త్సోకర్ సరస్సు
త్సోకర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | లడఖ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 33°18′N 77°59′E / 33.300°N 77.983��E |
గరిష్ట పొడవు | 7.5 కిలోమీటర్లు (4.7 మై.) |
గరిష్ట వెడల్పు | 2.3 కిలోమీటర్లు (1.4 మై.) |
ఉపరితల వైశాల్యం | 22 కి.మీ2 (8.5 చ. మై.) |
ఉపరితల ఎత్తు | 4,530 మీటర్లు (14,860 అ.) |
త్సో కర్ సరస్సు లడఖ్ దక్షిణ భాగంలో ఉన్న రుషు పీఠభూమిలో ఉంది. ఇది ఒక ఉప్పు నీటి సరస్సు. కొన్ని సంవత్స���ాల క్రితం వరకు ఈ సరస్సు ఉప్పుకు ప్రధానమైన వనరుగా ఉండేది, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉప్పును చాంగ్పా సంచార జాతులు టిబెట్‌కు ఎగుమతి చేసేవారు.[1][2]
వాతావరణం
[మార్చు]అధిక ఎత్తు కారణంగా, ఇక్కడి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. శీతాకాలంలో -40 ° C (-40 ° F) కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవిలో 30 ° C (86 ° F) ఉష్ణోగ్రత నమోదవుతుంది.[3]
అనుసంధానం
[మార్చు]త్సో కర్ సరస్సుకు నైరుతి చివరన ఉన్న స్టార్ట్‌సపుక్ త్సో అనే ఒక చిన్న సరస్సుతో ఇన్లెట్ స్ట్రీమ్ ద్వారా అనుసంధానించబడి ఉంది. ఈ రెండు కలిసి 9 కిలోమీటర్ల మేర మైదానాలను ఏర్పరిచాయి.[4][5]
ప్రయాణం
[మార్చు]ఈ సరస్సు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతమైన శ్రీనగర్‌కు 540 కి.మీ దూరంలో ఉంది.
రెండు వేర్వేరు మార్గాల ద్వారా ఈ సరస్సును చేరుకోవచ్చు. ఒకటి లేహ్-మనాలి మార్గం ద్వారా 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేరుకుంటే, మరొకటి పాంగాంగ్ సరస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Location of Tso Kar". geonames.org. Retrieved 2012-04-12.
- ↑ Dharma Pal Agrawal; Brij Mohan Pande (1976). Ecology and Archaeology of Western India: Proceedings of a Workshop Held at the Physical Research Laboratory, Ahmedabad, Feb. 23-26, 1976. Concept Publishing Company, 1977. p. 239–. Retrieved 4 December 2012.
- ↑ "Ladakh's Tso Kar wetland complex added to list of Ramsar sites - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-27.
- ↑ "Tso Kar, Jammu and Kashmir Tourism". spectrumtour.com. Retrieved 2012-04-12.
- ↑ Ecology and Archaeology of Western India: Proceedings of a Workshop Held at the Physical Research Laboratory, Ahmedabad, Feb. 23-26, 1976. Concept Publishing Company, 1977. 1977. p. 239–. Retrieved 4 December 2012.
{{cite book}}
: Cite uses deprecated parameter|authors=
(help) - ↑ Brijraj Krishna Das (2008). Lakes: water and sediment geochemistry. Satish Serial Pub. House, 2008. p. 121–. ISBN 9788189304546. Retrieved 4 December 2012.