Jump to content

హిమంత బిశ్వ శర్మ

వికీపీడియా నుండి
హిమంత బిశ్వ శర్మ
హిమంత బిశ్వ శర్మ

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ


పదవీ కాలం
2021 మే 10 – ప్రస్తుతం పదవిలో ఉన్నారు
గవర్నరు జగదీష్ ముఖి
ముందు సర్బానంద సొనోవాల్

ఆర్ధిక, ఆరోగ్య, విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
24 మే 2016 – 2021 మే 9
పదవీ కాలం
2011 – 2014
పదవీ కాలం
2006 – 2011

ఆర్ధికశాఖ మంత్రి
పదవీ కాలం
2004 సెప్టెంబరు 1 – 2006 జూన్
పదవీ కాలం
2002 జూన్ 7 – 2004 ఆగస్టు 31

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2001
ముందు భ్రిగు కుమార్‌ ఫుకన్
నియోజకవర్గం జలుక్‌బరి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1969-02-01) 1969 ఫిబ్రవరి 1 (వయసు 55)
జోర్హాట్, అసోం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (1996–2015)
జీవిత భాగస్వామి రింకి భూయాన్ శర్మ (7 జూన్ 2001) [1]
సంతానం 2
నివాసం గువాహటి
పూర్వ విద్యార్థి కాటన్ యూనివర్సిటీ (బిఎ / ఎంఏ)
బి.ఆర్.ఎం ప్రభుత్వ లా కళాశాల (ఎల్.ఎల్.బి)
గౌహతి యూనివర్సిటీ (పి.హెచ్.డి)

హిమంత బిశ్వ శర్మ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుత అసోం ముఖ్యమంత్రిగా 2021 మే 10 నుండి అధికారంలో ఉన్నారు.[2][3] అతను 2015లో కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి, బిజెపిలో చేరాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

హిమంత బిశ్వ శర్మ 1969, ఫిబ్రవరి 1న అస్సాం రాష్ట్రం జోర్హాట్ లో కైలాష్ నాథ్ శర్మ, మృణాళిని దేవి దంపతులకు జన్మించాడు. అతను కాటన్ యూనివర్సిటీ (బిఎ/ఎంఏ), బి.ఆర్.ఎం ప్రభుత్వ లా కళాశాల (ఎల్.ఎల్.బి), గౌహతి యూనివర్సిటీ నుండి పి.హెచ్.డి పూర్తి చేశాడు. 1991–92లో రాజనీతి శాస్త్రంలో పీజీ చేస్తున్న సమయంలో కాటన్‌ కాలేజ్‌ యూనియన్‌ సొసైటీకి జనరల్‌ సెక్రటరీగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

హిమంత బిశ్వ శర్మ ఆల్ అస్సాం స్టూడెంట్‌ యూనియన్ (ఏఏఎస్‌యూ) లో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించాడు. ఆయనను 1996లో అప్పటి ముఖ్యమంత్రి హితేశ్వర్‌ సైకియా కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించాడు. ఆయన 2001లో జలుక్‌బరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి భ్రిగు ఫుకాన్‌ గెలిచాడు. తరువాత వరుసగా 2006, 2011, 2016 ఎన్నికల్లో గెలిచాడు. హిమంత 2004లో తొలిసారి తరుణ్​ గొగొయి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయనకు 2015లో తరుణ్‌ గొగోయ్‌తో విభేదాల కారణంగా 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరాడు.[4] హిమంత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, 2021 మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

ఇతర విషయాలు

[మార్చు]

హిమంత బిశ్వ శర్మ అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చ‌డం, 2017లో మణిపూర్‌లో కూటమి ఏర్పాటు, మేఘాలయలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాడు. నాగాలాండ్‌లో బీజేపీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్, నేషనల్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 May 2021). "సీఎం అవుతానని 30 ఏళ్ల క్రితమే చెప్పాడు : సీఎం భార్య". Sakshi. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  2. Business Standard (10 May 2021). "Himanta Biswa Sarma sworn in as Chief Minister of Assam". Business Standard. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  3. Sakshi (10 May 2021). "అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం". Sakshi. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  4. ETV Bharat News (12 May 2021). "అసోం సీఎంగా హిమంత- ఆయనే ఎందుకు?". ETV Bharat News. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  5. India Today (9 May 2021). "Why the BJP made Himanta Biswa Sarma Assam CM". Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.