీ, ముక్కలుగా పట్టుకెళ్ళి గానీ రకరకాల విభాగాల్లో పెట్టేసి కనబడకుండా సర్దేసెయ్యొద్దు. ఇక్కడే, ఇలాగే ఉండనివ్వండి. అనువాద పరికరంలో ఉన్న కనీస మానవిక అనువాద స్థాయిని ఇప్పుడున్న 30% నుండి తగ్గించేసి పూర్వపు స్థాయికి తీసుకెళ్ళాలనేది అర్జున గారి ప్రతిపాదన. దానిపైన మాత్రమే నా అభిప్రాయాలు రాస్తున్నాను. మానవిక అనువాద స్థాయిని తగ్గించాలనేది తిరోగమన ఆలోచన అని నా ఉద్దేశం. ఎందుకో కింద రాస్తాను: అనువాద పరికరం విషయంలో నా అనుభవం గురించి చెప్పాలి. నేను 200 పైచిలుకు అనువాదాలను నేరుగా పరికరం నుండే ప్రచురించాను. దానికి అనేక రెట్ల వ్యాసాలను అనువదించి కాపీ పేస్టు చేసి వికీపేజీల్లో ప్రచురించాను. వాటి పరిమాణం కనీసం 70 లక్షల బైట్లుంటుంది (2020 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో నేను చేసిన పనిలో 90% పైన అనువాద పరికరం ద్వారా చేసినదే). చాలా ముఖ్యమైన సంగతి: ఇదంతా మానవిక అనువాద స్థాయి 30 శాతానికి పెంచిన తరవాతనే చేసాను.
- 30 శాతానికి పెంచాక నా అనుభవం సంతృప్తికరంగా ఉంది. ప్రచురించేటపుడు ఇబ్బంది తలెత్తలేదా? తలెత్తింది. నాకు గుర్తున్నంతలో రెండు సార్లు జరిగింది. "30% మానవిక అనువాదం అవలేదు, నేను ప్రచురించను పొమ్మం"ది. నేను అనుభవజ్ఞుణ్ణి నా నిర్ణయాన్నే గౌరవించవా అని నేను హుంకరించలేదు. (అసలు ఇంత అనుభవం ఉంది, అంత అనుభవముంది అని మాట్టాడ్డం నా పద్ధతి కాదు. అది నాకు నచ్చదు. మన అనుభవం మన పనిలో కనబడాలి గానీ మాటల్లో కాదు అని నేను భావిస్తాను. అర్జున గారు అనుభవం గురించి ఒక విభాగం పెట్టి మరీ మాట్టాడారు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను అంతే) తలొంచుకుని తప్పులున్నాయేమో చూసి కనబడిన వాటిని సరిచేసి ప్రచురించాను. ఆ పేజీల్లో ఇప్పౌడు చూస్తే ఇంకా అనేక తప్పులు కనబడతాయి, సందేహం లేదు నాకు.
- అర్జున గారు ఎంతో అనుభవజ్ఞుడు, అందులో ఇసుమంతైనా సందేహం లేదు. కానీ ఆ అనుభవం రచన లోని భాష నాణ్యతలో కనబడిందా? పవన్ సంతోష్ గారు లేదని తేల్చి చెప్పారు. అర్జున గారు హుందాగా ఔనని అంగీకరించారు కూడా. ఇక ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక ఏంటి? ప్రాతిపదికే లేకుండా పోయింది. ఈ ప్రతిపాదన కింద పీట లాగేసారు పవన్ గారు.
- 30% నుండి ఎందుకు తగ్గించాలి -పరికరం నాణ్యత పెరిగిందా? మీరు పరీక్షార్థం ఓ ఇరవయ్యో, అరవయ్యో, మరిన్నో.. అనువాదాలేమైనా చేసి ఎంపిరికల్ డేటా ఏమైనా సేకరించారా? లాంటి కొన్ని మౌలికమైన ప్రశ్నలు ముక్కుసూటిగా అడిగారు, పవన్ గారు. సమాధానం లేదు.
- నాకు అర్థమైనంతలో ఇక్కడ స్పందించిన వాడుకరులంతా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. 30% అలాగే ఉండాలని కోరుకున్నారు. వీలైతే 50% దాకా పెంచాలని ఒకరు అన్నారు. అయితే అర్జున గారు వీటిని వర్గీకరించి, కొందరు అనుకూలురు, కొందరు ప్రతికూలురు అంటూ వర్గీకరించారు. అదెలా చేసారో అర్థం కాలేదు.
- ఈ థ్రెషోల్డ్ యొక్క ఆవశ్యకతను నొక్కిచెబుతూ ప్రణయ్ రాజ్ గారు ఒక్క క్లిక్కులో ప్రచురించేస్తారు అని రాస్తే దాన్ని వెర్బాటిం విమర్శిస్తూ అపోహ అంటూ చిన్నబుచ్చారు.
- యర్రా రామారావు గారిని "70% కంటే తక్కువ విధానం అమలైన తరువాత ఒక్క వ్యాసం అనువదించి లేక ఒకేరకమైన వ్యాసాలు అనువదించి సమస్యలు ఎదుర్కోలేదు అని విధానాన్ని సమర్ధించడం బలహీనమైన వాదన అని నా అభిప్రాయం." ఒక్క వ్యాసం అనువదించారంటూ అన్నారు. మరి అర్జున గారు చేసినదెన్ని? ఒక్ఖ అనువాదం చెయ్యని వ్యక్తి ప్రతిపాదన పెట్టొచ్చు, ఒకే ఒక్క అనువాదం చేసిన వ్యక్తి ఈ ప్రతిపాదన తప్పు అని చెప్పకూడదా!?
- ఈ 30% పరిమితి పెట్టాక నేను 37 అనువాదాలు ప్రచురించాను. వాటి సగటు మానవిక అనువాద స్థాయి: 36.24% వాటిలో నేను రెండు పేజీలను ప్రచురించేటపుడు 30% అవలేదని నన్ను హెచ్చరించింది అవి రాణాప్రతాప్, భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం. ఈ రెంటినీ ఆ స్థాయి దాటించి ప్రచురించాను. ఈ జాబితా లోని ప్రతీ ఒక్క పేజీని కూడా చదివితే మళ్ళీ అనేక దోషాలు నాకే కనిపిస్తాయి. ఇతర వాడుకరులకైతే ఇక చెప్పనే అక్కర్లేదు. వాడుకరుల సమాచారం కోసం ఆ పేజీల జాబితాను కింద ఇస్తున్నాను. 30% అనువాద పరిమితి ఉంది కాబట్టి వీటి నాణ్యత కాస్తంత మెరుగ్గానే ఉంటుంది. అదే 40% పరిమితి ఉండుంటే, లేదా ప్రభాకర్ గారు అడిగినట్టు 50% ఉండుంటే కచ్చితంగా - ఖచ్చితంగా - ఈ వ్యాసాల నాణ్యత మరింత మెరుగ్గా ఉండేది.
సం. | పేజీ తెలుగు పేరు, ఇంగ్లీషు పేరు | మానవిక అనువాదాల స్థాయి |
1 | · భార్యాభర్తల బంధం "Bharyabhartala Bandham : | 35.90% |
2 | · శుభప్రదం "Subapradam : | 39.40% |
3 | · శుభమస్తు (సినిమా) "Subhamastu: | 45.30% |
4 | · శుభవార్త (సినిమా) "Subhavartha : | 37.20% |
5 | · శృంగార రాముడు "Srungara Ramudu : | 30.10% |
6 | · మౌనం (సినిమా) "Mounam: | 34.20% |
7 | · మిఠాయి (2019 సినిమా) "Mithai (film): | 40.20% |
8 | · జి.వి.కె రెడ్డి "Gunupati Venkata Krishna Reddy: | 33.75% |
9 | · రాణాప్రతాప్ "Maharana Pratap: | 30.02% |
10 | · యాసర్ అరాఫత్ "Yasser Arafat : | 30.69% |
11 | · సాత్పురా పర్వత శ్రేణి "Satpura Range: | 33.07% |
12 | · వేబ్యాక్ మెషీన్ "Wayback Machine: | 32.19% |
13 | · బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ "Belt and Road Initiative: | 31.46% |
14 | · ప్రీవీ పర్సు "Privy Purse in India : | 39.05% |
15 | · జ్యోతిశ్చక్రం "Ecliptic : | 44.90% |
16 | · భారతీయ భాషల సర్వే "Linguistic Survey of India : | 30.28% |
17 | · క్రిప్స్ రాయబారం "Cripps Mission : | 35.10% |
18 | · విజయనగరం జమీందారీ "Vizianagaram estate : | 30.50% |
19 | · బనగానపల్లె సంస్థానం "Banganapalle State : | 32.50% |
20 | · సర్వే ఆఫ్ ఇండియా "Survey of India : | 30.50% |
21 | · సైన్య సహకార ఒప్పందం "Subsidiary alliance : | 35.79% |
22 | · ఆరావళీ పర్వత శ్రేణులు "Aravalli Range : | 31.30% |
23 | · పెద వేంకట రాయలు "Peda Venkata Raya : | 50.30% |
24 | · భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం "Indian National Centre for Ocean Information Services : | 30.04% |
25 | · భారతీయ భూగర్భ సర్వేక్షణ "Geological Survey of India : | 34.25% |
26 | · భారతదేశ ఏకీకరణ "Political integration of India : | 32.03% |
27 | · రాష్ట్రకూటులు "Rashtrakuta dynasty : | 34.90% |
28 | · చమురు ఒలకడం "Oil spill : | 41.50% |
29 | · గ్రీన్‌హౌస్ వాయువు "Greenhouse gas : | 37.38% |
30 | · బ్లాక్ హోల్ "Black hole : | 46% |
31 | · గ్రీన్‌హౌస్ ప్రభావం "Greenhouse effect : | 46.50% |
32 | · పారిశ్రామిక విప్లవం "Industrial Revolution : | 35.70% |
33 | · భూ సర్వే "Surveying : | 35% |
34 | · శబ్ద కాలుష్యం "Noise pollution : | 36.90% |
35 | · జల వనరులు "Water resources : | 41% |
36 | · జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ "James Webb Space Telescope : | 39.67% |
37 | · ఓజోన్ క్���ీణత "Ozone depletion : | 37.71% |
సగటు | 36.24% |
- ఇకపోతే అర్జున గారు ఇచ్చిన గణాంకాల గురించి ఎంత తక్కువ మాట్టాడుకుంటే అంత మంచిది. అయితే ఈ ప్రతిపాదనకు మద్దతుగా ఆయన చూపించిన గణాంకాల డొల్లతనాన్ని మచ్చుకు ఒక్కటి చూపిస్తాను. పైన అనువాదకులు, #అనువాద వ్యాసాలు - గణాంకాల విశ్లేషణ అనే విభాగంలో - 30% పరిమితికి ముందు పురోగతిలో ఉన్న అనువాదాల సంఖ్య 67 ఉండేది. ఆ తరువాత అది 47 కు తగ్గిపోయింది, ఇది వాడుకరుల అసక్తి లేమికి సూచన అన్నారు. ఆ సంఖ్య ఇప్పుడు 716 ఉంది. అంటే ఆయన గణాంక విశ్లేషణ ప్రకారం ప్రజల ఆసక్తి 11 రెట్లు పెరిగినట్టే. (అసలు సంగతేంటంటే మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో విస్తరణల తుపానొచ్చింది. కొందరు వాడుకరులు అనువాద పరికరం విరివిగా వాడి విస్తరణలు చేసారు. అందులో నేనూ ఒకణ్ణి. నేను ఇంకా అనేక వందల పేజీలను, విస్తరణ అయ్యాక, అనువాద పరికరం నుండి తీసేసాను. లేకపోతే ఈ సంఖ్య వీజీగా వెయ్యి దాటి ఉండేది.)
- పరికరం లోని మానవిక అనువాదాల పరిమితికి నాణ్యత అనులోమానుపాతంలో ఉంటుంది. వాడుకరుల అనుభవానికి నాణ్యత అనులోమానుపాతంలో ఉంటుందని అనుకోవడం పొరపాటౌతుంది, భ్రమౌతుంది. అర్జున రావు గారే అందుకు ఉదాహరణ అని పవన్ గారు నిరూపించారు కూడా. అర్జున గారితో పాటు నేనూ ఒక ఉదాహరణే నని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. (నా అనుభవమ్మీద, నా భాషా పటిమ మీద నాకు అపోహలేమీ లేవు. అందుకే ఆ పరిమితి పెంచాలని కోరుకున్నాను, రచ్చబండలో చర్చించాను, అంతకు మూందు నేను చేసిన అనువాదాలను పరిశీలించాను. పరిమితిని పెంచమని చెప్పాను. ఇదంతా బహిరంగంగా రచ్చబండ లోనే జరిగింది. ఈ ప్రాజెక్టు పేజీని పెట్టింది కూడా అందుకే. ఇక్కడా చర్చ జరిగింది. అర్జున గారు అప్పుడు ఈ రెండు చోట్లా చర్చల్లో పాల్గొనలేదు. ఐదే నెలల్లో మళ్ళీ ఆ మార్పును రద్దు చెయ్యాలని కొత్త చర్చకు మాత్రం తెరతీసారు!)
- చివరిగా: అనువాద పరికరం పదునైన చాకు లాంటిది. కూరగాయలు కోసుకోవచ్చు, వేలూ కోసుకోవచ్చు. వేలు తెగిందని, చాకును అరగదీసి మొండిదాన్ని చెయ్యాలనుకోవడం వివేకవంతమైన పని కాదు. __చదువరి (చర్చ • రచనలు) 10:15, 2 సెప్టెంబరు 2020 (UTC)
ఇంగ్లీషు నుండి తెలుగు అనువాదంలో కొన్ని ముఖ్యాంశాలు
[మార్చు]ఇంగ్లీషు నుండి తెలుగు లోకి అనువాదం చేసేటపుడు ఈ రెండు భాషల స్వరూపం లోను, వాక్య నిర్మాణం లోనూ ఉండే అంతరాల వల్ల యాంత్రికానువాదం కృతకంగా ఉంటుంది. ఈ విషయంలో పరికరం ఇంకా పరిణతి సాధించలేదు. అనేక సవరణలు చెయ్యాల్సి ఉంటుంది. వాటిని చేసాకే ప్రచురించాలి. లేకపోతే భాష కృతకంగా, అపరిపక్వంగా ఉంటుంది. అ సవరణల్లో కొన్ని పరిశీలించండి:
- కర్మణి వాక్యాలు (పాసివ్ వాయిస్): "కోర్టు అతడికి పదేళ్ళు జైలు శిక్ష విధించింది" అని రాయడం తెలుగుకు సహజం. "అతడికి కోర్టు చేత పదేళ్ళ జైలుశిక్ష విధించబడింది" అని రాస్తే అది సహజం కాదు. పరికరం లాగే అనువదిస్తుంది.
- ఇంగ్లీషులో and ఉన్నచోటల్లా "మరియు" రాసేసుకుంటూ పోతుంది, పరికరం.
- ఇంగ్లీషులో of అని అంటే ఇది "యొక్క" అని రాసేస్తుంది. "అతడి చొక్కా రంగు తెలుపు" అనేది తెలుగుకు సహజం. "అతడి యొక్క చొక్కా రంగు తెలుపు" అని రాస్తుందది. అది మన భాషకు సహజం కాదు. వాటిని చూస్తూ ప్రచురించుకుంటూ పోతామా?
- ఇంగ్లీషులో ఉండే సంక్లిష్ట/సంశ్లిష్ట వాక్యాలు అనువాదం లోకి వచ్చేటప్పటికి మరీ అతుకుల బొంత లాగా ఉంటది.
- ఢి, ఝా, ఔ లాంటి కొన్ని అక్షరాలుండే పదాలను అనువాదాలు మరీ ఘోరంగా, ఇంగ్లీషు తెలుగు కలిసిపోయి గందరగోళంగా ఉంటది.
- మరొక్క సంగతి - మూలంలోని ఇంగ్లీషు భాష దోషాల్లేకుండా సరిగ్గా ఉంటే పరిస్థితి పైన చెప్పినట్లు ఉంటది. ఒకవేళ మూలం లోని ఇంగ్లీషు దోష భూయిష్టంగా ఉంటే (ఎన్వికీ లోని తెలుగు సినిమాల వ్యాసాల్లో ఇంగ్లీషు బాగుండదు) దాన్నుంచి వచ్చే అనువాదం మరీ భయంకరంగా ఉంటుంది.
- దీన్ని తిరిగి 15 శాతానికో 10 కో తీసుకుపోతే, నాణ్యత ఆ మేరకు పడిపోవడం తథ్యం. ఆ తప్పులను సవరించుకోవడంలో బోలెడంత వికీ సమయం పడుతుంది. ఆ సవరణలు చేసిన/చేస్తున్న వాళ్ళకు తెలుస్తుంది ఆ నెప్పేంటో. సవరణలు చెయ్యని వాళ్లకు / భాష నాణ్యత పట్ల పెద్దగా పట్టింపు లేనివాళ్లకూ ఆ నెప్పి తెలవదేమో.. నాకు తెలవదు. __చదువరి (చర్చ • రచనలు) 14:50, 2 సెప్టెంబరు 2020 (UTC)
పరిమితి పెంచే ముందు ఏం జరిగింది?
[మార్చు]15% నుండి 30% కి పెంచే ముందు, ఈ పరికరం డెవలపరుతో జరిగిన చర్చను చూసారా? మన రచ్చబండలోనే జరిగింది. నేనొక్కణ్ణే ఆ చర్చలో పాల్గొన్నాను. అర్జున గారు ఆ చర్చలో చేరలేదు. ఎంచేతనో తెలీదు. ఆ చర్చను చదవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఇంగ్లీషులో జరిగిన ఆ చర్చ గురించి టూకీగా చెబుతాను
- పరికరంలో ఉన్న సమస్యలు ఆయనకు చెప్పాను. మనకు ఏం కావాలో కూడా చెప్పాను.
- అలాక్కాదు ఇలా చెయ్యవచ్చు అంటూ 15% నుండి పెంచుకునే సూచన ఆయనే చేసాడు. కానీ చేసే ముందు మీ పాత అనువాదాలను పరిశీలించమని చెప్పాడు.
- నేను అంతకు రెణ్ణెల్ల ముందు అనువదించిన దాదాపు 20 వ్యాసాల గణాంకాలను పరిశీలించాను. ఆ వ్యాసాల పేర్లు కూడా రాసాను ఆ చర్చలో. వాటిలో 55% వరకూ మానవిక అనువాదాలున్నాయి.
- ఈ విషయమే ఆయనకు చెప్పి, దీని గురించి మా సముదాయంలో చర్చించి ఆ నిర్ణయం మీకు చెబుతాను అని ఆయనకు చెప్పాను.
- అప్పుడు ఈ ప్రాజెక్టు పేజీ పెట్టి ఇక్కడ చర్చకు పెట్టాను. చర్చలో విశ్వనాధ్ గారొక్కరే పాల్గొన్నారు. అర్జున గారు ఇప్పుడూ పాల్గొన లేదు. ఎంచేతో తెలీదు.
- ఒక వారం తరువాత మా ఇద్దరి నిర్ణయాన్ని ఆ డెవలపరుకు చెబితే ఆయన 30% తో మొదలెడదాం అని ఆ విధంగా అమలు చేసాడు.
ఈ చర్చ 2020 ఫిబ్రవరిలో జరిగింది. __చదువరి (చర్చ • రచనలు) 14:50, 2 సెప్టెంబరు 2020 (UTC)
- దీని వెనుక ఇంత చరిత్ర ఉందని చదువరి గారి స్పందన తరువాత పూర్తిగా అవగాహన అయ్యింది.పూర్తిగా అర్థం అయిన తరువాత ప్రభాకర్ గౌడ్ గారు అన్నట్లు యాంత్రిక అనువాదం స్థాయి 50 శాతానికి తగ్గించినా పర్వాలేదనిపిస్తుంది.తెవికీ నాణ్యత మెరుగవుతుంది.భాష నాణ్యత పట్ల పట్టింపులేని వాళ్లకు, అర్థం అయితే చాలనే అభిప్రాయం ఉంటుంది.అది తప్పు.--యర్రా రామారావు (చర్చ) 16:24, 2 సెప్టెంబరు 2020 (UTC)
అర్జున గారూ మీరు పెట్టిన "ప్రతిపాదన 4" అనే విభాగాన్ని తీసేసాను. ఎందుకంటే నేను కొత్త ప్రతిపాదన ఏదీ చెయ్యలేదు. అలాంటి అపార్థం కలిగించే అవకాశం ఉన్న నా స్పందన లోని భాగాన్ని సవరించాను. మీరు పెట్టిన నా ప్రతిపాదన భాగాన్ని తీసేసాను. గమనించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 00:14, 3 సెప్టెంబరు 2020 (UTC)