Jump to content

హైదరాబాదు మెట్రో

వికీపీడియా నుండి
(హైదరాబాదు మెట్రొ రైలు ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు మెట్రో రైలు
Hyderabad Metro Logo
ముఖ్య వివరాలు
స్థానిక ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ట్రాన్సిట్ రకంమెట్రోరైలు
లైన్ల సంఖ్య3 (Phase I)
స్టేషన్ల సంఖ్య66 (Phase I)
ముఖ్య కార్యనిర్వహణాధికారినల్లమిల్లి వెంకట సత్యనారాయణ రెడ్డి, MD[1]
ప్రధానకార్యాలయంమెట్రో భవన్, సైఫాబాద్, హైదరాబాదు
వెబ్ సైటు
నిర్వహణ
ప్రారంభమైన కార్యాచరణ2017 నవంబరు 29
నిర్వహించేవారుహైదరాబాద్ మెట్రో రైల్ లి. (HMRL)
సాంకేతిక అంశాలు
వ్యవస్థ పొడవు72.16 కి.మీ. (44.84 మై.) (Phase I)[2]
97 కి.మీ. (60 మై.) (Phase II)
ట్రాక్ గేజ్1,435 mm (4 ft 8+12 in) standard gauge
విద్యుదీకరణ25kV, 50Hz AC ఓవర్‌హెడ్ లైను
సరాసరి వడి34 km/h (21 mph)
అత్యధిక వడి80 km/h (50 mph)
System map

హైదరాబాదు మెట్రో
తొలి దశ
మియాపూర్
జె.ఎన్.టి.యు. కళాశాల
రాయదుర్గం
కె.పి.హెచ్.బి. కాలనీ
హైటెక్ సిటీ
కూకట్‌పల్లి
దుర్గం చెరువు
బాలానగర్
మాదాపూర్
మూసాపేట
పెద్దమ్మ గుడి
భరత్ నగర్
జూబ్లీహిల్స్
చెక్‌పోస్ట్
ఎర్రగడ్డ
Road No 5
Jubilee Hills
ESI Hospital
యూసుఫ్‌గూడ
S.R. Nagar
మధురానగర్
అమీర్‌పేట
పంజాగుట్ట
బేగంపేట
ఎర్రమంజిల్
ప్రకాష్ నగర్
ఖైరతాబాద్
రసూల్‌పురా
��క్డికాపూల్
పారడైజ్
అసెంబ్లీ
JBS Parade Ground
నాంపల్లి
పరేడ్ గ్రౌండ్
గాంధీ భవన్
Osmania
ఉస్మానియా వైద్య కళాశాల
Secunderabad
West | Jn | ఈస్ట్
మెట్టుగూడ
గాంధీ హాస్పిటల్
తార్నాక
ముషీరాబాద్
హబ్సిగూడ
R.T.C. X Roads
NGRI
చిక్కడపల్లి
స్టేడియం
నారాయణగూడ
ఉప్పల్
సుల్తాన్ బజార్
నాగోల్
ఎం.జి.బి.ఎస్.
మలక్‌పేట
సాలార్‌జంగ్ మ్యూజియం
న్యూ మార్కెట్
చార్మినార్
మూసారాంబాగ్
శాలిబండ
దిల్‍సుఖ్‍నగర్
షంషేర్‌గంజ్
చైతన్యపురి
జంగమెట్ట
విక్టోరియా మెమోరియల్
ఫలక్‌నుమా
ఎల్.బి. నగర్
రెడ్ లైన్
గ్రీన్ లైన్
బ్లూ లైన్
భారతీయ రైల్వేలు మార్గాలు

హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు నగరంలో ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం చేసే రైలు సేవలనందిస్తోంది. మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017 లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత, ఎల్ బి నగర్ - అమీర్ పేట మార్గాన్ని అక్టోబర్ 2018 లో ప్రారంభించారు. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గాన్ని మార్చి 2019 న ప్రారంభించారు. [3]

జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ఫిబ్రవరి 7 2020 నుండి అందుబటులోకి వచ్చినది . ఈ మార్గం ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కి.మీ.లకు గాను 69 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రో గా గుర్తింపుపొందింది.[4]

మెట్రో రైలు ప్రారంభించిన తొలిరోజే 2 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించారరు. 2022 నవంబరు 29 నాటికి ఐదేండ్ల‌ కాలంలో మెట్రోలో 31 కోట్ల మంది ప్ర‌యాణించగా, మెట్రోలో ప్ర‌తి రోజు 4.40 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణం చేస్తున్నారు.[5]

మెట్రో సేవలు - సమయాలు

[మార్చు]

హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు మియాపూర్ నుంచి LB నగర్ మీదుగా అమీర్ పేట, ఎంజీబీఎస్ మీదుగా రెడ్ లైన్ తన సర్వీసులను నిర్వహిస్తోంది. అలాగే నాకోల్ నుంచి రాయదుర్గ్ మీదుగా సికింద్రాబాద్, అమీర్ పేట్ మీదుగా బ్లూ లైన్ అమీర్ పేట రెడ్ లైన్, బ్లూ లైన్ కు ఇంటర్ చేంజ్ స్టేషన్, జేబీఎస్ఎం నుండి జీబీఎస్ మార్గం గ్రీన్ లైన్ కు తన సర్వీసులను నిర్వహిస్తోంది.

హైదరాబాద్ మెట్రో రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి వారపు రోజులు , వారాంతాల్లో 06:30 గంటల నుండి 22:00 గంటల వరకు నడుస్తుంది. ఇవి తాత్కాలిక సమయాలు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా మార్చబడతాయి. చివరి రైలుకు 5 నిమిషాల ముందు ఆ స్టేషన్ టికెట్ కౌంటర్లు మూసివేస్తారు[6].

ప్రాజెక్టు ప్రత్యేకతలు

[మార్చు]
  • రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుంది.
  • ఈ రైలు అత్యధికంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు - MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణం ప్రకారం
  • ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
  • అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
  • భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమారలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
  • తమంతట తామె తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
  • ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
  • రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు.
  • రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలు ఒక రైలు నడపే సౌలబ్యం
  • టికెట్ ధర ₹10 నుండి ₹60 వరకు.
  • ప్రతి స్టేషను జంక్షనుకు బస్సుల ఏర్పాట్లు.

మెట్రో రైలు ప్రయోజనాలు

[మార్చు]
ప్రధాని నరేంద్ర మోడీ 2017 లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు
  • అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని, స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది.
  • పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది.
  • రోడ్డు రవాణాతో పోలిస్తే ఒక ప్రయాణీకుడికి 50% తక్కువ శక్తిని వినియోగిస్తుంది.
  • ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది.
  • 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
  • ఎల్.బి.నగర్ నుండి మియాపూరు వరకు 29 కిలో మీటర్లు దూరం. మొత్తం స్టేషన్లు 27. ప్రయాసమయము 45 నిముషాలు.
  • జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం . మొత్తం స్టేషన్లు 16. ప్రయాణ సమయం 22 నిముషాలు.
  • నాగోలు నుండి శిల్పారామం వరకు దూరము 28 కిలో మీటర్లు. మొత్తం స్టేషన్లు 23. ప్రయాణ సమయము 30 నిముషాలు.
  • మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉద్యోగవకాశాలు.
  • సురక్షిత ప్రయాణం.

ప్రాజెక్టు వివరాలు

[మార్చు]
హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ టవర్ వైపు మెట్రో

చాలా ట్రాఫిక్, రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.[4]

ప్రతిపాదిత కారిడార్లు
కారిడార్ దూరం స్టేషన్లు ప్రయాణ సమయం ప్రస్థుత స్థితి
ఎల్.బి.నగర్ నుండి మియాపూరు 29 కి.మీ. 27 45 ని. పూర్తి
జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా 15 కి.మీ. 16 22 ని. పాక్షికం
నాగోలు నుండి రాయదుర్గ్ 28 కి.మీ. 23 45 ని. పూర్తి
రాయదుర్గం నుండి ఎయిర్‌పోర్టు 31 కి.మీ. 7 30 ని. ప్రతిపాదన
హైదరాబాద్ మెట్రో రైల్ భవన్
  • విద్యుత్ సరఫరా 25kV AC, 50 Hz ఓవర్ హెడ్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా జరపబడుతుంది.
  • ఈ వ్యవస్థ కారిడార్ 1, 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic), కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది.
  • ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
  • అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
  • భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
  • తమంతట తామే తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
  • ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
  • రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
  • రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
  • అత్యంత సరసమైన టికెట్ ధర. 8 రూపాయల నుండి 19 రూపాయల వరకు .
  • మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు, ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు, భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.

మియాపూర్‌ - నాగోలు కారిడార్‌

[మార్చు]

మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్‌ మధ్య 27.6 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఈ మొదటి దశ 27.6 కిలోమీటర్ల లైనులో 18 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్‌లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉప్పల్‌ డిపోలో ఏర్పాటు చేశారు.[3] మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ వ్యవస్థ ఉంది.

రాయదుర్గం - ఎయిర్‌పోర్టు కారిడార్

[మార్చు]

హైదరాబాదు మెట్రో ప్రారంభమై 5 ఏళ్ళు గడిచిన సందర్భంగా మెట్రో ప్రాజెక్టు కారిడార్‌-4లో భాగంగా రాయదుర్గం నుండి ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌ సమీపంలోని ఎయిర్‌పోర్టు వరకు గల 31 కి.మీ.ల దూరం 6,250 కోట్ల రూపాయలతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కార్యరూపం ఇచ్చింది. విమానాశ్రయంతో మెట్రో రైలు మార్గం అనుసంధానమైతే కేవలం 25-30 నిమిషాల్లో అక్కడి నుంచి ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం, మైండ్‌ స్పేస్‌, హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్స్‌కు చేరుకోవచ్చు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ (31 కిలోమీటర్లు) మార్గంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున బయో డైవర్సిటీ జంక్షన్‌, నానక్‌రాంగూడ, నార్సింగి, టీఎస్‌ పోలీస్‌ అకాడమీ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ టౌన్‌, ఎయిర్‌పోర్టు కార్గో స్టేషన్‌, టర్మినల్‌ ప్రాంతాలలో 7-8 మెట్రో స్టేషన్లు నిర్మించేలా డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ఈ కారిడార్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌తోపాటు హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ), జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌లను భాగస్వాములుగా ఉంటాయి.[7][8] హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రాజెక్టు. 2025 చివరి నాటికి దీన్ని పూర్తి చెయ్యాలని తలపెట్టారు.

ఈ ప్రాజెక్టుకు 2022 డిసెంబరు 9న గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్‌ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునాదిరాయి వేసి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌ముద్ అలీ, సబిత ఇంద్రారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, సిహెచ్ మ‌ల్లారెడ్డి, ఎంపీలు కె. కేశ‌వ‌రావు, జి. రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.[9]

నెట్వర్క్

[మార్చు]
లైను మొదలైనది స్టేషన్లు పొడవు టర్మినళ్ళు సగటు తరచుదనం (నిమిషాల్లో)
రెడ్ 2017 నవంబరు 29 27 29 కి.మీ. (18 మై.) మియాపూర్ ఎల్.బి నగర్ 4 1/2 నిమిషాలు (ఒత్తిడి వేళల్లో)

7 నిమిషాలు (ఇతర వేళల్లో )

బ్లూ 23 27 కి.మీ. (17 మై.) రాయదుర్గం నాగోలు
గ్రీన్ 2020 ఫిబ్రవరి 7 9 10.5 కి.మీ. (6.5 మై.) JBS PG ఎం.జి.బి.ఎస్
మొత్తం 59 66.5 కి.మీ. (41.3 మై.)
Hyderabad Metro Network Map
Hyderabad Metro Network Map

స్టేషను ప్రణాళిక

[మార్చు]
మెట్రో రైలు స్టేషను కొరకు నిర్మాణములోనున్న జంట స్తంభములు

స్టేషను రూపకల్పన

[మార్చు]
  • స్టేషనును స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మించారు.
  • ఫ్లాట్ఫారంకు, ఎస్కలేటరుకు మాత్రమే పైకప్పు నిర్మించారు.

ప్రయాణికునికి సౌకర్యాలు

[మార్చు]
  • ప్రతి చోట టిక్కెట్టు అమ్మే మెషీన్లను అందిస్తున్నారు.
  • స్టేషనులో అనుకూలవంతమైన ప్రదేశాలలో టెలిఫోన్లను ఏర్పాటు చేస్తున్నారు.
  • ప్రయాణికులకు అనుకూలంగా స్టేషను మాస్టరు ఉండే చోటును నిర్మించారు.
  • సామాను పరిశీలనా పరికరాలు, ప్రాథమిక చికిత్సా పరికరాలను అందుబాటులో ఉంచుతారు.

బడ్జెట్ వివరాలు

[మార్చు]
  • 2016-17 బడ్జెటులో ఈ ప్రాజెక్టుకు 200 కోట్ల రూపాయలు కేటాయించారు.

మూలాలు

[మార్చు]

Train Timings

  1. "Metro rail projects: Four new metromen and their challenges". The Times Of India. 18 December 2011. Archived from the original on 2016-08-25. Retrieved 2014-11-29.
  2. "L&T set to bag Rs 12,132-cr Hyderabad metro rail project". The Hindu. 14 July 2010. Retrieved 2010-05-17.
  3. 3.0 3.1 "గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది". 2019-03-30. Archived from the original on 2019-08-15. Retrieved 2018-08-15.
  4. 4.0 4.1 Geetanath, V. (2018-09-24). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-11.
  5. telugu, NT News (2022-11-29). "హైద‌రాబాద్ మెట్రోకు నేటికి ఐదేండ్లు పూర్తి.. 31 కోట్ల మంది ప్ర‌యాణం". www.ntnews.com. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.
  6. "Train Timings". Hyderabad Metro Rail (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-23.
  7. "Hyderabad Metro: ఎయిర్‌పోర్టుకు మెట్రో". EENADU. 2022-11-28. Archived from the original on 2022-11-28. Retrieved 2022-11-29.
  8. telugu, NT News (2022-11-28). "ఎయిర్‌పోర్టుకు హై స్పీడ్ మెట్రో". www.ntnews.com. Archived from the original on 2022-11-29. Retrieved 2022-11-29.
  9. telugu, NT News (2022-12-09). "మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2022-12-10. Retrieved 2022-12-11.

బయటి లింకులు

[మార్చు]