తాళ్ళూరి రామేశ్వరి
తాళ్ళూరి రామేశ్వరి | |
---|---|
జననం | తాళ్ళూరి రామేశ్వరి |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | దీపక్ సేధ్ |
పురస్కారాలు | ఫిలింఫేర్, నంది |
తాళ్ళూరి రామేశ్వరి (Talluri Rameswari) తెలుగు, హిందీ సినిమా నటి. దూరదర్శిని కార్యక్రమాలలోనూ కూడా నటించింది
తిరుపతికి చెందిన ఈమె నటనలో శిక్షణ తీసుకుని హిందీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామాలక్ష్మి (1978) సినిమాలో నటించి తెలుగులో పేరు తెచ్చుకున్నారు. సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రభుత్వం పురస్కారం ఇచ్చి సత్కరించింది. తర్వాత మంగళతోరణాలు అనే చిత్రంలో నటించారు. తరువాత ఈమె హిందీ సినిమా రంగంలో స్థిరపడ్డారు. సునయనా అనే చిత్రంలో నటించే సమయంలో ప్రమాదం జరిగి కంటికి గాయమైంది. ఇటీవలి కాలంలో నిజం అనే తెలుగు చిత్రంలో మహేష్ బాబు తల్లిగా క్లిష్టమైన పాత్రలో నటించారు.
రామేశ్వరి తల్లితండ్రుల స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని లంకలకోడేరు గ్రామం. కానీ రామేశ్వరి నెల్లూరులో జన్మించింది.[1] 9వ తరగతి వరకు రామేశ్వరి చదువు కాకినాడలో సాగింది. ఆ తరువాత ఆమె తండ్రి వృత్తి రీత్యా కుటుంబము తిరుపతిలో స్థిరపడింది. తిరుపతిలో ఉండగా సినిమా షూటింగు చూసిన రామేశ్వరి సమ్మోహితురాలై సినీరంగంలో చేరాలని నిశ్చయించుకున్నది. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలని సినీరంగంలో చేరటం ప్రోత్సహించిన ఆ రోజుల్లో రామేశ్వరి తండ్రి విశాల ధృక్పధంలో పిల్లలను వారికి నచ్చిన రంగంలో స్థిరపడే స్వతంత్రం ఇచ్చాడు. దానితో రామేశ్వరి అక్క తాళ్ళూరి శాంతకుమారి డాక్టరు అయ్యింది. చదువు అంతగా అబ్బని రామేశ్వరి సిన��రంగంలో ప్రవేశించే ఉద్దేశంతో పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు దరఖాస్తు పెట్టెంది. కనీసం డిగ్రీ అయినా చదవకుండా సినీరంగంలో చేరితే, కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆమె తండ్రి మొదట్లో కొంత ఆందోళన చెంద��డు. కానీ అప్పటికే ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్క, సినీరంగంలో సరైన అవకాశాలు రాకపోతే చెల్లెలిని ఆదుకోవడానికి తానున్నాని హామీ ఇవ్వడంతో తండ్రి కొంత కుదుటపడ్డాడు. పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరింది.
సినీరంగ ప్రవేశం
[మార్చు]రాజశ్రీ ఫిల్మ్ వారు తమ కొత్త సినిమా కోసం కొత్త కళాకారులకోసం వెతుకుతూ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చారు. అది చూసి రామేశ్వరి దరఖాస్తు పెట్టుకున్నది. అలా దుల్హన్ వహీ జో పియా మన్ భాయే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది.
పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కలిసిన పంజాబీ నటుడు, నిర్మాత దీపక్ సేథ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకొన్నది. పెళ్ళి తర్వాత రామేశ్వరి బొంబాయిలో స్థిరపడింది. వీరికి 17, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. రామేశ్వరి తన భర్తతో కలిసి 2007లో "మై తూ అస్సీ తుస్సీ" అనే ఒక పంజాబీ సినిమాను నిర్మించారు.[2] ఈ సినిమా కథ విలియం షేక్‌స్పియర్ నాటకం "కామెడీ అఫ్ ఎర్రర్స్" పై ఆధారితమైనది.[3] పంజాబీ సినిమాలో మైలురాయి అనదగిన మరో సినిమా ఛన్న్ పర్దేసీని కూడా రామేశ్వరీ-సేథ్ దంపతులు నిర్మించారు.[4] తన మాతృభాష తెలుగులో, తనకు పేరుతెచ్చిన హిందీ సినిమాలుకు కాకుండా పంజాబీ సినిమాలెందుకు తీస్తున్నారని ప్రశ్నించినప్పుడు తెలుగు, హిందీ సినిమాలకు పెట్టుబడి ఎక్కువగా అవసరమని, తాము అంత రిస్కును భరించలేమని చెప్పింది.
తాళ్లూరి రామేశ్వరి నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]- సీతామాలక్ష్మి
- నిజం
- మంగళతోరణాలు
- రౌడీ ఫెలో (2014)
సీరియళ్ళు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "తెలుగు సినిమా.కాంలో రామేశ్వరి ఇంటర్వ్యూ". Archived from the original on 2008-11-03. Retrieved 2008-10-17.
- ↑ ఐ.ఎం.డీ.బిలో రామేశ్వరి ప్రొఫైల్
- ↑ Rameshwari produces first Punjabi film[permanent dead link] - జీ న్యూస్
- ↑ http://www.tribuneindia.com/2006/20060701/ldh2.htm