Jump to content

సోముల వెంకటసుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
సోముల వెంకటసుబ్బారెడ్డి

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1972 – 1978
ముందు గంగుల తిమ్మారెడ్డి
తరువాత గంగుల తిమ్మారెడ్డి
నియోజకవర్గం ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1983 – 1985
ముందు గంగుల ప్రతాపరెడ్డి
తరువాత గంగుల ప్రతాపరెడ్డి
నియోజకవర్గం ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1994 – 2009
ముందు పాటిల్ శేషిరెడ్డి
తరువాత కె.ఇ.ప్రభాకర్
నియోజకవర్గం పత్తికొండ శాసనసభ నియోజకవర్గం , ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం భూమా శోభా నాగిరెడ్డి
ఎస్‌.వీ.మోహన్‌ రెడ్డి

ఎస్వీ సుబ్బారెడ్డిగా ప్రసిద్ధి చెందిన సోముల వెంకటసుబ్బారెడ్డి కర్నూలు జిల్లా చెందిన రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మాజీ మంత్రి. రెండు సార్లు ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుండి, మూడు సార్లు పత్తికొండ శాసనసభ నియోజకవర్గం, మొత్తం ఐదుసార్లు శాసనసభ ఎన్నికయ్యాడు.

ఎస్వీ సుబ్బారెడ్డి, 1972లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొంది, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కాంగ్రేసు పార్టీలో చేరాడు. 1978లో ఇందిరా కాంగ్రేసు అభ్యర్ధిగా ఆళ్లగడ్డనుండి పోటీచేసి గంగుల తిమ్మారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1983లో మరలా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి రెండోసారి శాసనసభ ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1984లో నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరి, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశాడు. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి ఐన తర్వాత, కాంగ్రేసు పార్టీలో చేరి, 1989లో కోయిలకుంట్ల శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రేసు అభ్యర్ధిగా పోటీచేసి తెలుగుదేశం అభ్యర్ధి కె.సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయాడు.[1]

ఆ తర్వాత మరలా తెలుగుదేశం పార్టీలో చేరి, 1994 నుండి వరుసగా మూడు పర్యాయాలు పత్తికొండ శాసనసభ నియోజకవర్గంనుండి తెలుగుదేశం అభ్యర్ధిగా గెలుపొంది, 2009 వరకు శాసనసభలో పత్తికొండకు ప్రాతినిధ్యం వహించాడు. 1995లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక, ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు.[1]

కర్నూలు జిల్లా రాజకీయనాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఈయన చిన్న కుమార్తె. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొన్నాళ్లు తండ్రీ కూతుళ్లు ఒకేసారి శాసనసభా సభ్యులుగా ఉన్నారు.[2] ఈయన కుమారుడు, ఎస్‌.వీ. మోహన్‌ రెడ్డి, 2014లో కర్నూలు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 183.
  2. "శోభానాగిరెడ్డి మృతి..ప్రముఖుల సంతాపాలు". సాక్షి. 25 April 2014. Retrieved 19 August 2024.