నిఖిల్ చోప్రా
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | అలహాబాదు, ఉత్తర ప్రదేశ్ | 1973 డిసెంబరు 26|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 227) | 2000 మార్చి 2 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 116) | 1998 మే 28 - Kenya తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 జూన్ 1 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94–2000/01 | ఢిల్లీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001/02–2003/04 | ఉత్తర ప్రదేశ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 ఏప్రిల్ 25 |
నిఖిల్ చోప్రా (జననం 1973 ఆగస్టు 19) మాజీ భారతీయ క్రికెటరు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలరుగా ఆడాడు. వన్ డే ఇంటర్నేషనల్ స్పెషలిస్టుగా అతను, 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత జట్టులో భాగంగా ఉన్నాడు. కెరీర్‌లో అతను 39 వన్‌డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. [1] [2]
క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, చోప్రా టెలివిజన్ క్రికెట్ విశ్లేషకుడిగా మారాడు. అతను ESPN-స్టార్ వారి క్రికెట్ క్రేజీ, టైమ్డ్ అవుట్, క్రికెట్ ఎక్స్‌ట్రా ప్రోగ్రామ్‌లలో అతిథిగా ఉంటూంటాడు. ఆజ్తక్, ఇండియా టుడేలలో కోసం క్రికెట్ నిపుణుడిగా పనిచేస్తూ, ఐపిఎల్‌లో హిందీ వ్యాఖ్యానం చేస్తున్నాడ��.
క్రికెట్ కెరీర్
[మార్చు]వన్-డే స్పెషలిస్ట్‌గా పరిగణించబడే నిఖిల్ చోప్రా, భారతదేశం తరపున ఒక టెస్టు, 39 వన్‌డేలు ఆడాడు. 1999లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌కు భారత జట్టులో అతను సభ్యుడు. చోప్రా మంచి పరిమిత ఓవర్ల బౌలరు గానే కాకుండా, దిగువ వరుసలో వచ్చే మంచి బ్యాటరుగా కూడా పేరు తెచ్చుకున్నాడు.
అతను పించ్-హిట్టర్ పాత్రను పోషించగలడు లేదా ఇన్నింగ్స్ చివరిలో వేగంగా పరుగులు చేయగలడు. వన్‌డేలలో భారతదేశం తరపున 26 ఇన్నింగ్స్‌లలో, అతను 15.50 సగటుతో 310 పరుగులు సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 61 కూడా ఉంది. చోప్రా చాలా ఉపయోగకరమైన బౌలరు. లైన్, లెంగ్తులపై అతనికి మంచి నియంత్రణ ఉంది. బౌలింగులో మంచి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. కానీ టెస్టుల్లో పెద్దగా ముద్ర వేయలేకపోయాడు.
2000లో దక్షిణాఫ్రికాతో ఆడిన ఏకైక టెస్టులో 24 ఓవర్లు బౌలింగ్ చేసి 78 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. వన్డేల్లో కెరీర్‌లో 46 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 1999లో వెస్టిండీస్‌పై వచ్చాయి. టొరంటోలో జరిగిన మూడో వన్‌డేలో, అతను 5/21 తీసుకున్నాడు. దాంతో వెస్టిండీస్ కేవలం 137 పరుగులకే ఆలౌటైంది.
చోప్రాకు 1999/20000 సీజను అంత ఉషారుగా గడవలేదు. తన చివరి 9 వన్‌డే ఇన్నింగ్స్‌లలో కేవలం 10 వికెట్లు తీసుకున్నాడు. చోప్రాను జట్టులో ఉంచడం సెలెక్టర్‌లకు ఎల్లప్పుడూ కష్టంగా ఉండేది. 2000 ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయాక అతన్ని జాతీయ జట్టు నుండి తొలగించారు.
రిటైరైన తర్వాత నిఖిల్, క్రికెట్ వ్యాఖ్యాతగా మారాడు. [3]
మూలాలు
[మార్చు]- ↑ Nikhil Chopra, CricInfo. Retrieved 2023-04-25.
- ↑ Nikhil Chopra, CricketArchive. Retrieved 2023-04-25, (subscription required)
- ↑ Dasgupta, Piyali (30 June 2010). "Nikhil to play a commentator in Patiala..." The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-04-26.