Jump to content

లక్నో లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

లక్నో లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఈ లోక్‌సభ స్థానం 1991 నుండి బీజేపీ విజయం సాధిస్తూ వస్తుంది. ఇక్కడి నుండి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎనిమిది సార్లు పోటీ చేశాడు. ఆయన 1955లో జరిగిన ఉప ఎన్నికలో మొదటిసారి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచి ఆ తర్వాత 1957, 1962లో రెండో స్థానంలో నిలిచి తర్వాత, 1991, 1996, 1998, 1999, 2004లో వరుసగా ఐదు సార్లు ఎంపీగా అక్కడి నుండి ఎన్నికయ్యాడు.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా గెలిచిన పార్టీ (2022) ఓటర్ల సంఖ్య (2019)
171 లక్నో వెస్ట్ జనరల్ లక్నో సమాజ్ వాదీ పార్టీ 4,12,201
172 లక్నో నార్త్ జనరల్ లక్నో బీజేపీ 4,24,848
173 లక్నో తూర్పు జనరల్ లక్నో బీజేపీ 4,48,016
174 లక్నో సెంట్రల్ జనరల్ లక్నో సమాజ్ వాదీ పార్టీ 3,69,533
175 లక్నో కంటోన్మెంట్ జనరల్ లక్నో బీజేపీ 3,85,769
మొత్తం: 20,40,367

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 విజయ లక్ష్మి పండిట్ భారత జాతీయ కాంగ్రెస్
1955^ శేరజ్వతి నెహ్రూ
1957 పులిన్ బిహారీ బెనర్జీ
1962 BK ధాన్
1967 ఆనంద్ నారాయణ్ ముల్లా స్వతంత్ర
1971 షీలా కౌల్ భారత జాతీయ కాంగ్రెస్
1977 హేమవతి నందన్ బహుగుణ జనతా పార్టీ
1980 షీలా కౌల్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 మంధాత సింగ్ జనతాదళ్
1991 అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ
1996
1998
1999
2004
2009 లాల్‌జీ టండన్
2014 రాజ్‌నాథ్ సింగ్
2019[1]

మూలాలు

[మార్చు]
  1. Business Standard (2019). "Lucknow Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.