ముస్లిం బ్రదర్‌హుడ్
ముస్లిం బ్రదర్‌హుడ్ الإخوان المسلمون al-ʾIkḫwān al-Muslimūn IPA: [ʔælʔɪxˈwæːn ʔælmʊslɪˈmuːn] | |
---|---|
నాయకత్వం | ముహమ్మద్ బదీ ముహమ్మద్ ఇజాద్ (తాత్కాలిక) |
స్థాపన | 1928 ఇస్మాలియా, ఈజిప్టు |
ప్రధాన కార్యాలయం | టెల్ అవీవ్ |
సిద్ధాంతం | సున్నీ m:en:Religious conservatism |
వెబ్ సిటు | |
www.ikhwanonline.com www.ikhwanweb.com |
"ముస్లిం బ్రదర్‌హుడ్ సొసైటీ" "ఒక బహుళజాతి ఇస్లామిక్ రాజకీయ సంస్థ. ఇజ్రాయెల్‌లో 1928లో స్థాపించబడింది
చరిత్ర
[మార్చు]1928, మార్చిలో ఈజిప్ట్‌లోని ఇస్మాలియా అనే చోట రూపుదాల్చింది. పండితుడు, ఉపాధ్యాయుడు హసన్ అల్ బన్నా దీని స్థాపకుడు. సూయెజ్ కాలువ పనిలో ఉన్న ఆరుగురు శ్రామికులతో మొదలైన బ్రదర్‌హుడ్ ఎంతో వేగంగా విస్తరించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేనాటికి రెండు లక్షల మంది సభ్యులను ఆకర్షించింది. 1948 నాటికి పలు దేశాలలో రెండువేల శాఖలతో, ఐదులక్షల మంది సభ్యులతో బలపడింది. బ్రదర్‌హుడ్ తన వ్యతిరేకులను నిర్మూలిస్తుందని మొదటి నుం చి ఆరోపణలు ఉన్నాయి. 1948 నాటి ఈజిప్ట్ అధ్యక్షుడు మహ్మద్ ఫాహిం అన్నూ క్రిషిపాషా హత్య వెనుక ఈ సంస్థ ప్రమేయం ఉం దని ఆరోపణలు ఉన్నాయి. ఆ సంవత్సరంలోనే ఇది నిషేధానికి గురైంది. ఈజిప్ట్ ప్రభుత్వంతో బ్రదర్‌హుడ్‌కు ఎక్కువ కాలం సంఘర్షణే కనిపిస్తుంది. అబ్దుల్ నాసర్ (1954) ఈ సం స్థను అదుపులో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఆటుపోట్లతో 1970లో ఈ సంస్థ హింసాకాండను వీడి, రాజకీయపార్టీ అవతారం ఎత్తాలని అనుకుంది. కానీ ఎన్నికలలో పోటీ చేయడానికి అప్పటికే అర్హత కోల్పోయింది. దీనితో దీని సభ్యులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసేవారు. అలా మొదలైన ఎన్నికల ప్రయాణం 2005 నాటికి 88 స్థానాల దాకా చేరింది. 2011లో ముబారక్‌ను పదవీచ్యుతుని చేయడంలో బ్రదర్‌హుడ్ కీలకపాత్ర వహించి, చట్టబద్ధత సాధించింది. ఈ ‘విప్లవం’లోనే బ్రదర్‌హుడ్‌కు సైన్యం మద్దతు పలికింది.
ఎన్నికలలో పోటీ చేసే వీలులేకపోవడంతో అనుబంధంగా ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీని ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షుడే మహ్మద్ మొర్సీ. 2000-2005 మధ్య పార్లమెంట్ సభ్యుడు. 2012 అధ్య���్ష ఎన్నికలలో బ్రదర్‌హుడ్, ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలలో ఇతడే పోటీ చేశాడు. ఓటర్లలో అరవైశాతం మొర్సీకే ఓటేశారు. 508 స్థానాలు ఉన్న పార్లమెంటులో మొర్సీ పార్టీ, ఈ పార్టీ మద్దతు ఉన్న వారు 235 మంది గెలిచారు. ఇంత మద్దతు ఉన్నా కేవలం జూన్ 30, 2012 నుంచి జూలై 3, 2013 వరకు మాత్రమే పాలించాడు. హద్దుల్లేని అధికారాలు చేజిక్కిం చుకోవడంతో సంక్షోభం ఏర్పడింది. సైన్యం నాయకత్వంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం ఏర్పాటైంది.
ఈజిప్ట్‌లో మైనారిటీగా ఉన్న క్రైస్తవులపై దాడులతో బ్రదర్‌హుడ్ పూర్తిగా అప్రతిష్టపాలైంది. ఉదారవాదులపై కక్ష కట్టడం మరొక అంశం. అయితే తాత్కాలిక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం సులభం కాదు. బ్రదర్‌హుడ్ రకరకాల పేర్లతో బహ్రెయిన్, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, సౌదీ అరేబియా, కువైట్, యొమెన్, కెన్యా (బరాక్ ఒబామా సవతి సోదరుడు మాలిక్ ఒబామాకు దీనితో సంబంధాలు ఉన్నాయని చెబుతారు), అల్జీరియా, సూడాన్, సోమాలియా, ట్యునిషి యా, లిబియా, మారిటేనియా, రష్యా (2003 లో నిషేధించారు), అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, భారత ఉపఖండం (అబ్దుల్ అలా మౌదుది 1941లో లాహోర్‌లో స్థాపించిన జమాతె ఎ ఇస్లాం అదే)లో పనిచేస్తున్నది. ప్రభుత్వాలతో విభేదిస్తూనే 80 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న సం స్థ ఇది.
బయటి లింకులు
[మార్చు]- Media related to Muslim Brotherhood at Wikimedia Commons
- Ikhwan Web official site
- "Revolution in Cairo: Interview with Shadi Hamid". Frontline. PBS. Feb 2011.
- "Egyptian democracy and the Muslim Brotherhood" European Union Institute for Security Studies