Jump to content

యాగా వేణుగోపాలరెడ్డి

వికీపీడియా నుండి
యాగా వేణుగోపాలరెడ్డి
యాగా వేణుగోపాలరెడ్డి రాష్ట్రపతి ప్రతిభాదేవీసింగ్ పాటిల్ నుండి పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్న చిత్రం
21వ గవర్నరు భారతీయ రిజర్వ్ బాంక్
In office
6 సెప్టెంబర్ 2003 – 5 సెప్టెంబర్ 2008
అంతకు ముందు వారుబిమల్ జలన్
తరువాత వారుదువ్వూరి సుబ్బారావు
వ్యక్తిగత వివరాలు
జననం (1941-08-17) 1941 ఆగస్టు 17 (వయసు 83)
కొమ్మనవారిపల్లె గ్రామం, పుల్లంపేట మండలం, వైఎస్‌ఆర్ జిల్లా
జాతీయతIndian
చదువుOsmania University, Hyderabad
వృత్తిIAS

యాగా వేణుగోపాల్ రెడ్డి (వై.వి.రెడ్డి) భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి 2008 ఆగస్టులో పదవీవిరమణ చేశాడు.' రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరైన వై.వి.రెడ్డి 1964 బ్యాచ్ కు చెందిన IAS (ఐ.ఏ.ఎస్) అధికారి. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది.

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

1941 ఆగస్టు 17న వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం కొమ్మనవారిపల్లె గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించాడు. నంద్యాల కలెక్టర్‌గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన వృత్తిరీత్యా మద్రాసులో స్థిరపడడం వల్ల వేణుగోపాల్‌రెడ్డి చదువంతా తమిళనాడులోనే సాగింది.

వృత్తి జీవితం

[మార్చు]

వేణుగోపాల్‌రెడ్డి IAS అధికారి కాకముందు 1961 నుంచి లెక్చరర్ గా పనిచేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో M.A., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D., నెదర్లాండ్స్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియల్ స్టడీస్ లో ఆర్థిక ప్రణాళిక (Economic Planning) లో డిప్లొమా చేశాడు. అవే కాకుండా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Doctor of Letters), మారిషస్ విశ్వవిద్యాలయం (Doctor of Civil Law) ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Department of Business Management) లోను, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (London School of Economics and Political Science - International Relations Department) లోనూ, Administrative Staff College of India లోనూ విజిటింగ్ ఫాకల్టీగా పనిచేసిన వై.వి.రెడ్డి హైదరాబాదులోని CESS (Center for Economic and Social Studies) లో Honorary Senior Fellow గా కొనసాగుతున్నాడు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో (బ్యాంకింగ్) కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శి గా, వాణిజ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ యాదృచ్ఛిక పేజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, ఆపైన 1996 నుంచి ఏడేళ్ళు రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా సేవలందించాడు. రిజర్వ్ బ్యాంకు గవర్నరు కాకముందు ప్రపంచ బ్యాంకు సలహాదారుగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) బోర్డులో భారతదేశం తరపున ద్రవ్య వ్యవహారాల స��హాదారుగా పనిచేసిన రెడ్డి 2002లో IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితుడయ్యాడు. ఆర్థికాభివృద్ధి పథంలో ఈయన సలహాలను వినియోగించుకున్న దేశాల్లో చైనా, బహ్రెయిన్, ఇథియోపియా, టాంజానియా, తదితర దేశాలున్నాయి.

ఆర్థికరంగ సంస్కరణలు, వాణిజ్యం, BoP (Balance of payments), ద్రవ్య మార్పిడి రేటు, విదేశీ వాణిజ్య ఋణాలు, కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ప్రాంతీయ ప్రణాళిక, ప్రభుత్వరంగ సంస్కరణలు, తదితర రంగాలలో ఆయన కీలక భూమిక నిర్వహించాడు.

రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా బ్యాంకు వ్యవహారాల్లో పారదర్శకతను తీసుకువచ్చాడు. మన దేశ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం వృద్ధి రేటు నుంచి 8-9 శాతం వృద్ధిరేటును నమోదు చేసే స్థాయికి విస్తరించిన తరుణంలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లను తట్టుకొని ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా జాగ్రత్త వహించాడు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచెయ్యడంలో గట్టిపట్టున రెడ్డి ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయంగా రూపాయి మారకం రేటు పెరిగేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. సెప్టెంబరు 2008లో రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పదవీ విరమణ చేసిన వై.వి.రెడ్డి ప్రస్తుత ఆర్థికమాంద్యం నుంచి బయటపడటానికి పలు దేశాల ప్రతినిధులు, ఎంతో అనుభవజ్ఞులైన ఆర్థిక బ్యాంకింగ్‌ నిపుణులతో ఐరాస ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమిక సిఫార్సులు చేసింది.

వై.వి.రెడ్డి ప్రస్తుత ఆర్థిక సంక్షోభంపై రాసిన పుస్తకం: 'ఇండియా అండ్‌ ద గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌'. ఈ పుస్తకంలో రెండు ప్రధానమైన అంశాలకు సమాధానం ఉంది. ఒకటి- మిగిలిన దేశాల కంటే భారత్‌ పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. రెండు- ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? దానిపై ఎవరేం చేస్తున్నారు? సంక్షోభాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలోని సమాచారం వీలు కల్పిస్తోంది.

ప్రస్తుతం వీరు 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులుగా ఉనన్నారు. భారత ఆర్థిక రంగానికి వీరు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం వీరిని పద్మ విభూషణ్ సత్కారం ఇచ్చింది.

మూలాలు

[మార్చు]