Jump to content

వాడుకరి చర్చ:Purushotham9966

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Purushotham9966 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Purushotham9966 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు ప్రభాకర్ గౌడ్ నోముల గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 13:43, 17 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

krutagjatalu Purushotham9966 (చర్చ) 02:02, 8 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం Purushotham9966 గారు. తెలుగు వికీపీడియాకు స్వాగతం. ఇక్కడ తెలుగులో రాయడం బహు తేలిక.. రాసే ఎడిట్ పెట్టె లోనే ఒక సౌలభ్యం ఉంది.. తెలుగును ఇంగ్లీషులో (రోమను లిపిలో) రాసుకుంటూ పోతూంటే అది తెలుగులోకి మారుస్తూ పోతుంది. అంటే "నేను వస్తున్నాను" అని రాయాలంటే, మనం ఆ పెట్టెలో nEnu vastunnaanu అని రాయాలి. రాస్తూ రాస్తూ ఉండగానే దాన్ని తెలుగు లోకి మారుస్తూంటూంది. నేను ఇది అలానే రాసాను. మీరూ ప్రయత్నించి చూడండి.__ చదువరి (చర్చరచనలు) 02:24, 8 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ.. ఈ సంగతి మీకు ఈసరికే తెలుసని నేను గ్రహించాను. ఇక్కడ కృతజ్ఞతలు (kRtaj~natalu) అనే మాటను ఇంగ్లీషులో రాస్తేనూ.., తెలీదనుకున్నానండి. __ చదువరి (చర్చరచనలు) 02:27, 8 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఓకే Purushotham9966 (చర్చ) 04:00, 8 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మిత్రులకు నమస్కారం. 5 నిమిషాలకు ఒక రచన చేసినట్లు భావిస్తున్నారు. కాదండి, నేను పరిశోధించి పుస్తక రూపంలో తెచ్చిన విషయాలే. వికీ భాష అన్నారు. మీ ప్రమాణాల్లో లేకపోతే సవరించండి. నాకు 82 సంవత్సరాలు. ఇందులో రాయకపోయినా ఏమీ కాదు.
సెలవు. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, విశ్రాంత ప్రిన్సిపల్, సర్వోదయ పీజీ. కాలేజీ, నెల్లూరు. Purushotham9966 (చర్చ) 06:25, 22 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాకు స్వాగతం

[మార్చు]

నమస్కారం Purushotham9966 గారు. తెలుగు వికీపీడియాకు స్వాగతం. మీరు ముందుగా మీ పేరు ఎరుపు అక్షరాలతో కనిపిస్తుంది కదా మీ పేరు పైన నొక్కండి అప్పుడు మీ ఖాతా పేజీ ప్రారంభమవుతుంది. దానిని ప్రచురించండి అనగా సేవ్ చేయడం, మీరు ఎక్కడ ఉన్న పైన నుండి కింద వరకు ఇది సెర్చ్ మొత్తం చదవడానికి ప్రయత్నించండి. కొంతవరకు అవగాహన వస్తుంది ఏమైనా ఇబ్బందులు ఉంటే అడగండి వికీపీడియా కూడా వాట్సాప్ లాగా అడ్మిన్స్ ఉంటారు ప్రతి ఒక అక్షరాన్ని గమనిస్తూ ఉంటారు ఇంతకుముందు పలకరించిన వారు స్వాగతం చెప్పింది నాగేశ్వరరావు గారు వికీపీడియా సభ్యులు, చదువరి గారు అడ్మిన్ గారు నేను ఒక సభ్యుని ఇలా చాలా మంది ఉన్నారు గమనిస్తూ ఉంటారు. మీరు ఏమి అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం... ఏమైనా అనుమానం ఉంటే మళ్ళీ మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేదు ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్చర్చ 03:45, 13 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

krutagjatalu . నేను datinavanni/కొంచం షహకరించండి. కొన్ని విషయాలు గుర్తుండవు. ప్రస్తుతం పుష్కరం ఏమీ రాయడంలేదు. రోజు కొందరు గొప్పవాళ్లను గురించి రాస్తామని ప్రయత్నం. మీరు సవరించండి. ఏమీ అనుకోను. na ఫోన్ 9000642079.ఎప్పుడైనా మాట్లాడవచ్చు. సహాయం అర్థిస్తున్నా. Purushotham9966 (చర్చ) 10:33, 18 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం

[మార్చు]

నమస్కారం సార్. మీరు రాసిన కొన్ని వ్యాసాల్లో (నోముల అప్పారావు, పి శ్రీనివాసులు) తగిన మూలాలు లేవని గమనించాను. దీని వలన ఆయా వ్యక్తుల ప్రాధాన్యత ఏమిటో తెలియకున్నది. తెలియనంత మాత్రాన వారికి ప్రాముఖ్యత లేదని అర్థం కాదు. కానీ, విషయ ప్రాముఖ్యత ఉందని తెలియజెప్పే మూలాలు ఉండడం, ఆ మూలాలను ఎవరైనా నిర్థారించుకునే వీలు ఉండడం వికీపీడియాలో తప్పనిసరి. నేను ఆ వ్యక్తుల ప్రాముఖ్యతను నిరూపించే ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని చూసాను గానీ, నాకు దొరకలేదు. మీవద్ద తగు ఆధారాలేమైనా ఉంటే ఆయా పేజీల చర్చ పేజీలో చేర్చవలసినది. పుస్తక మూలాలున్నా (పుస్తకం పేరు, రచయిత, ప్రచురణ సంవత్సరం, ప్రచురణ సంస్థ, పేజీల సంఖ్య వగైరాలు) చేర్చవచ్చు.

అలాగే, ఆయా పేజీల్లో ఇచ్చిన సమాచారానికి ఆధారంగా తగిన మూలాలను కూడా చేర్చవలసినదిగా కోరుతున్నాను. ఆ మూలాలు కూడా విషయ ప్రాముఖ్యతను నిరూపించేందుకు ఉపయోగపడవచ్చు. __చదువరి (చర్చరచనలు) 16:35, 12 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నోముల అప్పారావు నెల్లూరులో 1940 ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు నెల్లూరు టౌన్ హాల్లో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేసిన విష్యం పుస్తకంలో ఉంది. ఆయన తెలుగు, సంస్కృత పుస్తకాల జాబితా ఉంది. ప్రకారణాల్లో కాకినాడ చిరునామా ఉంది. ఆయన కవిత్వం ప్రౌఢంగా ఉంది. ఫోటో వారి బుక్ లోనిదె. ఎక్కడో రికార్డు కకాకపోతే అటువంటి పండితుల వివరం మరచిపోతారని. పత్రికలు రిపోర్టులు, అచ్చు పుస్తకాలూ ప్రమాణం కావ? Purushotham9966 (చర్చ) 04:05, 26 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా ఫోటోలు తొలగించారు. ఒక ఉదాహరణ:చతుర్వేదుల కృష్ణ 1957 లో చనిపోయారు. మేము పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంవారం పాండిచ్చేరి వెళ్ళి అరవిందో ఆశ్రమలో ఆయన ఫోటో ఉంటే తెచ్చాము. ఆయన అవివాహితుడు. ఒక పుస్తకం రచయిత మరణం తరవాత 60 ఏళ్ళ వరకే వారసులకు హక్కులుంటవి. తర్వాత అందరూ వాడుకోవచ్చు. కొంచం పరిశీలించి ఫోటోల విషయంలో నిర్ణయం తీసుకోండి. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, నెల్లూరు. Purushotham9966 (చర్చ) 12:28, 20 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సూరం సుందరరామయ్య (సుందరరామయోగి) వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

సూరం సుందరరామయ్య (సుందరరామయోగి) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యక్తి విషయ ప్రాముఖ్యతని నిర్థారించే మూలాలు లేవు. ఒక వారం రోజులలో సరైన మూలాలను చేర్చనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సూరం సుందరరామయ్య (సుందరరామయోగి) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 13:28, 4 ఏప్రిల్ 2023 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 13:28, 4 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మామిడిపూడి కృష్ణమూర్తి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

మామిడిపూడి కృష్ణమూర్తి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యక్తిని గూర్చి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మామిడిపూడి కృష్ణమూర్తి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 12:05, 10 ఏప్రిల్ 2023 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 12:05, 10 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సుప్రసిధ్హ చ్రిత్రకారులు మామిడిపూడి వెంకటరంగయ్య తమ్ముని కుమారుడు కృష్ణమూర్తి. ఆతను మద్రాసు ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో సుప్రసిద్హ శిల్పి రాయ్ చౌదరి వద్ద అయిదు సంవత్సరాలు చిత్రలెఖనం అభ్యసించి డిప్లొమా చేసి, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ కార్యదర్శిగా పనిచేసి, ఇప్పుడు అమెరికాలో విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. తాను చిత్రించిన వర్ణచిత్రాలు అనేక ఆంతర్జాతీయ మ్యూజియంలలో ప్రదర్శిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయన నాకు తెలుసు. ఇప్పుడు కూడా తొలగించాలని మీరు భావిస్తే తొలగిఅంచండి. Purushotham9966 (చర్చ) 06:58, 16 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నోముల అప్పారావు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

నోముల అప్పారావు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యక్తి యొక్క విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లభ్యమగుట లేదు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నోముల అప్పారావు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 15:56, 10 ఏప్రిల్ 2023 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 15:56, 10 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఊఇఉఇకుయ్కుకు Purushotham9966 (చర్చ) 06:35, 16 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నోముల అప్పారావు బహుగ్రంథ రచయిత. 1940 ప్రాంతంలో కాకినాడనుంచి నెల్లూరు వచ్చి ఏడాది ఉంది ఒక యోగిని సేవించి వెళ్లారు. వారి ప్రస్తావనలు నెల్లూరు స్థానిక పత్రికలలో ఉన్నాయి. ఆయన గ్రంథాలలో ఒక్కటి మాత్రం మాకు లభించింది. ముఖపత్రం మీద ఫోటో ఇది. అరుదయిన ఫోటో. ఇంకా ఆయన రచనలకు వెదుకుతున్న. మన జాతి సంపదగా ఫోటోను భావిస్తున్న. ఇక మీ ఇష్టం.\ Purushotham9966 (చర్చ) 07:03, 16 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు లేని వ్యాసాలు

[మార్చు]

@Purushotham9966 గారూ... తెవికీలో రచనలు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అయిదే, వికీ నియమాల ప్రకారం వికీ వ్యాసాల విషయ ప్రాముఖ్యతను నిర్ధారించడానికి మూలాలు అవసరం. మూలాలు లేని వ్యాసాలు తొలగించబడుతాయి. కాబట్టి, వికీలో ఇంతకుముందే ఉన్న వ్యాసాలను పరిశీలించి మూలాల అవసరాల గురించి తెలుసుకోగలరు. మీరు ఈరోజు రాసిన 'నెల్లూరులో మణి బుక్ స్టాల్ స్థాపకులు మణి' వ్యాసాన్ని మూలాలు చేర్చి అభివృద్ధి చేసేవరకు మీ వాడుకరి ఉపపేజీకి తరలిస్తున్ననాను. తగిన మూలాలు చేర్చి వ్యాస విషయ ప్రాముఖ్యతను నిర్ధారించగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:23, 18 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అతన్ని గురించి తెలుగు అన్ని పత్రికలలొ (17) రాశారు, చవండి. నెను మౌలికంగా పరిశోధన లేకుండా రాయను. . యెదొ ఒకటి రాసెవరకు అధారాలు ఉండవు. వికికి అధారాలు అవసరం. ఒఖే. Purushotham9966 (చర్చ) 03:16, 19 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Purushotham9966 గారూ, వ్యాసాలకు సంబంధించిన మూలాలు చేర్చడంకోసం తెవికీలోని 'ఉల్లేఖించండి' అనేదాన్ని ఉపయోగించి మూలాలు చేర్చాలి. వ్యాస సమాచారం వెబ్సైటులో ఉంటే ఆ వెబ్సైటులోని యూఆర్ఎల్ ను చేర్చాలి. వార్తపత్రికల మూలాలు ఉంటే ఆయా పత్రికలలో వచ్చిన వార్త హెడ్డిండ్, వార్తపత్రిక పేరు, ఎడిషన్ పేరు, ప్రచురణ తేది, పేజీ నంబరు చేర్చాలి. పుస్తకంలో ఉంటే పుస్తకం పేరు, రచయిత పేరు, ప్రచురణ సంస్థ పేరు, ప్రచురణ సంవత్సరం, పేజీ నంబరు చేర్చాలి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:47, 19 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చూద్దామండీ Purushotham9966 (చర్చ) 16:45, 19 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం శీర్షిక

[మార్చు]

@Purushotham9966 గారూ... 'కోఠీమహిళా కళాశాల వ్యవస్థాపకురాలు అమీనా పోప్, అయాన్ రాండ్ నవల ఫౌంటెన్ హెడ్, నెల్లూరులో మణి బుక్ స్టాల్ స్థాపకులు మణి' వంటి శీర్షికలతో వ్యాసాలు రాస్తున్నారు. అలా కాకుండా నేరుగా వ్యక్తుల పేరుతో అనగా అమీనా పోప్, ఫౌంటెన్ హెడ్, మణి' వంటి శీర్షికలను ఉపయోగించగలరు. అందుకోసం వికీలో ఇంతకుముందే ఉన్న వ్యాసాలను పరిశీలించగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:22, 21 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వికీశైలి

[మార్చు]

@Purushotham9966 గారూ... . తెవికీలో రచనలు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మీరు ఏకదాటిగా వ్యాసాలు సృష్టిస్తూ పోతున్నారు. చర్చలలో రాసినవి పట్టించుకోవడంలేదు. వికీకి ఒక శైలి ఉంటుంది. దానిని బట్టే వికీ వ్యాసాలు ఉండాలి. అలాగే వికీలో వ్యాసం వ్యావహారిక భాషలో ఉండాలి. మీరు సరళ గ్రాంథికంలో రాస్తున్నారు. వికీపీడియా వ్యాసాల్లో గ్రాంధికం రాయకూడదదు. మీరు 5 నిముషాలలో ఒక వ్యాసం రాస్తే, ఇతర వాడుకరులు దాన్ని సరిచేయడానికి అరగంట సమయం వెచ్చించాల్సివస్తోంది. ఈ విషయం అలోచించగలరు. మీరు రాసిన వ్యాసాలను ఎవరైనా చూస్తే వికీలో వ్యాసాలు ఇలానే ఉంటాయనుకునే అవకాశం ఉంది. మీరు రాసిన వ్యాసాలలో మార్పులకు అవకాశం ఉన్న కొన్ని వ్యాసాలను (భట్టారం రామకృష్ణయ్య, గుర్రం వెంకన్నశాస్త్రి, దర్భా వెంకట కృష్ణమూర్తి, వేదం వెంకటాచల అయ్యర్) వికీశైలీలోకి మార్చి రాశాను. మార్పులు చేయలేని కొన్ని వ్యాసాలను మీ వాడుకరి ఉపపేజీలకు తరలించాను. వ్యక్తుల వ్యాసాలకు సంబంధించి వికీపీడియా శైలి పేజీని చూడగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:55, 13 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Purushotham9966 గారూ... ఎన్నిసార్లు చెప్పినా మీ ధోరణి మారడంలేదు. వ్యాసాలను మీ వాడుకరి ఉపపేజీలకు తరలించిన తరువాత మీరు ఆయా వ్యాసాలలో మార్పులు చేయకుండా, అవే వ్యాసాలను మళ్ళీ (డేవిడ్ ఆంథోనీ రచన ది హార్స్, ది వీల్ అండ్ లాంగ్వేజస్; అమీనా పోప్ పే) సృష్టిస్తున్నారు. కనుక మీపై ఒకరోజు నిరోధం విధిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:31, 13 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Purushotham9966 గారూ... మళ్ళీ మీరు వికీశైలీలో లేకుండా వ్యాసాలు రాస్తున్నారు. మీరు 5 నిముషాలలో ఒక వ్యాసం రాస్తే, ఇతర వాడుకరులు దాన్ని సరిచేయడానికి అరగంట సమయం వెచ్చించాల్సివస్తోంది. గమనించగలరు. ఈ రోజు మీరు విస్మృత యాత్రికుడు (నవల) వ్యాసంలో పాఠ్యం మొత్తం ఒకే విషయంలో రాశారు నేను దానికి ఉప శీర్షికలతో వికీశైలీలోకి మార్చాను. ఈ మార్పును గమనించి ఇకపై మీరు రాసే వ్యాసాలలో వికీశైలీకి అనుగుణంగా రాస్తారని ఆశిస్తున్నాను.
గత రెండురోజులుగా మీ చర్చపేజీలో రాస్తున్నా కూడా మీరు స్పందించడంలేదు. ఈ విషయంపై మీ స్పందనను తెలియజేయగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:18, 15 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు లేకుండా, వికీ శైలీలో లేకుండా వ్యాసాలు రాయడం

[మార్చు]

@Purushotham9966 గారూ... మీరు 5 నిముషాలలో ఒక వ్యాసం రాస్తే, ఇతర వాడుకరులు దాన్ని సరిచేయడానికి అరగంట సమయం వెచ్చించాల్సివస్తోంది. ఈ విషయం అలోచించగలరు. మీరు రాసిన వ్యాసాలను ఎవరైనా చూస్తే వికీలో వ్యాసాలు ఇలానే ఉంటాయనుకునే అవకాశం ఉంది. మీకు గతంలోనే చాలాసార్లు చెప్పాము. అయినాకానీ మూలాలు లేకుండా, వికీ శైలీలో లేకుండా వ్యాసాలు రాస్తున్నారు. అందుకే 3 రోజులపాటు మీ ఖాతాను నిరోధంలో పెట్టాను. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:28, 21 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

పురుషోత్తం గారూ, మీరు ఇంకనూ నేర్చుకోవలసి ఉన్నది. పైన ప్రణయ్ రాజ్ గారు మీరు చేస్తున్న పొరపాట్లు ఎత్తి చూపిననూ అవే పొరపాట్లు మళ్ళీ చేస్తున్నారు. కనీసం అడిగి తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు. మీరు వేగంగా రాయడం కన్నా, వికీ నియమాలు అనుసరించి రాయడం ముఖ్యం. దయచేసి అర్థం చేసుకోగలరు. మూలాలు సరిగా ఇవ్వని వ్యాసానికి ఇటీవలి ఒక ఉదాహరణ ప్లాసిబో ఎఫెక్ట్ రవిచంద్ర (చర్చ) 18:12, 10 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రయత్నం చేస్తున్నా. మీరంతా ఉన్నారనే ధీమాతో. నేను నా దినచర్యలో రాసిపెట్టినవే ఇక్కడ పెడుతున్నా. మీకు తొలగించే freedom ఉంది. Iam aged, about 83. My time si runningout. Purushotham9966 (చర్చ) 03:36, 25 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:36, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ Purushotham గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:16, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అంటోనీ మలయాళీ సినిమా వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

అంటోనీ మలయాళీ సినిమా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వికీకరణ, శుద్ధి చేయబడని గూగుల్ అనువాదం. మూలాలు, లింకులు లేవు. ఒక వారం రోజులలో ఈ వ్యాసాన్ని వికీకరించి శుద్ధి చేయనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అంటోనీ మలయాళీ సినిమా పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 10:50, 28 మార్చి 2024 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 10:50, 28 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తుంగా వెంకట రమణారెడ్డి(T.V) వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

తుంగా వెంకట రమణారెడ్డి(T.V) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు. ఈ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లభ్యమగుట లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే సరైన మూలాలు చేర్చి విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తుంగా వెంకట రమణారెడ్డి(T.V) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 15:00, 25 ఏప్రిల్ 2024 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 15:00, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

tolaginchandi Purushotham9966 (చర్చ) 05:05, 6 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తీతువు లేక తిత్తిరిపక్షి

[మార్చు]

నమస్కారం సార్. తీతువు లేక తిత్తిరిపక్షి వ్యాసంలో కింది అంశాలను పరిశీలించి తగు మార్పుచేర్పులు చెయ్యాలి:

  • కాపీ హక్కులు గల పాఠ్యాన్ని కాపీ పేస్టు చేసారు. మూలం కోరాలో ఉంది. అక్కడ రాసినది మీరే అయినప్పటికీ, దాన్ని యథాతథంగా ఒక్కడ పెడితే, అది కాపీహక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. అక్కడి భావాన్ని తీసుకుని మీ స్వంత వాక్యాల్లో ఇక్కడ రాయాలి. ఆధారం కోసం దాన్ని ఇక్కడ మూలంగా ఇవ్వాలి. (కోరా, ఇక్కడ మూలంగా ఇవ్వడానికి పనికిరాదు అని నా అభిప్రాయం. కానీ దీనిపై ఇతరుల అభిప్రాయం కూడా తీసుకోవాలి)
  • వ్యాసంలో ఒక్క మూలం కూడా లేదు. ఆఖరి వాక్యంలో రాసిన మూలాన్ని అలా కాకుండా, పాఠ్యంలో ఎక్కడ వర్తిస్తుందో అక్కడ ఇన్‌లైన్ మూలంగా చేర్చాలి.
  • వికీశైలిలో లేదు. వ్యాస విషయాన్ని క్లుప్తంగా వివరిస్తూ (ఉపోద్ఘాతం లాగా) ఒక ప్రవేశిక ఉండాలి. ఆ తరువాత వ్యాస పాఠ్యాన్ని సముచితమైన విభాగాలుగా విభజించి రాయాలి. ఇతర వ్యాసాలను పరిశీలించి చూడండి.
  • వ్యాసంలో సముచితమైన చోట్ల సంబంధిత వ్యాసాలకు లింకులివ్వాలి. వీటిని అంతర్గత లింకులంటారు. కనీసం ఒక్క లింకైనా లేకపోతే ఆ వ్యాసం ఉన్నట్లుగా తెవికీ పరిగణించడం లేదు.
  • వ్యాసాన్ని కనీసం ఒక్క వర్గంలోనైనా చేర్చాలి.
  • వ్యాసం పేరు "తీతువు" "తిత్తిరిపక్షి: లలో ఏదో ఒకటే పెట్టాలి, రెండవ పేరుతో దారిమార్పు పేజీ సృష్టించాలి.
పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 03:29, 2 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీశైలి

[మార్చు]

మీరు రాసిన కొన్ని వ్యాసాలను పరిశీలించాను, అవి వికీశైలిలో లేవు. కోరా శైలిలో ఉంటున్నాయి. వికీశైలి అంటే ఏమిటి అనేది తెలుసుకునేందుకు కొన్ని వ్యాసాలను పరిశీలించండి.

అలాగే మూలాలు అసలేమీ ఉండడం లేదు. గతంలో వీటి గురించి ఇతరులు ఎప్పి ఉన్నారు, నేనూ చెప్పాను. కానీ మీరు అలాగే రాస్తున్నారు. దయచేసి వికీపీడియా శైలిని గౌరవించండి. నమస్కారం. __ చదువరి (చర్చరచనలు) 22:34, 25 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

శిఖండి మరియు ఎవరూ మీకు చెప్పని మరికొన్ని క్వీర్ కథలు

[మార్చు]

నమస్కారం. మీరు కొత్తగా శిఖండి మరియు ఎవరూ మీకు చెప్పని మరికొన్ని క్వీర్ కథలు అనే వ్యాసం సృష్టించారు. దీన్ని కూడా, పాత పద్ధతి లోనే, వికీశైలిలో కాకుండా, మూలాలు లేకుండా సృష్టించారు. దయచేసి వికీశైలిలో రాయండి. అనేకమార్లు మీకు ఈ విషయంలో అభ్యర్థనలు చేసినప్పటికీ కొత్త వ్యాసం కూడా పాత శైలి లోనే రాసారు. ఎలా రాయాలి అనే విషయంలో మీకు సందేహ్గాలేమైనా ఉంటే అడగండి. కింది వ్యాసాలను పరిశీలిస్తే మీకు శైలి గురించి కొంత అవగాహన కలుగుతుంది.

మనం ఏదో ఒక రకంగా రాసి పడేస్తే వేరెవరో వచ్చి సరిచేస్తార్లే అని అనుకోకండి. తెలుగు వికీపీడియాలో అలా సవరణలు చేసేంత మంది వాడుకరులు లేరు. ఉదాహరణకు మీరు రెండేళ్ళ కిందట మూలాల్లేకుండా, వికీశైలిలో కాకుండా రాసిన శ్రీ విక్రమసింహపురి మండల సర్వస్వము అనే వ్యాసం ఇప్పటికీ అలాగే పడి ఉంది. మూలాలు చేరలేదు, శైలిని సవరించలేదు. అంచేత దయచేసి ఇకపై వికీశైలి లోనే వ్యాసాలు రాయండి. __ చదువరి (చర్చరచనలు) 03:20, 30 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్స్ Purushotham9966 (చర్చ) 03:40, 4 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

టిబెట్ ముఖ్యపట్టణం లాసా మీదుగా మానస సరోవర యాత్ర పేజీని సత్వరమే తొలగించాలని అందులో ఒక ట్యాగు పెట్టారు. సత్వర తొలగింపు కారణాల్లో G12 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసారు. ఎందుకంటే, ఈ వ్యాసం లేదా బొమ్మ విస్పష్టంగా కాపీహక్కులను ఉల్లంఘిస్తోంది. చట్ట ప్రకారం, వేరే వెబ్‌సైట్లలో ప్రచురించినవి గానీ, ముద్రితమైనవి గానీ కాపీహక్కులున్న పాఠ్యాన్నీ, బొమ్మలనూ మేం అంగీకరించం. అందుచేత మీరు చేర్చిన పాఠ్యాన్ని తొలగించే అవకాశం చాలా ఉంది. బయటి వెబ్‌సైట్లను సమాచారానికి మూలంగా వాడుకోవచ్చు గానీ, వాక్యాలకు మూలంగా వాడుకోరాదు. చాలా కీలకమైన అంశం చూడండి: మీ స్వంత పదాల్లో రాయండి. కాపీహక్కు ఉల్లంఘనలను వికీపీడియా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. పదే పదే ఉల్లంఘించేవారిని నిరోధిస్తుంది.

బయటి వెబ్‌సైటు ల��దా బొమ్మ మీకే చెందినదైతే, వాటిని వీకీపీడియాను వాడుకోవ్వాలని మీరు భావించే పనైతే, — దానర్థం, ఇతరులకు దాన్ని సవరించే హక్కు ఉంటుంది — అప్పుడు మీరు en:Wikipedia:Donating copyrighted materials లో చూపిన పద్ధతుల్లో ఏదో ఒకదాని ప్రకారం ధృవీకరించాలి. ఆ బయటి వెబ్‌సైటు లేదా బొమ్మ మీ స్వంతం కాకపోతే, కానీ స్వంతదారు నుండి మీకు అనుమతులు ఉంటే Wikipedia:Requesting copyright permission చూడండి. మరిన్ని వివరాల కోసం వికీపీడియా విధనాలు మార్గదర్శకాలు చూడండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. చదువరి (చర్చరచనలు) 00:27, 1 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నేను మొదట కోరలో రాశాను, తర్వాత మార్పులతో మిసిమిలో ప్రచురించాను, దాన్ని ఎడిట్ చేసి ఇక్కడ పెట్టాను. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా సమ్మతమే. యాత్ర అనుభవం మా రాంబాబుది, రాత నాది. Purushotham9966 (చర్చ) 07:30, 2 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలు శీర్షికలు

[మార్చు]

పురుషోత్తం గారూ, మీరు వ్యాసాలు సృష్టించే టపుడు వ్యాసాల శీర్షిక మరీ పొడవుగా ఉంటోంది. ఉదాహరణకు ఏదైనా నవల గురించి వ్యాసం సృష్టించాలంటే దాని రచయిత పేరు కూడా అందులో ఉండనవసరం లేదు. ఉదాహరణకు అంతర్ముఖం అనే వ్యాసం పేరు చూడండి. దానిని అంతర్ముఖం "యండమూరి" నవల అనే పేరుతో సృష్టించనవసరం లేదు. ఎందుకంటే అంతర్ముఖం అనే పేరుతో మరే నవలా లేదు. దయచేసి వ్యాసాలు సృష్టించేటపుడు ఈ విషయం గుర్తు పెట్టుకోండి. అలాగే మీకు వికీ వ్యాసాల శైలి ఇంకా అర్థం అయినట్లు అనిపించడం లేదు. ఉదాహరణకు సరైన పద్ధతిలో మూలాలు ఇవ్వడం. వ్యాసాన్ని ప్రవేశిక, విభాగాలు గా విడగొట్టడం. లింకులు ఇవ్వడం ఇలాంటివి. దయచేసి కొన్ని మంచి వికీ వ్యాసాలు చదివి అర్థం చేసుకుని తర్వాత వ్యాసాలు రాయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడే అడగండి. రవిచంద్ర (చర్చ) 16:26, 12 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Purushotham9966 గారి వ్యాసాలలో ఎక్కువుగా స్వంత అభిప్రాయాలు ఉంటున్నవి. ఏ ఒక్క వ్యాసానికి సరియైన మూలం ఉండదు. వీటిని అన్నిటిని ఒకసారి పరిశీలించవలసిన అవసరముందని నేను గమనించిన విషయం. వికీపీడియా మార్గదర్శకాలు, శైలి అసలు పాటించుటలేదు. రాయలన్న తపన ఉన్నందుకు వారికి నా అభినందనలు. నా మాటలు భాధకలిగిస్తే క్షమించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:38, 12 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
శ్రీ యర్రా రామారావు గారు, నమస్కారం,
మీరు, అనగా వికీ వారి ప్రకారమే రాస్తున్నా. నేను బేసిక్ గా పరిశోధకుణ్ణి, నా థీసిస్ వెంకటగిరి సంస్థాన చరిత్ర ఎమెస్కో వారు ఇటీవల పునర్ముద్రణ చేశారుకూడ. నా వద్ద కొందరు విశ్వవిద్యాలయాల్లో పరిశోధించి పిహెచ్., డిగ్రీలు పొందారు కూడా. మీ పరిశోధన, వ్యాస రచన విధానాలు నాకు బోధపడక పోయివుండవచ్చు. గురజాడ సమగ్ర రచనలు, రాత ప్రతులు, రికార్డులు పరిశోధించి గురజాడ సమగ్ర రచనల సంపుటం నా సంపాదకత్వంలో 2012 లో మనసు ఫౌండేషన్ ప్రచురించింది. ఇవికాక మరో పది పుస్తకాలు నావి అచ్చయి బజారులో దొరుకుతున్నాయి.
వికీ విధానాలకు అనుగుణంగా రాయలేకపోయాను. అల్లాంటి వ్యాసాలు తొలగించండి. ఇలా రాసినందుకు క్షంతవ్యుణ్ణి. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, నెల్లూరు. Purushotham9966 (చర్చ) 13:37, 18 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Purushotham9966 గారూ నమస్కారం. మీరు పెద్దవారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేదు. సహృదయంతో వికీ నియమాలు, మార్గదర్శకాలు అర్థం చేసుకున్నందుకు, మీ స్పందనకు ధన్యవాదాలు. వికీపీడియా నిర్వాహక బాధ్యతతో, మిమ్మల్ని నేను భాధపెట్టినందుకు క్షమించాలి. యర్రా రామారావు (చర్చ) 14:47, 18 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]