ప్రపంచ కళా దినోత్సవం
ప్రపంచ కళా దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | ఏప్రిల్ 15 |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రపంచ కళా దినోత్సవం ప్రతి ఏట ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. సృజనాత్మకతపై ప్రపంచంవ్యాప్తంగా అవగాహన కలిపించడంకోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది.[1][2]
ప్రారంభం
[మార్చు]గ్వాడలజరాలో జరిగిన ప్రపంచ కళల అసోసియేషన్ యొక్క 17వ సమావేశంలో ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రతిపాదన పంపడంతోపాటూ 2012లో మొదటిసారిగా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. టర్కీ దేశపు బెడ్రీ బయకమ్ ఈ ప్రతిపాదనకు సహాయం అందించగా, రోసా మరియా బురిల్లో వెలస్కో (మెక్సికో), అన్నే పుర్నీ (ఫ్రాన్స్), లియు డావీ (చైనా), క్రిస్టోస్ సైమోనైడ్స్ (సైప్రస్), అండర్స్ లిడెన్ (స్వీడన్), కాన్ ఐరీ (జపాన్), పావెల్ క్రాల్ (స్లొవేకియా), దేవ్ చౌరామున్ (మారిషస్), హిల్డే రాంగ్స్కోగ్ (నార్వే) తదితరులు సంతకాలు చేశారు. దాంతో ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా అంగీకరించబడింది.[1][3][4]
ఇటలీకు చెందిన చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ఈ దినోత్సవం నిర్ణయించబడింది. కళా, ప్రపంచ శాంతి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సహనం, సోదర, బహుళ సాంస్కృతికత, ఇతర ��ంగాలకు డావిన్సి ప్రతీకగా నిలిచాడు.[2][4]
కార్యక్రమాలు
[మార్చు]2012, ఏప్రిల్ 15న జరిగిన తొలి ప్రపంచ కళా దినోత్సవంకు టర్కీ, మెక్సికో, ఫ్రాన్స్, చైనా, సైప్రస్, స్వీడన్, జపాన్, స్లొవేకియా, మారిషస్, నార్వే దేశాలలోని ప్రపంచ కళల అసోసియేషన్ కు చెందిన అన్ని జాతీయ కమిటీలు, 150మంది కళాకారులు మద్దతు లభించింది.[3][4] వెనుజులా దేశం డావిన్సీ గౌరవార్ధంగా పెయింటింగ్స్, శిల్పాలు, ప్రింట్లు, వీడియో, ఫోటోలతో చిత్ర ప్రదర్శనలను నిర్వహించింది.[4] 2013లో దక్షిణాఫ్రికాలోని మోబోంబెలా మున్సిపల్ ఆర్ట్ మ్యూజియంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి.[5] గూగుల్ సంస్థ గూగుల్ ఆర్ట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ కళా దినోత్సవంకు తన మద్దతును అందించింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Why World Art Day?". International Association of Art. Archived from the original on 25 డిసెంబరు 2013. Retrieved 15 April 2019.
- ↑ 2.0 2.1 Gerry La Roux (April 15, 2013). "Celebrating art and creativity on World Art Day". New Zealand: Science Lens. Retrieved 15 April 2019.
- ↑ 3.0 3.1 "World Art Day to be celebrated April 15". Hürriyet Daily News. Istanbul. April 11, 2012. Retrieved 15 April 2019.
- ↑ 4.0 4.1 4.2 4.3 "Día Mundial del Arte se celebra este sábado en Caracas". Caracas: El Universal. 12 April 2012. Retrieved 15 April 2019.
- ↑ ""World Art Day" Exhibition" (PDF). South Africa: MBombela Art Gallery. Retrieved 15 April 2019.
- ↑ Elizabeth Palermo (April 15, 2013). "Van Gogh's 'Starry Night' Most-Loved Painting on Google". TechNewsDaily. Archived from the original on 9 ఏప్రిల్ 2014. Retrieved 15 April 2019.