పంజాబీ తండూర్
![]() | |
మూలము | |
---|---|
మూలస్థానం | Punjab region |
పంజాబీ తండూర్ (Gurmukhī:ਤੰਦੂਰ; Shahmukhi:تندور) అనేది పంజాబ్లో వంట తయారు చేయడానికి ఉపయెగించే ఒక మట్టితో తయారు చేయబడ్డ పాత్ర.
తయారీ
[మార్చు]దీనిని ప్రత్యేకమైన మట్టితో తయారు చేస్తారు. గోళాకారంగానూ నిలువుగానూ ఉండే వీటిని పంజాబ్ లోని గ్రామాలలో సాంప్రదాయ వంటకాలకు వాడుతారు. ఈ తండూర్లను నేలలో అతికించేస్తారు. కర్రలు, చెక్కలు, బొగ్గులతో అందులో మంట వేస్తారు. దాదాపు 480 డిగ్రీలు కూడా మండగలవు వీటిలో.[1] కొన్ని రకాల పంజాబీ తండూర్లు నేలకు ఎత్తులో కూడా ఉంటాయి.[2] కొన్ని గ్రామాలలో గ్రామ మొత్తానికి ఉమ్మడి తండూర్లు కూడా కలిగి ఉంటారు.[3][4][5]
సింధు లోయ నాగరికత ప్రదేశాల్లో ఈ పంజాబీ తండూర్ల అవశేషాలు కూడా దొరికాయి.[6] అవిభాజ్య పంజాబ్‌లో కూడా ఈ పంజాబీ తందూర్లను వాడేవారు.[3][7]
ఉపయోగాలు
[మార్చు]- పంజాబ్ లోని ప్రతి ఇంట్లో, పెరట్లో రోటీలు, నాన్లు తయారుచేయడంకోసం వీటిని ఉపయోగిస్తారు
- ఈ తండూర్లను తందూరీ కోడిమాంసం తయారీలో ఉపయోగిస్తారు.
పంజాబీ సంస్కృతిలో కూడా ఈ తండూర్లు భాగమైపోయాయి. ఈ సామూహిక తండూర్ల వద్ద కూర్చొని ఎన్నో జానపద పాటలకు ప్రాణం పోశారు పంజాబీ పడుచులు.[3]
భారత విభజన తరువాత ఇతర ప్రదేశాల్లో స్థిరపడిన పంజాబీల ద్వారా ఈ తండూర్లు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు పరిచయమయ్యాయి.[8]
తండూర్ కీ, భథికి తేడా
[మార్చు]తండూర్ మట్టి, ఇటుకలతో తయారు చేస్తారు. ఒక వైపు ఓపెన్ గా ఉండి, దా��ట్లో పదార్ధాలను వండుతారు. కాని భథి పైన ఎదైనా లోహంతో తయారు చేసిన మూత ఉంచి వండుతారు. భథి నుంచి పొగ వేరే సిలిండర్ వంటి దాని నుండి బైటకు వస్తుంది.[3]
కొన్ని భథిలపై మట్టితో శాశ్వతంగా కప్పేస్తారు. వాటిని భట్టీలు అంటారు. వీటిని ఎక్కువగా రాజస్థాన్ లో వాడతారు.[9] ఎక్కువ మోతాదులో వండాలంటే ఈ భథిలపై అసలు మూతే ఉంచరు.[10]
మూలాలు
[మార్చు]- ↑ Vahrehvah
- ↑ Punjabi tandoor in Amritsar
- ↑ 3.0 3.1 3.2 3.3 Alop ho riha Punjabi virsa byHarkesh Singh Kehal Pub Lokgeet Parkashan ISBN 81-7142-869-X
- ↑ Pind Diyan Gallian PTC Channel - Bilga (Jalandhar) which are also known as tadoors in Punjabi.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-14. Retrieved 2016-07-23.
- ↑ Pop's Mops and Sops - Barbecue and Sauces from Around the World By "B" "B" Quester [1]
- ↑ [2] The Rough Guide to Rajasthan, Delhi and Agra By Daniel Jacobs, Gavin Thomas
- ↑ New York Times STEVEN RAICHLEN 10 05 2011
- ↑ The Hindu Mohammed Iqbal 14 10 2012
- ↑ "Traditional stoves". Archived from the original on 2016-10-28. Retrieved 2016-08-02.