Jump to content

లికాబాలి

వికీపీడియా నుండి

లికాబాలి,భారతదేశం,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పర్వత పట్టణం.ఇది దిగువ సియాంగ్ జిల్లా ప్రధానకేంద్రం. [1] ఈ పట్టణం లికబాలి విధానసభ నియోజకవర్గంలో భాగం . ప్రస్తుత శాసనసభ సభ్యుడు కార్డో నైగ్యోర్.[2] ఇందులో కంగ్కు విభాగం జెన్సి విభాగం, లికబాలి విభాగం ఉన్నాయి.ప్రతి విభాగం కింద కొన్ని గ్రామాలు ఉన్నాయి. లికబాలి ప్రధానంగా అస్సాం పరిధిలోని సిలాపాథర్ పట్టణ సరిహద్దుకు సమీపంలో ఉంది.

జనాభా

[మార్చు]

అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలోని లికబాలి ఒక మధ్య తరహా గ్రామం లికబాలి.2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో మొత్తం 69 కుటుంబాలు నివసిస్తున్నాయి.గ్రామంలో 462 మంది జనాభా ఉన్నారు.వారిలో 284 మంది పురుషులు, 178 మంది స్త్రీలు.

లికబాలి హెచ్‌క్యూ గ్రామంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 61, ఇది మొత్తం గ్రామ జనాభాలో 13.20%గా ఉంది.గ్రామ సగటు లింగ నిష్పత్తి 627, ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సగటు 938 కన్నా తక్కువ.బాలల లైంగిక నిష్పత్తి 1033, అరుణాచల్ ప్రదేశ్ సగటు నిష్పత్తి 972 కన్నా ఎక్కువ.

అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర సగటు అక్షరాస్యతతో పోలిస్తే లికబాలి హెచ్‌క్యూ గ్రామంలో అక్షరాస్యత ఎక్కువ. 2011 లో, లికబలి హెచ్‌క్యూ గ్రామ అక్షరాస్యత రేటు 88.03%, అరుణాచల్ ప్రదేశ్‌లో 65.38%. లికబాలిలో హెచ్‌క్యూ పురుషుల అక్షరాస్యత 90.55% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 83.67%.

భారత రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, లికబాలి హెచ్క్యూ గ్రామాన్ని, గ్రామ ప్రతినిధిగా ఎన్నుకోబడిన సర్పంచ్ (గ్రామ అధిపతి) నిర్వహిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Likabali". Retrieved 26 October 2015.
  2. "Likabali MLA". Archived from the original on 19 August 2016. Retrieved 14 August 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లికాబాలి&oldid=3426228" నుండి వెలికితీశారు