Jump to content

బోయిస్ హరే కృష్ణ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 43°36′10″N 116°12′37″W / 43.60278°N 116.21028°W / 43.60278; -116.21028
వికీపీడియా నుండి

బోయిస్ హరే కృష్ణ దేవాలయం (వైదిక సాంస్కృతిక కేంద్రం), యునైటెడ్ స్టేట్స్‌, ఐడహో రాష్ట్రంలోని బోయిస్ లో ఉన్న దేవాలయం. 1986లో బోయిస్ రాష్ట్ర విశ్వవిద్యాలయం సమీపంలో సభ్యులలో ఒకరి ఇంటిలో ఇది ప్రారంభించబడింది. అంతకు ముందు ఈ పట్టణంలో హరే కృష్ణ దేవాలయం లేదు. స్థానిక పాఠశాలలు, కళాశాలల నుండి ఉపాధ్యాయులు వచ్చి బోధించేవారు.

నిర్మాణం, ప్రారంభం

[మార్చు]

1999లో రెండు ఇటుక డ్యూప్లెక్స్‌ల మధ్య ఈ కొత్త దేవాలయాన్ని నిర్మించారు. 1999 ఆగస్టులో బోయిస్ మేయర్ బ్రెంట్ కోల్స్ రిబ్బన్‌ను కత్తిరించి దేవాలయాన్ని ప్రారంభించాడు.[1] బోయిస్ హరే కృష్ణ దేవాలయం, వేద సాంస్కృతిక కేంద్రం ప్రతిరోజూ ఉదయం 5:00 నుండి 9:00 గంటల వరకు ఆరాధనకు తెరిచి ఉంటుంది.[2]

నిర్మాణ శైలీ

[మార్చు]

బోయిస్ ఆర్కిటెక్ట్ బ్రూస్ పో ఈ దేవాలయాన్ని డిజైన్ చేశారు. గోల్డెన్ డోమ్, పెయింట్ సీలింగ్, రిచ్ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ అన్నీ స్థానిక మాస్టర్ ఆర్టిస్టులచే రూపొందించబడ్డాయి. జైపూర్ నుండి తెచ్చిన చేతితో చెక్కబడిన టేకువుడ్ బలిపీఠాన్ని దేవాలయంలో మధ్యభాగంలో ఏర్పాటుచేశారు. రాధా - బంకేబిహారి ఆలయ దేవతలుగా ఉన్నారు. దేవాలయానికి దక్షిణం వైపున మెరిడియన్ కళాకారుడు మైఖేల్ బూత్ రూపొందించిన స్టెయిన్డ్ గ్లాస్ విండో "పది అవతారాలను" వివరిస్తోంది.

మూలాలు

[మార్చు]
  1. Horan, Tiffany (21 August 1999). Mayor To Open New Boise Temple Archived 2012-02-25 at the Wayback Machine published in The Idaho Statesman. Last accessed 1 September 2009.
  2. "Boise Hare Krishna Temple And Vedic Cultural Center". Retrieved 2022-06-30.

బయటి లింకులు

[మార్చు]

43°36′10″N 116°12′37″W / 43.60278°N 116.21028°W / 43.60278; -116.21028