Jump to content

ఫ్లోరోబోరిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
ఫ్లోరోబోరిక్ ఆమ్లం
Canonical, skeletal formula of fluoroboric acid
పేర్లు
Preferred IUPAC name
టెట్రా ఫ్లోరోబోరిక్ ఆమ్లం
ఇతర పేర్లు
టెట్రా ఫ్లోరోబోరిక్ ఆమ్లం, oxonium tetrafluoroboranuide, oxonium tetrafluoridoborate(1-)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య
పబ్ కెమ్ 28118
యూరోపియన్ కమిషన్ సంఖ్య 240-898-3
వైద్య విషయ శీర్షిక Fluoroboric+acid
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:38902
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య ED2685000
SMILES F[B](F)(F)[FH]
జి.మెలిన్ సూచిక 21702
ధర్మములు
BF4H
మోలార్ ద్రవ్యరాశి 87.81 g·mol−1
స్వరూపం రంగులేని ద్రవం
ద్రవీభవన స్థానం −90 °C (−130 °F; 183 K)
బాష్పీభవన స్థానం 130 °C (266 °F; 403 K)
ఆమ్లత్వం (pKa) ~1.8 (MeCN solution)[1]
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము External MSDS
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R34
S-పదబంధాలు (S1/2), S26, మూస:S27, S45
సంబంధిత సమ్మేళనాలు
సంబంధిత సమ్మేళనాలు
Hydrogen fluoride

Triflic acid

Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఫ్లోరోబోరిక్ ఆమ్లంఒక ఆకర్బన రసాయన సంయోగ పదార్ధం.ఇది బలమైన ఆమ్లం.ఇది ద్రవస్థితిలో వున్న ఆమ్లం. దీనిని టెట్రాఫ్లోరోబోరిక్ ఆమ్లం అనికూడా అంటారు. ఈ ఆమ్లం యొక్క రసాయన ఫార్ములా H3OBF4.ఫ్లోరోబోరిక్ ఆమ్లాన్ని ఇతర ఫ్లోరోబోరేట్లవణాలను ఉత్పత్తి చేయు పూర్వగామిగా వాడుటకై ఉత్పత్తి చేస్తారు.ఫ్లోరోబోరిక్ ఆమ్లం తినివేయు/క్షయికరణ గుణం కల్గిన ఆమ్లం.ఇది చర్మం మీద తన ప్రభావాన్ని కనపర్చుతుంది.ఈ ఆమ్లం వాణిజ్యపరంగా నీటిలో కాని లేదా డైఇథైల్ ఇథరు వంటి ద్రావణిలలో కరగింఛిన స్థితిలో లభిస్తుంది.ఈ ఆమ్లం పెర్క్లోరిక్ ఆమ్లంవంటి అణు నిర్మాణాన్ని కల్గిఉన్నది.

భౌతిక ధర్మాలు

[మార్చు]

ఫ్లోరోబోరిక్ ఆమ్లం రంగులేని ద్రవఆమ్లం.విష పూరితమైనది.[2]

అణుభారం

[మార్చు]

ఫ్లోరోబోరిక్ ఆమ్లం అణుభారం 87.81గ్రాములు/మోల్[3]

సాంద్రత

[మార్చు]

20°Cవద్ద ఫ్లోరోబోరిక్ ఆమ్లం సాంద్రత1.38గ్రాములు/మి.లీ[4]

ఫ్లోరోబోరిక్ ఆమ్లం ద్రవీభవన స్థానం −90 °C(−130 °F;183 K)[4]

మరుగు ఉష్ణోగ్రత

[మార్చు]

ఫ్లోరోబోరిక్ ఆమ్లం బాష్పీభవన స్థానం 130 °C(266 °F;403 K)[4] సాల్వెంట్ ఫ్రీ ఫ్లోరోబొరిక్ ఆమ్లాన్ని వేరుపరచ లేనప్పటికీ,వీటి యొక్కద్రావణీయలను(solvates)ను విశ్లేషించడం జరిగింది.ఈలవణాలు ప్రోటోనేటేడ్ ద్రావణిని కేటాయాన్ గా కల్గి(ఊదా: H3O+ and H5O+2), చుర్భుజకోణ BF−4 అనయాన్ కల్గి ఉండును. ఇందులోని అనయాన్, కేటాయాన్ లు బలమైన హైడ్రోజన్ బంధాన్ని కల్గి ఉండును.

రసాయన చర్యలు

[మార్చు]

నీటిలో కరిగినపుడు వేడిని విదుదలచేయును[2].

ఉత్పత్తి

[మార్చు]

బోరిక్ ఆమ్లాన్ని సజల హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంలో కరగించి ఫ్లోరోబోరిక్ ఆమ్లం తయారు చేయుదురు.సజల ఫ్లోరో బొరిక్ ఆమ్లాన్నిబొరిక్ ఆమ్లంతో చర్య జరిపించినపుడు మూడు హైడ్రో ఫ్లోరిక్ ఆమ్ల ఇక్విలెంట్ భాగాల చర్యా ఫలితంగా మధ్య స్థాయి బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఏర్పడును.నాల్గవ ఇక్విలెంట్ హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లభాగం చర్యా ఫలితంగాఫ్లోర��� బొరిక్ ఆమ్లాన్ని ఏర్పడును.

B(OH)3 + 4 HF → H3O+ + BF−4 + 2 H2O

నిర్జల/అనార్ద్ర ఫ్లోరోబొరిక్ ఆమ్లాన్ని అనార్ద్ర అసిటిక్ (acetic anhydride)తోచర్య జరిపించి ఉత్పత్తి చెయ్యవచ్చును.

అనువర్తనాలు

[మార్చు]

ఫ్లోరోబోరేటులను ఉత్పత్తి చెయ్యుటకు ఫ్లోరోబోరిక్ ఆమ్లాన్ని పూర్వగామి(precursor)గా వినియోగిస్తారు.లోహఆక్సైడ్ లను ఫ్లోరో బోరిక్ ఆమ్లంతో చర్య జరిపి ఫ్లోరోబోరేట్ లను తయారు చేయుదురు.జ్వాల వ్యాప్తి నిరోధక పదార్థాల తయారీలో,,ఫ్రిట్స్/సెరామిక్ పదార్థాలు(frits)మెరుగు పరచుటలో ఈ ఆకర్బనలవణాలను వాడెదరు.[5] అలాగే అల్యూమినియం ఇచ్చింగ్(etching)అ, ఆసిడ్ పికిలింగ్(acid pickling)లో ఉపయోగిస్తారు.

సేంద్రియ రసాయన శాస్త్ర పరిధిలో వినియోగం

[మార్చు]

అల్కిలెసన్(alkylation), పాలిమెరిజేసన్ లో ఫ్లోరో బోరిక్ ఆమ్లాన్ని ఉత్ప్రేరకంగా వాడెదరు.

గల్వమిక్ సెల్స్(Galvanic cells)

[మార్చు]

గాల్వనిక్ ఆక్సిజన్ సెన్సర్ వ్యవస్థలో ఫ్లోరోబోరిక్ ఆమ్లాన్నిఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తారు.

మెటల్ ప్లెటింగు

[మార్చు]

క్రోమియం(III)ఆక్సైడ్, సల్ఫోనిక్ ఆమ్లంతో కలిపి కాతోడ్ చర్య ద్వారా టిన్ ప్లేటేడ్ స్టిల్ లోహ పూతగాఉపయోగిస్తారు.ఎలక్ట్రో ప్లేటింగులో ఉపయోగిస్తారు[2]..

ఇవికూడా చూడండి

[మార్చు]

అధారాలు/మూలాలు

[మార్చు]
  1. Kütt, A., et al., "Equilibrium Acidities of Superacids", J. Org. Chem. 2010, volume 76, pp. 391-395. doi:10.1021/jo101409p
  2. 2.0 2.1 2.2 "FLUOROBORIC ACID". cameochemicals.noaa.gov. Archived from the original on 2017-04-11. Retrieved 2017-04-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Fluoroboric Acid". pubchem.ncbi.nlm.nih.gov. Archived from the original on 2017-04-11. Retrieved 2017-04-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 4.2 "Fluoroboric acid". chemicalbook.com. Archived from the original on 2017-04-11. Retrieved 2017-04-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "FLUOROBORIC ACID". chemicalland21.com. Archived from the original on 2017-04-11. Retrieved 2017-04-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)