తెలంగాణ జిల్లాల జాబితా
తెలంగాణ జిల్లాలు | |
---|---|
రకం | జిల్లా |
స్థానం | తెలంగాణ |
సంఖ్య | 33 జిల్లాలు |
జనాభా వ్యాప్తి | ములుగు – 257,744 (అత్యల్ప); హైదరాబాదు – 3,943,323 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | హైదరాబాదు – 217 కి.మీ2 (84 చ. మై.) (అతిచిన్న); భద్రాద్రి కొత్తగూడెం – 7,483 కి.మీ2 (2,889 చ. మై.) (అతిపెద్ద) |
ప్రభుత్వం | తెలంగాణ ప్రభుత్వం |
ఉప విభజన | తెలంగాణ రెవెన్యూ డివిజన్లు |
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం లోని ఒక రాష్ట్రం. 2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు కలెక్టర్‌కు నాయకత్వం వహిస్తాడు[1]
చరిత్ర
[మార్చు]భారత స్వాతంత్ర్యం తరువాత 1948లో భారతదేశంలోని డొమినియన్‌లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి 8 జిల్లాలు ఉన్నాయి.[2] 1953, అక్టోబరు 1న వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటుచేయబడింది.[3] 1956, నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మెరుగైన పరిపాలన కోసం భద్రాచలం డివిజన్, అశ్వారావుపేట తాలూకా భాగాలను గోదావరి జిల్లాల నుండి ఖమ్మం జిల్లాలో కలుపబడ్డాయి.[3] 1978, ఆగస్టు 15న హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్ అర్బన్ జిల్లా, హైదరాబాద్ రూరల్ జిల్లాగా విభజించారు. హైదరాబాద్ అర్బన్ జిల్లాను చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్, సికింద్రాబాద్ తాలూకాలు అనే 4 తాలూకాలుగా ఉన్నాయి. వీటిలో ఎంసిహెచ్ ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ రూరల్ జిల్లాను రంగారెడ్డి జిల్లాగా మార్చారు.[4]
ఆంధ్రప్రదేశ్ నుండి 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పడింది. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చారు.[5][6]
2016, అక్టోబరు 11న 21 కొత్త జిల్లాలు సృష్టించబడ్డాయి. దాంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలు కనిష్ఠంగా 2 నుండి గరిష్ఠంగా 5 జిల్లాలుగా విభజించబడ్డాయి.[7]
2019, ఫిబ్రవరి 17న 9 మండలాలతో ములుగు, 11 మండలాలతో నారాయణపేట కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. అప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది.[8] 2016లో వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు. ఆ తరువాత 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[9][10][11]
గణాంకాలు
[మార్చు]భద్రాద్రి జిల్లా 8,062 కి.మీ2 (3,113 చ. మై.) వైశాల్యంతో అతిపెద్ద జిల్లా కాగా, 2,019 కి.మీ2 (780 చ. మై.) వైశాల్యం కలిగిన రాజన్న జిల్లా అతి చిన్న జిల్లా. హైదరాబాద్, 3,52,69,257 మందితో అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా.[12]
జిల్లాల జాబితా
[మార్చు]వ.సంఖ్య | జిల్లా | జిల్లా ప్రధాన
కార్యాలయం |
రెవెన్యూ
డివిజన్లు సంఖ్య |
మండలాలు సంఖ్య | మొత్తం రెవెన్యూ గ్రామాలు | అందులో నిర్జన గ్రామాలు | నిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు సంఖ్య | జనాభా (2011) | వైశాల్యం (చ.కి) | జిల్లా పటాలు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ఆదిలాబాద్ జిల్లా | ఆదిలాబాద్ | 2 | 18 | 505 | 31 | 474 | 7,08,952 | 4,185.97 | |
2 | కొమరంభీం జిల్లా | ఆసిఫాబాద్ | 2 | 15 | 419 | 17 | 402 | 5,15,835 | 4,300.16 | |
3 | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | కొత్తగూడెం | 2 | 23 | 377 | 32 | 345 | 13,04,811 | 8,951.00 | |
4 | జయశంకర్ భూపాలపల్లి జిల్లా | భూపాలపల్లి | 1 | 11 | 223 | 23 | 200 | 7,12,257 | 6,361.70 | |
5 | జోగులాంబ గద్వాల జిల్లా | గద్వాల్ | 1 | 12 | 196 | 0 | 196 | 6,64,971 | 2,928.00 | |
6 | హైదరాబాద్ జిల్లా | హైదరాబాద్ | 2 | 16 | - | - | 34,41,992 | 4,325.29 | ||
7 | జగిత్యాల జిల్లా | జగిత్యాల | 3 | 18 | 286 | 4 | 282 | 9,83,414 | 3,043.23 | |
8 | జనగామ జిల్లా | జనగామ | 2 | 12 | 176 | 1 | 175 | 5,82,457 | 2,187.50 | |
9 | కామారెడ్డి జిల్లా | కామారెడ్డి | 3 | 22 | 473 | 32 | 441 | 9,72,625 | 3,651.00 | |
10 | కరీంనగర్ జిల్లా | కరీంనగర్ | 2 | 16 | 210 | 5 | 205 | 10,16,063 | 2,379.07 | |
11 | ఖమ్మం జిల్లా | ఖమ్మం | 2 | 21 | 380 | 10 | 370 | 14,01,639 | 4,453.00 | |
12 | మహబూబాబాద్ జిల్లా | మహబూబాబాద్ | 2 | 16 | 287 | 15 | 272 | 7,70,170 | 2,876.70 | |
13 | మహబూబ్ నగర్ జిల్లా | మహబూబ్ నగర్ | 1 | 16 | 310 | 2 | 308 | 13,18,110 | 4,037.00 | |
14 | మంచిర్యాల జిల్లా | మంచిర్యాల | 3 | 18 | 362 | 18 | 344 | 807,037 | 4,056.36 | |
15 | మెదక్ జిల్లా | మెదక్ | 4 | 21 | 381 | 8 | 373 | 767,428 | 2,740.89 | |
16 | మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా | మేడ్చల్ | 2 | 15 | 163 | 7 | 156 | 2,542,203 | 5,005.98 | |
17 | నల్గొండ జిల్లా | నల్గొండ | 4 | 31 | 566 | 15 | 551 | 1,631,399 | 2,449.79 | |
18 | నాగర్ కర్నూల్ జిల్���ా | నాగర్ కర్నూల్ | 4 | 20 | 349 | 9 | 340 | 893,308 | 6,545.00 | |
19 | నిర్మల్ జిల్లా | నిర్మల్ | 2 | 19 | 429 | 32 | 397 | 709,415 | 3,562.51 | |
20 | నిజామాబాద్ జిల్లా | నిజామాబాద్ | 3 | 29 | 450 | 33 | 417 | 1,534,428 | 4,153.00 | |
21 | రంగారెడ్డి జిల్లా | రంగారెడ్డి | 5 | 27 | 604 | 32 | 572 | 2,551,731 | 1,038.00 | |
22 | పెద్దపల్లి జిల్లా | పెద్దపల్లి | 2 | 14 | 215 | 8 | 207 | 795,332 | 4,614.74 | |
23 | సంగారెడ్డి జిల్లా | సంగారెడ్డి | 4 | 27 | 600 | 16 | 584 | 1,527,628 | 4,464.87 | |
24 | సిద్దిపేట జిల్లా | సిద్దిపేట | 3 | 24 | 381 | 6 | 375 | 993,376 | 3,425.19 | |
25 | రాజన్న సిరిసిల్ల జిల్లా | సిరిసిల్ల | 2 | 13 | 171 | 4 | 167 | 546,121 | 2,030.89 | |
26 | సూర్యాపేట జిల్లా | సూర్యాపేట | 2 | 23 | 279 | 9 | 270 | 1,099,560 | 1,415.68 | |
27 | వికారాబాదు జిల్లా | వికారాబాద్ | 2 | 19 | 503 | 19 | 484 | 881,250 | 3,385.00 | |
28 | వనపర్తి జిల్లా | వనపర్తి | 1 | 14 | 216 | 1 | 215 | 751,553 | 2,938.00 | |
29 | హన్మకొండ జిల్లా | వరంగల్ | 1 | 14 | 163 | - | - | 1,135,707 | 1,304.50 | |
30 | వరంగల్ జిల్లా | వరంగల్ | 2 | 13 | 192 | - | - | 716,457 | 2,175.50 | |
31 | యాదాద్రి భువనగిరి జిల్లా | భువనగిరి | 2 | 17 | 321 | 3 | 318 | 726,465 | 3,091.48 | |
32 | ములుగు జిల్లా [13] | ములుగు | 1 | 9 | 336 | 109 | 277 | 2,94,000 | ||
33 | నారాయణపేట జిల్లా[13] | నారాయణపేట | 1 | 11 | 252 | 2 | 250 | 5,04,000 | ||
మొత్తం | 76 | 594 | 35,003,694 | 112,077.00 |
మూలం: తెలంగాణ జిల్లాలు [14]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశ జిల్లాల జాబితా
- తెలంగాణ జిల్లాలు (అవిభక్త ఆంధ్రప్రదేశ్)
- ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
- ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
- ఆంధ్రప్రదేశ్ మండలాలు
- ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు
- తెలంగాణ రెవెన్యూ డివిజన్లు
- తెలంగాణ మండలాలు
- తెలంగాణ పురపాలక సంఘాలు
- జి. డి. పి. ప్రకారం తెలంగాణలోని జిల్లాల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Telangana State Portal Districts". www.telangana.gov.in. Retrieved 23 April 2019.
- ↑ Yazdani, Ghulam (1937). "Hyderabad State". Atlantic Publishers & Distri – via Google Books.
- ↑ 3.0 3.1 "Know Your Corporation".
- ↑ Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2021-10-31.
- ↑ "The Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2014" Accessed 13 July 2014
- ↑ "Protests against Centre, Andhra Pradesh in Khammam over Polavaram Bill". Deccan Chronicle, 12 July 2014. Accessed 2021-10-31.
- ↑ "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 2018-12-25. Retrieved 2021-10-31.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Telangana gets two new districts: Narayanpet and Mulugu". The New Indian Express. Archived from the original on 2021-11-04. Retrieved 2021-10-31.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Namasthe Telangana (12 July 2021). "అర్బన్.. హన్మకొండ రూరల్.. వరంగల్". Namasthe Telangana. Archived from the original on 13 July 2021. Retrieved 2021-10-31.
- ↑ "Hanamkonda Reorganization: State Government issues final notice". Deccan News. 2021-08-12. Archived from the original on 2021-10-31. Retrieved 2021-10-31.
- ↑ "Hanamkonda, Warangal in Telangana to be new districts now- The New Indian Express". web.archive.org. 2021-10-27. Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Telangana gets 31 districts to spruce up adminstration". Deccan Chronicle. 11 October 2016. Retrieved 11 October 2016.
- ↑ 13.0 13.1 "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 ఫిబ్రవరి 2019. Retrieved 17 ఫిబ్రవరి 2019.
- ↑ "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2016.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)