రామ్‌కుమార్ (చిత్రకారుడు)
రామ్ కుమార్ | |
---|---|
జననం | [1] సిమ్లా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1924 సెప్టెంబరు 23
మరణం | 2018 ఏప్రిల్ 14 | (వయసు 93)
జాతీయత | భారతీయుడు |
రంగం | చిత్రకళ |
శిక్షణ | శారద ఉకిల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, న్యూఢిల్లీ (1945) |
అవార్డులు | లలిత కళాసమితి ఫెలోషిప్, 2011[2] పద్మ భూషణ, 2010[3] ఆఫీసర్స్ ఆర్ట్స్ ఎత్ లెటర్ , 2003 |
రామ్ కుమార్ (1924 – 2018) భారతీయ చిత్రకారుడు, రచయిత. అతడు ప్రసిద్ధ అమూర్త భావనా చిత్రకారులలో ఒకడు.[6] అతడు ఒక ఆధునిక వాది. ఎం.ఎఫ్. హుస్సేన్, ఎఫ్.ఎన్. సౌజా, హెచ్.గాడే, ఎస్.హెచ్. రాజా తదితరులతో కూడిన ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ బృందంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ బృందంతో కలిసి అతడు భారత కళల పట్ల నూతన ఒరవడిని సృష్టించాడు. అతడు ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రిస్తాడు.[7] అమూర్త చిత్రకళ కొరకు ఫిగరేటివ్ చిత్రాలను గీసిన మొదటి భారతీయులలో ఒకనిగా గుర్తింపబడ్డాడు.[8] గృహాలలో, అంతర్జాతీయ మార్కెట్ అతని చిత్రాలు ఎక్కువ ధరలకు అమ్ముడవుతాయి. అతడు గీసిన "ద వేగబాండ్" న్యూయార్క్ లో $1.1 మిలియన్ల ధర పలికింది. ఇది ఒక ప్రపంచ రికా��్డు. రచనలోను, చిత్రకళలోనూ రాణించిన కొద్ది భారతీయ ఆధునికవాదులలో అతను ఒకడు[9]
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]రామ్ కుమార్ వర్మ హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మిచాడు.[10] అతడి తండ్రి పంజాబ్ లోని పాటియాలాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసాడు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో సివిల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసాడు.[11][12] రామ్ కుమార్ న్యూఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఎం.ఎ (ఆర్థిక శాస్త్రం) లో పట్టాను పొందాడు.[13] 1945లో అయడు ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అవకాశం పొందాడు.[14] ఒకనాటి సాయంత్రం, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలోని తన స్నేహితులతో పాటు కన్నాట్ ప్లేస్‌లో తిరుగుతూ అనుకోకుండా అక్కడి కళా ప్రదర్శనలో అడుగుపెట్టాడు.[15]
రామ్ కుమార్ "శైలోజ్ ముఖర్జీ" నడుపుతున్న శారదా ఉకిల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో తరగతులను నిర్వహించేవాడు.[16] శైలాజ్ ముఖర్జీ శాంతినికేతన్ స్కూలులో చిత్రకారుడు. అతడు రామ్‌కుమార్ కు సజీవ మోడల్స్‌లోచిత్ర కళను పరిచయం చేసాడు.[17] అక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అతడు "రాజా" ను ఒక ప్రదర్శనలో కలిసాడు. రాజా, రామ్ లు మంచి స్నేహితులైనారు.[18] పెద్ద చదువులను పారిస్ లో "ఆండ్రి లోటే", "ఫెర్నాండ్ లెగెర్" ల వద్ద చదువుకొనుటకు రామ్ కుమార్ తన తండ్రిని ఒప్పించాడు.[19] పారిస్ లో పసిఫిక్ శాంతి ఉద్యమం ఆయనను ఆకర్షించింది. అతడు ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అక్కడ సామాజిక వాస్తవ వాదులైన "కాతే", ఫోర్గెనన్ ల ప్రభావానికి లోనయ్యాడు.[20] అతడిని ప్రసిద్ధ చిత్రకారులైన ఎస్.హెచ్.రాజా, ఎం.ఎఫ్.హుస్సేన్ లతో స్నేహం కుదిరింది.[21]
జీవితం
[మార్చు]అతడు అమూర్త చిత్రాలను సాధారణంతో తైలం లేదా ఎక్రిలిక్ లతో వేసాడు.[22] అతడు "ప్రోగ్రెసివ్ ఆర్టిస్టు గ్రూపు" తో మంచి సంబంధాలను కలిగి ఉండేవాడు.[23]
రామ్ కుమార్ భారతదేశంలోనే కాక అనేక దేశాలలో చిత్రప్రదర్శనలలో పాల్గొన్నాడు. అందులో 1958 లో జరిగిన వెనిస్ బిన్నేల్ ఒకటి.[24] 1987, 1988 లలో యు.ఎస్.ఎస్.ఆర్, జపాన్ లలో జరిగిన భారతీయ ఉత్సవాలలో పాల్గొన్నాడు.[25] అతడు 2008 లో ఢిల్లీలో సోలో ఎగ్జిబిషన్ ను ఇటీవల నిర్వహించాడు.[26] అతడు హిందీ లో రచనలు చేసాడు. అతడు రాసిన రచనలు ఎనిమిది సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. అందులో రెండు నవలలు, ఒక యాత్రా చరిత్ర వర్ణన ఉన్నాయి.[27]
ఆయన గీసిన తొలి చిత్రాలలో నగర జీవన పరిస్థితి ప్రధాన అంశంగా ఉండేది.[19][28] చిత్రాలలో ప్రత్యేకంగా వారణాసిలో, దాని శిథిలమైన, పాడైపోయిన ఇళ్ళు, నిరాశాజనక భావాలను తెలియచేస్తుంది.[29]
ప్రకృతి ప్రదేశాల ఉల్లాసం, మానవ సమాజంలో జరిగిన హింసను చూపించే చిత్రాలను గీసాడు.[19]
భారతీయ కళలో ఆసక్తి పెరిగినందున, రామ్ కుమార్ చిత్రలేఖనాల కళకు మార్కెట్లో గుర్తింపు పెరిగింది.[30]
రామ్ కుమార్ 1972 లో భారత ప్రభుత్వంనుండి పద్మశ్రీ[31] , 2010 లో భారత మూడవ అత్యున్నత పద్మభూషణ్ పురస్కారం పొందాడు.[32]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రామ్ కుమార్ ప్రముఖ హిందీ రచయిత నిర్మల్ వర్మ కు అన్నయ్య. కల్నల్ రాజ్ కుమార్ వర్మకు తమ్ముడు. అతడు న్యూఢిల్లో నివసించాడు.
పురస్కారాలు
[మార్చు]- జాన్ డి. రాకెఫెల్లర్ III ఫెలోషిప్, న్యూయార్క్ , 1970[33]
- పద్మశ్రీ, భారత ప్రభుత్వం, 1972
- ప్రేమ్‌చంద్ పురస్కారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం , 1972
- కాళీదాస్ సమ్మాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం , 1986
- ఆఫీసర్స్ ఆర్ట్స్ ఎత్ లెటర్ల్స్, ఫ్రాన్స్ ప్రభుత్వం , 2003
- జీవిత కాల సాఫల్య పురస్కారం, న్యూఢిల్లీ ప్రభుతం , 2010
- పద్మభూషణ పురస్కారం, భారత ప్రభుత్వం , 2010
- లలిత కళా అకాడమీ ఫెలోషిప్ , 2011
మూలాలు
[మార్చు]- ↑ India Who's who 1995-96, p. 273
- ↑ "The fellowship of Shri Ram Kumar". Lalit Kala Akademi. Retrieved 29 March 2012.[permanent dead link]
- ↑ "Padma Bhushan Awardees". Retrieved 25 March 2012.
- ↑ "Lifetime Achievement Award". The Times of India. Archived from the original on 2012-07-09. Retrieved 28 March 2012.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Bio Summary
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Ram Kumar". Indian and foreign review. 24. Ministry of Information and Broadcasting (India): 20. 1986. ISSN 0019-4379.
- ↑ "Progressive artist's group". Retrieved 26 March 2012.
- ↑ "Ram Kumar artistic intensity of an ascetic". Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 26 March 2012.
- ↑ "Portrait of an Artist". Outlook. Retrieved 28 March 2012.
- ↑ "Biography". Retrieved 28 March 2012.
- ↑ "ArtistInterview". Saffron Art. Retrieved 28 March 2012.
- ↑ "Nirmal Verma Obituary". Rediff. Retrieved 30 March 2012.
- ↑ Lal, Sham; Gagan Gill (1996). Ram Kumar: a journey within. Vadehra Art Gallery. p. 209. OCLC 36556291.
- ↑ "Ram Kumar Interview". Saffron Art. Retrieved 28 March 2012.
- ↑ "True Colours". Indian Express. 19 December 2010. Retrieved 28 March 2012.
- ↑ "Ram Kumar: Artistic Intensity of an Ascetic". Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 28 March 2012.
- ↑ "Ram Kumar a transition from figurative". Archived from the original on 1 నవంబరు 2011. Retrieved 30 March 2012.
- ↑ "Artist Profile". The Art Trust. Archived from the original on 3 ఫిబ్రవరి 2014. Retrieved 30 March 2012.
- ↑ 19.0 19.1 19.2 Treves, Toby (2006). Indian art: the moderns revisited, Volume 1. Vadehra Art Gallery. p. 42. ISBN 978-81-87737-19-3.
- ↑ "Artistic intensity of an ascetic". Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 1 April 2012.
- ↑ Kapur, Geeta (1978). Contemporary Indian artists. Vikas. p. 49. ISBN 978-0-7069-0527-4.
- ↑ Chawla, Rupika (1995). Surface and depth: Indian artists at work. Viking. p. 105. ISBN 978-0-670-86174-3.
- ↑ "Progressive artist's group". Retrieved 25 March 2012.
- ↑ Jachec, Nancy (2008). Politics and painting at the Venice Biennale, 1948–64: Italy and the idea of Europe. Manchester University Press. p. 175. ISBN 978-0-7190-6896-6.
- ↑ Vishwambara, K. S. (1998). Movement in Indian art, a tribute. Karnataka Chitrakala Parishath. p. 91. OCLC 62857926.
- ↑ "A colourful friendship". Indian Express. 18 January 2008. Retrieved 26 September 2009.
- ↑ Kumar, Ram (2004). The face & other stories. Vadehra Art Gallery. p. 16. ISBN 978-81-87737-06-3.
- ↑ Lal, Sham (2003). Indian realities in bits and pieces. Rupa & Co. p. 513. ISBN 978-81-291-0247-8.
- ↑ "Breadth of lifescapes". The Hindu. 7 July 2002. Archived from the original on 28 డిసెంబరు 2009. Retrieved 26 September 2009.
- ↑ "Second knock". Lucknow Newsline. Indian Express Group. 24 September 2005. Retrieved 26 September 2009.[permanent dead link]
- ↑ "Search Awardees". My India, My Pride. National Informatics Centre. Archived from the original on 31 జనవరి 2009. Retrieved 26 September 2009.
- ↑ "Doctors and artists in Delhi's Padma gallery". The Times of India. 26 January 2010. Archived from the original on 11 ఆగస్టు 2011. Retrieved 11 April 2010.
- ↑ "Artist Bio". Retrieved 29 March 2012.
బయటి లంకెలు
[మార్చు]- మూలాల లోపాలున్న పేజీలు
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with RKDartists identifiers
- 1924 జననాలు
- 2018 మరణాలు
- భారతీయ చిత్రకారులు
- భారతీయ రచయితలు