Jump to content

శివుడు

వికీపీడియా నుండి
08:46, 14 ఆగస్టు 2024 నాటి కూర్పు. రచయిత: రవిచంద్ర (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)

శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు.నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు.[1]

శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు రూపంగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు.[2] శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు[3]. వినాయకుడు, కుమార స్వామి, అశోక సుందరి, జ్యోతి, మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

శివ శబ్ద అర్థాలు

[మార్చు]

శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు (ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు), రూపాతీతుడు.అందుకే శివుని ఈ విధంగా స్తోత్రం చేశ్తారు.

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణమ్
వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్
కంచి కైలాసనాథ ఆలయ శివలింగం
నటరాజ నృత్య భంగిమలో పరమ శివుడు

ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధం చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.

పుట్టుక విశేషాలు, కథనాలు

[మార్చు]

శివుడు జననమరణాలుకు అతీతుడు.కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే.విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు.పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.అందుకే పరమశివుడు అంటారు.

మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉంది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రం ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉంది.

శివుని రూపం

[మార్చు]

పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.

రెండు స్వరూపాలు

[మార్చు]

శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. ఆవి రుద్రస్వరూపంగా ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జాగ్రత్తగా పరిశిలిస్తే మహదేవుణ్ణి రెండు రుపాలలో గమనిస్తాము.

పేర్లు, అవతారాలు

[మార్చు]

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

గ్రంథాలు, పురాణాలు

[మార్చు]
మార్కండేయుని రక్షించే శివుడు, రాజా రవి వర్మ చిత్రం

ప్రముఖ శివ దేవాలయాలు

[మార్చు]

........123 శివుని లింగరూపంలోను, మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాలవల్ల తెలుస్తుంది. శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను, ఆశీనమూర్తిగానూ ఉంటాడు. కానీ శయనరూపంలో శివుని ప్రతిమలు లేవు. మొత్తం 45 రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగరూపంలోనే ప్రతిష్ఠింపబడుచున్నాడు. శివలింగాలు నాలుగు రకాలు. అవి దైవికాలు, ఆర్షకాలు, బాణలింగాలు, మానుషాలు.

  1. రామనాథస్వామి లింగం - రామేశ్వరం
  2. శ్రీశైల క్షేత్రం (మల్లికార్జున లింగం) - శ్రీశైలం
  3. భీమశంకర లింగం - భీమా శంకరం
  4. ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం - ఎల్లోరా
  5. త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం, త్రయంబకేశ్వరాలయం, నాసిక్
  6. సోమనాథ లింగం - సోమనాథ్
  7. నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
  8. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం
  9. మహాకాళ లింగం - ఉజ్జయని
  10. వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (డియోఘర్)
  11. విశ్వేశ్వర లింగం - వారణాశి
  12. కేదారేశ్వర - కేదారనాథ్
  13. శ్రీ రాజ రాజేశ్వర స్వామి - వేములవాడ

ప్రముఖ దేవాలయాలు siva

[మార్చు]

పండగలు

[మార్చు]

భాస్కర క్షేత్రాలు

[మార్చు]

భాస్కర క్షేత్రాలు పది. అవి-

  1. కాశి లేదా వారణాసి
  2. పుష్పగిరి
  3. కంచి
  4. నివృత్తి (శృంగేరి)
  5. అలంపురి
  6. శ్రీశైల క్షేత్రం
  7. శ్రీ విరూపాక్ష దేవాలయం (హంపి)
  8. సేతు (రామేశ్వరం)
  9. కేదార్‌నాథ్
  10. గోకర్ణం.
  11. ఖమ్మం
  12. అమరావతి

పంచ కేదారాలు

[మార్చు]

కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కా���ీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణంలో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు. అవి వరసగా కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. కాఠ్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.

కేదారినాధ్

[మార్చు]

ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాండవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. ఆదిశంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కార్తీక మాసంలో వచ్చే యమద్వివిధియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

  • సోనప్రయాగకి దగ్గరలోని ఫటా అనే గ్రామం నుంచి కేదార్నాథ్ ఆలయం సమీప ప్రదేశానికి హెలీకాప్టర్ సదుపాయం అందుబాటులో ఉంది.

తుంగనాధ్

[మార్చు]

పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

రుద్రనాధ్

[మార్చు]

పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీనది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనదిగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

మధ్య మహేశ్వర్

[మార్చు]

పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

కల్పనాధ్

[మార్చు]

పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భక్తులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.

ప్రార్థనలు, స్తోత్రాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. ముప్పాళ్ల హనుమంతరావు (1997) పేజీ.615
  2. Tattwananda, p. 45.
  3. Flood (1996), p. 17.

బయటి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  • శ్రీ స్కాందే-సనత్కుమార చరితాయాం-గోకర్ణఖండే- భాస్కర క్షేత్ర నిరూపితం ( శ్రీశైలం 6.వ. భాస్కర క్షేత్రమని నిరూపించ బడినది / సిరిపురపు మల్లికార్జునశర్మ- శ్రీశైలంప్రాజెక్టు. )


"https://te.wikipedia.org/w/index.php?title=శివుడు&oldid=4298238" నుండి వెలికితీశారు