Jump to content

తిన్‌సుకియా జిల్లా

వికీపీడియా నుండి
Tinsukia జిల్లా
তিনিচুকীয়া জিলা
Assam పటంలో Tinsukia జిల్లా స్థానం
Assam పటంలో Tinsukia జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంAssam
ముఖ్య పట్టణంTinsukia
మండలాలు1. Tinsukia, 2. Sadiya, 3. Margherita, 4. Doomdooma
Government
 • లోకసభ నియోజకవర్గాలు1.Dibrugarh (shared with Dibrugarh district), 2.Lakhimpur (shared with Lakhimpur and Dhemaji districts)
 • శాసనసభ నియోజకవర్గాలు1. Tinsukia, 2. Digboi, 3. Doomdooma, 4. Margherita, 5. Sadiya
విస్తీర్ణం
 • మొత్తం3,790 కి.మీ2 (1,460 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం13,16,948
 • జనసాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.92%
 • లింగ నిష్పత్తి948 female per 1000 male
ప్రధాన రహదార్లుNH 37, NH 38, NH 153
Websiteఅధికారిక జాలస్థలి

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో తిన్‌సుకియా జిల్లా (అస్సామీ:তিনিচুকীয়া জিলা) ఒకటి. తిన్‌సుకియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3790చ.కి.మీ.[1] ఇది దాదాపు దక్షిణ జార్జియా దేశవైశాల్యానికి సమం.[2]

పట్టణాలు

[మార్చు]
  • టిన్సుకియా
  • మాకుం
  • దిగ్బొయికి
  • మార్గెరిటీ
  • జగున్
  • డూండుమా
  • కకపథర్
  • సదియా

చరిత్ర

[మార్చు]

తిన్‌ సుకియా పురాతన నామం బెంగ్మరా. ఇది ముత్తక్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉంటుంది. సర్బనానందా సింఘా గుయిజాన్ నదీతీరంలో రంగగరా వద్ద రాజధానిని స్థాపించాడు. క్రీ.పూ 1791లో సర్బనానందా సింఘా తన రాజధానిని బెంగ్మరాకు మార్చబడింది. సర్బనానందా సింఘా తన మంత్రి గోపీనాథ్ బర్బరుహ్ సాయంతో బెంగ్మరా నగరాన్ని స్థాపించాడు. ప్రస్తుత తిన్‌ సుకియా కేంద్రస్థానంలో స్థాపించబడింది. 1989 అక్టోబరు 1 న తిన్‌ సుకియా అస్సాం రాష్ట్ర 23 వ జిల్లాగా ప్రకటించబడింది. దిబ్రూఘర్ జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి తిన్‌ సుకియా జిల్లా ఏర్పాటు చేయబడింది.[3] సర్బనానందా సింఘా కాలంలో చౌల్‌దువా పుఖురి, కడమొని పుఖురి, డా ధరుయా పుఖురి, బాటర్ పుల్హురి, లోగొని పుల్హురి, నా-పుల్హురి, కుంభి పుఖురి, రుపాహి పుఖురి మొదలైన సరోవరాలను నిర్మించారు. సరోవరాలే కాక సర్బనానందా సింఘా ముత్తక్ సామ్రాజ్యం అంతటా రహదార్లను నిర్మించజేసాడు: గోధా-బర్బురియా రోడ్, రంగ్గరా రోడ్డు, రింగ్ రోడ్డు మొదలైన ప్రధాన రోడ్లు నిర్మించబడ్డాయి. 1882లో బ్రిటిష్ ప్రభుత్వం సదియా, చబుయాలో మొదటి సారిగా టీతోటల పెంకం ప్రారంభించారు. చాయ్‌బుయా అనే పేరు టీ ప్లాంటేషన్ నుండి ఏర్పడింది. 1882లో దిబ్రు-సదియా రైల్వే స్టేషను ఏర్పాటు చేయబడింది. ఇది ఈశాన్య భారత ఆర్థికాభివృద్ధికి అధికంగా తోడ్పడుతుంది.

ఆర్ధికం

[మార్చు]

తిన్‌ సుకియా అస్సాం రాష్ట్రంలో పారిశ్రామిక నగరంగా గుర్తింపు పొందింది. జిల్లాలోని దిగ్బోయిలో పురాతనమైన ఆయిల్ రిఫైనరీ ఉంది. లెడో ఓపెన్ కాస్ట్ కోయల్ మైనిగ్. అస్సాం రాష్ట్రంలోని ప్రధాన వాణిజ్యకేంద్రాలలో తిన్‌సుకియా ఒకటి. జిల్లాలో హిందుస్థాన్ యూనిలివర్ సంబంధిత కాస్మిక్ ప్లాంట్ ఉంది.

ప్రయాణవసతులు

[మార్చు]

తిన్‌సుకియా వాయు, రహదారి, రైలు మార్గాలద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. అస్సాం రాష్ట్ర రాజధాని దిస్పూర్‌కు తిన్‌సుకియా చక్కగా అనుసంధానించబడి ఉంది. తిన్‌సుకియాకు 40కి.మీ దూరంలో ఉన్న సమీపంలోని విమానాశ్రయం మొహంబరి, దిబ్రూఘర్‌లలో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, కొలకత్తాలకు దినసరి విమానసర్వీసులు లభిస్తున్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,316,948,[4]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 371వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 347[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.51%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 948:1000,[4]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 70.92%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
హిందువులు 1,029,142,
క్రైస్తవులు 62,403
ముస్లిములు 40,000 (3.47%).
స్థానికులు అహూంస్, టీ గిరిజనులు, మొరన్, ముత్తక్, సింగ్ఫొ,
వలస ప్రజలు నేపాలి,బిహారీ,బెంగాలీ.
గిరిజనులు తాయ్ ఫకె, ఖామ్యంగ్, నొక్టే

సంస్కృతి

[మార్చు]

పర్యాటకం

[మార్చు]
Tilinga Mondir at Tinisukia

" డిబ్రు సైఖొవ నేషనల్ పార్క్ " పక్షులకు ప్రత్యేకించబడుతుంది. ఇందులో అంతరించి పోతున్న వైవిధ్యమైన 350 జాతుల జంతువులు పరిరక్షంచబడుతున్నాయి. అత్యంత అరుదైన ప���ర్తిగా తెల్లని అడవి బాతులు, ఇతర వలస పక్షులు ఉన్నాయి. అడవి - గుర్రాలు (ఫెరల్ గుర్రాలు) ఉన్నాయి. " దిహింగ్ పత్కై విల్డ్‌లైఫ్ శాక్చ్యురీ" అస్సాంలోని దిగువభూములలోని సతతహరితారణ్యంగా గుర్తించబడుతుంది. ఈ అభయారణ్యం 300 చ.కి.మీ వైశాల్యంలో ఉంది. ఇందులో హూలాక్గిబ్బన్, పిగ్- టైల్డ్ మచక్యూ, స్లో లోరిస్, పులి, ఏనుగు, క్లౌడెడ్ లెపార్డ్, హార్న్‌బిల్స్ వంటి పక్షులు ఉన్నాయి. సమీపకాలంలో కేరళా వారి ఆయుర్వేద కేంద్రం ప్రారంభించబడింది. బరూహ్ లాడ్జ్‌లో ఒక నేచుర్ కేర్ సెంటర్ ప్రారంభించబడింది. బరూహ్ మార్కెట్ వెనుక జకుజ్జి బాత్ (హైడ్రొథెరఫి) ఆరంభించబడింది. అక్కుప్రెషర్ చికిత్స, ఫిజియోథెరఫీ చికిత్స కూడా లభిస్తుంది. " డిగ్‌బోయీ "లో 2 ఆధునిక ప్రపంచ అద్భుతాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు సగర్వంగా చెప్పుకున్నారు. ఇక్కడి పురాతన రిఫైనరీలో ఇప్పటికీ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగుడుదిగుడుగా పచ్చని తివాసి పరచినట్లున్న టీ తోటలు. డిగ్‌బోయీలో ఇప్పటికీ కాలనీకాల వాతావరణం నెలకొని ఉంది. విహంగవీక్షణంగా ఈ దృశ్యాలను చూసేసమయంలో మంచు కప్పుకున్న హిమాలయశిఖరాలను దర్శించవచ్చు. " వార్ సెమెంట్రీ " : ఇది డిగ్‌బోయిలో నాటకీయంగా జరిగిన చారిత్రక సంఘటనకు నిదర్శనంగా ఉంది.

  • మార్ఘరెటా : ఇది టీ గార్డెన్‌కు కేంద్రంగా ఉంది. ప్లైవుడు ఫ్యాక్టరీలు, కోయల్ మైన్లు, పలు పిక్నిక్ స్పాట్లు, ఇసుకతో కూడిన నదీతీరాలు ఉన్నాయి.
  • క్రీడలు : 18 - స్కాట్‌లాండ్ వారు రూపొందించిన హోల్ గోల్ఫ్ కోర్స్, ఉంది. డిగ్బోయిలో 8 గోల్ఫ్ మైదానాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1999లో తిన్‌సుకియా జిల్లాలో 340 చ.కిమీ వైశాల్యంలో " డిబ్రూ- సైల్ఖొవ పార్క్ " ఏర్పాటు చేయబడింది.[7] ఇది ఈ నేషనల్ పార్క్‌ను దిబ్రూ జిల్లాతో పంచుకుంటుంది.

మూలాలు

[మార్చు]
  1. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. South Georgia 3,718km2
  3. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470
  7. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూస:అస్సాంలోని జిల్లాలు