Jump to content

పాపుం పరే జిల్లా

వికీపీడియా నుండి
పeపుమ్ పరే జిల్లా
అరుణాచల ప్రదేశ్ పటంలో పeపుమ్ పరే జిల్లా స్థానం
అరుణాచల ప్రదేశ్ పటంలో పeపుమ్ పరే జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల ప్రదేశ్
ముఖ్య పట్టణంయుపియా
విస్తీర్ణం
 • మొత్తం2,875 కి.మీ2 (1,110 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం1,76,385[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత82.1%[1]
 • లింగ నిష్పత్తి950[1]
Websiteఅధికారిక జాలస్థలి
ఇటానగర్ సమీపంలోని డిక్రోంగ్ నది

పాపుం పరే జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంగా ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[3]

చరిత్ర

[మార్చు]

పాపుం పరే జిల్లా 1999లో దిగువ సుబన్‌సిరి జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేయుట ద్వారా ఈ జిల్లా రూపొందింది.[4]

భౌగోళికం

[మార్చు]

పాపుం పరే జిల్లా కేంద్రం యుపియా. పాపుం పరే జిల్లా 2,875 చ.కి.మీ.[5] రాష్ట్ర రాజధాని ఇటానగర్ కూడా పాపుం పరేలో ఉంది.

పరిపాలనా విభాగాలు

[మార్చు]

ఉప విభాగాలు

[మార్చు]

జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది.

తాలూకాలు

[మార్చు]

పరిపాలనను సులభతరం చేయడానికి, 2 ఉపవిభాగాలుగాను 10 తాలూకాలుగా (తాలూకా/తహసీల్/తహశీల్) గా విభజించారు. ఇవి ఉప-జిల్లాలను సూచించే పరిపాలనా విభాగాలు.వీటిలో బహుళ గ్రామాలు, కొన్ని పట్టణాలను కలిగి ఉంటాయి.

శాసన వ్యవస్థ

[మార్చు]

జిల్లాలో 3 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి:- ఇటానగర్, డాయ్‌ముఖ్, సగలీ. ఈ మూడు అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[6]

లోక్‌సభ నియోజకవర్గాలు

[మార్చు]

ఈ జిల్లా అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

జనాభా గణాంకాలు (2011)

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపమ్ పరే జిల్లాలో మొత్తం జనాభా 176,573. వీరిలో 89,182 మంది పురుషులు కాగా, 87,391 మంది స్త్రీలు ఉన్నారు.[7] జిల్లాలో మొత్తం 35,730 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 980.

జిల్లా మొత్తం జనాభాలో 54.9% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 45.1% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84.7% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 73.9%. అలాగే పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 969 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 993.

జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 25170, ఇది మొత్తం జనాభాలో 14%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 12729 ఉండగా, ఆడ పిల్లలు 12441 ఉన్నారు. ఈ విధంగా పిల్లల లింగ నిష్పత్తి 977, ఇది జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (980) కంటే తక్కువ.

జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 79.95%. జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 73.77%, స్త్రీల అక్షరాస్యత రేటు 63.23%.

పాపుం పరే జిల్లాలో న్యిషి గిరిజనులు అత్యధికంగా ఉన్నారు. వీరు సంప్రదాయంగా డొన్యి- పొలో మతాన్ని అనుసరిస్తారు. న్యిషి ప్రజలలో కొందరు క్రైస్తవమతాన్ని అనుసరిస్తారు.[8]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1978లో పాపుం పరె జిల్లాలో 140 చ.కి.మీ వైశాల్యంలో " ఇటానగర్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
  2. "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  3. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  5. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  6. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 2 May 2011.
  7. "Papum Pare District Population Religion - Arunachal Pradesh, Papum Pare Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2002-11-29. Retrieved 2014-03-06.
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]