Jump to content

లియో హెండ్రిక్ బేక్‌లాండ్

వికీపీడియా నుండి
లియో హెండ్రిక్ బేక్‌లాండ్
Portrait of Leo Baekeland in 1916
జననం
Leo Henricus Arthur Baekeland

November 14, 1863
Ghent, Belgium
మరణం1944 ఫిబ్రవరి 23(1944-02-23) (వయసు 80)
Beacon, New York, US
వృత్తిChemist, inventor
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Plastics research, Bakelite, Novolac
పురస్కారాలుJohn Scott Medal (1910)
Willard Gibbs Award (1913)
Perkin Medal (1916)[1]
Franklin Medal (1940)

లియో హెన్రికస్ ఆర్థర్ బేక్‌లండ్ (నవంబరు 14, 1863 - ఫిబ్రవరి 23, 1944) బెల్జియన్-అమెరికన్ రసాయనశాస్త్రవేత్త. ఆయన 1893 లో కనుగొన్న వెలోక్స్ ఫోటోగ్రాఫిక్ కాగితం, 1907 లో కనుగొన్న బేక్‌లైట్ అనే పదార్థం ద్వారా అందరికీ సుపరిచితుడు. ఆయన చవకైన, వేడిచేసినా కరగని ప్రముఖ ప్లాస్టిక్ అయిన బేక్‌లైట్ ను కనుగొన్నాడు. దీని ఫలితంగా ఆయన "ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు" గా గుర్తింపబడ్డాడు.[2]: 13  [3][4]

ప్రారంభ జీవితం

[మార్చు]

లియో బేక్‌లాండ్ నవంబరు 14, 1863 న బెల్జియంలోని ఘెంట్ లో జన్మించాడు. [5] ఆయన తండ్రి చెప్పులుకుట్టే పనిచేసేవాడు, తల్లి గృహిణి. [6] ఆయన బెల్జియంలోని ఘెంట్ లో ప్రారంభ జీవితాన్ని గడిపాడు. ఘెంట్ మ్యునిసిపల్ టెక్నికల్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ చేసాడు. 1880లో సిటీ ఆఫ్ ఘెంట్ ద్వారా ఘెంట్ విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రం అభ్యసించుటకు గానూ[2]: 13  స్కాలర్ షిప్ పొందాడు.[7]: 102  తన 21వ యేట మాక్సిమా కం లాడె వద్ద పి.హెచ్.డి పూర్తిచేసాడు..[7]: 102  1887 నుండి 1889 మధ్య కాలంలొ ఆయన బ్రూగెస్ లోని ప్రభుత్వ హయ్యర్ నోర్మల్ పాఠశాలలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం బోధించుటకు ప్రొఫెసర్ గా నియమితులైనారు. 1889 లో ఆయన ఘెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా రసాయనశాస్త్ర విభాగంలో నియమితులైనారు..[2]: 14  ఆయన సెల్లెన్ స్వర్ట్స్ ను వివాహమాడాడు. వారికి ముగ్గురు పిల్లలు.[8][9]

వృత్తి

[మార్చు]

1889లో బేక్‌లాండ్, ఆయన భార్య ఇంగ్లాండు, అమెరికాలలోని విశ్వవిద్యాలయాలను సందర్శించేందుకు ప్రయాణ స్కాలర్‌షిప్ పొందారు..[1]: 178 [2]: 14  వారు న్యూయార్క్ నగరాన్ని సందర్శించారు. అచట వారు కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ చార్లెస్ ఎఫ్.చాండ్లెర్ , ఇ. అండ్ హెచ్.టి ఆంటోనీ ఫోటోగ్రాఫిక్ కంపెనీకి చెందిన రిచర్డ్ ఆంటోనీలను కలిసారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన చార్లెస్ ఎఫ్. చాండ్లెర్ ఆయనను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉండేందుకు ప్రభావితం చేసారు.[10] అప్పటికే బేక్‌లాండ్ ఇతర రసాయనాలకు బదులుగా నీటితో వాడగలిగే ఫోటో గ్రాఫిక్ ప్లేట్లను కనుగొని అభివృద్ది చేసాడు. దానికి 197 లో బెల్జియంలో పేటెంట్ హక్కులను పొందాడు.;[2]: 13  [7]: 127–129  ఆంటోనీ యువ రసాయనశాస్త్రవేత్త సమర్థతను గుర్తించి తన కంపెనీలో ఉద్యోగాన్ని ఇచ్చాడు.[7]: 130 [11]

బేక్‌లాండ్ ఆంటోనీ కంపెనీలో రెండు సంవత్సరములపాటు పనిచేసాడు. 1891 లో కన్సల్టింగ్ కెమిస్ట్ గా స్వయంగా వ్యాపారం ప్రారంభించాడు.[7]: 130  కానీ వ్యాధులవలన, నిధులు కనుమరుగవడం మూలంగా తన చర్యలపై పునరాలోచించి తన పాత ఆశక్తికర అంశమైన ఫోటోగ్రాఫిక్ కాగితాల ఉత్పత్తికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.[12] రెండు సంవత్సరముల తీవ్ర ప్రయత్నం తరువాత అతడు ఫోటోగ్రాఫిక్ కాగిత ఉత్పత్తి ప్రక్రియను పూర్తిచేసాడు. దానికి "వెలాక్స్" అని పేరుపెట్టారు. ఇది మొట్టమొదటి వాణిజ్యపరమైన ఫోటోగ్రాఫిక్ కాగితం. ఆ కాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ క్రొత్త ఉత్పత్తికి పెట్టుబడి దారులుగానీ, కొనుగోలుదారులు గానీ దొరకలేదు. అందువల్ల బేక్‌లాండ్ లియనార్డో జాకోబి తో భాగస్వామ్యం చేసుకొని నెపెరా కెమికన్ కంపెనీని న్యూయార్క్ లోని యోంకెర్స్ వద్ద స్థాపించాడు.: 131–135 [11]

1899లో జాకోబీ, బేక్‌లాండ్, ఆల్బర్ట్ హన్ లు వారి నెపేరా కంపెనీని ఈస్ట్‌మన్ కొడక్ కంపెనీ అధినేత అయిన జార్జ్ ఈస్ట్‌మాన్ కు $750,000 కు అమ్మివేసారు. [13][14] ఈ లావాదేవీ ద్వారా బేక్‌లాండ్ సుమారు $215,000 లను సంపాదించాడు. .[7]: 134–136 [15]

తన వాటా డబ్బుతో ఆయన న్యూయార్క్ లోని "స్నగ్ రాక్" ను కొనుగోలు చేసాడు. అది తన స్వంత ప్రయోగశాలగా మార్చుకున్నాడు.

ఆయన కనీసం 20 స్ంవత్సరముల పాటు ఫోటోగ్రఫీపై పరిశోధనలు చేయరాదని అంగీకరించాడు. కొత్త రంగంలో పరిశోధనలు చేయానని నిర్ణయించాడు. అతడు 1900 లో తిరిగి జర్మనీకి వచ్చాడు. విద్యుత్ రసాయన శాస్త్రంలో ఛార్లోట్టెన్‌బర్గ్ వద్ద టెక్నికల్ ఇనిస్టిట్యూట్ లో పరిశోధనలు ప్రారంభించాడు. [16]: 14 

యునైటెడ్ నేషన్స్ నుండి వచ్చిన తరువాత బేక్‌లాండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అభివృద్ధి చేయుటలో క్లింటన్ పాల్ టౌన్‌సెండ్, ఎలాన్ హనింగ్‌టన్ హోకర్ లకు సహయం చేయుటలో నిమగ్నమయ్యాడు.

ఒక పైలట్ ప్లాంట్‌ను నిర్మించడం, నిర్వహించడం యొక్క బాధ్యతతో ఒక స్వతంత్ర సలహాదారుగా బేకెలాండ్‌ను నియమించారు.[17]: 138–139  ఆయన ఐరన్ ఆక్సైడ్ తో నింపబడిన ఆజ్‌బెస్టాస్ వస్త్రం, ఆజ్‌జెస్టాస్ దారం, ఐరన్ హైడ్రాక్సైడ్ లను ఉపయోగించి చార్కోలీ ప్రక్రియ ద్వారా బలమైన డయాఫ్రం బ్యాటరీని అభివృద్ధి చేసాడు. ఆయన పరిశోధనలు హోకర్ కెమికల్ కంపెనీకి ఎగుమతి కాబడ్దాయి. నయాగరా జలపాతం వద్ద ప్రపంచంలొ అతి పెద్ద ఎలక్ట్రో కెమికల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా ఆయన పరిశొధనలు ఉపయోగపడ్డాయి.[16] [18][19]

బేక్‌లైట్ ఆవిష్కరణ

[మార్చు]

"వెలక్స్" ఆవిష్కరణ విజయవంతమైన తరువాత ఆయన రసాయన శాస్త్రం యొక్క వేరొక రంగంలొ అభివృద్ధికోసం కృషిచేసాడు.

Baekeland's Yonkers Laboratory

ప్లాస్టిక్ యుగంలో యొక్క మొటటి ఉత్పత్తి బేకలైట్ ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు.[20] వేడిచేసినా దాని ఆకృతిలో మార్పు చెందని మొట్టమొదటి ప్లాస్టిక్ బేకలైట్ గుర్తింపు పొందింది. దీనిని రేడియోలు, టెలిఫోన్లు, విద్యుత్ ఉపరకణాలలొ ఉపయొగిస్తున్నారు. ఇది విద్యుత్, ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. తరువాత పారిశ్రామికంగా అనేక శాఖలలో ఈ పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు.[20]

బేక్‌లాండ్ అనేక పురస్కారాలు, గౌరవాలను పొందాడు అందులో 1916లో పెర్కిన్ మెడల్, 1940లో ప్రాక్లిన్ మెడల్ ఉన్నాయి.[21] 1978 లో ఆయనను ఓహియా లోని నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేం లో చేర్చారు.[22]

1944 లో బేక్‌లాండ్ మరణం సమయానికి ప్రపంచంలో బేకలైట్ ఉత్పత్తి 175,000 టన్నులు, అది 15,000 వివిధ ఉత్పత్తులలో ఉపయోగించారు. ఆయనకు 100 కి పైబడి పేటెంట్స్ ఉన్నాయి. [21] అందులో కాపర్, కాడ్మియం వేరుచేసే విధానం కూడా ఉంది.

క్షీణత, మరణం

[మార్చు]
The[permanent dead link] gravesite of Leo Hendrik Baekeland

ఆయన తన జనరల్ బేక్ లైట్ కంపెనీని 1939లొ యూనియన్ కార్బైడ్ సంస్థకు అమ్మి పదవీవిరమణ చేసాడు. తరువాత ఆరోగ్యం క్షీణించి న్యూయార్క్ లోని బీకన్ వద్ద సెరెబ్రల్ హెమోరేజ్ తో మరణించారు. [23] ఆయన న్యూయార్క్ లోని స్లీపే హాలో వద్ద ఖననం చేయబడ్డాడు.[24]

మూలాలు

[మార్చు]
నోట్సు
  1. 1.0 1.1 "Perkin Medal Award". The Journal of Industrial and Engineering Chemistry. 8 (2): 177–190. 1916. Retrieved 1 September 2015.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Landmarks of the Plastics Industry. England: Imperial Chemical Industries Ltd., Plastics Division. 1962. pp. 13–25.
  3. Bowden, Mary Ellen (1997). "Leo Baekeland". Chemical achievers : the human face of the chemical sciences. Philadelphia, PA: Chemical Heritage Foundation. ISBN 9780941901123.
  4. Amato, Ivan (1999-03-29). "Time 100: Leo Baekeland". Archived from the original on 2007-11-06. Retrieved 2007-11-08.
  5. Sas, Benedikt; Vocht, Stanislas De; Jacobs, Philippe (2014). Intellectual Property and Assessing its Financial Value. Kidlington: Chandos Publishing. pp. 2–7. ISBN 9781843347927. Retrieved 1 September 2015.
  6. Gratzer, Walter (2011). Giant molecules : from nylon to nanotubes. Oxford: Oxford University Press. ISBN 978-0199562138.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 Bijker, Wiebe E. (1997). "The Fourth Kingdom: The Social Construction of Bakelite". Of bicycles, bakelites, and bulbs : toward a theory of sociotechnical change (1st MIT Press pbk ed.). Cambridge, Mass.: MIT Press. pp. 101–198. ISBN 9780262522274. Retrieved 2 September 2015.
  8. "Leo Baekeland". NNDB Tracking the entire world. Soylent Communications. Retrieved 1 September 2015.
  9. Flynn, Tom. "Yonkers, Home of the Plastic Age". Archived from the original on 2 మార్చి 2000. Retrieved 17 జనవరి 2018.
  10. "Leo Hendrik Baekeland". Chemical Heritage Foundation. Retrieved 2 September 2015.
  11. 11.0 11.1 Gehani, R. Ray (1998). Management of Technology and Operations. John Wiley and Sons. pp. 81–82. ISBN 0-471-17906-X.
  12. 12.0 12.1 Haynes, Williams (1946). "XIX: Materials for To-morrow". This Chemical Age. London: Secker and Warburg. pp. 238–239.
  13. Jenkins, Reese V. (1975). Images and Enterprise: Technology and the American Photographic Industry, 1839 to 1925. Baltimore, MD: Johns Hopkins University Press. pp. 191–201. ISBN 0801815886.
  14. Haynes[12] quotes a surprising immediate offer of $1,000,000, when Baekeland had been hoping for $50,000 at most.
  15. Mercelis, Joris (2012). "Leo Baekeland's Transatlantic Struggle for Bakelite: Patenting Inside and Outside of America". Technology and Culture. 53 (2): 372. doi:10.1353/tech.2012.0067.
  16. 16.0 16.1 Landmarks of the Plastics Industry. England: Imperial Chemical Industries Ltd., Plastics Division. 1962. pp. 13–25.
  17. Bijker, Wiebe E. (1997). "The Fourth Kingdom: The Social Construction of Bakelite". Of bicycles, bakelites, and bulbs : toward a theory of sociotechnical change (1st MIT Press pbk ed.). Cambridge, Mass.: MIT Press. pp. 101–198. ISBN 9780262522274. Retrieved 2 September 2015.
  18. Kettering, Charles Franklin (1946). Biographical memoir of Leo Hendrik Baekeland, 1863-1944. Presented to the academy at the autumn meeting, 1946 (PDF). National Academy of Sciences (U.S.).; Biographical memoirs. p. 206.
  19. Thomas, Robert E. (1955). Salt & Water, Power & People: A Short History of Hooker Electrochemical Co. Niagara Falls, NY: Hooker Chemical Co. p. 109. ISBN 1258790807.
  20. 20.0 20.1 Amato, Ivan (1999-03-29). "Time 100: Leo Baekeland". Archived from the original on 2007-11-06. Retrieved 2007-11-08.
  21. 21.0 21.1 Kettering, Charles Franklin (1946). Biographical memoir of Leo Hendrik Baekeland, 1863-1944. Presented to the academy at the autumn meeting, 1946 (PDF). National Academy of Sciences (U.S.).; Biographical memoirs. p. 206.
  22. Flynn, Tom. "Yonkers, Home of the Plastic Age". Archived from the original on 2 మార్చి 2000. Retrieved 17 జనవరి 2018.
  23. "Leo Baekeland Dead, Created Bakelite. Chemist Noted for Invention in Plastics. Produced Velox, a Photographic Paper". New York Times. February 24, 1944. Retrieved 2015-04-14.
  24. "Leo Hendrik Baekeland (1863 - 1944) - Find A Grave Memorial". findagrave.com.
ఇతర పఠనాలు

ఇతర లింకులు

[మార్చు]
Awards and achievements
అంతకు ముందువారు
Seymour Parker Gilbert
Cover of Time Magazine
22 September 1924
తరువాత వారు
Hiram Johnson