Jump to content

సామి షామనిజం

వికీపీడియా నుండి
సామి డ్రమ్, ఆర్క్టికమ్ (Arctikum) మ్యూజియం, రొవ్యానీయెమి, ఫిన్లాండ్

సాంప్రదాయ సామీ ఆధ్యాత్మిక అభ్యాసాలు, నమ్మకాలు, మానవ శాస్త్రవేత్తలు దివ్యాత్మోపాసన మతం (షమానిజంగా) పరిగణించే ఒక రకమైన సర్వాత్మ వాదం(యానిమిజం), బహుదేవతత్వం అనే వాటిపై ఆధారపడి ఉంటాయి. శాంపి (Sápmi) లో మత సంప్రదాయాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే కొద్దీ గణనీయంగా మారవచ్చు.

సాంప్రదాయ సామి మతాన్ని సాధారణంగా సర్వాత్మ వాదంగా పరిగణిస్తారు. ప్రకృతి లోని అన్ని ముఖ్యమైన సహజ వస్తువులు (జంతువులు, మొక్కలు, రాళ్ళు మొదలైనవి) ఆత్మను కలిగి ఉంటాయని సామీ నమ్మకం, ఇక బహుదేవతారాధన దృక్కోణంలో చూస్తే, సాంప్రదాయ సామీ విశ్వాసంలో అనేక ఆత్మలు ఉన్నట్టు కనిపిస్తుంది. [1] సాధారణంగా, చనిపోయిన జంతువుల ఆత్మలను పూజించడాన్ని సామీ సాంప్రదాయ విశ్వాసాలు, అభ్యాసాలు నొక్కి చెబుతాయి. రెయిన్ డీర్ వంటి ప్రజలకు సహాయకారిగా ఉంటూ వారిని నిలబెట్టే స్థానిక జంతువులతో ఉండే సంబంధం వారి బంధు-సమూహానికి చాలా ముఖ్యమైనది. [1]

దేవతలు, జంతువుల ఆత్మలు

[మార్చు]

ఒక్క ఎలుగుబంటి ఆరాధన మాత్రమే కాకుండా, ప్రకృతిని గమనించే హల్దీ వంటి ఇతర జంతువుల ఆత్మలు కూడా వారి ఆరాధనలో భాగమే. సామీలోని కొదరికి హొరగల్లెస్ అనే ఉరుము దేవుడు ఉంటాడు. అలాగే "ఆకుపచ్చ, సారవంతమైన భూ పుత్రి " రానా నీజ్తా. [2] ఫిన్నిష్ పురాణాలలో కనిపించే , ఉత్తర వైపున ఉండే ధృవ తార వరకు వ్యాపించి ఉండే విశ్వ వృక్షం లేదా విశ్వాధార స్తంభం, వీరి ఆరాధనలో ఉండవచ్చు. [3]

లైబ్ ఒల్మై, సాంప్రదాయకంగా అటవీ జంతువులతో సంబంధం కలిగి ఉండే ఈ అటవీ ఆత్మను కొంతమంది సామి ప్రజలు విశ్వసిస్తారు. ఆ జంతువులన్నీ ఆ ఆత్మ మందలుగానే పరిగణిస్తారు. ఆ ఆత్మ వారికి వేటలో అదృష్టాన్నిలేదా దురదృష్టాన్ని ఇస్తుందని చెబుతారు. అతని అనుగ్రహం వారికి చాలా ముఖ్యమైనది, ఒక రచయిత ప్రకారం, విశ్వాసులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అతనికి ప్రార్థనలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు . [4]

సైడిస్

[మార్చు]
స్టాబ్బెన్(Stabben): ఒక సైడిస్‌ (sieidi) రాయి, బాల్స్ఫ్జోర్డ్(Balsfjord)

ఉత్తర స్కాండినేవియా అంతటా విస్తరించిన ప్రకృతి దృశ్యంలో, అసాధారణమైన భూ స్వరూపంతో ఉన్న సైడిస్‌లను చూడవచ్చు. ఇవి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుండి భిన్నంగా కనిపిస్తాయి. వీటిని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలుగా పరిగణిస్తారు. ప్రతి కుటుంబం లేదా వంశం దానికంటూ పూజ నీయమైన స్థానిక ఆత్మలను కలిగి ఉంటుంది, వాటికి వారు తమ రక్షణ కోరుతూనో, అదృష్టం ఆశించో మొక్కుబడులు సమర్పించుకుంటారు. మనిషి లేదా జంతువు లాంటి కొంత పోలికలు ఉండే స్టోర్జున్‌కేర్‌ని కొన్నిసార్లు రాళ్లుగా వర్ణిస్తారు, ఇవి పర్వత శిఖరంపైనో, గుహల లోనో లేదా నదులు, సరస్సుల సమీపంలోనో ఏర్పాటు చేసుంటాయి. చలికాలంలో వాటి కింద తాజా కొమ్మలను, వేసవిలో అయితే ఆకులు లేదా గడ్డినో పరిచి తద్వారా వాటిని గౌరవించుకుంటారు. అన్ని జంతువులు, చేపలు, పక్షులు ఆ స్టోర్జుంకరే అధికార పరధిలోనే ఉంటాయి. వాటిని వేటాడే వారికి, లేదా చేపలు పట్టే వారికి ఆ అదృష్టాన్ని అందజేసింది. రైన్డీర్ ను వారికి ప్రసాదిస్తుంది. ప్రతి వంశానికి, కుటుంబానికి ఒక స్వంత బలి పీఠపు కొండ ఉంటుంది. [5]

నోయిడ్

[మార్చు]

సమాజం తరపున మానవ ప్రపంచానికి, సైవో గా పిలుచు కొనే అధో జగత్తు ( అండర్ వరల్డ్) మధ్య ఒక నోయిడి అనే పురుష మధ్యవర్తి , వేడుకల్లో సాధారణంగా సామీ డ్రమ్ని, ఫాడ్నో అనే దేశీయ వేణువును ఉపయోగిస్తాడు.

పూర్వీకులు

[మార్చు]

మిషనరీల దృక్కోణం లో "జీవించి ఉన్నవారు, మరణించినవారు ఏక కాలంలో ఒకే కుటుంబానికి చెందిన రెండు భాగాలుగా ఉంటారు " అనే సామీల భావన, ప్రపంచం దృష్టిలో అత్యంత సరిదిద్దలేని అంశంగా కనిపిస్తుంది. అయితే సామీలు ఈ భావనను ప్రాథమికమైనదిగా భావించారు. అయితే క్రైస్తవులు చనిపోయిన వారికి, జీవించి ఉన్న వారితో సంబంధం ఏదైనా కలిగి ఉండేందుకు గల అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చారు. [6] ఈ నమ్మకం కేవలం మతంగా మాత్రమే కాదు, వారి పూర్వీకులతో వారి సజీవ సంభాషణ అయినందున, వారి సమాజం పూర్తిగా వెనుక బడిపోయింది. [7]

దేవతల జాబితా

[మార్చు]

సామీ మతం ప్రాంతాలు,తెగల మధ్య కొంత భిన్న మైనదిగా ఉంటుంది. దేవతలు ఒకేలా ఉన్నప్పటికీ, వారి పేర్లు ప్రాంతాల మధ్య మారుతూ ఉంటాయి. దేవతలు కూడా అతివ్యాప్తి చెంది కనిపిస్తారు: ఒక ప్రాంతంలో, ఒక దేవత వేర్వేరు దేవతా రూపాలుగా కనిపిస్తే, మరొక ప్రాంతంలో, అనేక దేవతలు ఏకం అయి కొందరిగానే కన్పిస్తారు. ఈ వైవిధ్యాల కారణంగా, దేవతల విషయంలో కొంత గందరగోళం కనిపిస్తుంది.

సామి ఆరాధించే ప్రధాన దేవతలు : [8] [9] [10] [11]

  • అక్క (Akka)- మదెరక్క, జుక్సక్క, ఉక్సక్కతో సహా సంతానోత్పత్తి దేవతల సమూహం
  • బీవి (Beaivi)- సూర్యుని దేవత, మానవుల తల్లి
  • బీగ్గగల్లిస్(Bieggagallis) - సూర్య దేవత భర్త, మానవుల తండ్రి
  • బీగ్గోల్మాయ్(Bieggolmai) 'మ్యాన్ ఆఫ్ ది విండ్స్' - గాడ్ ఆఫ్ ది గాడ్
  • బిఏజ్జెన్న్ఈఏజ్టే(Biejjenniejte) - వైద్యం, ఔషధం యొక్క దేవత, సూర్యుని కుమార్తె, బీవి
  • హోరగల్లు (Horagalles)- ఉరుము దేవుడు. అతని పేరు " థోర్- మాన్" అని అర్ధం కావచ్చు. అతన్ని "తాత", బజనోల్మ్మై, డ���ర్ప్మిస్, టోర్డామ్ అని కూడా పిలుస్తారు.
  • జహ్బ్మే అక్క (Jahbme akka)- చనిపోయినవారి దేవత, పాతాళం, చనిపోయిన వారి రాజ్యం యొక్క యజమానురాలు
  • ఇప్మిల్ 'గాడ్' - క్రిస్టియన్ గాడ్ యొక్క స్థానిక పేరుగా స్వీకరించబడింది (సంబంధిత ఫిన్నిష్ పదం జుమాల చూడండి ), రాడియన్-అట్జే కోసం కూడా ఉపయోగించబడుతుంది
  • లీయాబోలేమెమ్మ్య్ (Lieaibolmmai)- వేట, వయోజన పురుషుల దేవుడు
  • మద్దెర్-అట్జే (Madder-Attje)- మదెరక్క భర్త, తెగ తండ్రి. అతని భార్య నవజాత శిశువులకు వారి శరీరాలను ఇస్తే, అతను వారి ఆత్మలను వారికి ఇస్తాడు.
  • మనో(Mano), మన్నా, లేదా అస్కే - చంద్రుని దేవుడు
  • ముబ్పియెనాల్మాజ్ (Mubpienålmaj)- క్రైస్తవ సాతానుచే ప్రభావితమైన చెడు దేవుడు
  • రాడియన్-మద్దెర్-అట్జే (Madder-Attje)- మదెరక్క భర్త, తెగ తండ్రి.మద్దెర్-అట్జే (Madder-Attje)- మదెరక్క భర్త, తెగ తండ్రి.అట్జే (Radien-attje)- సృష్టికర్త, ఉన్నత దేవుడు, ప్రపంచ సృష్టికర్త, అధిపతి దైవత్వం. సామీ మతంలో, అతను నిష్క్రియంగా, లేదా నిద్రపోతున్నాడు, తరచుగా మతపరమైన ఆచరణలో చేర్చరు. అతను తన జీవిత భాగస్వామితో కలిసి మానవుల ఆత్మలను సృష్టించాడు. అతన్ని వారల్డెన్ ఓల్మై అని కూడా పిలుస్తారు.
  • రేడీయాహ్క్క (Raedieahkka)- ఉన్నత దేవుడు రాడియన్-అట్జే భార్య. ఆమె తన జీవిత భాగస్వామితో కలిసి మానవుల ఆత్మలను సృష్టించింది.
  • రానా నీజ్తా(Rana Niejta) - వసంత దేవత, రాడియన్-అట్జే, రేడీయాహ్క్క కుమార్తె. [2] రానా, అంటే "ఆకుపచ్చ" లేదా పొడిగింపు ద్వారా "సారవంతమైన", సామీ అమ్మాయిలకు ప్రసిద్ధ పేరు.
  • రేడియన్-పార్డ్నే(Radien-pardne) - రేడియన్-అట్జే,రేడీయాహ్క్క కుమారుడు. అతను తన నిష్క్రియ తండ్రికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు, తన పనులను నిర్వహిస్తాడు, అతని ఇష్టాన్ని నెరవేరుస్తాడు.
  • రుయోట్టా (Ruohtta) - అనారోగ్యం, మరణం యొక్క దేవుడు. అతను గుర్రపు స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది.
  • స్టాల్లో (Stallo) - అరణ్యంలో భయ పెట్టె నరమాంస భక్షక దిగ్గజం.
  • తజేత్సీయాల్మాజ్(Tjaetsieålmaj) - "నీటి మనిషి",నీరు, సరస్సులు, చేపలు పట్టే దేవుడు.

ఇది కూడ చూడు

[మార్చు]
  • సామీ ప్రజలు#మతం
  • సామి ప్రజల క్రైస్తవీకరణ
  • ఫిన్నిక్ పురాణాలు
  • లాపిష్ పురాణాల శకలాలు
  • లార్స్ లెవి లాస్టాడియస్
  • దేశీయ మతం

ప్రస్తావనలు

[మార్చు]

 1. 1 2 హోలోవే, అలాన్ "ఇవ్వర్". "ది డిక్లైన్ ఆఫ్ ది సామి పీపుల్స్ ఇండిజినస్ రిలిజియన్". టెక్సాస్ విశ్వవిద్యాలయం. 2. 1 2 డోనర్, ఒట్టో (1876). "లైడర్ డెర్ లాపెన్ - లప్పలైసియా లౌలుజా". Suomi-sarjan Toinen Jakso, 2 Oso: 13. Cite journal అవసరం |journal= (సహాయం)

3. ↑ లీమింగ్, పేజీలు. 135

4. ↑ ప్రీ- అండ్ ప్రోటో-హిస్టారిక్ ఫిన్స్ బై అబెర్‌క్రోంబీ, పే. 161

5. ↑ ప్రీ- అండ్ ప్రోటో-హిస్టారిక్ ఫిన్స్ బై అబెర్‌క్రోంబీ, pp. 163-164

6. ↑ రైడ్వింగ్, హకాన్ (1993). ది ఎండ్ ఆఫ్ డ్రమ్-టైమ్: లూల్ సామీ మధ్య మతపరమైన మార్పు, 1670-1740లు. ఉప్ప్సల: Almqvist & Wiksell International.

7. ↑ హోల్లోవే, అలాన్ “ఇవ్వర్”. "ది డిక్లైన్ ఆఫ్ ది సామి పీపుల్స్ ఇండిజినస్ రిలిజియన్". TexasU.

8. ↑ హోఫ్బెర్గ్, హెర్మన్, లాపర్నెస్ హెడ్నాట్రో, 1879 ('సామి పాగానిజం')

9. ↑ హోల్మ్బెర్గ్-హర్వా, యునో, లప్పర్నాస్ మతం: (లప్పలైస్టెన్ ఉస్కొంటో, 1915), సెంటర్ ఫర్ మల్టీఎత్నిక్ రీసెర్చ్ [సెంట్రమ్ ఫర్ మల్టీఎట్నిస్క్ ఫోర్స్కినింగ్], ఉప్ప్సల, 1987 ('సామి యొక్క విశ్వాసం')

10. ↑ కార్స్టన్, రాఫెల్, సేమ్ఫోల్కెట్స్ మతం: డి నార్డిస్కా లాపర్నాస్ హెడ్నిస్కా ట్రో ఓచ్ కల్ట్ ఐ రిలిజియన్‌షిస్టోరిస్క్ బెలిస్నింగ్, స్టాక్‌హోమ్, 1952 ('ది సామి మతం')

11. ↑ రాయిటర్‌స్కిల్ద్, ఎడ్గార్, డి నార్డిస్కా లప్పర్నాస్ మతం, నోర్‌స్టెడ్ట్, స్టాక్‌హోమ్, 1912 (ది రిలిజియన్ ఆఫ్ ది నార్తర్న్ సామి)

గ్రంథ పట్టిక

[మార్చు]
  • అబెర్‌క్రోంబీ, జాన్ (1898). పూర్వ, ప్రోటో-హిస్టారిక్ ఫిన్స్. డి. నట్.
  • బాక్మ్యాన్(Bäckman), లూయిస్; హుల్ట్ క్రన్ట్జ్ (Hultkrantz, Åke, eds.) (1985) సామీ ప్రీ-క్రిస్టియన్ రిలీజియన్: సామీలలో మతం యొక్క పురాతన జాడలపై అధ్యయనాలు. స్టాక్‌హోమ్: ఆల్మ్‌క్విస్ట్ & విక్సెల్.
  • లీమింగ్, డేవిడ్ ఆడమ్స్ (2003). యూరోపియన్ మిథాలజీ. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. pp. 133–141 ఫిన్నిక్, ఇతర నాన్-ఇండో-యూరోపియన్ పురాణాలు. ISBN 9780195143614.

బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Holloway, Alan "Ivvár". "The Decline of the Sámi People's Indigenous Religion". University of Texas.
  2. 2.0 2.1 Donner, Otto (1876). "Lieder der Lappen - Lappalaisia lauluja". Suomi-sarjan Toinen Jakso, 2 Oso: 13. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. Leeming, pp. 135
  4. Pre- and Proto-Historic Finns by Abercromby, p. 161
  5. Pre- and Proto-historic Finns by Abercromby, pp. 163-164
  6. Rydving, Håkan (1993). The End of Drum-Time: Religious Change among the Lule Saami, 1670s-1740s. Uppsala: Almqvist & Wiksell International.
  7. Holloway, Alan “Ivvár”. "The Decline of the Sámi People's Indigenous Religion". TexasU.
  8. Hofberg, Herman, Lapparnes hednatro, 1879 ('Sami Paganism')
  9. Holmberg-Harva, Uno, Lapparnas religion: (Lappalaisten uskonto, 1915), Centre for Multiethnic Research [Centrum för multietnisk forskning], Uppsala, 1987 ('The faith of the Sami')
  10. Karsten, Rafael, Samefolkets religion: de nordiska lapparnas hedniska tro och kult i religionshistorisk belysning, Stockholm, 1952 ('The Sami religion')
  11. Reuterskiöld, Edgar, De nordiska lapparnas religion, Norstedt, Stockholm, 1912 (The religion of the Northern Sami)