Jump to content

వెంకటేష్ ప్రసాద్

వికీపీడియా నుండి
వెంకటేష్ ప్రసాద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బాపూ కృష్ణారావ్ వెంకటేష్ ప్రసాద్
పుట్టిన తేదీ (1969-08-05) 1969 ఆగస్టు 5 (వయసు 55)
బెంగళూరు, మైసూరు రాష్ట్రం
ఎత్తు1.91 మీ. (6 అ. 3 అం.)
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగుకుడిచేతి వాటం మీడియం-ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 204)1996 జూన్ 7 - ఇంగ్లండు తో
చివరి టెస్టు2001 ఆగస్టు 29 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 89)1994 ఏప్రిల్ 2 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2001 అక్టోబరు 17 - కెన్యా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991–2003కర్ణాటక రాష్ట్ర జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టు వన్‌డే దేశీవాళీ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 33 161 123 236
చేసిన పరుగులు 203 221 892 304
బ్యాటింగు సగటు 7.51 6.90 10.02 6.46
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 30* 19 37 20
వేసిన బంతులు 7,041 8,129 22,222 11,951
వికెట్లు 96 196 361 295
బ��లింగు సగటు 35.00 32.30 27.75 29.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 7 1 18 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 3 0
అత్యుత్తమ బౌలింగు 6/33 5/27 7/37 6/18
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 37/– 75/– 56/–
మూలం: CricketArchive, 2017 సెప్టెంబరు 2

వెంకటేష్ ప్రసాద్ (జ. 1969 ఆగస్టు 5)[1] భారత మాజీ క్రికెట్ ఆటగాడు. టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పటి మైసూరు రాష్ట్రంలో బెంగుళూరులో జన్మించిన వెంకటేష్ ప్రసాద్ 1994 లో తన కెరీర్ మొదలు పెట్టాడు. ప్రసాద్ ప్రధానంగా కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్. జవగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ తో కలిసి కొంతకాలం భారత జట్టులో మంచి జోడీగా పేరుపొందారు.[2] ప్రసాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కింగ్స్ XI పంజాబ్ కి బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. 2007 నుంచి 2009 మధ్యలో భారత క్రికెట్ జట్టుకి కూడా బౌలింగ్ కోచ్ గా సేవలందించాడు.

అంతర్జాతీయ క్రీడల్లో ప్రసాద్ మొత్తం 33 టెస్టులాడి 35 సగటున 96 వికెట్లు తీశాడు. 161 వన్డేలు ఆడి 32.3 సగటుతో 196 వికెట్లు తీశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వెంకటేష్ ప్రసాద్ పూర్తి పేరు బాపు కృష్ణారావ్ వెంకటేష్ ప్రసాద్. 1969 ఆగస్టు 5న అప్పటి మైసూరు రాష్ట్రం, బెంగళూరులో జన్మించాడు.

1996 ఏప్రిల్ 22 న తనకన్నా వయసులో పెద్దదైన జయంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి పృథ్వి అనే కుమారుడు ఉన్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Cricinfo - Players and Officials - Venkatesh Prasad". Retrieved 2008-08-29.
  2. "Could have played little longer but knees made it difficult, says Javagal Srinath". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-20. Retrieved 2021-03-02.
  3. Staff (2008-01-23). "Love Stories Of Famous Indian Bowlers". boldsky.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-04.