Jump to content

పంచాగ్నులు

వికీపీడియా నుండి
యోమం లో అ��్ని

వివిధ కావ్యాలలోను, పురాణాలలోను చెప్పబడిన ఐదు అగ్నులు పంచాగ్నులు అనబడుతాయి. అగ్ని పురాణములో చెప్పబడిన అగ్నులు ఇవి

  1. బడబాగ్ని - ఇది సముద్రంలో ఉంటుంది. బడబాగ్నినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు.
  2. జఠరాగ్ని - ఇది జీవుల ఉదరంలో ఉండి ఆహారమును జీర్ణింపచేస్తుంది.
  3. కాష్టాగ్ని లేదా దావానలము - ఇది ఎండు కఱ్ఱల రాపిడి వలన పుట్టి హోమములు మొదలగువానియందు ఉపయుక్త మగుచున్నది.
  4. వజ్రాగ్ని - ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉంటుంది.
  5. సూర్యాగ్ని - ఇది ఆదిత్యునియందు ఉంటుంది.

ఇంకా కొన్ని సందర్భాలలో ప్రస్తావింపబడే అగ్నులు

  • ఆత్మలో రగిలే జ్ఞానాగ్ని
  • పాదాల్లో కాలాగ్ని
  • కడుపులో క్షుధాగ్ని
  • హృదయంలో శీతాగ్ని
  • నేత్రాల్లో క్రోధాగ్ని

మూలాలు, వనరులు

[మార్చు]
  • అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశం) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)