ఒక వస్తువుని చీకటి వెలుగుల మిశ్రమంలో కెమెరా గా పిలువబడే యంత్రంతో ఫిల్మ్ మీద ( ఇప్పుడు డిజిటల్ ఉపకరణములలో ) చిత్రీకరించే శాస్త్రాన్ని ఫోటోగ్రఫి అంటారు.ఇది ప్రపంచములో అందరికి ఉపయోగపడే శాశ్రీయమయిన కళ. చాయచిత్రీకరణకి కెమెరా,కటకాలు,ఫిల్మ్,ఎన్లార్జర్,ఫోటో పేపర్,రసాయనాలు,కాంతి లేదా వెలుతురు(సూర్య కాంతి),దీపాలు,విద్యుత్ శక్తి కావలసిన వనరులు.మానవుని జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన చక్రం,విద్యుత్శక్తి,ఫోన్,రైల్,విమానం లాగే ఫోటోగ్రఫీ కూడా అనటం అతిశయోక్తి కాదు.
అసలు ఫోటోగ్రఫి అనే పదం పురాతన గ్రీక్ పదాలయిన φωςఫోస్(light)మరియు γραφηgraphêగ్రఫే ("stylus","paintbrush") లేక γραφω graphōగ్రఫో (the verb, "I write/draw"),రెండు పదాల కలయికతో వెలుతురుతో చిత్రీకరణ లేదా చిత్రీకరణ అని అప్పటి చిత్రకారులు పరిశోధకులు వాడటముతో ఫోటోగ్రఫి గా రూపాంతరం చెందింది. మొట్టమొదట ఛాయాచిత్రాన్ని(ఫోటోగ్రాప్)1826లో నేసెఫార్ నీప్సే (Nicéphore Niépce)అనే ఫ్రెంచ్ పరిశోధకుడు పెవటెర్ (pewter)
అనే పల్లెరం మీద చిత్రీకరించాడు.పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన బిటుమేన్ మరియు జుడియా అని పిలువబడే రసాయనం ల మిశ్రమాన్ని పెవటెర్ అనే మెరుగు పెట్టిన పళ్లెం మీద పూసి ఈ ఘనకార్యాన్ని సాధించగాలిగాడు. డబ్బా కెమెరా (Box camera) తో రసాయనపూత పూసిన గాజు (glass) చాయచిత్ర సంగ్రకాల(photoplate) నుండి ఫిల్మ్ తో, ఇప్పుడు అత్యంత ఆధునిక డిజిటల్ కామేరాలతో కంటికి కనిపించని అత్యంత సూక్ష్మ కణాలని,కనిపించే అన్నిరకాలయిన వాటిని కంటికి కనిపించని కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోని గ్రహాలని కూడా చక్కగా సహజమయిన రంగులలో చిత్రీకరించే వరకు ఫోటోగ్రఫీ అభివృద్ది చెందింది.
(మొత్తం వ్యాసం చూడండి)
ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహణం (Photography) అనునది కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను భద్రపరచటం తో బాటు రసాయనిక చర్యల తో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం (photographic film) వలన గానీ /ఎలక్ట్రానిక్ ప్రక్రియతో ఇమేజ్ సెన్సర్ (చిత్రాలని గుర్తించే పరికరము) వలన గానీ మన్నికైన చిత్రాలని సృష్టించే/ముద్రించే ఒక కళ/శాస్త్రము/అభ్యాసము. సాధారణంగా ఒక వస్తువు పై ప్రసరించే కాంతిని గాని, లేదా ఒక వస్తువు నుండి వెలువడుతున్న కాంతిని గానీ ఒక కటకం (lens)తో దృష్టి (focus) ని కేంద్రీకరించి, కెమెరా లో ఉండే కాంతిని గుర్తించే ఉపరితలం పై నిర్దిష్ట సమయం వరకూ బహిర్గతం (exposure) చేయటం తో ఆ వస్తువుల నిజ ప్రతిబింబం (real image) సృష్టించటం జరుగుతుంది. దీని ఫలితంగా వైద్యుదిక చిత్ర సంవేదిక (electronic image sensor) లోని ప్రతి ఒక్క చిత్ర కణము (pixel) పై విద్యుచ్ఛక్తి (electrical charge) వైద్యుదిక చర్య (electronical processing) జరిగి తర్వాత ప్రదర్శితమగుటకు, మార్పులు చేసుకొనుటకు సాంఖ్యిక ప్రతిబింబం (digital image) ఫైల్ గా భద్రపరచబడుతుంది.
... ఫిలిం ను కెమెరాలో తప్పుగా లోడ్ చేయటం రెడ్ స్కేల్ అనే ప్రక్రియకి దారి తీసిందనీ... ఫిలిం లు ఉపయోగంలో లేని ఈ కాలం లో కూడా ఉద్దేశ్యపూర్వకంగా ఆ ప్రభావాన్ని తేవటానికి చాలా ఫోటోగ్రఫర్ లు శ్రమిస్తారనీ...
ఫోటోగ్రఫి వ్యాసాన్ని విస్తరించటం. ఈ వ్యాసంలోని ఎర్ర లింకులని వీలైనన్ని తగ్గించటం
మూస:ఛాయాచిత్రకళ లోని ఎర్ర లింకులని వీలైనన్ని తగ్గించటం. ఛాయాచిత్రకళకి సంబంధించిన మరిన్ని వ్యాసాలని ఈ మూసలో చేర్చటం
ఛాయాచిత్రకళ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం
ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన ఛాయాచిత్రకళా రూపాల, సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.
మిడ్-రేంజ్ ఎస్ ఎల్ ఆర్ తో బాటు వీడియో రికార్డింగ్ కల నికాన్ డి90 విడుదల
2005
నికాన్ డి3 మరియు నికాన్ డి700 విడుదల
1999
సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా నికాన్ డి1 విడుదల
1995
ఈ ఎఫ్ 75-300 ఎం ఎం పేరు తో కెనాన్ కెమెరా కటకం విడుదల చేసినది
1992
ఈ ఓ ఎస్ 5 మరియు పవర్ షాట్ 600 (ఇది కెనాన్ యొక్క మొదటి డిజిటల్ కెమెరా) లని కెనాన్ విడుదల చేసినది.
1991
DCS 100 పేరుతో కొడక్ వాణిజ్యపరంగా మొట్టమొదటి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాని అందుబాటులోకి తెచ్చింది
1988
Nippon Kōgaku Kōgyō Kabushikigaisha గా స్థాపించబడిన సంస్థ Nikon Corporation గా మారినది
1987
ఎలెక్ట్రో ఆప్టికల్ సిస్టం (ఈ ఓ ఎస్) శ్రేణిలో మొట్టమొదటిదైన కెనాన్ ఈ ఓ ఎస్ 650 విడుదల
1981
మొట్టమొదటి ఛార్జ్ కపుల్డ్ డివైస్ ని సోనీ మావికా అనే కెమెరాలో వినియోగం. దీనితో ఫిలిం కి తెర పడింది.
1980
నికాన్ ఎఫ్ 3 విడుదల
1976
మైక్రోకంప్యూటర్ తో అనుసంధానించబడిన ప్రపంచం లోనే మొట్టమొదటి కెమెరా ఏఈ-1 ని కెనాన్ రూపొందించినది
1971
కెనాన్ ఎఫ్-1 అనబడు ఎస్ ఎల్ ఆర్ కెమెరాని విడుదల చేసినది
నికాన్ ఎఫ్ 2 విడుదల
1965
కెనాన్ పెలిక్స్ అనబడు సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా విడుదల
1963
పోలరాయిడ్ ఇన్స్టంట్ కలర్ ఫిలిం ను కనుగొన్నది
1961
కెనాన్ 7 అనబడు రేంజ్ ఫైండర్ కెమెరా విడుదలైనది
1959
కెనాన్ మొట���టమొదటి చలనచిత్ర కెమెరా అయిన రిఫ్లెక్స్ జూం 8 ని విడుదల చేసినది
కెనాన్ 35 ఎం ఎం ఫిలిం సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా అయిన కెనాన్ ఫ్లెక్స్ ని విడుదల చేసినది
నికాన్ తన మొట్టమొదటి సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా అయిన నికాన్ ఎఫ్ ని విడులద చేసినది
1958
టెలివిజన్ ప్రసారలకై కెనాన్ జూం కటకాన్ని కనుగొన్నది
1957
నికాన్ తన రేంజ్ ఫైండర్ కెమెరా అయిన నికాన్ ఎస్ పి ని విడుదల చేసినది
1948
మొట్టమొదటి నికాన్ కెమెరా నికాన్ ఐ విడుదల
1940
కెనాన్ మొదటి ఎక్స్-రే కెమెరాని రూపొందించినది
1937
కెనాన్ మాతృ సంస్థ అయిన ప్రెసిషన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబొరెటరీ స్థాపన
1936
అగ్ఫా యొక్క కలర్ ఫిలిం అగ్ఫా కలర్ న్యూ రూపొందించబడినది
1935
మొట్టమొదటి కలర్ ఫిలిం (ఇంటెగ్రల్ ట్రైప్యాక్ లేదా మోనోప్యాక్) ని కోడాక్ కోడాక్రోం పేరు తో పరిచయం చేసింది.
1932
నికాన్ యొక్క Nikkor బ్రాండు పరిచయం
1917
నికాన్ మాతృ సంస్థ అయిన జపాన్ ఆప్టికల్ ఇండస్ట్రీస్ కో., లి.మిత్సుబిషి చే స్థాపన
1908
గాబ్రియల్ లిప్మన్ వ్యతీకరణ పద్ధతి ద్వారా ఫోటోలలో రంగులను పునరుత్పత్తి చేయగల లిప్మన్ ప్లేట్ ను కనుగొన్నాడు
1907
లూమియర్ సోదరులచే ఆటోక్రోం అనే కలర్ ఫోటోగ్రఫీ ప్రక్రియ కనుగొన్నారు
1888
జార్జ్ ఈస్ట్మన్ మరియు హెన్రీ ఏ స్ట్రాంగ్ లు కలిసి కొడాక్ సంస్థను స్థాపించారు
1884
జార్జ్ ఈస్ట్మన్ ఫోటోగ్రఫిక్ ప్లేట్ ల స్థానే ఫిలిం ని ఉపయోగించే సాంకేతికతని కనుగొన్నాడు
1873
జర్మను ఫోటోకెమిస్ట్ హెర్మన్ వోగెల్ ఆకుపచ్చ, పసుపుపచ్చ మరియు ఎరుపు రంగులని గుర్తించగలిగే డై సెన్సిటైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్నాడు. ఇదే కలర్ ఫోటోగ్రఫీ ని వాణిజ్య రంగం వైపుకి మరల్చింది
1861
మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటోని తీశారు
1860
లూయీస్ డుకోస్ డు హారోన్ అనే ఫ్రెంచి ఫోటోగ్రఫర్ సబ్ట్రాక్టివ్ మెథడ్ ఆఫ్ కలర్ రీప్రొడక్షన్ (వ్యవకలన పద్ధతి)ని కనుగొన్నాడు
1855
స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త జేంస్ క్లర్క్ మ్యాక్స్వెల్ మూడు రంగుల వేర్పాటు సిద్ధాంతం (త్రీ-కలర్-సెపరేషన్ ప్రిన్సిపల్) ని కనుగొన్నాడు
1851
ఫ్రెడరిక్ స్కాట్ wet plate collodion ప్రక్రియని ప్రచురించాడు
1840
ఇంగ్లీషు ఆవిష్కర్త విలియం హెన్రీ ఫాక్స్ టాల్బట్ సిల్వర్ ప్రక్రియ చిత్రాన్ని శాశ్వతీకరించటానికి డాగ్యురె ప్రక్రియని ఆధారం చేసుకొని దానినే మరింత అభివృద్ధి చేసి నెగిటివ్ లని రూపొందించే క్యాలోటైప్ ప్రక్రియని కనుగొన్నాడు
ఫిబ్రవరి 25: Vossische Zeitung అనే జర్మను వార్తాపత్రికలో జొహాన్ వాన్ మేడ్లర్ అనే బెర్లిన్ ఖగోళ శాస్త్రవేత్త ఈ పదాన్ని వాడాడు
జాన్ హర్షల్ సోడియం థయోసల్ఫేట్ ఫోటోలని స్థిరీకరించి మన్నగలిగేలా చేస్తుందని టాల్బట్ మరియు డాగురె లకి సమాచారమందించాడు. మొదటి గ్లాస్ నెగటివ్ ని తయారు చేశాడు
1838
పాలిష్ చేయించుకోవటానికి ఒక వ్యక్తి కొన్ని నిముషాల బాటు ఆగి ఉండగా, లూయిస్ డాగ్యురె అతనిని చిత్రీకరించాడు
1837
నిసేఫోర్ నీప్సె తో కలసి సిల్వర్ కాంపౌండ్ ల పై ప్రారంభించిన ప్రయోగాలని నీప్సే మరణించిన తర్వాత కూడా కొనసాగించిన లూయీస్ డాగ్యురె డాగ్యురోటైప్ ని కనుగొన్నాడు
1835
ఇప్పటివరకూ తెలిసిన అతి పురాతమైన నెగటివ్ గా గుర్తించబడిన ల్యాకోక్ అబ్బే లోని ఓరియల్ కిటికీ యొక్క ఛాయాచిత్రం తీయబడినది
1834
బ్రెజిల్ లోని కెంపినాస్ లో హెర్క్యూల్స్ ఫ్లారెన్స్ అనే ఒక ఫ్రెంచి చిత్రకారుడు మరియు ఆవిష్కర్త ఒకానొక పద్ధతిని వివరించేందుకు తన డైరీలో "photographie" అనే పదాన్ని రాసుకొన్నాడు.
1832
బ్రెజిల్ కు చెందిన హెర్క్యులెస్ ఫ్లారెన్స్ ఇంచుమించు డాగ్యురోటైప్ పద్ధతిని అవలంబించి దానిని ఫోటోగ్రఫీ అని వ్యవహరించాడు
1826
నిసేఫోర్ నీప్సె తన కెమెరా అబ్స్క్యూరా తో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ వ్యూ ఫ్రం ద విండో ఎట్ లే గ్రాస్ (View from the Window at Le Gras) ని సృష్టించటంలో సఫలీకృతులు
1822
ఫ్రెంచి ఆవిష్కర్త నిసేఫోర్ నీప్సె మొట్టమొదటి శాశ్వత చిత్రాన్ని ముద్రించిననూ, డూప్లికేట్ చేసే ప్రక్రియలో అది చెడిపోయినది