పక్కయింటి అమ్మాయి
పక్కయింటి అమ్మాయి (1953 తెలుగు సినిమా) | |
చందమామ పత్రికలో పక్కయింటి అమ్మాయి ప్రకటన | |
---|---|
దర్శకత్వం | సి.పుల్లయ్య |
తారాగణం | అంజలీదేవి, రేలంగి, సి.యస్.రావు, ఏ.యమ్.రాజా |
నిర్మాణ సంస్థ | ఈస్టిండియా ఫిలిం కంపెనీ |
భాష | తెలుగు |
నవరసాల్లో హాస్యానికి సముచిత స్థానంలో ఉంచిన తెలుగు సినిమా పక్కయింటి అమ్మాయి. బెంగాలీలో సుధీర్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన 'పాషేర్ బరీ' ఈ చిత్రానికి ఆధారం. తరువాత' పడో'సన్ పేరుతో హిందీలో నిర్మించారు. తరువాత తెలుగులో కె.వాసు దర్శకత్వంలో పక్కింటి అమ్మాయి (1981) ని మళ్ళీ నిర్మించారు.
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]అనగనగా ఒక చదువురాని ఓ బడుద్దాయి, పేరు సుబ్బారాయుడు (రేలంగి). అతని ఇంటిపక్కనే వుంటుంది కథానాయిక (అంజలీదేవి). ఆమెకు నాట్యం అంటే వల్లమాలిన అభిమానం. ఆమె నృత్యరీతుల కనువుగా సంగీతాన్ని చెప్పే మాస్టార్ని (అడ్డాల నారాయణరావు) పెట్టుకుంటుంది. పక్కింట్లో నివసించే సుబ్బారాయుడు చేష్టలు ఆమెకు నచ్చవు. ఆమెపై మనసు పారేసుకొన్న సుబ్బారాయుడు తన మిత్రబృందం సభ్యుల సలహామేరకు తనకు సంగీతం వచ్చినట్లు ఫోజు పెడతాడు. ఆమె తన గురువును సుబ్బారాయుడి మీదకు ఉసిగొల్పుతుంది. సుబ్బారాయుడు తన గురువు సలహమేరకు మరో మిత్రుడు (ఏ.యం.రాజా) పాట పాడుతుంటే దానికి తగ్గట్టు పెదాలు కదుపుతూ సుబ్బారాయుడు అద్భుతంగా అభినయిస్తాడు. దాంతో కథానాయిక కూడా సుబ్బారాయున్ని ప్రేమించేదాకా వస్తుంది. అయితే అసలు గాయకుదు రాజా అని, సుబ్బారాయుడు కాదని తెలుసుకున్న నాయిక తన మనసు మార్చుకుంటుంది. సుబ్బారాయున్ని రక్షించుకోవడానికై మిత్రులు పన్నిన వ్యూహంలో భాగంగా సుబ్బారాయుడు చచ్చినట్లు నటిస్తాడు. కథానాయిక మనసు మార్చుకొని సుబ్బారాయుడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
తారాగణం
[మార్చు]రేలంగి వెంకట్రామయ్య
అంజలీదేవి
ఎ.ఎం.రాజా
సి.శ్రీనివాసరావు
మహంకాళి వెంకయ్య
అడ్డాల
ఆర్.కె.రావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
సంగీతం: గుడిమెట్ల అశ్వద్ధామ
గీత రచయిత:ముద్దుకృష్ణ
గాయనీ గాయకులు: పులపాక సుశీల, ఎ.ఎం.రాజా, ఎం.వి.రాజు
విడుదల:16:12:1953.
నిర్మాణ సంస్థ: ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ.
పాటల జాబితా
[మార్చు]1.ఏ తీరున గళము చాపి ఏ రీతిగ కలతను లేపి ప్రణయానికి, రచన: ముద్దుకృష్ణ, గానం.పులపాక సుశీల
2.కలయేమో ఇది నా జీవిత ఫలమేమో చెలియా, రచన: ముద్దుకృష్ణ, గానం.ఎ.ఎం.రాజా
3.గణ గణ గణ గణ ఆకాశంలో గంటలు మ్రోగాయి, రచన:ముద్దుకృష్ణ, గానం.ఎం.వి.రాజు, ఎ.ఎం.రాజా
4 గులాబి పువ్వు సుమమా నీ కళా తపమిది ఏల, రచన: ముద్దుకృష్ణ, గానం.పులపాక సుశీల
5.తరించే ��ీవితము ఫలించే కామితము కదలెను నా మదిలో, రచన: ముద్దుకృష్ణ, గానం.ఎం.వి.రాజు
6. నన్నరలించుట న్యాయమేరా మూరిడు శరములు, రచన: ముద్దుకృష్ణ, గానం.ఎం.వి.రాజు, పులపాక సుశీల
7.నీ మాటలూ నీ మాటలూ నీ చూపుల తళుకులలో, రచన: ముద్దుకృష్ణ, గానం.ఎం.వి.రాజు
8.పసిపాప మనసుతో పవళించేవేల నిదరలో కలకల, రచన: ముద్దుకృష్ణ, గానం.పులపాక సుశీల
9.ప్రేయసీ నా హృదిలో అమృత గీతాలాపన అలలతో పొంగిపోరలే, రచన: ముద్దుకృష్ణ, గానం.ఎ.ఎం.రాజా
10.వసంతకాలం వచ్చింది వరునికి వధువుని పూచింది, రచన: ముద్దుకృష్ణ, గానం.పులపాక సుశీల బృందం .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.