దాల్మా గార్డెన్ మాల్
40°10′48″N 44°29′19″E / 40.179906°N 44.488531°E
ప్రదేశం | మల్టియా-సెబష్టియా జిల్లా, యెరెవాన్, ఆర్మేనియా |
---|---|
ప్రారంభ తేదీ | అక్టోబర్ 2012 |
అభివృద్ధి కారకుడు | దాల్మా ఇన్వెస్ట్ |
యజమాని | తాషిర్ గ్రూప్ |
స్టోర్‌ల సంఖ్య, సేవలు | 116 |
మొత్తం ఫ్లోర్ విస్తీర్ణం | 43,500 మీ2 (468,000 sq ft) |
ఫ్లోర్ల సంఖ్య | 3 |
పార్కింగ్ | 500+ |
దాల్మా గార్డెన్ మాల్ (ఆర్మేనియన్:Դալմա Գա��դեն Մոլ) ఆర్మేనియా దేశంలోని ఒక షాపింగ్ మాల్. ఇది ఆర్మేనియా రాజధాని యెరెవాన్‌లో సిట్సెర్నాకబెర్డ్ కొండకు దగ్గరలో ఉంది. ఇది ఆర్మేనియా దేశంలోని మొట్టమొదటి షాపింగ్ మాల్.
చరిత్ర
[మార్చు]ఈ షాపింగ్ మాల్ నిర్మాణం 2009లో మొదలు పెట్టబడింది.[1] 2012 అక్టోబర్ నెలలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించబడింది. [2][3][4] ఆర్మేనియాలో జన్మించిన రష్యన్ వ్యాపారి సామ్‌వెల్ కరపెత్యాన్ సారథ్యంలోని తాషిర్ గ్రూప్ ఈ దాల్మా గార్డెన్ షాపింగ్ మాల్‌ను నిర్మించింది. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆర్మేనియా అధ్యక్షుడు "సెర్జ్ సర్ఖస్ జన్" హాజరయ్యాడు.[5]
తరువాత "యెరెవాన్ సిటీ" హైపర్‌మార్కెట్ ఈ మాల్‌లో ప్రారంభమయ్యింది. 2015లో "క్యారీఫోర్ హైపర్‌మార్కెట్" ఈ షాపింగ్ మాల్‌లో మొదలయ్యింది.
సేవలు
[మార్చు]యెరెవాన్ లోని అతిపెద్ద నగల దుకాణం ఈ షాపింగ్ మాల్‌లో ఉంది.
2013, నవంబర్ 18న ఈ మాల్‌లో "సినిమా స్టార్" మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభించబడింది. "సినిమా స్టార్" అనేది రష్యన్ సినిమా వ్యాపార సంస్థ. ఇది ఆర్మేనియన్ మార్కెట్లోకి ఈ షాపింగ్ మాల్‌లో 6 హాళ్లను నెలకొల్పడం ద్వారా ప్రవేశించింది. ఈ మల్టీప్లెక్స్ మైఖేల్స్ కేఫ్ రెస్టారెంట్‌కు సమీపంలో ఉంది.[6]
ఈ షాపింగ్ మాల్‌లో అనేక కేఫ్‌లు, రెస్టారెంట్లు, ఒక ఫుడ్ కోర్టు, ఒక బౌలింగ్ సెంటర్, చిన్నపిల్లల కోసం "ప్లే లాబ్" ఉన్నాయి.
అనేక అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు ఈ దాల్మా గార్డెన్ మాల్‌లో తమ రీటైల్ షాపులు తెరవడం ద్వారా ఆర్మేనియన్ మార్కెట్లోకి ప్రవేశించాయి. వాటిలో కొన్ని:
- జర
- స్ట్రాడ్‌వేరియస్
- మ్యాంగో
- పుల్ & బేర్
- యుఎస్ పోలో అసోసియేషన్
- బెర్‌ష్కా
- వాలిస్
- మిస్ సెల్ఫ్‌రిడ్జ్
- కర్పిస
- గియోర్డానొ
- గెరి వెబర్
- మసిమో డట్టి
- ప్రొమోడ్
- గ్యాప్
- ఎల్‌సి వైకికి
- మార్క్స్ & స్పెన్సర్
- డెసిగ్యుల్
- మాన్‌సూన్
- యాక్సెసరైజ్
- న్యూయార్కర్
- న్యూ లుక్
- ఎఫ్&ఎఫ్
- లెవీ'స్
- సీలియో
- ఆర్మనీ ఎక్స్‌చేంజ్
- టాప్‌షాప్
- నెక్‌స్ట్
- గరాజ్
- లా సెంజా
- ఓయ్‌షో
- మెక్స్
- క్లార్క్స్
- స్కెచర్స్
- ఛార్లెస్ & కీత్
- ఆల్డో
- బాటా
- స్టీవ్ మాడెన్
- క్రాక్స్
- వైవెస్ రోచర్
- జిస్క్
- టేప్ ఆ లోయీల్
- ఒకైడి
- జెన్నిఫర్
- బ్లాంకో
- బాల్డి
- రోబెర్టో పిరలోఫ్
- బర్గర్ కింగ్
- యెరెవాన్ సిటీ రిటైలర్స్
- బేసిక్ సెంటర్ రిటైలర్స్
- రియో గలేరియా రిటైలర్స్
చిత్రమాలిక
[మార్చు]దాల్మా గార్డెన్ మాల్‌కు సంబంధించిన దృశ్యమాలిక:
మూలాలు
[మార్చు]- ↑ (19 జూన్ 2018). ఫ్రమ్ దాల్మా గార్డెన్స్ టు దాల్మా మాల్: ఆర్మేనియన్ కంపెనీ లాంచెస్ ద కంస్ట్రక్షన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ సెంటర్ ఇన్ యెరెవాన్, ఆర్మేనియన్.కామ్Archived 2014-04-18 at the Wayback Machine
- ↑ దాల్మా గార్డెన్ మాల్ ఓపెనింగ్ Archived 2013-04-15 at Archive.today, రిపాట్ ఆర్మేనియా
- ↑ (19 జూన్ 2018). దాల్మా గార్డెన్ మాల్ షాపింగ్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ సెంటర్ ఓపెన్స్ యెరెవాన్ Archived 2016-06-05 at the Wayback Machine, పాన్‌ఆర్మేనియన్.నెట్
- ↑ (19 జూన్ 2018). ఓవర్ 25 ఇంటర్‌నేషనల్ బ్రాండ్స్ రెప్రెజెంటెడ్ ఇన్ దాల్మా గార్డెన్ మాల్ ఇన్ యెరెవాన్ Archived 2012-11-02 at the Wayback Machine, అర్క న్యూస్ ఏజెన్సీ
- ↑ (19 జూన్ 2018).ప్రెసిడెంట్ సెర్జ్ సర్ఖస్ జన్ అటెండెడ్ ద ఓపెనింగ్ సెరిమనీ ఆఫ్ ద దాల్మా గార్డెన్ మాల్ కాంపౌండ్ అండ్ విజిటెడ్ ది ఆర్మ్‌ప్రొడ్‌ఎక్స్‌పో ఎగ్జిబిషన్ Archived 2014-04-18 at the Wayback Machine, ప్రెసిడెంట్.ఎఎమ్
- ↑ సినిమా స్టార్ ఈజ్ ఓపెన్ అట్ ద దాల్మా గార్డెన్ మాల్ Archived 2015-10-29 at the Wayback Machine