బాడీగార్డ్
బాడీగార్డ్ (2012 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గోపీచంద్ మలినేని |
---|---|
నిర్మాణం | బెల్లంకొండ సురేష్ |
కథ | సిద్ధిక్ |
తారాగణం | దగ్గుబాటి వెంకటేష్, త్రిష, సలోని |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
సంభాషణలు | కోన వెంకట్ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | గౌతం రాజు |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్ |
భాష | తెలుగు |
బాడీగార్డ్ 2012లో విడుదలైన తెలుగు సినిమా. ఇది మలయాళం, హిందీలో నిర్మించబడిన సినిమాకు తెలుగు రూపము.
నటీనటులు
[మార్చు]- దగ్గుబాటి వెంకటేష్
- త్రిష
- సలోని
- ప్రకాష్ రాజ్
- కోట శ్రీనివాసరావు
- జయప్రకాశ్ రెడ్డి
- సుబ్బరాజు
- ఆలీ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- రావు రమేశ్
- ఎం. ఎస్. నారాయణ
- శ్రీవిష్ణు
- ప్రియదర్శి పులికొండ
- గద్దె రాజేంద్ర ప్రసాద్
- రాహుల్ దేవ్
- ముకేష్ రిషి
- సుమన్ (నటుడు)
- సత్య (నటుడు)
- షకలక శంకర్
- అజయ్ (నటుడు)
- ప్రగతి
- వేణుమాధవ్
- ప్రవీణ్
- తాగుబోతు రమేష్
- గుండు సుదర్శన్
- అమిత్ తివారి
- ఆదర్శ్ బాలకృష్ణ
- ఫిష్ వెంకట్
- రఘు కారుమంచి
- మీనాక్షి దీక్షిత్ - అతిథి పాత్ర
పాటల జాబితా
[మార్చు]బాడీగార్డ్ (నువ్వు పుట్టంగనే) రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. బాబా సెహగల్, రమ్యా ఎన్ఎస్కె, నవీన్ మాధవ్, ఎం ఎల్ ఆర్. కార్తీకేయన్ , రాహూల్ నంబియార్
హాసన్న(అడుగడుగున నిన్ను చూసా) రచన: అనంత్ శ్రీరామ్, గానం. శ్రీవర్దిని , రాహూల్ నంబియార్
ఓ మై గాడ్ : రచన: అనంత ��్రీరామ్, గానం.రంజిత్, గీతామాధురి, బిందు
ఎవ్వరో, రచన: శ్రీమణి, గానం.కార్తీక్
జియ జాలీ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.హరిచరన్ , రీటా, శ్రావణ భార్గవి , హరిణి
ఎందుకో కావాలనుకున్న ప్రేమను , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.శ్వేతాపండిట్, ఎస్.తమన్ , హరిచరన్.
విమర్శకుల స్పందన
[మార్చు]123తెలుగు.కాం వారు తమ సమీక్షలో, "బాడీగార్డ్ కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ చిత్రం. కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వించగా కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఏడిపిస్తాయి. రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు వదిలేస్తే క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది" అని వ్యాఖ్యానించారు.[1] వన్ ఇండియా వారు తమ సమీక్షలో, "అసభ్యత, హింస లేకుండా ఉండటం, కామిడీ, సెంటిమెంట్ పండటంతో ఈ చిత్రం ఫ్యామిలీలు నిరభ్యంతరంగా చూసే అవకాశం కలిగిస్తుంది. యూత్ కాస్త దూరమైనా, కుటుంబాలు కదిలివస్తే సినిమా మంచి విజయమే సాధిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించారు.[2] తెలుగువాహిని.కాం తమ సమీక్షలో, "సంక్రాంతి సీజన్ కాబట్టి, వెంకటేష్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అండగా నిలబడటానికి కావలసినంత సెంటిమెంట్, యాక్షన్ ఉంది కాబట్టి బాడీగార్డ్ డీసెంట్ హిట్ గా నిలుస్తుంది. మిగతా బాషలలో చూసినవాళ్ళకు ఒకే, కొత్తగా చూస్తే కేకే" అని వ్యాఖ్యానించారు.[3]
పురస్కారాలు
[మార్చు]సైమా అవార్డులు
[మార్చు]2012 సైమా అవార్డులు
- ఉత్తమ సహాయనటి (సలోని)
మూలాలు
[మార్చు]- ↑ "సమీక్ష: మంచి మనసున్న బాడీగార్డ్". 123తెలుగు.కాం. Retrieved జనవరి 14, 2012.
- ↑ "కామిడీ గార్డ్ (బాడీగార్డ్ రివ్యూ)". వన్ ఇండియా. Retrieved జనవరి 14, 2012.
- ↑ "బాడీగార్డ్ మూవి రివ్యూ: మిగతా బాషలలో చూసినవాళ్ళకు ఒకే, కొత్తగా చూస్తే కేకే". తెలుగువాహిని.కాం. Archived from the original on 2013-05-05. Retrieved జనవరి 14, 2012.