Jump to content

నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°10′12″N 79°25′48″E మార్చు
పటం

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 6 మండలాలు ఉన్నాయి.

చాలా కాలంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి బలం ఉంది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఇక్కడ అనేకమార్లు విజయం సాధించారు. తెలంగాణా సాయుధ పోరాటం సమయంలో ఉద్యమాలలో పాల్గొన్న నంద్యాల శ్రీనివాసరెడ్డి వంటి నాయకుల కారణంగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి.[1] సుమారు 30 సంవత్సరాల కాలం కమ్యూనిస్టి పార్టీ తరపున నర్రా రాఘవరెడ్డి శాసనసభ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. 1972లో భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మూసపాటి కమలమ్మ, 2009లో టి. లింగయ్య ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలనాటికి ఈ నియోజకవర్గంలో వోట్ల సంఖ్య 2,21,453. ప్రస్తుతం ఇది ఎస్.సి.లకు రిజర్వు చేయబడిన నియోజకవర్గంగా ఉంది.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలు హుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[2] 95 నకిరేకల్ ఎస్.సి వేముల వీరేశం పు కాంగ్రెస్ 133540 చిరుమర్తి లింగయ్య పు బీఆర్ఎస్ 64701
2018 95 నకిరేకల్ ఎస్.సి చిరుమర్తి లింగయ్య పు కాంగ్రెస్ 93699 వేముల వీరేశం పు తెలంగాణ రాష్ట్ర సమితి 85440
2014 95 నకిరేకల్ ఎస్.సి వేముల వీరేశం పు తెలంగాణ రాష్ట్ర సమితి 62445 చిరుమర్తి లింగయ్య పు కాంగ్రెస్ 60075
2009 95 నకిరేకల్ ఎస్.సి చిరుమర్తి లింగయ్య పు కాంగ్రెస్ 72023 మామిడి సర్వయ్య పు సి.పి.ఎం 59847
2004[3] 288 నకిరేకల్ జనరల్ నోముల నర్సింహయ్య పు సీపీఎం 66999 కటికం సత్తయ్య గౌడ్ పు తె.దే.పా 42777
1999[4] 288 నకిరేకల్ జనరల్ నోముల నర్సింహయ్య పు సీపీఎం 40229 కటికం సత్తయ్య గౌడ్ పు తె.దే.పా 35114
1994[5] 288 నకిరేకల్ జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 59216 నేతి విద్యాసాగర్ పు స్వతంత్ర 23110
1989[6] 288 నకిరేకల్ జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 58179 గుర్రం విద్యాసాగర్ రెడ్డి పు కాంగ్రెస్ 43551
1985 288 నకిరేకల్ జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 53144 చిన వెంకట్రాములు దేశబోయిన పు కాంగ్రెస్ 23444
1983[7] 288 నకిరేకల్ జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 29355 ఎస్. ఇంద్రసేనా రెడ్డి పు కాంగ్రెస్ 28709
1978 288 నకిరేకల్ జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 25687 మాసారం నరసయ్య పు కాంగ్రెస్ 19238
1972 281 నకిరేకల్ జనరల్ మూసపాటి కమలమ్మ[8][9] పు కాంగ్రెస్ 20381 నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 16545
1967 281 నకిరేకల్ జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 24741 మూసపాటి కమలమ్మ పు కాంగ్రెస్ 17788
1962 296 నకిరేకల్ జనరల్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి పు సి.పి.ఐ 27442 కంచెర్ల రామకృష్ణారెడ్డి పు కాంగ్రెస్ 22748
1957 82 నకిరేకల్ జనరల్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ పు పిడీఎఫ్   20763 కే. వెంకట్రామ రావు పు కాంగ్రెస్ 13405

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం నుండి సి.పి.ఎం పార్టీకి చెందిన నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటికం సత్తయ్య గౌడ్‌పై 24222 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. నర్సిహ్మయ్య 66999 ఓట్లు పొందగా, సత్తయ్య గౌడ్ 42777 ఓట్లు సాధించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
  5. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  7. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
  8. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  9. Eenadu (8 November 2023). "ఒక్కసారే గెలిచి.. ప్రజల మధ్యే నిలిచి". Archived from the original on 8 November 2023. Retrieved 8 November 2023.