Jump to content

నూరెక్ ఆనకట్ట

అక్షాంశ రేఖాంశాలు: 38°22′18″N 69°20′53″E / 38.37167°N 69.34806°E / 38.37167; 69.34806
వికీపీడియా నుండి
నూరెక్ ఆనకట్ట
నూరెక్ ఆనకట్ట is located in తజికిస్తాన్
నూరెక్ ఆనకట్ట
Location of Nurek Dam within Tajikistan
ప్రదేశంనూరెక్, తజుకిస్తాన్
అక్షాంశ,రేఖాంశాలు38°22′18″N 69°20′53″E / 38.37167°N 69.34806°E / 38.37167; 69.34806
ఆవశ్యకతవిద్యుత్తు
స్థితిOperational
నిర్మాణం ప్రారంభం1961
ప్రారంభ తేదీ1972-1980
యజమానిబార్కీ తోజిక్
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరువక్ష్ నది
Height300 మీ. (980 అ.)[1][2][3]
పొడవు700 మీ. (2,300 అ.)
జలాశయం
సృష్టించేదినూరెక్ జలాశయం
మొత్తం సామర్థ్యం10.500 కి.మీ3 (8,512,000 acre⋅ft)
ఉపరితల వైశాల్యం98 కి.మీ2 (38 చ. మై.)
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుబార్కీ తోజిక్
Commission dateInitial: 1972–1979
Reconstruction: 1988
TypeConventional
టర్బైన్లు9 x 335 MW Francis-type
Installed capacity3,015 MW

నూరెక్ ఆనకట్ట తజికిస్తాన్లోని వఖ్ నదిపై నిర్మించారు. దీని ప్రాథమిక ఉద్దేశం జలవిద్యుత్ ఉత్పత్తి. ఇక్కడి విద్యుత్ కేంద్రానికి 3,015 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యం ఉంది. ఆనకట్ట నిర్మాణం 1961 లో ప్రారంభమైంది. విద్యుత్ కేంద్రపు మొదటి జనరేటర్ 1972 లో మొదలు కాగా, చివరి జెనరేటర్ 1979 లో ప్రారంభమైంది. 1980 లో తజికిస్తాన్ సోవియట్ యూనియన్లో రిపబ్లిక్గా ఉన్నప్పుడు మొత్తం ప్రాజెక్ట్ పూర్తయింది. ఆ సమయంలో ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టగా మారింది. 300 మీ. (984 అ.) వద్ద, ఇది ప్రస్తుతం ప్రపంచంలో రెండవ ఎత్తైన మానవ నిర్మిత ఆనకట్ట, ఇది 2013 లో జిన్‌పింగ్-ఐ ఆనకట్టను అధిగమించింది. రోగూన్ ఆనకట్ట, తజికిస్తాన్లోని వక్ష్ వెంట, పూర్తయినప్పుడు దాని పరిమాణాన్ని మించి ఉండవచ్చు.

నిర్మాణం

[మార్చు]

నూరెక్ ఆనకట్టను సోవియట్ యూనియన్ 1961, 1980 సంవత్సరాల మధ్య నిర్మించింది. ఈ ఆనకట్టలో తొమ్మిది జలవిద్యుత్ ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి, మొదటిది 1972 లో మొదలు కాగా, చివరిది 1979 లో ప్రారంభించబడింది. ఆనకట్ట యొక్క వరద ప్రాంతం నుండి 5,000 మంది ప్రజలు పునరావాసం పొందారని అంచనా. [4]

ఈ ఆనకట్ట దేశ రాజధాని దుషాన్‌బేకు తూర్పున 75 కి.మీ. దూరాన, పశ్చిమ తజికిస్తాన్లోని వఖ్ష్ నదిపై ఉంది. ఆనకట్ట సమీపంలో ఉన్న నూరెక్ పట్టణంల ఆనకట్ట యొక్క విద్యుత్ ప్లాంట్లో పనిచేసే ఇంజనీర్లు, ఇతర కార్మికులూ నివసిస్తున్నారు.

విద్యుదుత్పత్తి

[మార్చు]
నూరెక్[permanent dead link] రిజర్వాయర్

నూరెక్ ఆనకట్ట యొక్క విద్యుత్ కేంద్రంలో మొత్తం తొమ్మిది ఫ్రాన్సిస్ టర్బైన్ -జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటీ 300 మె.వా. ఉత్పాదక సామర్థ్యం ఉంది (మొత్తం 2,700 మె.వా.). వాటికి 1984 1988 మధ్య పునఃరూపకల్పన చేసి, తిరిగి అమర్చారు. ఇప్పుడు వాటికి 335 మె.వా. సామర్థ్యం ఉంది. మొత్తం ప్లాంటుకు 3,015 మెగావాట్ల సామర్థ్యం ఉంది. 1994 నాటికి, ఇది దేశం యొక్క 4.0 గిగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సింహభాగం దీనిదే. ఇది దేశంలోని 98% విద్యుత్ అవసరాలను తీరుస్తుంది. [5]

నూరెక్ జలాశయం 10.5 కిమీ3 సామర్థ్యంతో తజీకిస్తాన్ లోకెల్లా అతిపెద్దది. ఈ జలాశయం 70 కి.మీ. పొడవుతో, 98 చ.కి.మీ. ల ఉపరితల వైశాల్యంతో ఉంటుంది. ఇందులో నిల్వ చేసిన నీటిని విద్యుదుత్పత్తికీ, వ్యవసాయానికీ ఉపయోగిస్తారు. దంగారా ఇరిగేషన్ సొరంగం ద్వారా నీటిని 14 కిలోమీటర్ల దూరం పంపించి సుమారు 700 చ.కి.మీ. పొలాలకు సాగునీటిని అందిస్తారు. ఈ జలాశయాన్ని నీటిని నింపినపుడు ఇది ప్రేరేపిత భూకంపానికి కారణం కావచ్చునని అనుమానిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "History of Nurek Dams". Canadian Induced Seismicity Research Group. Retrieved 10 January 2015.[permanent dead link]
  2. "Open Joint Stock Holding Company "Barki Tajik"" (in Tajik). Ministry of Energy of the Republic of Tajikistan. Archived from the original on 21 October 2007. Retrieved 10 January 2015.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. Jansen, Robert B. (1988). Advanced Dam Engineering for Design, Construction, and Rehabilitation. Springer Science & Business Media. p. 744. ISBN 0442243979.
  4. Sodiqov, Alexander (2013). "From Resettlement to Conflict: Development-Induced Involuntary Displacement and Violence in Tajikistan". In Heathershaw, John; Herzig, Edmund (eds.). The Transformation of Tajikistan: The Sources of Statehood. New York, MY: Routledge. pp. 49–65.
  5. Ghasimi, Reza (1994). Tajikistan. The International Bank for Reconstruction. p. 138. ISBN 0-8213-3105-1.