Jump to content

విధేయన్

వికీపీడియా నుండి
విధేయన్
దర్శకత్వంఅడూర్ గోపాలక్రిష్ణన్
స్క్రీన్ ప్లేఅడూర్ గోపాలక్రిష్ణన్
దీనిపై ఆధారితంపాల్ జకారియా రాసిన భాస్కర పట్టెలరుమ్ ఎన్టీ జీవితం అనే నవల ఆధారంగా
నిర్మాతకె. రవీంద్రన్ నాయర్
తారాగణంమమ్ముట్టి
ఎంఆర్ గోపకుమార్
తన్వి ఆజ్మీ
ఛాయాగ్రహణంమంకడ రవివర్మ
కూర్పుఎం. మణి
సంగీతంవిజయ భాస్కర్
నిర్మాణ
సంస్థ
జనరల్ పిక్స్
విడుదల తేదీ
1994
సినిమా నిడివి
112 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

విధేయన్, 1994లో విడుదలైన మలయాళ సినిమా. జనరల్ పిక్స్ బ్యానరులో కె. రవీంద్రన్ నాయర్ నిర్మించిన ఈ సినిమాకు అడూర్ గోపాలక్రిష్ణన్ దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలో మమ్ముట్టి, ఎంఆర్ గోపకుమార్, తన్వి ఆజ్మీ ప్రధాన పాత్రలు పోషించగా, విజయ భాస్కర్ సంగీతం అందించాడు.[2] మలయాళ రచయిత పాల్ జకారియా రాసిన భాస్కర పట్టెలరుమ్ ఎన్టీ జీవితం అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు మలయాళంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, జాతీయ ఉత్తమ నటుడు (మమ్ముట్టి) అవార్డులు వచ్చాయి. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంతోపాటు అనేక అవార్డులను గెలుచుకుంది.

నటవర్గం

[మార్చు]
  • మమ్ముట్టి (భాస్కర పటేలర్‌)
  • ఎంఆర్ గోపకుమార్ (థమ్మీ)
  • తన్వి అజ్మీ (భాస్కర పటేలర్ భార్య)
  • సబిత ఆనంద్ (ఓమన)
  • అలియర్
  • బాబు నంబూతిరి
  • కెపిఏసి అజీజ్
  • ప్రొ. కెవి తంపి
  • కృష్ణన్ కుట్టినాయర్
  • నవీన్ డి. పాడిల్

నిర్మాణం

[మార్చు]

జకారియా రాసిన ఈ నవల పటేలా శేఖర గౌడ (శిరాడి శేఖర) అనే నిజ జీవిత పాత్రను దృష్టిలో ఉంచుకొని రాయబడింది. రచయిత జటారియా కర్ణాటకలోని మంగళూరు సమీపంలో నివసిస్తున్నప్పుడు ఈ పటేలార్ కథలు విన్నాడు.[3] సినిమా విడుదలైన తర్వాత, అడూర్ సినిమాపై జకారియాతో గొడవ పెట్టుకున్నాడు. అడూర్ తన కథను హిందుత్వంతో నింపాడని జకారియా అన్నాడు.[4]

అవార్డులు

[మార్చు]
1993 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు[5]
ఇతర ��వార్డులు
  • రోటర్‌డామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎన్ఈటిపిఏసి అవార్డు[6]
  • ఇంటర్‌ఫిల్మ్ అవార్డు - మన్‌హీమ్ -హైడెల్‌బర్గ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం[6]
  • ఫీచర్ ఎఫ్ఐపిఆర్ఈఎస్సిఐ, స్పెషల్ జ్యూరీ ప్రైజ్, సింగపూర్

మూలాలు

[మార్చు]
  1. "Vidheyan (1993) | Vidheyan Malayalam Movie | Movie Reviews, Showtimes". NOWRUNNING (in ఇంగ్లీష్). Retrieved 2021-08-26.
  2. "Vidheyan (1993)". Indiancine.ma. Retrieved 2021-08-26.
  3. "പട്ടേലർ എന്നൊരു സത്യം". Malayala Manorama. March 27, 2011.
  4. Gowri Ramnarayan (September 24 – October 7, 2005). "A constant process of discovery". Frontline (magazine). Retrieved 2021-08-26.
  5. "Kerala State Film Awards: 1993". Kerala State Chalachitra Academy. Archived from the original on 2 October 2010. Retrieved 2021-08-26.
  6. 6.0 6.1 http://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/Must-Watch-International-Award-Winning-Malayalam-Films/Must-Watch-International-Award-Winning-Malayalam-Films/photostory/52255804.cms

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విధేయన్&oldid=4213882" నుండి వెలికితీశారు