హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | రాజధాని ఎక్స్‌ప్రెస్ | ||||
స్థితి | నిర్వహిస్తున్నారు | ||||
స్థానికత | పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ & ఢిల్లీ | ||||
తొలి సేవ | మార్చి 1 1969 | ||||
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు రైల్వే మండలం | ||||
మార్గం | |||||
మొదలు | హౌరా జంక్షన్ రైల్వే స్టేషను (HWH) | ||||
గమ్యం | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | ||||
ప్రయాణ దూరం | 1,447 కి.మీ. (899 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం |
| ||||
రైలు నడిచే విధం | రోజూ | ||||
రైలు సంఖ్య(లు) | 12301/12302; 12305/12306 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు |
| ||||
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలదు | ||||
ఆటోర్యాక్ సదుపాయం | No | ||||
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ కలదు | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large Windows | ||||
వినోద సదుపాయాలు | Onboard WiFi Service | ||||
బ్యాగేజీ సదుపాయాలు | కలదు | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం |
| ||||
|
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు ,తూర్పు రైల్వే మండలం ద్వారా నిర్వహించబడుతున్న ఒక ప్రతిష్టాత్మక రైలుసర్వీసు.ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని సమీపలోవున్న హౌరా రైల్వే స్టేషన్ నుండి భారత దేశ రాజధాని ఢిల్లీ లో గల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణీస్తుంది.
చరిత్ర
[మార్చు]హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, ప్రారంభించిన మొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్.దీనిని 1969 మార్చి 1 న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు.ఈ రైలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో సాయంత్రం 05గంటల 30నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10గంటల 50నిమిషాలకు హౌరా రైల్వే స్టేషన్ చేరింది.తిరిగి హౌరా జంక్షన్ రైల్వే స్టేషను లో మరుసటి రోజు సాయంత్రం 05గంటలకు బయలుదేరి ముసటి రోజు ఉదయం 10గంటల 20నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరింది.�� రైలును మొదటగా వారానికి రెండుమార్లుప్రయాణీంచే విధంగా ప్రారంభించారు.హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన తరువాత కోల్‌కాతా,ఢిల్లీ ల మద్య ప్రయాణకాలం గణనీయంగా తగ్గింది.
ప్రయాణ మార్గం
[మార్చు]- 12301 నెంబరుతో ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ హౌరా లో సాయంత్రం 04గంటల 55నిమిషాలకు బయలుదేరి ధన్‌బాద్,గయ,ముఘల్ సరై,అలహాబాద్,కాన్పూర్ ల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.ఈ రైలు ఆదివారం తప్ప మిగిలిని రొజుల్లో హౌరా నుండి బయలుదేరుతుంది.
- 12302 నెంబరుతో ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 04గంటల 55నిమిషాలకు బయలుదేరి కాన్పూర్,గయ, ధన్‌బాద్ ల మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 9గంటల 50నిమిషాలుకు హౌరా చేరుతుంది.ఇది శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజుల్లోను ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంది.
- 12305 ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ హౌరా లో మధ్యాహ్నం 02గంటల 5నిమిషాలకు బయలుదేరి బర్ధమాన్,మధుపూర్,పాట్నా,ముఘల్ సరై,అలహాబాద్,కాన్పూర్ ల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.ఈ రైలు కేవలం ఆదివారం మాత్రమే ఈ మార్గంలో ప్రయాణిస్తుంది.
- 12306 ప్రయాణించు హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4గణ్టల 55నిమిషాలకు బయలుదేరి కాన్పూర్,పాట్నా,మధుపూర్ లమీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటల 15నిమిషాలకు హౌరా చేరుతుంది.
కోచ్ల కూర్పు
[మార్చు]- హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ 12301/02 (వయా గయ) లో మొత్తం 10 మూడవ తరగతి ఎ.సి భోజీలు,5 రెండవ తరగతి ఎ.సి భోగీలు,2 మొదటి తరగతి ఎ.సి భోగీలు,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భొగీల తో కలిపి మొత్తం 20 భొగీలుంటాయి.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
EOG | ఎ5 | ఎ4 | ఎ3 | ఎ2 | ఎ1 | హెచ్2 | హెచ్1 | PC | బి10 | బి9 | బి8 | బి7 | బి6 | బి5 | బి4 | బి3 | బి2 | బి1 | EOG |
- హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ 12305/06 (వయా పాట్నా) లో మొత్తం 10 మూడవ తరగతి ఎ.సి భోజీలు,5 రెండవ తరగతి ఎ.సి భోగీలు,2 మొదటి తరగతి ఎ.సి భోగీలు,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భొగీల తో కలిపి మొత్తం 20 భొగీలుంటాయి.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
EOG | ఎ5 | ఎ4 | ఎ3 | ఎ2 | ఎ1 | హెచ్2 | హెచ్1 | PC | బి10 | బి9 | బి8 | బి7 | బి6 | బి5 | బి4 | బి3 | బి2 | బి1 | EOG |
సమయ సారిణి
[మార్చు]12501 హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ (గయ మీదుగా)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 HWH హౌరా జంక్షన్ రైల్వే స్టేషను 16:55 ప్రారంభం 0.0 1 2 ASN ఆసన్సోల్ జంక్షన్ 19:01 19:03 2ని 200.5 2 3 DHN ధన్‌బాద్ 19:55 20:00 5ని 258.8 2 4 PNME పరస్నాథ్ 20:37 20:39 2ని 306.5 1 5 GAYA గయ 22:34 22:37 3ని 458.2 1 6 MGS ముఘల్ సరై 00:45 00:55 10ని 663.5 2 7 ALD అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను 02:43 02:46 3ని 816.1 2 8 CNB కాన్పూర్ సెంట్రల్ 04:45 04:53 8ని 1010.5 2 9 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 10:00 గమ్యం 1450.7 2
-
12305 హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ (పాట్నా మీదుగా)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 HWH హౌరా జంక్షన్ రైల్వే స్టేషను ప్రారంభం 14:05 0.0 1 2 BWN బర్ధమాన్ జంక్షన్ 15:06 15:08 2ని 94.5 1 3 MDP మధుపూర్ జంక్షన్ 17:11 17:15 4ని 282.0 1 4 JSME జేస్దిహ్ జంక్షన్ 17:40 17:44 4ని 311.0 1 5 PNBE పాట్నా 21:00 21:10 10ని 531.6 1 6 MGS ముఘల్ సరై 00:42 00:52 10ని 743.1 2 7 ALD అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను 02:43 02:46 3ని 895.7 2 8 CNB కాన్పూర్ సెంట్రల్ 04:45 04:53 8ని 1090.2 2 9 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 10:00 గమ్యం 1530.3 2
-
12305 హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ (పాట్నా మీదుగా)
ట్రాక్షన్
[మార్చు]హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ కు మొదటగా WDM-4 డీజిల్ లోకోమోటివ్ను ఉపయోగించేరవారు.ఈ డీజిల్ లోకోమొటివ్ సహాయంతో రైలు 115కిలో మీటర్ల అత్యధిక వేగాన్ని అందుకునేది.1971 లో హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క గరిష్ట వేగపరిమితిని 120కిలో మీటర్ల నుండి 130కిలో మీటర్ల కు పెంచారు.దానివల్ల హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రయాణ సమయంమరింత తగ్గింది.1976 నాటికి హౌరా-ఢిల్లీ రైలుమార్గం పూర్తిస్థాయిలో విధ్యుతీకరింపబడినప్పటికీ WDM-4 డీజిల్ లోకోమోటివ్ను ఉపయోగించారు.నాడు WDM-4 డీజిల్ లోకోమోటివ్లు అత్య్ధిక వేగంతో ప్రయాణించేలా రూపొందించడం వల్ల WDM-4 ను ఉపయోఅగించారు.తరువాతి కాలంలో WAP-1,WAP-2 లోకోమోటివలను ఉపయోగించారు. ప్రస్తుతం హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ కు హౌరా లోకోషెడ్ ఆధారిత WAP-7 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు,
ఇవి కూడా చూడండి
[మార్చు]- చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్
- ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్
- సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్
- బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]https://indiarailinfo.com/train/-train-new-delhi-howrah-rajdhani-express-via-patna-12306/1319/664/1 మూస:Railway lines in Eastern India