స్వామినారాయణ దేవాలయం (అట్లాంటా)
స్వామినారాయణ దేవాలయం (అట్లాంటా) | |
---|---|
స్థానం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | జార్జియా |
ప్రదేశం: | లిబర్న్ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | శిల్పశాస్త్రం |
చరిత్ర | |
నిర్మాత: | ప్రముఖ్ స్వామి మహారాజ్ |
వెబ్‌సైటు: | http://www.baps.org/atlanta |
స్వామినారాయణ దేవాలయం, జార్జియాలోని అట్లాంటాలో స్వామినారాయణ్ సంస్థచే నిర్మించబడిన సాంప్రదాయ హిందూ దేవాలయం. మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలోని స్వామినారాయణ్ సంస్థ, హిందూమతంలోని స్వామినారాయణ సంస్థకు చెందినది. ఈ దేవాలయం 2007, ఆగస్టు 26న ప్రారంభించబడింది. అట్లాంటాలోని లిల్బర్న్ శివారులో ఉన్న ఈ దేవాలయం, పురాతన హిందూ గ్రంథాల ప్రకారం నిర్మించబడింది. 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దేవాలయం 34,450 చేతితో చెక్కిన ఇటాలియన్ పాలరాయి, టర్కిష్ సున్నపురాయి, భారతీయ ఇసుకరాయితో తయారు చేయబడింది.[1] ఇక్కడ వారానికోసారి సభలు జరుగుతాయి. ప్రతిరోజూ ఆరాధనలు, సందర్శకుల కోసం ఈ దేవాలయం తెరిచే ఉంటుంది.
గ్రేటర్ అట్లాంటా ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయులు 1980లలో ఆధ్యాత్మిక సమావేశాలను నిర్వహించడానికి వారివారి ఇళ్ళలో కలుసుకునేవారు. 1988లో, జార్జియాలోని క్లార్క్‌స్టన్‌లో ��ంఘం స్కేటింగ్ రింక్‌ను కొనుగోలు చేసి, దానిని దేవాలయంగా పునరుద్ధరించింది.[2] ప్రస్తుతమున్న దేవాలయానికి చెందిన ఇరవై తొమ్మిది ఎకరాల ప్లాట్‌ను 2000, ఫిబ్రవరి నెలలో జార్జియాలోని లిల్‌బర్న్‌లో కొనుగోలు చేశారు. ప్రముఖ్ స్వామి మహరాజ్ భూమి పూజలు నిర్వహించాడు. ఆ తరువాత 2004లో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 2007లో నిర్మాణం పూర్తయిన తర్వాత దేవాలయం ప్రారంభించబడింది.[2] 2017, జూలై 1న పదవ వార్షికోత్సవం జరిగింది.
నిర్మాణం, ప్రారంభోత్సవం
[మార్చు]2000, ఫిబ్రవరి నెలలో, ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆశీస్సులతో, అట్లాంటా శివారులోని లిల్‌బర్న్‌లో 29 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు.[2] 200, జూన్ 13న శైలన్యాస్ విధి అనే వైదిక కార్యక్రమం నిర్వహించి, దేవాలయ పునాదికి శంకుస్థాపన చేశారు.[3]
దేవాలయ నిర్మాణం
[మార్చు]2005 సెప్టెంబరులో నిర్మాణం ప్రారంభమైంది, 2006 జనవరిలో పునాది కోసం కాంక్రీటు పోశారు.[4] 2006 మార్చిలో, 106,000 క్యూబిక్ అడుగుల ఇటాలియన్ కర్రారా పాలరాయిని అమర్చడానికి ఒక ప్రత్యేక క్రేన్‌ను ఏర్పాటు చేశారు.[4] 34,000 కంటే ఎక్కువ చెక్కిన రాతి నగిషీలను భారతదేశం నుండి తెప్పించారు.[4] 2007 ఆగస్టులో ప్రముఖ్ స్వామి మహారాజ్ ప్రారంభించడంతో ఈ మందిర నిర్మాణం కేవలం రెండేళ్ళలోపు పూర్తయింది.[2][5]
దేవాలయ ప్రారంభోత్సవానికి ముందు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. 2007 ఆగస్టు 24న, పదివేలమందికి పైగా భక్తుల సమక్షంలో ప్రపంచ శాంతికోసం విశ్వశాంతి మహాయజ్ఞాన్ని నిర్వహించారు.[5]
2007 ఆగస్టు 26న, ప్రముఖ్ స్వామి మహారాజ్ చేతులమీదుగా దేవతామూర్తుల ప్రతిష్ఠతో దేవాలయం ప్రారంభించబడింది. కాంగ్రెస్ సభ్యుడు హెన్రీ జాన్సన్ జూనియర్, లిల్బర్న్ మేయర్, జాక్ బోల్టన్, గ్విన్నెట్ కౌంటీ కమిషనర్ చార్లెస్ బన్నిస్టర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. [5]
చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Gleaming Hindu Temple to Open in Atlanta Suburb". NPR.org. Retrieved 2022-01-24.
- ↑ 2.0 2.1 2.2 2.3 "WRSP - BAPS Mandir Profile Atlanta". wrldrels.org. Retrieved 2022-01-24. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "NRIPulse.com^^^Home Of The Indian American Family". www.nripulse.com. Retrieved 2022-01-24.
- ↑ 4.0 4.1 4.2 "BAPS Shri Swaminarayan Mandir - Atlanta - Manidr Info". BAPS Swaminarayan Sanstha. Retrieved 2022-01-24.
- ↑ 5.0 5.1 5.2 "BAPS Swaminarayan Mandir's Inauguration Ceremony -Atlanta Dunia -". atlantadunia.com. Retrieved 2022-01-24.