బోరాన్ ట్రైఫ్లోరైడ్
| |||
పేర్లు | |||
---|---|---|---|
ఇతర పేర్లు
Boron fluoride, Trifluoroborane
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [7637-07-2] | ||
పబ్ కెమ్ | 6356 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 231-569-5 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:33093 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | ED2275000 | ||
SMILES | FB(F)F | ||
ధర్మములు | |||
BF3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 67.82 g/mol (anhydrous) 103.837 g/mol (dihydrate) | ||
స్వరూపం | colorless gas (anhydrous) colorless liquid (dihydrate) | ||
సాంద్రత | 0.00276 g/cm3 (anhydrous gas) 1.64 g/cm3 (dihydrate) | ||
ద్రవీభవన స్థానం | −126.8 °C (−196.2 °F; 146.3 K) | ||
బాష్పీభవన స్థానం | −100.3 °C (−148.5 °F; 172.8 K) | ||
exothermic decomposition [1] (anhydrous) very soluble (dihydrate) | |||
ద్రావణీయత | soluble in benzene, toluene, hexane, chloroform and methylene chloride | ||
బాష్ప పీడనం | >50 atm (20°C) | ||
ద్విధృవ చలనం
|
0 D | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-1137 kJ/mol | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
254.3 J/mol K | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 50.46 J/mol K | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | ICSC | ||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H330, H314 | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R14, R26, R35 | ||
S-పదబంధాలు | (S1/2), S9, S26, S28, S36/37/39, S45 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LC50 (median concentration)
|
1227 ppm (mouse, 2 hr) 39 ppm (guinea pig, 4 hr) 418 ppm (rat, 4 hr)[2] | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible)
|
C 1 ppm (3 mg/m3) | ||
REL (Recommended)
|
C 1 ppm (3 mg/m3) | ||
IDLH (Immediate danger)
|
25 ppm | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు
|
Aluminium fluoride Gallium(III) fluoride Indium(III) fluoride Thallium(III) fluoride | ||
సంబంధిత సమ్మేళనాలు
|
Boron monofluoride | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనునది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్ధం.బోరాన్, ఫ్లోరిన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన వాయు సమ్మెళన పదార్ధం.ఇది రంగులేని విష పూరిత వాయువు[4].దీని రసాయన ఫార్ములా BF3.తడివున్న గాలిలోఈ సంయోగ పదార్ధం తెల్లని పొగలను వెలువరించును.ఇది ప్రయోజనకరమైన లేవిస్ ఆమ్లం(Lewis acid).ఇతర బోరాన్ సంయోగ పదార్థాల ఉత్పత్తిలో బోరాన్ ట్రైఫ్లోరైడ్‌కు కీలకమైన పాత్ర కలదు.
ఆవిష్కారం
[మార్చు]కి.శ.1808 లో జోసెప్ లోవిస్ లుస్సాక్, లోవిస్ జాక్సిష్ థెనార్డ్(Joseph Louis Gay-Lussac, Louis Jacques Thénard,)కనుగొన్నారు.హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుటకై వారు కాల్సియం ఫ్లోరైడ్ ను అధిక ఉష్ణోగ్రత వద్దగాజు స్థితికి కరిగించినపుడు(vitrified)బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఏర్పడినది.
అణు నిర్మాణం
[మార్చు]బోరాన్ ట్రైఫ్లోరైడ్ అణువు త్రికోణాకారపు సమతులనిర్మాణం కల్గివున్నది
సంశ్లేషణ
[మార్చు]హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం(HF) తో బోరాన్ ఆక్సైడ్ రసాయనచర్య వలన బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఏర్పడును.
సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఫ్లోరైట్((CaF2)రసాయన చర్య వలన కుడా హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఉత్పత్తి అగును. సంవత్సరానికి అందాజుగా 2300-4500టన్నుల బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉత్పత్తి చేయబడు చున్నది. ప్రయోగ శాలల్లో,పరిశోధన శాలల్లో డైజోనియం(diazonium)లవణాలను ఉష్ణవియోగం చెందించడం ద్వారా బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉత్పత్తి చేస్తారు.
ప్రత్నామ్యాయంగా సోడియం టెట్రాఫ్లోరోబోరేట్,బోరాన్ ట్రైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లాల నుండి సంశ్లేషణ చేస్తారు.
- 6 NaBF4 + B2O3 + 6 H2SO4 → 8 BF3 + 6 NaHSO4 + 3 H2O
భౌతిక ధర్మాలు
[మార్చు]నిర్జల/అనార్ద్ర బోరాన్ ట్రైఫ్లోరైడ్ బాష్పీభవన స్థానం/ఉష్ణోగ్రత −100.3 C., క్లిష్టఉష్ణోగ్రత −12.3 C.దీనిని అందువలన ఈ రెండు ఉష్ణోగ్రతల మధ్య శీతలికరణ ద్రవస్థితిలో నిల్వ ఉంచవలయును.అలాగే దీనిని ఎక్కడికైనా రవాణా చేయునపుడు,వాహనాన్ని దీని యొక్క అంతర్గతవత్తిడిని నిలువరించు విధంగా రూపకల్పన చేయవలెను.ఎందుకనగా ఈ రసాయనాన్ని వుంచిన శీతలీకరణపరికరం విపలమైన,ఈ రసాయన పదార్ధం వత్తిడి క్లిష్టవత్తిడి 49.85బార్(4.985 MPa)కు చేరును.బోరాన్ ఫ్లోరైడ్ పదార్థాలను క్షయించు గుణం(పదార్థాలను కరిగించి,తిను గుణం)కల్గి ఉన్నది.
తేమసమక్షంలో ఇది ఉక్కు,తుప్పుపట్టని ఉక్కు/స్టెయిన్‌లెస్‌స్టీల్ లోహాలను తినివేయును.ఇది పాలి అమైడులతో,పాలి టెట్రాఫ్లోరోఇథైలిన్, polyvinylidene fluorideలతో రసాయన చర్య జరుపును
అణుభారం
[మార్చు]బోరాన్ ట్రైఫ్లోరైడ్ రసాయన పదార్థం అణుభారం :67.81 గ్రాములు/మోల్[5]
ద్రవీభవన ఉష్ణోగ్రత
[మార్చు]బోరాన్ ట్రైఫ్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం:-196.1°F(-127°C)[4]
బాష్పీభవన ఉష్ణోగ్రత
[మార్చు]బోరాన్ ట్రైఫ��లోరైడ్ యొక్క మరుగు/బాష్పీభవన స్థానం:-148°F(−100.3°C) [4]
సాంద్రత
[మార్చు]బోరాన్ ట్రైఫ్లోరైడ్ యొక్క వాయు స్థితి సాంద్రత:3.07666 గ్రాములు/లీటరు (ప్రామాణీక వత్తిడి,ఉష్ణోగ్రతలవద్ద).ద్రవస్థితిలో సాంద్రత1.57 గ్రాములు/సెం.మీ3(100.4°C)[4]
రసాయన చర్యలు
[మార్చు]అల్యూమినియం,గాలియం ట్రై హైలైడుల కాకుండా బోరాన్ ట్రైహాలైడులు అన్ని మోనోమెరిక్(monomer)పదార్థాలు.ఇవి వేగంగా హలైడు మార్పిడి చర్యను జరుపును.
- BF3 + BCl3 → BF2Cl + BCl2F
ఈ పరస్పర హాలైడ్ మార్పిడి చర్య కారణంగా ఈమిశ్రమ హలైడులను శుద్ధరూపంలో పొందలేము. బోరాన్ ట్రై ఫ్లోరైడ్ విభిన్నమైన లేవిస్ ఆమ్లం. లేవిస్ క్షరాలతో చర్యల వలన సంక్లిష్ట సంయోగ పదార్థాలైన adducts ను ఏర్పరచును.
- CsF + BF3 → CsBF4
- O(C2H5)2 + BF3 → BF3O(C2H5)2
జలవిశ్లేషణ
[మార్చు]బోరాన్ ట్రైఫ్లోరైడ్ నీటితో జరిపే జలవిశ్లేషణ చర్య(Hydrolysis)వలన బోరిక్ ఆమ్లం, ఫ్లోరోబోరిక్ ఆమ్లం ఏర్పడును.ఈ చర్యలో మొదట అక్వో అడక్ట్(aquo adduct) అయిన H2O-BF3 ఏర్పడును.ఇది HF ను కోల్పోయి బోరాన్ ట్రై ఫ్లోరైడ్ తో ఫ్లోరోబోరిక్ ఆమ్లాన్ని ఏర్పరచును.
- 4 BF3 + 3 H2O → 3 HBF4 + "B(OH)3"
Adduct అనగా రెండు సంయోగ పదార్థాల మధ్య అదనపు సంకలన చర్య వలన ఏర్పడిన రసాయన పదార్ధం
వినియోగం
[మార్చు]సేంద్రియ రసాయన శాస్త్రంలో బోరాన్ ట్రైఫ్లోరైడ్ వినియోగం
[మార్చు]సేంద్రియ సంశ్లేషణలో బోరాన్ ట్రైఫ్లోరైడ్ ను రసాయన కారకం,ముఖ్యంగా లీవిస్ ఆమ్లం(Lewis acid)గా ఉపయోగిస్తారు. లీవిస్ ఆమ్లం అనగా రసాయనపదార్థం నుండి(దాత)రింగు/జంట/జత ఎలక్ట్రానులను స్వికరించునది.
ఇతర ఉపయోగాలు
[మార్చు]ఇవికూడా చూదండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ http://www.nap.edu/openbook.php?record_id=4911&page=266
- ↑ "Boron trifluoride". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
- ↑ http://www.newenv.com/resources/nfpa_chemicals
- ↑ 4.0 4.1 4.2 4.3 "BORON TRIFLUORIDE". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2017-04-27.
- ↑ "Boron trifluoride". sigmaaldrich.com. Retrieved 2017-04-27.