శతావరి
శతావరి | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఎ. రెసిమోసస్
|
Binomial name | |
ఆస్పరాగస్ రెసిమోసస్ | |
Synonyms | |
శతావరి (ఆంగ్లం Shatavari) ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్పరాగేసి (Asparagaceae) కుటుంబంలో ఆస్పరాగస్ (Asparagus) ప్రజాతికి చెందినది. దీని శాస్త్రీయనామం ఆస్పరాగస్ రెసిమోసస్ (Asparagus racemosus). ఇవి హిమాలయాలలోను, భారతదేశమంతా పెరుగుతుంది. ఇది 1-2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.[2][3] దీనిని వృక్షశాస్త్రజ్ఞులు 1799 సంవత్సరంలో గుర్తించారు.[1] శతావరి అనగా సంస్కృతంలో నూరు వ్యాధుల్ని నయం చేస్తుందని అర్ధం (శత = నూరు; వరి = నయంచేస్తుంది).
లక్షణాలు
[మార్చు]- ఈ మొక్కలు 1-2 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
- వీనికి ఆకుపచ్చరంగులో చిన్న సూదుల్లాంటి ఆకులుంటాయి.
- వీటి సన్నని కాండం ��ీద చిన్న తెల్లని పువ్వులు పూస్తాయి.
- వీటికి గుండ్రని నలుపు రంగు బెర్రీ పండ్లు కాస్తాయి.
- వీటి వేర్లు దుంపవేర్లుగా సుమారు ఒక మీటరు పొడవున రెండు వైపులా మొనదేలి ఉంటాయి. ఇవి ప్రతి మొక్కలు నూరుకు పైగా తయారౌతాయి.
ఉపయోగాలు
[మార్చు]ఈ మొక్కలో స్టెరాయిడల్ గ్లైకోసైడ్ శతావరిన్ 1-5 అనే పోలిసైక్లిక ఆల్కలా యిడ్, ఆస్పరాగమైన్-ఎ, డైహైడ్రోఫెనాం త్రీన్ రేసివెూసోల్ అనబడే రసాయనాలు పుష్కళంగా ఉంటాయి. ఆయుర్వేదపరంగా శతావరిని ఉదరసంబంధ (అల్సర్, గ్యాస్టిక ట్రబుల్) వ్యాధులకి, నరాల బలహీనతకి, ఇతర అనేక రుగ్మతలకి ఔషధంగా వినియోగిస్తారు. అస లు శతావరి అంటేనే వంద రోగాలని నయంచేసేది అని అర్ధం. శతావరి మొక్కల్లో మనకి అత్యంత గా ఉపయోగపడే భాగం దుంపల మాదిరిగా ఉండే వేర్లు మాత్రమే. ఇవి చేదుగా ఉంటా యి. కానీ శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంది. ఈ వేర్లుతో తయారైన ఔషధులు మూత్రపిండాల వ్యాధులకి, నేత్ర సంబంధ వ్యాధులకీ, లైంగి'్స్హక ఉత్తేజ కారకాలుగా, జీర్ణశక్తిని పెంచి ఆకలి పుట్టించడానికి, విరే చనాలు అరికట్టడానికి, కీళ్ళ నొపðలకి, గొంతులో ఇన్‌ఫెక్షన్ నివా రించడానికి, వాడతారు. దుంపల్ని తినడం వల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారిం చబడి, ఆకలి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తు న్నారు. స్త్రీల అన్ని రకాల ఆరోగ్య సమస్య లకీ శతావరి టానిక మంచి దివ్యౌషధము. శతావరి హార్మోన్స్ ఉత్పత్తి చేయడంలో ఎంతో ఉప యోగపడుతుంది. అంతేకాక బాలింత లకి పాలు వృద్ధిచెంది శిశువుకి పోషక విలువలనందిస్తుంది. స్త్రీల లో మినోపాజ్ వల్ల ఏర్పడే రుగ్మతల్ని తొలగి స్తుంది. దీని నుండి తయారు చేయబడు తున్న 'శతావరికల్ప' అందరికీ ఆరోగ్యదాయి నిగా ఆయుర్వేద జనరల్ టానికగాే వాడుతు న్నారు. శతావరి చూర్ణం, శతావరి పౌడరు, శతావరి మాత్రలు ఇలా ఎన్నో విధాలుగా మనకి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. కీళ్ళనొపðలకి, నరాల బలహీనతకి దీని వేరుని గంధంగా నూరి పూస్తే మంచి ఉపశ మనం కలుగుతుంది. సౌందర్య సాధనాలలో కూడా దీనిని వినియోగించడం విశేషం. నోటి వ్యాధులు కూడా దీని వల్ల నివారించ బడతాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Asparagus racemosus information from NPGS/GRIN". Germplasm Resources Information Network. USDA. August 6, 2002. Retrieved April 25, 2009.
- ↑ Robert Freeman (February 26, 1998). "LILIACEAE - Famine Foods". Center for New Crops and Plant Products, Department of Horticulture & Landscape Architecture. Purdue University. Retrieved April 25, 2009.
- ↑ "Asparagus racemosa". Retrieved April 25, 2009.