Jump to content

యోగానంద కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
యోగానంద కృష్ణమూర్తి
జననం1931
మరణంఆగష్టు 14, 2015
నివాస ప్రాంతంఖమ్మంజిల్లా
వృత్తిఆధ్యాత్మిక ప్రచారం
ప్రసిద్ధిగురూజీ
పదవి పేరు108 సాయిమందిరాల నిర్మాణం
భార్య / భర్తమధురమ్మ

షిరిడీ సాయి ఆశ్రమ నిర్వాహకులూ, ప్రముఖ గురూజీ, 108కి పైగా సాయి మందిరాల నిర్మాణంలో పాలు పంచుకున్న వ్యక్తి గోళ్ళముడి యోగానంద కృష్ణమూర్తి (1931 - ఆగష్టు 14, 2015) ఈయన కృష్ణాజిల్లా నందిగామ మండలం గౌరారం గ్రామంలో జన్మించారు.

విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం

[మార్చు]

విజయవాడలో బిఏ ఎల్ ఎల్ బి వరకూ చదువుకున్నారు. హైదరాబాదులో ఇంటిలిజెన్స్ విభాగంలో డిఎస్పీగా పనిచేసారు. ఇంకా పదవీ కాలం వుండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసారు.

ఖమ్మం తో అనుభందం

[మార్చు]

1970 వ సంవత్సరంలో ఖమ్మం వచ్చి ఒక సంవత్సరం పాటు కోర్టులో న్యాయవాదిగా పనిచేసారు. తన జీవిత పర్యంతం బార్ కౌన్సిల్ లో సభ్యునిగా కొనసాగుతూనే వచ్చారు.

కుటుంబ జీవితం

[మార్చు]

1951 లో మధురమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కృష్ణసాయి, సత్యసాయి. నలుగురు కుమార్తెలు వాణిశ్రీ, జయశ్రీ, ఉమశ్రీ, రమశ్రీ, ఆయన ఇద్దరు కుమారులూ మరణించారు. కుమార్తెల్లో ఇద్దరు విదేశాల్లో ఉండగా ఒకరు హైదరాబాద్ లో మరోకరు ఖమ్మంలో ఉంటున్నారు. వీరి జీవిత చరమాంకంలో చిన్నకోడలు సుధాశ్రీ వీరి బాగోగులు చూసుకున్నారు. భక్తమండలి పిచ్చయ్య, నరసింహారావు, దండేల లక్ష్మీనారాయణ, సుగుణమ్మల సహకారంతో షిరిడీ ఆలయాలను, యోగానంద సాయి ఆశ్రమాన్ని ఆమె నడిపిస్తున్నారు.

ఆధ్యాత్మిక భావాల వ్యాప్తికి కృషి

[మార్చు]

1974లో ఖమ్మంలో తొలిసారిగా మామిళ్ళగూడెంలో సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. తర్వాత 1984లో పెద్దతండాలోని సాయిప్రభాత్ నగర్ యోగానంద షిరిడీ సాయి ఆశ్రమాన్ని ప్రారంభించారు. అదేవింధంగా కారేపల్లి, కామేపల్లి, నేలకొండపల్లి, జీళ్ళచెర్వులతో పాటు నల్గొండ జిల్లా కోదాడ, కృష్ణాజిల్లా వత్సవాయి. వరంగల్ జిల్లాలోనూ, ఒడిసా రాష్ట్రంలోని ఖరగ్ పూర్తో సహా మొత్తం 108 సాయి మందిరాలను నిర్మించడంలో యోగానంద ప్రధాన భూమికను పోషించారు.

కేవలం ఆలయాలను నిర్మించడమే కాకుండా ఏటా నగర సంకీర్తనలూ, పల్లెసేవలూ, గురుపౌర్ణమి, విజయదశమి లాంటి ఆధ్యాత్మిక వేడుకలను నిర్వహించారు. వీ��ిద్వారా లక్షలాది భక్తులను సంపాదించుకున్నారు. ఏటా వివిధ సందర్భాలలో వేలాదిమంది భక్తులకు అన్నదానం, వస్త్రదానం లాంటికార్యక్రమాలను కూడా నిర్వహించారు.

నిర్యాణం

[మార్చు]

యోగానంద కృష్ణమూర్తి తన 84 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 14, 2015ఖమ్మం జిల్లా గ్రామీణ మండలం పెద్దతండా లోని సాయిప్రభాత్ నగర్ కాలనీలోని షిరిడీ సాయి ఆశ్రమంలోనే తన తుది శ్వాస విడిచారు. అంతకు పూర్వం అనారోగ్య కారణాలతో ఈయన రెండు నెలలకు పైగా కోమాలోనే గడిపారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]